ఇస్లామిక్ ‘నాటో’ ఆచరణ సాధ్యం అవుతుందా?
x

ఇస్లామిక్ ‘నాటో’ ఆచరణ సాధ్యం అవుతుందా?

పాకిస్తాన్, సౌదీ, టర్కీ ఒక కూటమిగా మారబోతున్నాయా?


వివేక్ కట్జూ

ఇస్లామిక్ నాటో(ISLAMIC NATO) ఇప్పట్లో సాధ్యం అవుతుందా? దానికి కొంతకాలం సమయం పడుతుందా? ఇది చర్చల వరకే పరిమితమా? ఈ మధ్య పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం(ఎస్డీఎంఏ) కుదిరింది.

సౌదీ- పాక్ మధ్య గత ఆరు దశాబ్దాలుగా రక్షణ, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. తన భద్రత, రాజకుటుంబ రక్షణ కోసం పాక్ సైన్యం మీదనే ఆధారపడింది. రెండు దేశాల మధ్య ఇలాంటి ఒప్పందం కుదరడం మాత్రం అరుదే.

సౌదీ- పాకిస్తాన్ మధ్య అణుబంధం..
గతంలో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొన్న ప్రతిసారి ఆ దేశాన్ని కాపాడిన వాటిలో సౌదీ అరేబియా ఒకటి. రియాద్ అస్థిత్వ సంక్షోభం ఎదుర్కొంటే దానిని రక్షించడానికి తాము ఎంతకైనా వెళ్తామని ఇస్లామాబాద్ ఇది వరకూ ప్రకటించింది.
1999 లో సౌదీ అరేబియా అప్పటి రక్షణ మంత్రి ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్ధులాజీజ్ పాకిస్తాన్ రహస్యంగా అణు పరీక్షలు చేసిన కహుతా అణు కేంద్రాలను సందర్శించారని విశ్వసనీయ నివేదికల సమాచారం.
అప్పటి నుంచి గత 25 సంవత్సరాల సౌదీ- పాకిస్తాన్ రక్షణ సంబంధాలు ఇప్పుడు వ్యూహాత్మక కోణంలో మార్పు చెందాయి. ఇప్పుడు ఇరు దేశాల మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందం ఈ బంధానికి బహిరంగ కోణం.
పాకిస్తాన్ ఆర్థికంగా కుంగిపోకుండా ఉండేందుకు సౌదీ కూడా హమీ ఇచ్చినట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ ఆర్థికంగా ఎప్పుడూ దిగజారుతునే ఉంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ఒప్పందం ఇస్లామాబాద్ దృష్టిలో.
ఎస్డీఎంఏలో టర్కీ చేరుతుందా?
టర్కీని కూడా ఎస్డీఎంఏలో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇస్లామిక్ దేశాలలో శక్తివంతమైన దేశాలుగా పేరున్న సౌదీ, పాక్, టర్కీలు ఒక్కటిగా చేరితే ఇస్లామిక్ నాటో అనేది ఫామ్ అవుతుందని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఇది కొంచెం అతిశయోక్తి అనడంలో సందేహం లేదు.
ఇస్లామిక్ లో ‘ఉమ్మా’ సంప్రదాయం ఉంది. దానికి ఉమ్మడి నాయకుడు ఉండాలని నమ్ముతాయి. సౌదీ అరేబియా ఇస్లాం ఆవిర్భావ రక్షకుడిగా రెండు పవిత్ర మసీదులను రక్షించడం, అపారమైన సంపద ఉండటం వలన ఇస్లాం ప్రపంచానికి తానే సహజంగా నాయకుడిగా భావిస్తోంది.
మరోవైపు టర్కీ కూడా తానే ఇస్లామిక్ ప్రపంచానికి నాయకుడిగా, ఖలీఫా అధిపతిగా ప్రకటించుకోవడానికి కసరత్తు చేస్తున్నాయి. రెసిప్ తయ్యప్ ఎర్డోగన్ అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి ఇదే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఒకప్పుడు లౌకిక దేశంగా, కెమాల్ అటాతుర్క్ పాలనలో పాటించిన సంప్రదాయాల నుంచి ఇస్తాంబుల్ వైదొలగింది.
ఒట్టోమాన్ సామ్రాజ్యంలో టర్కీకి దక్కిన ప్రభావం తనకు కావాలని ఎర్డోగన్ బలంగా వాంఛిస్తున్నారు. కానీ నాటో వైఖరి ఇందుకు పూర్తిగా భిన్నం. 1949 లో అమెరికా దీనిని స్థాపించింది. సైనికపరంగా అదే అతిపెద్దది కాబట్టి, దానికి నిజమైన నాయకుడిగా ఉంటోంది.
అయితే డొనాల్డ్ ట్రంప్ పాలనలోకి వచ్చాక నాటో కూడా బలహీనపడింది. ఇప్పుడు ఇస్లామిక్ నాటోలోకి అనేక దేశాలు వచ్చినప్పటికీ దానికి ఉండే సమస్యలు అపారం. అవి పరిష్కారం కావడం చాలా కష్టమైన పని.
ముస్లిం దేశాల ఐక్యత కష్టమేనా?
ఇస్లాం అనుసరించని దేశాలను ఎదుర్కోనేటప్పుడూ ఇస్లామిక్ దేశాలన్నీ కూడా షియా- సున్నీ బేధాలను పాటంచవని అంటూ ఉంటారు. కానీ ఇది చారిత్రకంగా తప్పు. షియాలు- సున్నీ విబేధాలు ఇస్లామిక్ విశ్వాసం పై కూడా ప్రసరించాయి. పాలస్తీనా వంటి సమస్యపై ఇస్లామిక్ దేశాలు చేతులు కలపాయి.
కానీ ఇది చాలా అరుదుగా మాత్రమే జరిగిందని గుర్తు పెట్టుకోవాలి. భారత్ తో అనేక ఇస్లామిక్ దేశాలు మంచి సంబంధాలను నెరుపుతున్నాయి. ఓఐసీ సమావేశాలలో కూడా భారత్ లోని ముస్లిం మైనారిటీలపై వారు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఇప్పటికి సంబంధాలు కొనసాగుతున్నాయి.
అధికారంలో ఉన్న పార్టీతో సంబంధం లేకుండా 1990 ప్రారంభం నుంచి ఇలాంటి ఆందోళనలు తరుచుగా ఓఐసీ వ్యక్తం చేస్తోంది. జమ్మూకశ్మీర్ లో ముస్లిం పరిస్థితి విషయంలో ఓఐసీ చేసిన తీర్మానాలను పట్టించుకోవద్దని కొంతమంది ముస్లిం దేశాల దౌత్యవేత్తలు నాకు స్వయంగా చెప్పారు.
ముస్లిం దేశాలు ఖురాన్ ఆధారంగా పాలన సాగిస్తున్నాయి. భారత్ లౌకికవాద దేశం. అయితే వారి ఆందోళన మాత్రం ముస్లింలు స్వేచ్చగ తమ మతాచారాలను ఆచరించడం గురించి మాత్రమే వారి ఆందోళన.
ప్రవక్తను అవమానించడం..
ఇస్లాం ప్రవక్త, ఇస్లామిక్ ప్రపంచం గౌరవభావంతో చూసుకునే కొంతమందిని భారతీయ నాయకులు అవమానించారని అనిపించిన సందర్భంలో వారు దీనిని బహిరంగంగా ఎదుర్కొన్నారు.
ఇవి కొన్నిసార్లు జరిగాయి. ఇవి ఇస్లామిక్ ప్రపంచంతో భారత్ సంబంధాలను దెబ్బతీయవు. కానీ కాస్త ఇబ్బందని కలిగిస్తాయి. బీజేపీకి చెందిన ఒక నేత ఇలా ఒకసారి మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే. పాకిస్తాన్ ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఇందులో విఫలం అవతూనే ఉంది.
చైనా తన దేశంలో ఉన్న ఉయ్ గర్ ముస్లింల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. కనీసం ఇస్లామిక్ మత ఆచారాలను సైతం అది అమలవ్వనివ్వదు. ఇస్లామిక్ ప్రపంచం ఈ విషయంలో మౌనంగా ఉంది. ఇవన్నీ కూడా ముస్లింల పరిస్థితి కంటే వారి ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని అర్థం అవుతోంది.
పాకిస్తాన్ పట్ల వారికి ఉన్నది..
భారత్- పాక్ వివాదాలు జరిగినప్పుడు కొన్ని ఇస్లామిక్ దేశాలు వాటికి సాయం అందించాయి. చరిత్ర ప్రకారం చూసుకుంటే న్యూఢిల్లీతో మంచి సంబంధాలు నెరిపిన కాబూల్ రాజు జహీర్ షా, పశ్చిమ సరిహద్దులలో ఎలాంటి అలజడి ఉండదని ఇస్లామాబాద్ కు సందేశం పంపాడు. జోర్డాన్ కూడా ఇదే తీరులో వ్యవహరించింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా 1971 లో భారత్- పాక్ ను చీల్చగలిగింది.
ఇప్పుడు రెండు దేశాలు అణ్వాయుధాలు వాడుతున్నందున ఇస్లామిక్ ప్రపంచం మనకెందుకులే అన్నట్లు తటస్థంగా వ్యవహరిస్తున్నాయి. ముస్లిం మైనారిటీలపై దేశం లో ఉన్న విధానాలు, భారత్- పాకిస్తాన్ వివాదాలు ముస్లిం దేశాలు ప్రభావితం కావు. అంతర్జాతీయ సమాజం కోరుకున్నట్లుగానే అవి కూడా వివాదాలు ముగించాలని కోరతాయి.
ఇస్లామిక్ శక్తుల, బాహ్య ప్రపంచం కోరుకున్నంత మాత్రనా భారత్ లౌకిక దేశంగా ఉండజాలదు. దాని ప్రజలు లౌకికవాద సూత్రానికి కట్టుబడి ఉంటేనే లౌకికంగా ఉంటుంది. లౌకిక విలువల రక్షణ విదేశాల నుంచి రాకూడదు. ఇలాంటి సమయాల్లో కూడా భారతీయులు మతంతో సంబంధం లేకుండా సమానత్వం కోసం నిలబడి, సమాజాన్ని, రాజకీయాలను నియంత్రించే రాజ్యాంగ సూత్రాలను బలపరచాలి. ఇది మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది.
(ది ఫెడలర్ అన్ని వైపుల అభిప్రాయాలను గౌరవిస్తుంది. వ్యాసంలోని సమాచారం, అభిప్రాయం పూర్తిగా రచయితవి. ఇవి తప్పనిసరిగా ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబిచవు)
Read More
Next Story