
భారత్ ‘విశ్వగురు’ నుంచి ‘కార్మిక రాజధాని’గా మారుతోందా?
ఈయూతో వాణిజ్య ఒప్పందం అంత విలువైనది కాదా
డీకే రవికాంత్
భారత్ 77 వ గణతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కార్మిక ఎగుమతిలో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లు కనిపిస్తుంది. ఇది వలసపాలనలో బ్రిటిష్ వారు అనుసరించిన ఒప్పంద కార్మిక వ్యవస్థను గుర్తు చేసింది.
భారత్- ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘భారత్ అనేక దేశాలతో వాణిజ్య, చలనశీలత ఒప్పందాలపై సంతకం చేస్తోంది’’ అని గర్వంగా తెలిపారు. ఈ ఒప్పందాల వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
అన్ని ఒప్పందాలకు తల్లివంటిదా?
ఈ ఒప్పందంపై ప్రభుత్వం చెప్పేవాటికి, వాస్తవాలకు విరుద్దంగా ఉంది. స్వల్పకాలిక నైపుణ్యం పై యూరప్ ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించింది. ఒప్పందాల ద్వారా భారతీయ గ్రాడ్యూయేటట్లు విదేశాలలో కొత్త అవకాశాలు వస్తాయని చెబుతున్నారు.
27 దేశాల కూటమి అయిన ఈయూ ఈ ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్’ గా అభివర్ణిస్తున్నారు. కానీ వివరాలు మాత్రం ఏంటో బయటకు చెప్పడం లేదు. సుంకాల తొలగింపు, నాన్ టారిఫ్ వస్తువులు ఇలా దేనిపై ప్రత్యేకతలు ఏంటో చెప్పడం లేదు. అన్ని అస్పష్టంగా కొనసాగుతున్నాయి.
ప్రపంచంలో భారత్ నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువ గల అతిపెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా మన సొంతం. కానీ ఈయూది ప్రపంచం వాణిజ్యంలో సగం ఉంది. దాని ఆర్థిక శక్తి బలీయంగా ఉంది. దాని వార్షిక ఎగుమతులు 16 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
అందుకే ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్ ఈ ఒప్పందం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. ‘‘యూరప్ ప్రపంచాన్ని ఎంచుకుంటుంది. ప్రపంచం యూరప్ ఎంచుకోవడానికి సిద్ధంగా ఉంది’’ ఇది అక్షరాల నిజం.
బలహీనపడిన ఈయూ..
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఈయూ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న దక్షిణ అమెరికా కూటమి ఒప్పందం మెర్కోసూర్ ను విజయవంతంగా ముగించింది. ఇందులో ఉరుగ్వే, పరాగ్వే, బ్రెజిల్, అర్జెంటీనా, బొలివియా వంటి వ్యవసాయాధారిత దేశాలు ఉన్నాయి.
ఈ ఒప్పందాన్ని ఫ్రాన్స్, ఐర్లాండ్, బెల్జియం వంటి వ్యవసాయ ఆధారిత ఒప్పందాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఒప్పందానికి ఇంకా ఈయూ పార్లమెంట్ ఆమోదం అవసరం.
ఇప్పటికే వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలతో కూడా ఈయూ ఎఫ్టీఏలు కుదుర్చుకున్నాయి. ఇవి వ్యవసాయ ఉత్పతులతో పాటు చవకైన వస్త్ర రంగాల వాటాను అందించుకోబోతున్నాయి. ఈ పోటీలోకి భారత్ చాలా ఆలస్యంగా ప్రవేశించింది.
ఈయూ కూడా ప్రస్తుతం బలహీనంగా కనిపిస్తుంది. ఒకప్పుడు బలమైన సంధానకర్తగా ఉన్న డబ్ల్యూటీఓ ను అది కొన్ని ఒప్పందాల నుంచి తప్పించగలిగింది. కానీ అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు లొంగిపోయింది. యూఎస్ వ్యవసాయ, పారిశ్రామిక వస్తువులపై సుంకాలు తొలగించింది. ఈయూ ఎగుమతులపై అమెరికా 15 శాతం సుంకాలు విధించింది.
భారత్ ఏం కోరుకోవాలి?
ఈయూ తన మార్కెట్ లోని భారతీయ వస్తువులకు ప్రవేశం కల్పించినప్పటికీ కొన్ని వస్తుత్పలకు లాభసాటి కాదు. ఉదాహారణకు వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రయోజనం చేకూరదు.
ఎందుకంటే దానికి ఇప్పటికే అనేక ఒప్పందాలు కుదుర్చుకుని ఉంది. ఉదాహారణకు ఇండోనేషియా, దక్షిణ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఈ కోవకు చెందినవే.
మరో సంగతి ఏంటంటే.. అది విధించే నియంత్రణ పద్దతులు. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతి పాలైనవే. డబ్ల్యూటీఓ వాణిజ్య వివాదాలలో సగం శానిటరీ, ఫైటో సానిటరీ చర్యలు, వాణిజ్యానికి సాంకేతిక అడ్డంకుల నుంచి ఉత్పన్నమయినవే.
న్యూఢిల్లీకి చెందిన గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఇటీవల ప్రకటించిన వివరాల ప్రకారం భారతీయ ఎగుమతులు అనేక కఠిన ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి.
పురుగుమందుల అవశేషాల పరిమితుల కారణంగా బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాలు , టీ తో సహ అనేక భారతీయ వస్తువులకు ఈయూ తిరస్కరిస్తోంది. యాంటీ బయాటిక్ భయాందోళనల కారణంగా సముద్ర ఎగుమతులు కూడా ఇవే తరహ ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి.
సీబీఏఎం అణచివేతలు..
గత రెండు సంవత్సరాలుగా కార్బన్ బోర్డర్ అడ్జస్ట్ మెంట్ మెకానిజం(సీబీఏఎం) వంటి ఏకపక్ష నాన్ టారిఫ్ చర్యలకు ఈయూ పై విమర్శలు వచ్చాయి. వీటిపై బ్రిక్స్ కూడా ఆక్షేపణ తెలియజేసింది.
‘‘అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా లేని, ఏకపక్ష, శిక్షాత్మక, వివక్షతతో కూడిన రక్షణాత్మక చర్యలు, పర్యావరణ సమస్యల సాకుతో చేసే సీబీఏఎం వంటి వాటిని తిరస్కరించాలి’’ అని సూచించారు.
సీబీఏఎం కింద భారత ఉక్కు, ఇతర పారిశ్రామిక ఎగుమతులు అధిక ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈయూతో ఏదైనా వాణిజ్య ఒప్పందంలో నియంత్రణ సహకారం, వేగవంతమైన ఆమోదాలు, పరస్పర గుర్తింపుతో పాటు సుంకాల సరళీకరణ మాత్రమే ఎగమతి లాభాలను అందించగలని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీ వాస్తవ హెచ్చరించాడు.
ఈయూ అమెరికన్ వస్తువులకు కార్వియౌట్ లను మంజూరు చేసింది కానీ భారత్ కు మాత్రం అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇది కచ్చితంగా పక్షపాత వైఖరే.
సేవలు, వలస కార్మికులు..
ఈయూ మార్కెట్ లో వస్తువులే కాదు సేవలు కూడా అనేక ఇతర అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. ఈయూ రిమోట్ డిజిటల్ సర్వీస్ డెలివరిని పరిమితం చేస్తుంది. తరుచుగా భారతీయ సేవలకు స్థానిక బ్రాంచ్ లు స్థాపించమని బలవంతం చేస్తూ ఉంటుంది.
ఈయూ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ కింద భారత్, డేటా సురక్షితంగా ఉండాలని కోరుకుంటోంది. కానీ ఈయూ వాటిని వ్యతిరేకిస్తుంది. వీటితో పాటు జపాన్, దక్షిణ కొరియా కంపెనీలతో పోల్చుకుంటే మన కంపెనీలకు అధిక వ్యవస్థాపన ఖర్చులు వసూలు చేస్తున్నారు. ఈయూ దేశాలు స్వల్పకాలిక వీసాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాటిని వలస బెదిరింపులు పరిగణిస్తున్నాయి.
భారత్ మార్కెట్ కోసం మాత్రం..
భారతీయ వస్తుసేవలు, వలస కార్మికుల కోసం కఠిన విధానాలు అనుసరిస్తున్న యూరప్.. మన దేశ మార్కెట్లో ప్రవేశించడానికి సులభ మార్గాలు కోరుకుంటోంది. వాటిలో ముఖ్యమైనది ప్రభుత్వ రంగ సంస్థలకు వచ్చే ఆర్డర్లు. వాటి విలువు ఎంతలేకున్నా 600 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఈయూ ఇప్పుడు తన ఎలక్ట్రానిక్ వస్తువు ఎగుమతులను చైనా కాకుండా భారత్ వైపు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకప్పుడు ఈయూ ఆధీనంలో ఉన్న సోలార్ ప్యానెళ్లు, విండ్ టర్బైన్లు, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక సాంకేతిక పరిజ్ఞానాలు చైనా వేగంగా అందిపుచ్చుకుని వాటికి సవాల్ విసురుతోంది. దీని మార్కెట్ వాటా పోతుండటంతో ఈయూ ఇప్పుడు భారత్ ను తన మార్కెట్ గా భావిస్తోంది.
కానీ ఖర్చు..
ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్య హక్కులను నిరాకరించి, వారితో పోరాడిన బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా నేడు జీవించి ఉంటే బ్రస్సెల్స్ మాటలకు మోదీ మోసపోవద్దని గట్టిగా హెచ్చరించేవాడు.
చివరగా బలవంతులు తాము చేయాల్సింది చేస్తారు. బలహీనులు తాము చేయవలసింది అనుభవిస్తారు. ఒకప్పుడు విశ్వగురు హోదా ఆశించిన భారత్, ఇప్పుడు తన పాత్రకు రాజీపడిందా? ప్రపంచ ఒప్పంద కార్మికుల సరఫరాదారుగా అవతరించిందా?
(ది ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు గౌరవిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. అవి తప్పనిసరిగా ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబిచవు)
Next Story

