భారతీయ క్రికెట్ విశ్వాసాన్ని కోల్పోతుందా?
x
భారత క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, మహమ్మాద్ షమీ

భారతీయ క్రికెట్ విశ్వాసాన్ని కోల్పోతుందా?

వంద సగటు ఉన్న జట్టుకు ఎంపిక కాలేకపోతున్న క్రికెటర్లు


సిద్దార్థ్ మహాన్

భారత క్రికెట్ లో ప్రతిభ, జట్టు ఎంపికకు మధ్య తేడాలు కనిపిస్తున్నాయి. ఇవి ఇంతకుముందు కాలంలోనూ కనిపించిన ప్రస్తుతం ఇవి ఎక్కువ అవుతున్నట్లు ప్రస్తుత పరిణామాలను గమనిస్తే అర్థమవుతోంది.

రాబోయే దక్షిణాఫ్రికా ‘ఏ’ సిరీస్ తో తలపడేందుకు భారత ‘ఏ’ జట్టును ఎంపిక చేశారు. ఇందులో ఇద్దరు ఆటగాళ్లు లేకపోవడం చర్చనీయాంశమైంది. ఇందులో సర్ఫరాజ్ ఖాన్ కు చోటు కల్పించకపోవడంపై వివాదం చెలరేగింది. 2027 వన్డే ప్రపంచకప్ కు జట్టుకు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో భారత జట్టులో ఆటగాళ్ల ఎంపికపై వివాదాలు క్రమంగా పెరుగుతున్నాయి.

సర్పరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్ లో కొంతకాలంగా స్థిరంగా రాణిస్తున్నాడు. టన్నుల కొద్ది పరుగులు సాధించాడు. ఇటీవల ఫస్ట్ క్లాస్ సీజన్ లో ఏకంగా వంద సగటుతో పరుగులు సాధించాడు. అయినప్పటికీ సర్ఫరాజ్ కు ఇప్పటిదాకా పరిమిత అవకాశాలు మాత్రమే వచ్చాయి. తాజాగా కనీసం ‘ఏ’ జట్టులో కూడా 26 ఏళ్ల ఆటగాడికి సెలెక్టర్లు అవకాశం కల్పించలేదు.
ఎదురుదెబ్బలు..
సర్పరాజ్ ఖాన్ ఇప్పటి వరకూ 56 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 14 సెంచరీలు, 13 అర్థ సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా ఫస్ట్ క్లాస్ సగటు 65.19 గా ఉంది. 2019-24 మధ్య సర్ఫరాజ్ సగటు 100 కంటే ఎక్కువగా ఉంది. ఇది దేశవాళీ క్రికెట్ లో ఓ ఆటగాడి స్థిరత్వానికి ప్రాతిపదిక. అయినప్పటికీ కనీసం ఏ జట్టులోనే అతడిని సెలెక్టర్లు అవకాశం కనిపించలేదు.
అంతర్జాతీయ క్రికెట్ లోనూ సర్పరాజ్ ఖాన్ తన ఫామ్ ను కొనసాగించాడు. ప్రారంభ టెస్ట్ సిరీస్ లో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. తరువాత న్యూజిలాండ్ జట్టుపై సెంచరీ సాధించాడు.
అయినప్పటికీ రాబోయే దక్షిణాఫ్రికా ‘ఏ’ సిరీస్ కు ఈ ఆటగాడికి చోటు లభించలేదు. సెలెక్టర్లు సర్పరాజ్ ఖాన్ కు క్వాడ్రిసెప్స్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ క్రీడా నిఫుణులు, అభిమానులు దీనిని అంగీకరించడం లేదు.
భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ..‘‘నేను సెలెక్టర్ ను అయితే సర్ఫరాజ్ కు ఫోన్ చేసి ఏం చెప్పాలి అని ఆలోచించేవాడిని? అతను తన బరువు తగ్గించుకున్నాడు. దేశవాళీలో పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ పై సెంచరీ సాధించాడు. అతను జట్టుకు ఎంపిక కాకపోవడం ఎవరో ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నారు( సర్ఫరాజ్ ఖాన్ కో దేశో లియా, అభి నహీ చాహియే, సర్ఫరాజ్ ఖాన్ ఇక మనకు అవసరం లేదు)



రాజకీయ తుఫాన్..
భారత ‘ఏ’ జట్టుకు సర్ఫరాజ్ ను ఎంపిక చేయకపోవడంపై రాజకీయ తుఫాన్ చెలరేగింది. సర్పరాజ్ ఖాన్ ఇంటి పేరే అతని ఎంపిక కాకపోవడానికి కారణమని కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ఆరోపించారు. దీనిని హిందూ - ముస్లిం వివాదం మార్చే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది.అయితే బీజేపీ దీనిని ఖండించింది. ప్రతిభ, పారదర్శకత గురించి చర్చ జరగాల్సిన చోట రాజకీయాలు రావడం భారత క్రికెట్ కు మంచిది కాదంది.
భారత క్రికెట్ లో పదే పదే కొన్ని ఆరోపణలు వినిపిస్తాయి. సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లను కారణం చెప్పకుండా పక్కన పెడుతుంటారనే అపవాదు ఉంది. ఇది క్రికెట్ అభిమానులలో, దేశీయ ఆటగాళ్లలో, డ్రెస్సింగ్ రూమ్ లలో ద్వేషాన్ని పెంచడానికి కారణంగా మారుతోంది. ఇలాంటి సమయంలో ఎవరైన నమ్మాకాన్ని కోల్పోతే జట్టును పున: నిర్మించడం చాలా కష్టం.
వెటరన్ పేసర్ మహమ్మాద్ షమీ కూడా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్ కు తనను ఎంపిక చేయకపోవడం పై అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఫిట్ నెస్ లో తాను పాస్ అయినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఎందుకు తనను ఎంపిక చేయలేదో తెలియదని పేర్కొన్నారు. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీతో తాను నేరుగా మాట్లాడతానని చెప్పారు. షమీ దేని గురించి మాట్లాడుతున్నాడో తనకు తెలియదని చెప్పాడు.
నిజానికి ఇది తప్పించుకునే అంశం. అంతర్జాతీయ క్రికెట్ లో షమీ దాదాపు 400 వికెట్లు తీశాడు. ఈ పరిణామం తరువాత ఉత్తరాఖండ్ తో జరిగిన రంజీ మ్యాచ్ లో షమీ ఏడు వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్ లలో కేవలం 75 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
షమీ లాంటి సీనియర్ ఆటగాడిపై ఇలాంటి వ్యాఖ్యలు సెలెక్టర్లకు, ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపిక అంటే కేవలం ఉత్తమ ఎలెవన్ ఎంచుకోవడం మాత్రమే కాదు. ఆటగాళ్ల స్థానం అర్థం చేసుకోవడం ఆస్పష్టత ఏర్పడితే.. అది అభద్రతగా మారి వెంటాడుతుంది. వేగంగా వ్యాపిస్తుంది.
హర్షిత్ రాణా ఎంపిక..
కోల్ కత నైట్ రైడర్స్ యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఇటీవల కాలాల్లో మూడు ఫార్మాట్లలో దర్శనమిస్తున్నాడు. ఇది నిప్పుకు ఆజ్యం పోస్తోంది. రాణా ప్రతిభావంతుడైనప్పటికీ ఇంకా దేశీయంగా రాటుదేలలేదు. కొన్ని ప్రదర్శనలు మాత్రమే అతని ఖాతాలో ఉన్నాయి.
రాణా ఎంపిక సోషల్ మీడియాలో ట్రోల్స్ కు దారితీసింది. కోచ్ గంభీర్ తో సన్నిహితం కారణంగానే రాణా అన్ని ఫార్మాట్లకు ఎంపిక అవుతున్నారని రూమర్లు వస్తున్నాయి. కేకేఆర్ లో గంభీర్ అతడికి మెంటార్ గా వ్యవహరించాడు. దీనికి తోడు ఇద్దరిది ఢిల్లీ నేపథ్యం.
మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సహ చాలామంది మాజీ ఆటగాళ్లు ఈ చర్యను ఖండించారు. ఎంపిక అనేది సన్నిహిత సంబంధాల ఆధారంగా కాదు. కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే ఉండాలని అన్నారు. ప్రస్తుత వ్యవస్థ ఫామ్ కంటే పరిచయాలే జట్టు ఎంపికకు ప్రామాణికం అనే సందేశం ఇచ్చేలా ఉందని చెప్పారు.
గంభీర్ మాత్రం ఈ వాదనలు తిప్పికొట్టాడు. సోషల్ మీడియా ద్వారా ఒక యువకుడిని లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని అభివర్ణించారు. రాణా యోగ్యత ఆధారంగా జట్టులో చోటు సంపాదించుకున్నాడని వివరణ ఇచ్చాడు. అయినప్పటికి ట్రోల్స్, చర్చ తగ్గలేదు. ప్రస్తుత జట్టు ఎంపిక కోచింగ్ విధానం పక్షపాతానికి గురవుతుందనే పెరుగుతున్న కథనానికి దారితీసింది.



సీనియర్ ఆటగాళ్లలో అనిశ్చితి..
భారత సీనియర్ ఆటగాళ్ల పరిస్థితి కూడా అనిశ్చితిలోనే ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆశ్చర్యకరంగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఇవి అభిమానులలో అయోమయంలో పడేశాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు దేశీయ రెడ్ బాల్ ఆటలు ఆడారు. ఇది వారి ఆసక్తిని సూచిస్తుంది.
దీనికితోడు 2027 ప్రపంచకప్ లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఉంటారా లేదా అనే దాని సెలెక్టర్లు ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో అంతా గందరగోళంగా ఉంది. జట్టు ఎంపిక అనేది అంతర్గత విషయంగా అనిపించవచ్చు.
కానీ క్రికెట్ పిచ్చి ఉన్న భారత్ వంటి దేశంలో ప్రజలకు ఉన్న సంబంధాన్ని నిర్వచిస్తుంది. పరుగులు, వికెట్లు అవకాశాన్ని హమీ ఇవ్వమని ఆటగాళ్లు విశ్వసిస్తే, దేశీయ వ్యవస్థ దాని ప్రేరణాత్మక మూలాన్ని కోల్పోతోంది. జట్టు ఎంపిక రాజకీయంగా ప్రభావితమైనవి లేదా పక్షపాతంలో ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ..
క్రికెట్ ఆడే మరే ఇతర దేశంలోనూ లేని లోతు భారత్ లో ఉంది. కానీ ఆ లోతు న్యాయాన్ని తప్పనిసరి చేస్తుంది. దేశంలో ప్రతిభ పుష్కలంగా ఉంది. కానీ ఎంపికలో అన్యాయం జరుగుతున్నట్లు అనిపించింది. ప్రస్తుత వివాదం ఒక ఆటగాడి గురించి లేదా ఒక నిర్ణయం గురించి కాదు. ఇది లక్ష్యం పట్ల స్పష్టత కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.
దేశీయ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకూ నమ్మకం పైనే ఆధారపడి ఉంది. ఆటగాళ్లు తమ ప్రదర్శనకు ప్రతిఫలం లభిస్తుందా అని సందేహం ప్రారంభం అయింది.
శుభ్ మన్ గిల్ నేతృత్వంలోని కొత్తతరం ఇప్పుడు 2027 ప్రపంచకప్ కోసం సిద్దమవుతున్న తరుణంలో ఇప్పుడు ఎంపిక ప్రక్రియ కీలకంగా మారింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఇప్పుడు భవిష్యత్ ఎంపికకు సిద్దంగా ఉంది.
అయితే వారికి పక్షపాతం, కమ్యూనికేషన్ గ్యాప్ వంటి వాటితో పోరాడుతోంది. వారు కేవలం జట్లను మాత్రమే ఎంపిక చేయరు. బిలియన్ల మంది అభిమానుల సమష్టి విశ్వాసాన్ని రూపొందిస్తారు. ఇది జట్టు ఎంపిక మళ్లీ విశ్వాసాన్ని ప్రేరేపించే సమయం ఇది.. కానీ వివాదాలను కాదు!
(ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను అందించడానికి వేదికగా పనిచేస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు అభిప్రాయాలు రచయితవి. ఇవి తప్పనిసరిగా ది ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబిచవు)
Read More
Next Story