
వాఘా సరిహద్దులో పాక్ సైనికులు
పాక్ ఉగ్రవాదులను అణచడానికి యుద్ధం కంటే మంచి మార్గం ఉందా?
పుల్వామా దాడి తరువాత భారత్ ఎంచుకున్న దారి సైనిక ఘర్షణ కంటే ఉత్తమమా?
(అనువాదం.. చెప్యాల ప్రవీణ్)
పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను లేకుండా ఏరివేయడం భారత్ కు అత్యవసరం. చాలా సంవత్సరాల క్రితం నాటి ఒక సంగతి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చిందనుకుంటున్నాను.
బెనజీర్ భుట్టో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన కొంతమంది దుండగులు ఒక భారతీయ నిఘా అధికారిని ఎత్తుకెళ్లారు.
ఆయన తన మూడేళ్ల పదవీకాలం ముగించుకుని రేపు భారత్ కు తిరిగి రావడానికి సిద్దమవుతున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. తరువాత ఆ అధికారిని ఐఎస్ఐ రోజుల తరబడి తీవ్రంగా హింసించింది.
భారత నిఘా సంస్థ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అతడిని బయటకు తీసుకురాలేకపోయింది. అయితే సదరు అధికారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఐఎస్ఐ అతడిని ఒక కారు ప్రమాదంలో చంపాలని నిర్ణయించుకుంది.
భారత అధికారి ఎలా అదృశ్య అయ్యారో న్యూఢిల్లీ, భారత నిఘా అధికారులు కనుగొన్నారు. వీరు సదరు అధికారిని వెతకడానికి ఇస్లామాబాద్ కు అల్టిమేటం జారీ చేయడంతో అక్కడ అధికారులు హైరానా పడ్డారు.
మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కిడ్నాప్ కు గురైన అధికారి సురక్షితంగా రాకపోతే న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ అధికారులకు ఇదే గతి పడుతుందని స్పష్టమైన సందేశం బెనజీర్ భుట్టో కార్యాలయానికి అందింది. ఈ బెదిరింపు బాగా పనిచేసింది.
పాక్ ప్రధాని ఐఎస్ఐకి ఫోన్ చేసి ఎలాంటి షరతు లేకుండా సదరు అధికారిని విడుదల చేయాలని ఆదేశించింది. అప్పటికే ఆ దుండగులు ఆ అధికారిని కారు లోపల ఉంచి కొండపై నుంచి తోసేసేందుకు చివరి ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో విడుదలకు ఆదేశాలు రావడంతో కిడ్నాప్ కు గురైన అధికారి గాయాలతో ఢిల్లీకి తిరిగి వచ్చాడు.
పాక్ ఏమనుకుంటుందంటే..
ఈ విషయాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవడంలో ముఖ్య విషయం ఏంటంటే.. పాకిస్తాన్ ను నడిపే పాలకులకు ఒక ప్రత్యేక మనస్తత్వంతో ఉంటారు.
1970 ల కాలం నుంచి వీరికి ఈ మనస్తత్వం బాగా అలవాటు అయింది. ఆఫ్ఘన్ పై సోవియట్ ఆక్రమణ తరువాత తాము పాలు పెంచి పోషించిన ముజాహిదీన్ ల బలం.. అమెరికా, సౌదీ అరేబియా, బ్రిటన్ దేశాల నుంచి వచ్చిన ఉదార సాయంతో పాక్ పాలకులు చెలరేగారు.
తాము ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చని, తమను అడ్డుకునే వారే ఉండరని, దారుణమైన హత్యలకు పాల్పడిన అడిగేవారే ఉండరని దాని మదిలో బాగా నాటుకుపోయింది.
భారత్ కు వ్యతిరేకంగా అన్ని రకాల ఉగ్రవాదులకు పాకిస్తాన్ చాలాకాలంగా ధైర్యంగా ఆశ్రయం కల్పించడానికి, ఆర్థిక సాయం అందించడానికి, సైనిక సాయం చేయడానికి ఇదే ప్రధాన కారణం.
జమ్మూకాశ్మీర్ విషయంలో ఇస్లామిస్టులకు రాజకీయ, దౌత్యపరమైన మద్దతును పాకిస్తాన్ బహిరంగంగానే అందించేది. కానీ మారుతున్న అంతర్జాతీయ పరిణామాలు, భారత్ దూకుడుతో పరిస్థితి అప్పటిలా లేదు. కానీ పాక్ మాత్రం తన మనస్తత్వం మార్చుకోలేదు.
పాకిస్తాన్ గుండెల్లోకి..
అపహరణకు గురైన ‘రా’ అధికారి విషయంలో లోగానే హత్యలు వన్ వే ట్రాఫిక్ కానవసరం లేదని భారతీయులు నిరూపించిన మరో సందర్భం కార్గిల్ యుద్దం సందర్భంగా జరిగింది.
డజన్ల కొద్ది పాకిస్తాన్ ఆక్రమణదారులను పట్టుకుని ఉరితీశారు. దీనికి సంబంధించిన ఫొటోలు తీయడానికి వీలులేకుండా అప్పుడు కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఆ సమాచారం బయటకు రాలేదు. ఈ ఘటనపై ఇస్లామాబాద్ ఏమి చేయలేకపోయింది. ఎందుకుంటే కార్గిల్ లో ప్రవేశించినవారు తమ వారు కాదని అంతకుముందే ప్రకటించింది.
భారత్, పాక్ భాషను అర్థం చేసుకుంది, పాకిస్తాన్ లో ఉన్న డజన్ల కొద్ది ఉగ్రవాద నాయకులను ఏరివేసేందుకు కట్టుదిట్టమైన ప్రణాళికబద్దంగా రహస్య మిషన్ ను ప్రారంభించింది. ఉగ్రవాదులు, నిర్వాహకులు తాము భారత చట్టానికి అతీతులమని, వారికి ఎప్పుడూ ఏమి జరగదని నమ్మూతూ ఉన్నారు.
2020-2024 వరకూ అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. దాదాపు 20 లక్షిత హత్యలు జరిగాయి. వాటిలో ఎక్కువ భాగం జైష్ ఏ మహ్మద్, లష్కర్ ఏ తోయిబాలకు చెందిన టాప్ నాయకులే కావడం గమనార్హం. ఈ రెండు సంస్థలు భారత్ లో నిషేధించారు. ప్రపంచం కూడా వీటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాయి.
గల్ఫ్ దేశాల నుంచి ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నట్లు కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి. ఖలిస్తానీ తీవ్రవాది పరమ్ జీత్ సింగ్ పంజ్వార్ కాల్చి చంపబడ్డాడు.
లష్కర్ ఏ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో కారు బాంబు పేలింది. అతను తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ చర్యలను భారత్ ఖండించింది.
ఉగ్రవాద శ్రేణులలో అర్థం అవుతుందా?
పాకిస్తాన్ లో ఈ లక్షిత హత్యలు ఎలా ప్రారంభం అయ్యయి? 2019 లో జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన కారుబాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులు మరణించడం దీనికి ప్రధాన కారణం.
ఈ హింసాత్మక చర్యను జేఈఎం గర్వంగా ప్రకటించుకుంది. ఈ అల్లకల్లోలం ఉగ్రవాదంపై యుద్ధాన్ని శత్రువు మధ్యలోని తీసుకెళ్లాలని భారత భద్రతా సంస్థలను ముందుడుగు వేసేలా చేసి ఉంటుంది.
హత్యల్లో వేగం పెరిగిన తరువాత ఉగ్రవాద శ్రేణులు, వారి నిర్వాహకులలో భయాన్ని సృష్టించాయి. పశ్చిమ దేశాలలో నివసించే ఖలిస్తానీలు క్రమం తప్పకుండా పాకిస్తాన్ ను సందర్శించే వారు.
ఈ లక్షిత హత్యలలో వారు ఉలిక్కి పడి తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు. చాలామంది జేఎం, ఎల్ఈటీ కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు వారి సొంత ఉగ్రవాద దేశంలోనే ఇది జరిగింది. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో అన్న ఆందోళన, భయం వారిని వెంబడించింది. ఇది జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలను ఆపలేదు కానీ, గణనీయంగా తగ్గించడంలో సాయపడింది.
ఇలాంటి దాడులకు పుల్వామా సంఘటన ఒక మలుపు. కానీ 2025 లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి మరో మలుపు తిరగబోతుందా అనిపిస్తోంది. ఐఎస్ఐ దాని బుద్దిని మార్చుకోలేదని తెలుస్తోంది.
ఉత్తమ ఎంపిక..
సహజంగానే భారత్ తన ప్రతిఘటన కొనసాగించాలి. ప్రస్తుత కార్యనిర్వహణ విధానాన్ని మెరుగుపరుస్తూనే, పాకిస్తాన్ ఉగ్రవాదులను, వారి నిర్వాహకులను ఇస్లామాబాద్ తో సహ ఎక్కడ దాగి ఉన్న వారిని నిర్మూలించడానికి భారత్ చేయగలిగినంతా చేయడం అత్యవసరం.
ఈ చర్యలు ఇతర దేశాల సార్వభౌమత్వంలోకి జోక్యం చేసుకోవడం కాదు. ఎందుకంటే ఇస్లామాబాద్ దశాబ్ధాలుగా ఇతర దేశాల సార్వభౌమత్వ విషయాల్లోకి ముఖ్యంగా భారత విషయాల్లో నేరుగా కలుగు జేసుకుంటూ ఇబ్బందులు సృష్టిస్తోంది.
ఇస్టామిస్ట్ దేశాల వెలుపల పాకిస్తాన్ ఒక ప్రత్యేకమైన చెత్త బుట్ట. పాకిస్తాన్ లో నిజమైన అధికారం ఎన్నుకోవడిన సైనిక- గూఢచార వ్యవస్థ చేతుల్లోనే ఉంది. దీనికి ఎటువంటి సందేహాలు లేవు. పాకిసాన్ ప్రజలు, దాని సమాజాన్ని ఇతర దేశాలతో పోల్చకూడదు.
పాకిస్తాన్ ఉగ్రవాదులను, వారిని నడిపేవారిని లక్ష్యంగా చేసుకుని చంపడం బహిరంగ సైనిక ఘర్షణ కంటే చాలా మెరుగైన, ఉత్తమమైన ఎంపిక అవుతుంది. ఇది దేశానికి ఎంతో మేలు చేసే అంశం అవుతుంది.
Next Story