జర్నలిస్టులకు కొత్త జర్నలిజం పరిచయం చేయాలి, ఆ పనిచేయాల్సిందెవరు?
x

జర్నలిస్టులకు కొత్త జర్నలిజం పరిచయం చేయాలి, ఆ పనిచేయాల్సిందెవరు?

పత్రికల మూస పద్దతి మారాలి… కొత్త పుంతలు తొక్కాలి.


ఆ మధ్య యూట్యూబ్ చానల్లు దండయాత్ర చేసాయి. ఇపుడు తగ్గు ముఖం పట్టాయి. ఎన్నికల ముందు మల్లీ వస్తాయేమో! ఇటీవల ఆన్ లైన్ దిన పత్రికలు , డిజిటల్ పత్రికలు , ప్రింటు పత్రికలు చాలా వస్తున్నాయి. తెలుగు భాష కనుమరుగవుతున్నవాళ్లు కళ్లు తెరవాలి. పత్రికలకు మార్గ దర్శనం చేయాలి. అదేమీ కనపడడం లేదు. తెలుగు పాఠకులను విస్తరింప చేసుకోవడం ఎలా అని చెప్పకుండా తెలుగు భాషా వాదులు, అధికార భాషా సంఘాలు , ప్రెస్ అకాడమీలు ఏం చేస్తున్నాయో ... అసలు వాల్లు ఎక్కడున్నారో తెలియడం లేదు. ప్రపంచ తెలుగు మహా సభలు అనగానే ఉసుల్ల పుట్ట తీరు పరిగెత్తు కొస్తారు. ట్రాఫిక్ జాం అయినపుడు ట్రాఫిక్ పోలీసు క్రమ మార్గంలో ట్రాఫిక్ క్లియర్ చేయడం కర్తవ్యం. అలాగే పోటా పోటీగా ఉత్సాహంగా వెలువడుతూ పత్రికలు ట్రాఫిక్ జాం సృష్టిస్తుంటే క్రమ పద్దతిలో మార్గ దర్శనం చేసే కర్తవ్యం పై వారంతా స్వీకరించాలి.

తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాభాషా సాంస్కృతిక శాఖ , ప్రభుత్వ ప్రకటనలు జారీ చేసే పౌర సంబంధ శాఖ , ప్రెస్ అకాడమీ, పాఠ్య పుస్తకాల రూపకర్తలు.. .ఏ ఒక్తరైనా , లేదా ఉమ్మడిగా చొరవ తీసుకొని చిన్న పత్రికల సంపాదకులను, బ్యూరో చీఫ్ లను ఆహ్వానించి సదస్సులు, నిర్వహించడం, గైడ్ లైన్సు తయారు చేసి ఇవ్వడం అవసరం. వారికి రాజకీయాలు నేర్పనవసరం లేదు. జర్నలిజం విలువలు, పత్రికా భాష, అనువాదాలకు తెలుగులో సరైన పదాలు సూచించాలి. అలాకాకపోతే వీరు చేసే భాషా సేవ ఏమిటిక? ప్రపంచంలో పత్రికల్లో వస్తున్న ట్రెండ్స్ ను పరిచయం చేయాలి. తద్వారా వారికి ఆసక్తి గల దారిలో పత్రికను తీర్చి దిద్దుకుంటారు. అలాగే 5 నిమిషాలకో వార్త, నిమిష నిమిషానికి వార్తలందించే చానల్లు, డిజిటల్ బుచ్చి వార్త పత్రికలు వస్తున్నతీరు గమనించి ప్రింటు పత్రికలు ఆన్ లైన్ డిజిటల్ పత్రికలు తమ ప్రత్యేకతను ఎలా నిలుపుకోవాలో తమదైన కొత్త పాఠక శ్రేణిని ఎలా సృష్టించుకోవాలో రకరకాల నమూనాలను వారికి పరిచయం చేయాలి.

హైదరాబాద్ నారాయణ గూడ తాజ్ మహల్ హోటల్ పక్కన పత్రికలు అమ్మే పాన్ షాపులో రకరకాల పత్రికలు కనపడతాయి. దిన పత్రికల్లో అలాంటి శీర్శికలు, ప్రత్యేక వ్యాసాలు, పరిశోదన ఆర్టికల్స్ , ఇంటర్ వ్యూలు ప్రచురించుకోవచ్చు.

ఎన్ని పత్రికలు వచ్చినా కొత్తదనం లేదు. అందరు అవే వార్తలు. కొత్త వార్తలు తక్కువ. కొత్త

కోణాలు తక్కువ. వ్యాసాలు, సంపాదకీయాలు లేని పత్రికలు దిన పత్రికల్లా అనిపించడం లేదు. కొందరు సంపాదకులు తమ సైజుకు అనువుగా ఇతరుల వ్యాసాలు ఎడిట్ చేసి ప్రచురిస్తున్నారు. దానివల్ల రచయిత చెప్పదల్చుకున్నది పాఠకులకు చేరదు. ఇన్ని పత్రికలు వస్తున్నా రావలసిన విశ్లేషణలు రావడం లేదు. వార్తలకు బదులుగా కొందరు తమ ఊహలను ‘ఇలా జరిగితే బాగుండు’అని అనుకున్నవి వార్తలుగా వడ్డిస్తున్నారు। నాయకుల పనికిమాలిన పరస్పర విమర్శల

చుట్టూ పత్రికలను తిప్పుతున్నారు. సమాజం గురించిన, ప్రజల గురించిన అనేక అంశాలను వదిలేస్తున్నారు. ఆటలు సినిమా వార్తలు కొత్త పత్రికలు కూడ వడ్డిస్తున్నారు. వీరు చెప్పక పోతే అవి వారికి తెలియవా? అలాంటి వాల్లు గంట గంటకు టీవీ లో సెల్ ఫోన్లో ఫాలో అవుతూనే ఉంటారు.

పెద్ద పత్రికలు అనగా పెద్ద సర్కులేషన్ గల పత్రికల కన్నా చిన్న పత్రికలు ఎన్నో విషయాలను అందించవచ్చు. పెద్ద పత్రికల్లో ప్రకటనలు ఎక్కువ. ఆటలు, షేర్ మార్కెట్, బిజినెస్, సినిమాలు, మహిళల పేజీలు, విద్యార్థులకు , ఉద్యోగార్థులకు పాఠాలు, సూచనలు , ప్రకటనలు పోనిు నికరంగా వేసే వార్తలు తక్కువ. 20 పేజీలు వేసినా సంపాదకీయ పేజీతో సహా ఐదారు పేజీల వార్తలుంటే ఎక్కువ. ఇది వారి పరిమితి. ఇది అర్థమయ్యాక వార చొరలేని ఫీల్డులో చొరబడి కొత్త పాఠకులను తయారు చేసుకోవచ్చు.

వార పత్రికలు మాసపత్రికలు బాగా తగ్గి పోయాయి. అవి లేని లోటును తీర్డానికి ప్రతి రోజు కథలు నవలలు సీరియల్ గా వేయవచ్చు. విద్యార్థుల రచనలు వేయ వచ్చు. బీసీల పేజీ వేయ వచ్చు. యువ పారిశ్రామిక వేత్తల పరిచయం వేయవచ్చు.

విజన్ ఉండాలి. ఎన్నో అంశాలు దొరుకుతాయి. వాట్సప్ లో వచ్చినవి, ఫేస్ బుక్ లో వచ్చివి వెరిఫై చేసి ప్రచురిస్తే వారు పత్రికను వేలాది మందికి పరిచయం చేస్తారు. తమ తొలి రచనలు అచ్చేసిన పత్రిక అని జీవితమంతా గుర్తుంచుకుంటారు.

లేఖల శీర్శిక ద్వారా ఎన్నో విషయాలు చెప్పే అవకాశం ఇవ్వ వచ్చు. విజన్ లేక పోవడమో అధ్యయనం లేక పోవడమో శిక్షణ లేక పోవడమో గాని వారు తెలంగాణ సమాజం బాగు పడడానికి చేయాల్సిన కర్తవ్యాలను స్వీకరించలేక పోతున్నారు. ఇది దయనీయ పరిస్థితి. ఆటలు సినిమాలు ఆ పత్రిక చదవక పోతే పాఠకులకు తెలియవా?

అనుక్షణ టీవీ ప్రసారాలున్నాయి. పతిరికలు తమదైన కొత్త పాఠకులను తయారు చేసుకోవాలనే ధ్యాస పెరగాలి. కథలు నవలలు సీరియల్లు ప్రచురించి వార పత్రికలు లేని లోటు తీర్చవచ్చు. పాఠకులను పెంచుకోవచ్చు. విద్యార్థుల రచనలు వేసి ఆకర్శించ వచ్చు. ఆలోచిస్తే ఎన్నో కొత్త వి తోస్తాయి. కొన్ని ప్రింటు పత్రికలు కూడా మూస ధోరణి మార్చుకోవాలి. ఏబీకే ప్రసాద్ గారు ఏ పత్రికకు మారితే ఆ పత్రికలో అంత వరకు ఏ పత్రికల్లో లేని శీర్శికలు ప్రవేశ పెట్టి కొత్త పాఠకులను తయారు చేసేవారు. వారిని మార్గ దర్శకంగా తీసుకొని కొత్త కొత్త ఆలోచనలు చేయడం అవసరం.

ఇటీవల మరో ట్రెండ్ చోటు చేసుకున్నది. పత్రికను చదివే పత్రికగా కాకుండాచూసే విజువల్ పత్రికగా మార్చేస్తున్నారు. చదవడానికి అనువుగా ఉండడం లేదు. పేజీ డిజైనింగ్లో మొదటి పేజీ తప్ప మిగతా పేజీల్లో ఆకర్శణ కన పడదు. ప్రతి పేజీని మొదటి పేజీలా పెదద్ద హెడింగ్ లు పెడ్తే పత్రిక ఆకర్శణీయంగా వుంటుంది. అనేక విషయాలు తెలుసు కోవడం మార్చుకో డం తమ శ్రమకు సార్థకత చేకూర్చుకోవడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.

Read More
Next Story