
కేజ్రీవాల్ ఓటమే కానీ బీజేపీ గెలుపు కాదా?
సొంత నిర్ణయాలే ఆప్ కొంపముంచాయి. ఏకపక్ష ఆలోచనలతో పుట్టిముంచిన మాజీ సీఎం
అపరిమితమైన అహాంకారం, తాను అజేయుడనే భావన కేవలం పార్టీనే కాదు.. తనను సైతం ఓడించింది. ఏకంగా మూడు సార్లు గెలిచిన తన స్థానాన్ని కూడా కోల్పోయాడు అర్వింద్ కేజ్రీవాల్.
మొదటి ఐదు సంవత్సరాల పాలన తరువాత ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని 2020 లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏర్పడిన వ్యతిరేకతను మాత్రం కేజ్రీవాల్ నేతృత్వంలో పార్టీ తట్టుకోలేక చేతులెత్తేసింది.
తన నిర్ణయాలే పార్టీని నిరాటంకంగా గెలవడానికి కారణమవుతున్నాయని కేజ్రీవాల్ తప్పుగా భావించారు. మొదటి టర్మ్ అంటే 2013-14 లో గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ సాయంతో 49 రోజులు సీఎంగా ఉన్నారు. అప్పుడు ఏర్పడిన సానుభూతి తో రెండో సారి గెలిచి సీఎం అయ్యారు. తరువాత తన పార్టీ పాలనతో రెండోసారి సీఎం అయ్యారు. కానీ ప్రభుత్వ వ్యతిరేకతను మాత్రం పూర్తిగా కనిపెట్టలేకపోయారు.
ఉచితాలు..
ఏ ప్రభుత్వం అయినా నిర్ధిష్ట పరిమితి వరకూ ఉచితాలు ఇవ్వచ్చు. విద్య, ఆరోగ్య, విద్యుత్, నీరు వంటి వాటిని ఉచితంగా ఇవ్వవచ్చు. ఈ రంగాలలో విశ్వసనీయమైన చొరవ అవసరమే. కానీ అది కూడా హద్దులు దాటొద్దు. అయితే ఇవి మాత్రమే ఓట్లు తెస్తాయని నమ్మడం తప్పు.
ఓటర్లు ఇంకా తమను వేధిస్తున్న అనేక సమస్యలను తీరుస్తారనే ఆశతో ఎదురుచూశారు. డిసెంబర్ 2022 లో ఆప్ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ను కైవసం చేసుకున్న తరువాత ఈ ఆశలు ఇంకా ఎక్కువయ్యాయి. కానీ వాటిని అందుకోవడంతో మాత్రం కేజ్రీవాల్ విఫలం అయ్యారు.
మోదీలాగానే..
ప్రధానమంత్రి మోదీ లాంటి స్వభావమే కేజ్రీవాల్ ది కూడా. కాకపోతే ఇక్కడో తప్పు జరిగింది. ఢిల్లీ మాజీ సీఎం తరుచుగా తాను ఎప్పుడో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు తిప్పలు పడేవారు. అయితే మోదీ మాత్రం తాను ఎప్పుడూ కూడా కొత్త కార్యక్రమాలు, పథకాలను ప్రవేశపెడుతూనే ఉంటారు. వాటి ప్రభావంతో సంబంధం లేకుండా కేవలం పేరు మీదనే వాటిని తీసుకొస్తూ ఉంటారు.
అసలు ఆప్ పుట్టిందే ‘ఇండియా అగైన్స్ట్ కరప్షన్’ అనే ప్రచారంతో నుంచి. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు తీసుకొస్తుందని అంతా భావించారు. కానీ కేజ్రీవాల్ తన పాలనలో పార్టీ మూలాలను మర్చిపోయారు.
నిర్ణయాలు అన్ని విఫలం..
డిసెంబర్ 2013 లో ప్రాముఖ్యత కలిగిన రాజకీయ నేతగా కేజ్రీవాల్ ఎదిగిన తరువాత తన స్వంత నిర్ణయాలు బహిరంగంగా ప్రకటించడం ప్రారంభించారు. ఆయన నిర్ణయాలు అన్ని కూడా తన తోటి సహచరులు ఎప్పుడు టీవీల్లోనే వినేవారు. ఇది తరువాత ఆనవాయితీగా మారింది. నిర్ణయాలు అన్ని కూడా కేంద్రీకృతంగా మారడం వల్ల ఆప్ ను భిన్నమైన పార్టీగా కనిపించాలని అందులో చేరిన వారందరూ కూడా తిరిగి పార్టీ నుంచి పక్కకు జరిగారు.
పార్టీ ఫిరాయింపులు కుదిపేశాయా?
పార్టీ ప్రారంభంలోనే మొదలైన నిష్క్రమణలు, పార్టీ ఓడిపోయే వరకూ ఆగలేదు. ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వని నాయకులు ఎనిమిది మంది ఒక్కరోజే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. వీరిలో చాలామంది అవకాశవాద కారణాల వల్ల పార్టీని వదిలి వెళ్లి ఉండవచ్చు.
కానీ ఇక్కడ ఉన్న మరో విషయం ఏంటంటే.. కేజ్రీవాల్ తన పార్టీ సూత్రాలకు కట్టుబడని వ్యక్తులను ఆప్ లో చేర్చుకున్నారని ఇది హైలైట్ చేస్తుంది. వారంతా తమ అభివృద్ధికి పార్టీని ఒక వాహనంగా, సాధనంగా వాడుకున్నారు.
కోటరీ రాజకీయాలు..
కేజ్రీవాల్ అహంకారపూరిత వైఖరి, తన సన్నిహిత సహచర సమూహంలోకి తన వందిమాగదులను చేరడానికి దారీ తీసింది. ఇది ఇతర సీనియర్ మంత్రులను దూరం చేసింది.
రెండోసారి అంటే 2020 లో ఆప్ ఢిల్లీ ఎన్నికల్లో 62 స్థానాలతో గెలిచిన తరువాత తన ఏకాభిప్రాయం లేని విధానాలకు ప్రజల ఆమోదం అని ఆయన అనుకున్నారు.
ప్రధాన సూత్రాల నుంచి పక్కకు..
అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ సూత్రాలను కేజ్రీవాల్ ఉల్లంఘించడం ప్రారంభించారు. రాజకీయాల్లో ఉండాల్సిన అవసరాలు నియమాలు ఉల్లఘించడానికి కారణం అవుతాయని ఆయన వివరించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి నిధులు సమకూర్చే విధానంతో ఆయన వేసిన ఎత్తుగడలు అన్ని అవినీతికి దారితీశాయి. మద్యం కుంభకోణం ఆయనను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.
ప్రత్యామ్నాయం అని చెప్పిన..
ప్రత్యామ్నాయా రాజకీయాలు ప్రారంభిస్తామని హమీ ఇచ్చిన పార్టీ, కొద్ది కాలంలోనే తాను ఇతర పార్టీలకు ఏమాత్రం భిన్నంగా లేనని కనిపించలేకపోయింది. ఇతర పార్టీల నాయకుల లాగా స్టీరింగ్ వీల్ ను నియంత్రించడంలో కేజ్రీవాల్ భిన్నంగా లేడని ప్రజలకు సైతం అర్థమయింది.
ఇతర నాయకుల వలే ఉంటే కేజ్రీవాల్ కు ఓటు ఎందుకు వేయాలని అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ప్రతి పని చేయడానికి కూడా లెప్టినెంట్ గవర్నర్ తో కయ్యాలు పెట్టుకోవడం, నిందలు అన్ని కేంద్రం మీదకు తోయడం కూడా ప్రజలకు నచ్చలేదు.
అసలు ఢిల్లీలో పాలన చేయడానికి కేంద్ర ప్రభుత్వం 1992 లో ప్రత్యేక చట్టం తెచ్చింది. దాని పరిధిలోనే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ అధికార పరిధిని మరిచీ ఇష్టం ఉన్నట్లు వివాదాలు సృష్టించడం ప్రారంభించారు.
తనకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమానమైన అధికారాలు ఉన్నాయని ఆయన భావించారు. కానీ అలాంటివేం తనకు లేవని ఈ మాజీ సివిల్ సర్వేంట్ అధికారి మర్చిపోయారు.
లెప్టినెంట్ గవర్నర్ తో సంఘర్షణ
ఢిల్లీ ప్రజలకు సేవలు అందించడంలో తన పూర్వీకుల తీరు నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడని కేజ్రీవాల్ ఎటువంటి రాజకీయ ఆదేశాన్ని పాటించని లెప్టినెంట్ గవర్నర్లతో కూడా నిరంతరం విభేదిస్తూనే ఉన్నారు. కేజ్రీవాల్ ఎల్లప్పుడు ఢిల్లీని జాతీయ రాజకీయాలకు పునాదిగా భావించారు. ఫిబ్రవరిలో 2014 లో జన్ లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడంలో విఫలమైన వెంటనే పార్టీలో పెద్దగా సంప్రదింపులు లేకుండానే ఆయన రాజీనామా చేశారు.
రాజకీయ ఎత్తుగడలు..
కేజ్రీవాల్ నిర్ణయం పార్టీ కార్యకర్తలను, మద్ధతుదారులను దిగ్బ్రాంతికి గురిచేసినప్పటికీ, తరువాత నరేంద్ర మోదీపై వారణాసి నుంచి పోటీ చేయాలనే నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. ఆయన జాతీయస్థాయిలో ప్రతిపక్ష రంగంలోకి మారడానికి ప్రయత్నించారు. ఈ ప్రచారంలో మద్దతుదారులు పార్టీ నుంచి దూరమైనట్లు ఆధారాలు ఉన్నాయి. దీని ఫలితంగా పార్టీ ఓట్ల వాటా దాదాపు 10 శాతం తగ్గింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవలేదు. కానీ కేజ్రీవాల్ తన విధానాల వల్ల ఓడిపోయాడు.
అయితే ఇప్పుడు మరోక ప్రశ్న. ఈ దారుణమైన పరాజయం నుంచి పార్టీ కోలుకుని పునరాగమనం చెందగలదా. దీనిలో రెండు విభిన్న కోణాలు ఉన్నాయి. కేజ్రీవాల్ ఇప్పుడు బెయిల్ పై బయట ఉన్నాడు. దీనిపై విచారణ తరువాత ఎం జరుగుతుందో చెప్పలేం. ప్రస్తుతం బీజేపీ దాని శాసనసభ విభాగాన్ని విభజించే ప్రయత్న చేస్తుందా? కొంతమంది పార్లమెంటేరియన్లను కూడా పక్కకు తప్పిస్తుందా? అది కూడా కేజ్రీవాల్ పైనే ఆధారపడి ఉంది.
తన తీరును సరిదిద్దుకోవాలి
కేజ్రీవాల్ తన ప్రవర్తనలోని లోపాలను సరిదిద్దుకోవాలి. మరింత స్నేహపూర్వకంగా మారి తన పార్టీతోనూ, ఇతర ప్రతిపక్ష పార్టీలతోనూ ఏకాభిప్రాయంతో ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆప్ ఓటమి తనపైనే కాకుండా తన పార్టీ పై కూడా ప్రభావం చూపుతాయని ఆయన అంగీకరించాలి.
గత పార్లమెంటరీ ఎన్నికల్లో ఎదురైన షాక్ నుంచి బీజేపీ, మోదీ కోలుకుని అనేక విజయాలు సాధిస్తూ వస్తున్నారు. దీని నుంచి కేజ్రీవాల్ పాఠాలు నేర్చుకోవాలి. ఈ ఓటమికి ఆయనదే పూర్తిగా బాధ్యత.
( ఫెడరల్ అందరి అభిప్రాయాలను గౌరవిస్తుంది. అన్ని వైపుల నుంచి సమాచారం సేకరించి ఓ వేదికగా నిలుస్తుంది. ఇందులో సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతం. ఇవి ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబించించవు)
Next Story