లా కమిషన్ లేకుండానే చట్టాలు చేయగలమా?
x

లా కమిషన్ లేకుండానే చట్టాలు చేయగలమా?

జస్టిస్ రితురాజ్ ఆవస్తీ నేతృత్వంలోని 22వ లా కమిషన్ యూసిసి పై అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది చట్టం చేశాక. ఏ నివేదిక ఇవ్వకుండానే చైర్మన్ వెళ్లిపోయారు.


కేంద్ర ప్రభుత్వం కొత్త ‘లా కమిషన్’ (Law Commission) ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. లా (Law) అనే పదాన్ని న్యాయం అనడం న్యాయం. లాయర్ అనే మాట కన్నా న్యాయవాది, న్యాయమూర్తులు అనడం సమంజసం. కాని చిత్రమేమిటంటే, మనకి న్యాయవాదులుగానీ, న్యాయమూర్తులు, న్యాయాధికారులుగాని ఎక్కువగా లేరు. లాయర్లలో గొప్ప వారు, పెద్దవారు ఉన్నారు గాని న్యాయానికి న్యాయం చేసేవాళ్లు తక్కువ. వాళ్లూ కొందరు ఉంటే ఎంత బాగుండేది కదా. న్యాయం చేయగలిగిన వారితో చట్టాలకు న్యాయం చేసేవారితో లా కమిషన్ ఉండాలి. లా కమిషన్ నుంచి న్యాయం అందుతుందని ఆశించవచ్చు. రాజకీయాల నీడల్లో అధికార రాజకీయ క్రీడల్లో న్యాయం (Justice), లా (Law), లా వ్యవహారాలు (Law Affairs) పలచబడకూడదు.

లా కమిషన్ లేకుండానే చట్టాలు చేయగలమా?

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తొందర్లో కమిషన్ లో పనిచేసే వారి పేర్లను ప్రకటిస్తుంది. అసలు చైర్ పర్సన్ లేకుండా చాలా కాలం కమిషన్ ఖాళీగా ఉంది. అంటే న్యాయం కూడా ఖాళీగా ఉందని విమర్శించుకోవచ్చు. కీలకమైన చట్టాలు తెచ్చారు, టకటకా పార్లమెంట్ లో చట్టాలు పాస్ చేయిండం జరుగుతూ ఉంది. ఈ అధికారం ఎవరిచ్చారో? మంత్రులలో, ఎంపీలలో కట్టలుకట్టలు ఉన్న చట్టాల తాళ్లు విప్పేవారు ఉంటే గింటే ఒక్కరో సగమో ఉండవచ్చు. ఆ చట్టాలమీద రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్ లో వేసిన విషయం కూడా చాలామందికి తెలియదు. పత్రికలు, టీవీలు, వీడియోలు ఈ విషయం చెప్పిన తరువాత, ‘ఓ హోహో ఆ చట్టాలు తెచ్చారా’ అనుకుంటారు.

కొత్త కొత్త చట్ట పద్ధతులు

మనకు ఇదివరకు కొన్ని పద్ధతులు ఉండేవి. ముందు ‘లా కమిషన్’ రావడం, మాజీ న్యాయమూర్తులు అధ్యక్షులుగా, కొందరు లాయర్లు, విద్యావేత్తలు ఉండే సభ్యులుగా ఉండేవారు. లా మంత్రిగారు ఫలానా చట్టం కావాలి అని అడిగితే దానికి సంప్రదింపులు, సభలు సమావేశాలు, జరపడం, అభిప్రాయసేకరణ చేయడం ఆ తరువాత కావలసిన చట్టం తయారు చేసుకోవడం పాత పద్ధతి.

ఇప్పుడు కొత్త పద్ధతులున్నాయి. అదేమంటే ముందు మంత్రిమండలి లేదా కేవలం ప్రధాన మంత్రిగారు, వారి హోం మంత్రిగారు, లేదా మరో వ్యవస్థ పెద్దలు నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుడు లా సంబంధించిన సెక్రెటర్లు, బ్యూరో క్రేట్స్ చట్టాలు తయారు చేస్తారు. మంత్రిమండలి, తరువాత పార్లమెంటు, చట్టాలు సులవుగా చేసేస్తాయి. కొందరు ప్రతిపక్ష ఎంపీలు ఏదో నచ్చక బాయకాట్ చేయకపోతేనో. వాకౌట్ చేయకపోతే, చట్టాలు ఇంకా సులువుగా టకటకా బయటకు వస్తాయి. న్యూస్ పేపర్ వచ్చినంత సులువుగా చట్టాలు చేసుకోవచ్చు కూడా. అప్పుడు రాష్ట్రపతి ఆలస్యం లేకుండా ఆమోదం ముద్ర వేయడం, వెంటనే చట్టాలు అమలు కావడం కొత్తపద్ధతి. అవి జనంలోకి వెళ్లిపోతాయి. ఇప్పుడు లా కమిషన్ కార్యక్రమం మొదలవుతుంది. ఉదాహరణ కోసం.. మూడు కొత్త క్రిమినల్ చట్టాలు, యూసిసి కోసం మాజీ రాష్ట్రపతిగారి అధ్యక్షుడుగా ఒక కమిటీ వచ్చింది. ఎపుడు? చట్టం అ వండివార్చి భోజనం ఆరగించేందుకు సిద్ధమయ్యాక. మరో ఉదాహరణ: దేశం మొత్తానికి, అన్ని రాష్ట్రాలకు కావలసిన చట్టాలు, రాజ్యాంగ సవరణలు కూడా సర్వసిద్ధం గా ఉంటాయి. అప్పుడు లా కమిషన్ వస్తుంది. ముందే విధానానికి అనుగుణంగా సంవిధానాన్ని వంచి, విరిచి, వంచించి ఏదయినా మనిష్టం ప్రకారం విధానం సంవిధానం ప్రకారం రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు.

22వ లా కమిషన్ టర్మ్ గత శనివారం ముగిసింది. అప్పడికీ లా కమిషన్ చైర్ పర్సన్ లేదా చైర్మన్ పోస్టు ఖాళీగా ఉన్నారు. జస్టిస్ రిషి రాజ్ ఆవస్తీ (Justice Ritu Raj Awasthi) 17 నెలల పనిచేసిన చాలా నెలల తరువాత వెళ్లిపోయారు. మిగిలిన సభ్యులు కూడా 31 ఆగస్టు 2024 ఖాళీ చేశారు. ఆయనకు యూసిసి చట్టాలు, ఒకే దేశం ఒకే ఎన్నికలు చట్టాలను తయారు చేయడానికి ప్రయత్నించారు కాని ఏ నివేదిక ఇవ్వకపోలేకపోయారు. ఎందుకంటే ఆయన మార్చిలో లోక్ పాల్ మెంబర్ గా పదవిని స్వీకరించారు.

కొత్త లా కమిషన్

ఇప్పుడు కొత్త 23వ లా కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి శుభాకాంక్షలు. అయితే ఇల్లు అలకగానే సరిపోదు. ఓ చైర్మన్, నలుగురు పూర్తి సభ్యులు (అందులో ఒక మెంబర్ సెక్రెటరీ తో సహా), అయిదుగురు మించని పార్ట్ టైమ్ సభ్యులు, ఇంకో ఇద్దరు అధికారులు ఉంటారు. సెప్టెంబర్ 1, 2024 నుంచి ఆగస్టు 31, 2027 దాకా పనిచేస్తారు. తొందరగా ఈ ఏర్పాటు జరుగుతుందని చాలా మంది ఆశిస్తున్నారు.

ఒక దేశం` ఒకే ఎన్నికలు’ పోయిన ఏడాది రాజ్యాంగ దినోత్సవం (నవంబర్‌ 26) సందర్భంగా గుజరాత్‌తో ‘ఆల్‌ ఇండియా ప్రిసైడిరగ్‌ ఆఫీసర్స్‌ కాన్ఫరెన్స్‌‘ (All India Presiding Officers' Conference) ముగింపులో ప్రధాని కూడా ‘ఒక దేశం` ఒకే ఎన్నికలు’ ఎజెండాప్రకటించారు. లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించాలనేది ఆయన అభిమతం. ఎన్ డి ఎ ప్రయత్పం. అందుకు చట్టాలను సవరించాలి. అవసరమైతే పాత చట్టాలను రద్దు చేయాలి. దీనికి అవసరమైన పథకాలు వేయాలి. ఆలోచనలు చేయాలి.

సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్‌ బిపి జీవన్‌ రెడ్డి ఆధ్వర్యంలోని లా కమిషన్ గతంలో ‘ఏకకాల ఎన్నికలు’ అనే అంశాన్ని పరిశీలించింది. అప్పటి నుంచి ఈ విషయం చర్చనీయంగా ఉంది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం సెప్టెంబర్‌ 2, 2023న నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. కమిటీ 191 రోజుల సంప్రదింపులు జరిపిన తరువాత 18,600 పేజీల భారీ నివేదికను 2024, మార్చి 14 న ప్రభుత్వానికి ఇచ్చింది. మరిచిపోకూడని అంశం ఏమిటంటే ఇంకా ‘లా కమిషన్’ లేదు గాని, ఈ ప్రతిపాదన అమలు చేసేందుకు ప్రయత్నాలన్నీ చేసి సిద్ధంగా ఉన్నారు. ఒక దేశం, ఒక ఎన్నికలు అనేది 2029 నుంచి ప్రారంభించవచ్చునని ఎన్డీయే ఎజెండా. ఆ సమయానికి ముందుగా గడువు ముగియనున్న రాష్ట్రాల శాసనసభల గడువును కొంత కాలం పొడిగించడం అవసరమని సిఫార్సులు చేయడం కూడా జరిగిపోయింది.

మొత్తం దేశానికి ఒకే వ్యక్తిగత చట్టం

మరో సంస్కరణ మరీ గొప్పది. అది యూసిసి (UCC: Uniform Civil Code) అంటే మొత్తం దేశానికి ఒకే వ్యక్తిగత చట్టం అంటే ఒకే దేశం ఒకే పర్సనల్ లా ఆక్ట్ అనే నినాదం. ఈ విధానం అనుకున్నారు. ఉండేది వారి సంవిధానం అనుకుంటున్నారుే. రాజ్యాంగమా కాదా తరువాత ఆలోచించుకోవచ్చు. ముందు సవరణలు చేసుకుంటే సరిపోతుంది.

రాజ్యాంగం లో యూసిసీ

1950లో యూసిసి అవసరమనుకుని ఆర్టికిల్ 44 ని రాజ్యాంగ నిర్మాతలు తీసుకువచ్చారు. ఆదేశిక సూత్రాలను సదుద్దేశంతోనే చేర్చారు. అమలు కాలేనివి ముఖ్యంగా రెండు. ఒకటి ఆర్టికిల్ 50 అంటే న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ వారు కలిసి ఉండకూడదు, విడిగా ఉండాలి. రెండోది ఆర్టికిల్ 44: ఈ రెండూ గొప్పగా దేశానికి ఉపయోగించబోవు అని అంబేడ్కర్ ఊహించలేదు. భగవద్గీత, కురాన్, బైబిల్ పేరుతో గొడవలెందుకు? మీకు ఏ పవిత్ర గ్రంధం ఇష్టమయితే దాన్ని చదువుకొండి. ఎట్లాగూ వాటిలోని భాష చాలామందికి రాదు. అదేమిటో కూడా తెలియదు. చదువుకోకపోయినా పరవాలేదు. ఇంటర్మీడియట్ తరువాత మాత్రం ఎంట్రన్స్ రాసుకునేజ్ఞానం ఉండాలి కాని. కాని ఈ మూడు గ్రంధాలు అవసరం లేదు.

21 లాకమిషన్ కాదన్నా కొత్త మరో ప్రయత్నం

ఇదే 21వ లా కమిషన్ ముందు బల్బీర్ సింగ్ చౌహాన్ గారికి 2018 నివేదిక సమర్పించారు. ఆయన చేసిన ప్రధానమైన వ్యాఖ్యలు ఇవి: ‘హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్)ను రద్దును ప్రతిపాదిస్తున్న నిబంధనను చేర్చడం తప్పనిసరా? ఆవిధంగా చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. మరో తీవ్రమైన సమస్య అవుతుంది అన్నారు. జస్టిస్ చౌహాన్ తన నివేదికలో ‘పర్సనల్ లా’ అంటే వ్యక్తిగతమైన అని అర్థం కాదు, ఒక మతానికి చెందిన చట్టాల ప్రకారం అని అర్థం. వివాహం, ఆస్తుల వారసత్వం అంశాలు, ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి వైవిధ్యపూరిత దేశంలో సమానత్వం, మొత్తం మీద భారతదేశానికి ఏకత్వాన్ని కూడా సాధించాల్సి ఉంచాలి. గోవాలో వివాహానికి ముందు ఒప్పందాలు న్యాయబద్ధమైనవే. ఎవరైనా సరే తన సొంత వారసులకు కాకుండా ఇతరులకు సంక్రమింప చేసే ఆస్తుల విషయంలో స్పష్టమైన పరిమితులను గోవా పౌరస్మృతి విధించిందని లా కమిషన్ వివరించింది. లా కమిషన్ యూసిసిని కనుక ‘ప్రస్తుత పరిస్థితిలో మన దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరమూ లేదు, కోరదగ్గదీ కాదు’ (Neither Necessary Nor Desirable) అని స్పష్టం చేసింది.

తరువాత మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత లోక్ పాల్ అయిన రిషిరాజ్ ఆవస్తీ గారి నేతృత్వంలో ఉండిన 22వ లా కమిషన్ మరోసారి ఈ యూసిసి పైన అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. కాని ఏ నివేదిక ఇవ్వకుండానే చైర్మన్ గారే వెళ్లిపోయారు. ఇక కొత్త కమిషన్ కోసం ఎదురుచూసుకోవడమే ప్రస్తుతం మన పని.


Read More
Next Story