కొత్త క్రిమినల్ చట్టాలు: కొత్తదంతా ఉత్తిదే, ఉండేదంతా పాతదే...
x

కొత్త క్రిమినల్ చట్టాలు: కొత్తదంతా ఉత్తిదే, ఉండేదంతా పాతదే...

నేరాల పాత చట్టాలకు కొంగ్రొత్త పేర్లు తగిలిస్తే అదే ‘సంస్కరణా’? భారతదేశ క్రిమినల్ చట్టాలను పూర్తిగా మార్చివేశామని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.1. భారతదేశంలో ప్రస్తుతం క్రిమినల్ చట్టాలను పూర్తిగా మార్చివేసారనుకుంటాం అని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాని 90 శాతం పాత భారత శిక్షా స్మృతి (IPC: Indian Penal Code) అని తెలియడం లేదు. నేరాల గురించిన పీనల్ కోడ్ 1860 ‘ఐ పి సి’ అని మనకు 164 సంవత్సరాలనుంచి తెలుసు. వాటితో పాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC: Criminal Procedure Code) 1973, సాక్ష్య చట్టం అని ఎవిడెన్స్ ఆక్ట్ 1872 కూడా కలిపి మూడు క్రిమినల్ చట్టాలు అంటున్నాం.

2. కొన్నిటిని కోడ్ అనీ, మరొకటి చట్టాన్ని ఆక్ట్ అని ఎందుకు అంటున్నారు? పీనల్ కోడ్ పేరుతో అనేకానేక నేరాల చట్టాలను ఓ సంపుటిగా ఉన్నపుడు దాన్ని ‘కోడ్’ లేదా స్మృతి అని అంటారు. అదే విధంగా ప్రోసీజర్ అనే వివిధ చట్టాల కూటమిని కూడా కోడ్ అంటాం. సాక్ష్యానికి సంబంధించిన అనేక నియమాలను ఒకే చట్టం (ఆక్ట్) అని విభజించినారు.

3. ఒకటి. ఐ పి సి లో నేరాలకు నిర్వచనాలు, శిక్షలు, మినహాయింపులకు సంబంధించిన నియమాలను పీనల్ కోడ్ రెండోది. ప్రక్రియకు సంబంధించిన అనేక నియమాలు (ప్రోసీజర్ కోడ్). మూడోది... సాక్ష్యాల నియమాలు వివరించే చట్టం. ఆ ముగ్గురు ప్రధానమైన వాటిని క్రిమినల్ లా అని అంటారు.

4. మొదటి విమర్శ: ఇప్పడి ప్రభుత్వం ఇవి పాత బ్రిటిష్ కాలపు తుప్పుపట్టిన చెత్త చట్టాలని తప్పు పడుతున్నారు. అవన్నీ కలిపి తిట్టి పడేస్తున్నారు. ఆ మూడు క్రిమినల్ చట్టాల్లో గురించి గొప్పగా ఎవరికీ పెద్ద ప్రేమ ఏమీ అవసరం లేదు. నిజమే. అయితే మరి 1973 మన భారతీయ కోడ్, మన పార్లమెంట్ చేసిన కోడ్ ఉందే కదా. అయినా కూడా ‘చెత్త, పాత, తుప్పుపట్టిన’ అని నిందించడం న్యాయమా?

5. రెండో విమర్శ: 1860 నాటి ఇండియన్ శిక్ష్మా స్మృతి అనే తిట్టుకోదగిన పరమ పాత (లేదా సనాతన) నేర నియమాలను 90 పైగా పాతగానే నెంబర్లు మార్చి కొత్త చట్టం అనీ సంస్కరణ అనడం ఎంతవరకు న్యాయం? అవసరమా? లేక మోసం అంటే తప్పా? సాక్ష్య చట్టం 95శాతం పాతదే. అసలు అక్షరం కూడా తూ.చ. అని మార్చకుండా పెట్టిన చట్టాలకు కూడా వినూత్న చట్టాలనే అంటారా?

6. నేర చట్టాల్లో భారతీయత అంటే ఏది? భారతీయ న్యాయ సంహిత అనీ, నాగరిక సురక్షా సంహిత అనీ సాక్ష్య అధినియమం అని ‘భారతీయ’ అని పేరు తగిలించి వేస్తే భారతీయ జనతా పార్టీకి ఈ కొత్త చట్టాల సొంతమైపోతాయా? మన రాజ్యాంగానికి కొత్త పేరు ఈ మధ్యనే మార్చుకున్నారు. అదో పెద్ద మార్పు అవుతుందా?

7. ఇండియా దటీజ్ భారత్ నిజానికి మన రాజ్యాంగంలో కాన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దటీజ్ భారత్ అని మొదటి ఆర్టికిల్ లోనే 1950లోనే రాసుకున్నతరువాత అది భారతీయ రాజ్యాంగం అని కొత్తగా అనవలసిన అవసరం ఏమొచ్చింది? ఏదో తామే పూర్తిగా రాజ్యాంగాన్ని, నేర చట్టాలను మార్చివేస్తున్నామనే పబ్లిసిటీ హంగుపొంగుల వేషాలేకాక ఇది ఎందుకు, ఏం లాభం.

8. భారతీయ జనతా పార్టీకి స్వయంగా 470 ఎంపీలు గెలిసి పోబోతున్నాయని, కనుక మొత్తం రాజ్యాంగాన్నే పూర్తిగా మార్చేస్తామని కూడా చెప్పుకున్నారు కదా. ఈ ఎన్నికల్లో నిజానికి బిజెపికి చాలా తక్కువ స్థానాలు మాత్రమే లభించాయి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి, నితీశ్ కుమార్ జేడి పార్టీలు లేకపోతే ఎన్ డి ఏ ఓడిపోయి ఉండేది. ఆ ఇద్దరి ఘన విజయం వల్ల, వారి మద్దత్తుతో బలహీనమైన బిజెపి ప్రభుత్వం చేసే అవకాశం వచ్చింది.

9. మేలుకునే ఉన్నారా? దారుణం ఏమంటే, ఇప్పడి ప్రతిపక్షాలు, ఎన్ డి ఎ లోఉన్న చంద్రబాబు, నితీష్ వారి రెండు పార్టీలైనా కనీసం ఈ కొత్త నేర చట్టాలను చర్చించకుండానే యథాతథంగా అమలుచేయడం న్యాయమా? ఆ నేర చట్టాల అమలు చేయడానికి 1 జులై 00.00 సమయానికి ముహూర్తం నిర్ణయించడం సమంజసం కాదు. సంకీర్ణంలోని ఈ రెండు పార్టీలైనా మనం చర్చించడం అవసరం అని అనలేదే? ప్రతిపక్షాలైనా కనీసం గట్టిగా ప్రశ్నించలేదు, కేవలం లాంఛనంగా మాత్రం వ్యతిరేకించారు. తీవ్ర ప్రతిఘటన లేనే లేదు. కనీసం గెలిచిన కొత్త ఎంపీలైనా ఒక్కడంటే ఒక్కడు కూడా ఆలోచించక పోవడం ఇది విచిత్రం. మనం గెలిపించుకున్న ఈ ఎంపీలు, వాటికి ఓట్లు వేసినవారు మేలుకునే వారెవరైనా ఉన్నారా? ప్రతిపక్షం గానీ, పత్రికలు, మీడియా, వీడియో పెద్దలు ఎవరూ ఆలోచించడం లేదా? అని అనుమానం వస్తుంది.

10. తోపు బండి సగటు మనిషికే బాధలన్నీ. హైదరాబాద్ లో చార్మినార్ లో పోలీసు స్టేషన్ లో బి ఎన్ ఎస్ 281 చట్టం కింద మోటారు వాహనాల (ఎం. వి.) చట్టం సెక్షన్ 177, 80(ఎ) కింద తెల్లవారు ఝామునుంచి కేసుల నమోదులు మొదలైనాయి. న్యూడిల్లీ రైల్వే స్టేషన్ బ్రిడ్జి కింద తోపు బండి మీద అమ్ముకుని పొట్టపోసుకునే మామూలు చిన్న వ్యాపారికి భారతీయ న్యాయసంహిత సెక్షన్ 281 కింద కొత్తకేసులు పెట్టడం మొదలు పెట్టారు. ఇంకా నయం దానికి కూడా ఆవిష్కరణలు చేయలేదు.

11. మొత్తం దేశంలో రాబోయే నెలలో ఎన్ని లక్షల కోట్ల జనాల కొత్త కేసులు పెడుతున్నారో ఎవరూ చెప్పలేరు. 650 జిల్లాలలో, 16వేల పోలీసు స్టేషన్ లో ఈ నేరపు చట్టాలు హడావిడిగా అమలు ప్రారంభించారు. పాత సి ఆర్ పి సి 154 కింద గుర్తింపు చేయదగిన నేరాలను నమోదు చేయడానికి సరికొత్త 173 నెంబర్ సెక్షన్ కింద భారతీయ నాగరిక్ సురక్ష సంహిత్ కింద కేసులు పెట్టుకుంటున్నారు.

12. మనకు రెండు సుప్రీంకోర్టులు అవసరమా? పాత 90 శాతం నేరనియమాలు అవేకదా అని పోనీ సరే అనుకుందామా? ఒక సమస్య ఉంది. అంటే ఇప్పుడు మనకు కోటి కేసుల మించినవి, లక్షల హైకోర్టు, అరలక్ష సుప్రీంకోర్టు కేసులుమించిన ఈ పాత కేసులు ఎన్నేళ్లదాకా పురాతన సెక్షన్ల నేరాలకింద విచారణ సాగుతుంది? ఇప్పుడు కొత్త కేసుల విచారణ మొదలైతే, జులై 2024 తరవాత కేసులు ఎవరు విచారణచేస్తారు, ఎన్నేళ్లు చేస్తారు? అందుకని రెండు సుప్రీంకోర్టులు, ప్రతి హైకోర్టుకు ఒకో హైకోర్టు, ప్రతి సివిల్ క్రిమినల్ కోర్టులకు మరో రెండు రకాల కోర్టులను పాతవి, కొత్తవి అంటూ విచారణ అనేది సాధ్యం కాదు. ఆ సెక్షన్ కింద ఒక వాదన, కాదు కాదు ఈ సెక్షన్ కింద అని పంచాయతీలు, రెండిటి మధ్య తేడాలు, భేదాలు విబేధాలు అని ఎవరు చర్చిస్తారు. ఎన్ని దశాబ్దాలు ఈ విచారణలు జరుగుతాయి? ఈ ఆలోచన ఎవరికైనా ఉందా? ఇష్టం వచ్చినట్టు ఐ ఎ ఎస్, ఐ పి ఎస్, పెద్దల చేతిలో సామాన్యులు, పేదల బ్రతుకులు కష్టాల్లో పడిపోతాయి కదా. మాజీ ముఖ్యమంత్రులకు రాజకీయ పెద్దలు, వారి కొడుకులు, వారి కూతురులకు లిటిగేషన్లో పెద్దలాయర్లకు ఎక్కువ డబ్బు చెల్లిస్తూ చాలా కాలం పార్టీ రాజకీయాల బంధాలకు సంబంధించిన సమస్యలు ఏ విధంగానైనా బయటపడే అవకాశం ఉంది. కాని మరి సగటు మనిషి గతి ఏమిటి?

13. మనకు రాజ్యాంగం కన్నా ఎక్కువగా జనానికి తెలిసింది ఐ పి సి మాత్రమే, వారిని ఏడిపించేది కూడా ఐ పి సి సెక్షన్ దెబ్బలే పడుతూ ఉంటాయి. సమాజంలో పోలీసులు, అడవుల్లో అయితే ఆటవీ శాఖల రక్షక భటులు జనం కష్టాలు ఉండేనే ఉన్నవే కదా. మన ప్రభుత్వం వారికి తెలిసిన కేసులు సమస్యలు ఇవే.

14. నెంబర్లు తగ్గినా నేరాలు ఎక్కువే ఇదివరకు 511 ఐ పి సి సెక్షన్ల నెంబర్లు ఏమీ తగ్గలేదు. కాకపోతే వాటిపేర్లు తగ్గించి 398 సెక్షన్లు న్యాయసంహితలో చేర్చారు. ఇది గాక 20 కొత్త నేరాలను సృష్టించారు. వాటికింద 33 కేసులకు కొత్త శిక్షలు రచించారు. జరిమానాలు 83 కొత్త రకం నేరాలు విధించే అవకాశం ఉంది. 23 కొత్త నేరాలలో ‘కనీస కారాగార శిక్ష’లను కనిపెట్టారు. ఇవిగాక సామాజిక సేవ అనే పేరుతో 6 నేరాల్లో వినూత్న విభిన్న నియమాలు తయారు చేసారు. కొత్త బిజెపి ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు, వారి ఎంపీలు ఎంఎల్యేలు వాటిగురించి తెలుసుకునే ఆలోచించనే లేనే లేదు. అయితే 19 శిక్షలను తొలగించారని అర్థం చేసుకోవాలి.

15. చర్చలేకుండానే చర్యలా? తుషార్ గాంధీ, తనికా సర్కార్ వంటి 3700 మంది ప్రముఖులు ఈ కొత్త నేర చట్టాలను పూర్తిగా పరీక్షించి, సమీక్షించి, జనం కూడా చర్చించుకున్నతరువాత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని కోరుకున్నారు. కాని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ జెపిసి ముందు పనికివచ్చే చర్చ లేకుండానే చర్యలు చేయడానికి దిగారు. అంత కొంపమునిగిపోయేంత తొందర ఎందుకు ఈ నేరాల చట్టాలు హడావుడిగా ఇవ్వడమే నేరం కాదా? పోనీ రెండు రకాలు కేసులు విచారణ చేయడానికి ఏమైనా వనరులు కల్పించారా అంటే అదీలేదు.

16. ఇవి భయానకమైన నిర్ణయాలు అని మామూలు జనానికి అర్థం కావడం లేదు. ఈ కొత్త నేర చట్టాలు ఏది టెర్రరిజం అనే నిర్వచనంతో జనాన్ని జైళ్లకు నింపే ప్రమాదం ఉంది. మాట్లాడే హక్కు అని అడుగుతారా అని కోపించి నోర్మూయ్ అంటూ వెళ్లగొట్టే బలాన్ని పోలీసులకు ఇచ్చే చట్టాలివి.

17. రాజద్రోహం తీసేసారని అనుకుంటున్నాం ప్రకటనలు పబ్లిసిటీలు చేస్తున్నారు కాని, దానికిన్నా భయంకరమైన సెడిషన్ తరహా కొత్త నేరాన్ని తయారు చేసారు. వీటికి మించి, తమకు కావలసిన వారిపై కేసులు పెట్టడం, తమ పార్టీకి చేరిన పాత నేరగాళ్లకు ప్రభువులై కొత్తపార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం, కొత్త కండువాలు తయారు చేస్తున్నారు. నచ్చని ప్రభుత్వాలను, కేసులు ఇరికించి, వారికి కొత్త ముఖ్యమంత్రులుగా, ఉపముఖ్యమంత్రులను చేసే అవకాశాలు బోలెడు ఉన్నాయి.

18. పోలీసు ఆఫీసర్లకు విపరీతమైన అధికారాలు ఇచ్చారు. ఉదాహరణకు పోలీసు అధికారుల ఆదేశాలను అవిధేయులైతే, వద్దని వ్యతిరేకించేవారిని, ప్రతిఘటించే వారిని, నిరాహార దీక్షలు, ధర్నాలు, సమ్మెలు చేసే వారిని జైలుకు పంపించే అధికారం అదనంగా ఈ చట్టాలు ఇస్తున్నారు.

19. నింద పడగానే మనుషులకు బేడీలు వేసే బలం పెంచారు.

20. నేరాల పరిశోధనలో చాలా కాలానికి కస్టడీ (అదే జైలు శిక్ష) లో ఉంచడం, ఎఫ్ ఐ ఆర్ చేయాలా వద్దా అనే అధికారం అధికారులకు విపరీతంగా లభిస్తున్నది. జైళ్లో బాధించే అధికారం వంటి రకరకాల చట్టాల వాటికి సంస్కరణల పేరు పెడుతున్నారు. ఇది దారుణం కాదా?

Read More
Next Story