అడవుల్లో తుపాకుల మోత, ఎవరికీ పట్టని ఆదివాసీల హాహాకారాలు
ఆ పార్టీవాడు ఇంకో పార్టీకి ఫిరాయించారనో మరోక నేత వెనక్కు వచ్చాడనో మీడియా రచ్చచేస్తున్నది తప్ప అడవుల్లో సాగుతున్న యుద్ధంలో చనిపోతున్నఆదివాసీల వార్తలు రాయవు
ఛత్తీస్డ్త లో అటు సాయుధ దళాల తుపాకుల ధ్వనుల మధ్య ఇటు ఆదివాసులు తీవ్రమైన ఘర్షణలో కొట్టుమిట్టాడుతున్నారు. అక్కడ ఎన్ కౌంటర్ల హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్ ఘడ్ తొలి ట్రైబల్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ నాయకత్వంలో డిసెంబర్ 2023న బిజెపి ప్రభుత్వం పరిపాలిస్తున్నది. ఆదివాసులు తమ హక్కులు కావాలని అడుగుతున్నారు. అదే సమస్య. అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అధికారానికి సంబంధించిన సమస్యగా మారింది. ఆ ప్రభుత్వాల కింద సాయుధ దళాలకు, మరోవైపు ఆదివాసుల హక్కుల పోరాటాలకు మధ్య ఘర్షణగా మారింది. అక్కడ ఆపరేషన్ ప్రహార్ పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. దీని పేరు ఎన్ కౌంటర్లు. కాదు కాదు, ద్రోణ్ సాంకేతిక తెలివితేటలు వాడుకుంటూ దానికి బాంబులు అమర్చి, జనం మీద ప్రహార్ చేస్తున్నారు. అంటే దాన్ని దమనం అని చెప్పుకుందామా, లేక నెమ్మదిగా ఘర్షణ అనుకుంటే సరిపోతుందా? తెలియదు?
దీనికి నేపథ్యం ఏమిటి?
భారత రాజ్యాంగం లో షెడ్యూల్డ్ ప్రాంతాలలో మొత్తం 11.3 శాతం భారత దేశపు భూభాగంలో ప్రజలు ఉన్నారు. ఎస్ టి క్యాటగరిలో వారికి 8.6శాతం జనాభా ఉంది. అయిదో షెడ్యూల్డ్ లో 10 రాష్ట్రాలు ఉన్నాయి. ఆరో షెడ్యూడ్డ్ లో 4 రాష్ట్రాలు ఉన్నాయి.
భారత రాజ్యాంగం ఆర్టికిల్ 244 కింద విభిన్నమైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మొత్తం అధికారం 59 శాతం జనాభావారికి ఏజెన్సీ పేరుతో గవర్నర్ కు దత్తమై ఉంటాయి. 244(1) కింద 5వ షెడ్యూల్డ్ 244 (2) కింద ఆరోషెడ్యూల్డ్ అధికారాలు వర్తిస్తాయి. వారికి పంచాయతీల షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తరణ చట్టం - పెసా అనే 1996 చట్టం వర్తిస్తుంది. 2006 నుంచి ఎఫ్ ఆర్ ఏ ఫారెస్ట్ హక్కుల చట్టం వర్తింస్తున్నది. అక్కడ రెవెన్యూ చట్టాలు సవరించి పాత సంప్రదాయాలకు సంబంధించిన నియమాలు అమలు చేస్తారు.
రాజ్యాంగం 5వ షెడ్యూల్డ్ కింద పది రాష్ట్రాలలో ఆంద్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వస్తాయి. 6వ షెడ్యూల్డ్ లో నాలుగు రాష్ట్రాలు – అస్సాం, మేఘాలయా, త్రిపుర, మిజోరం ఉన్నాయి. కేరళ లో 5 జిల్లాల్లోని 2 వార్డులు, 2133 నివాసాలలో, అయిదు గ్రామ పంచాయితీలు కూడా షెడ్యూల్డ్ ప్రాంతంలోకి చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
1951 జనాభాలెక్కల ప్రకారం 40 శాతం మంది గిరిజన లేదా ఆదివాసులు ఉన్నారని అంచనా. ఇప్పుడి జనాభా లెక్కలు కచ్చితంగా చేస్తే కనీసం 50 శాతం జనాభా మనదేశానికి విస్తరించి అర్థం అవుతుంది. అంటే మొత్తం భారతరాజ్యాంగం కింద సగం జనాభా రెండు షెడ్యూల్డ్ జనం కింద ప్రత్యేక పరిపాలనా విధానాలు ఉన్నాయి.
మిగతా సగం జనాభాకు మనకు తెలిసిన దేశానికి ఉన్న పరిపాలన అది కాక, మరో సగం జనాభా వేరే రాజ్యాంగ పాలనా పరిపాలన ఉంటుందన్నమాట. కనుక ఆదివాసులు, గిరిజన హరిజన అనే పేరుతో సగం జనాభా మన దేశంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. అప్పుడు వారి కష్టాలు, లాభాలు తెలుస్తాయి. వారికి ట్రైబల్ సలహామండలి. గవర్నర్ సలహాదారుడుగా ఉంటారు. అంటే రాజ్యాంగ ప్రజాస్వామ్య విధానం అమలులో ఉంటుందని మనందరికీ తెలుసు.
లెక్కల ప్రకారం మరో సగం ప్రత్యేక జనాభాకు గవర్నర్ గారు, వారి ద్వారా అధికారం ముఖ్యమంత్రికి వస్తుంది. అంటే పార్లమెంటు లేదా ఆయా అసెంబ్లీలలో అధికారాలు ఉండవు, కేవలం గవర్నర్ కు మాత్రమే వస్తుంది. దాని అర్థం ఏమంటే మొత్తం అధికారాలు పోలీసులకు, సైన్యానికి, లేదా ఇతర రకాల సాయుధ అధికారులకు ఉంటాయి.
సత్యాసత్యాల మధ్య సతమతం
సామాన్యులకు సాయుధ దళాలకు మధ్య నిజాలపైన అబద్దాలపైన పోరాటం జరుగుతున్నది. అంటే నిజంగా మావోయిస్టులు కాదో లేదో, అబద్దపు మానోయిస్టులనే వారో కాదో తెలియదు. అది అసలైన యుద్ధం. చనిపోయేవారిని మావోయిస్టులు అంటారు, చంపిన వారిని కూడా మావోయిస్టులు అని కూడా అంటారు. నిజం ఏమిటో; ఫేక్ ఎన్ కౌంటర్లో, నిజమైన మావోయిస్టులో ఛెప్పడం ఏ విధంగా సాధ్యం? ఈ లోగా చనిపోతున్నారు. కంకర్ అనే ప్రాంతంలో ఎన్నికల సభలో ఇక కేంద్ర హోం మంత్రి రాబోయే రెండేళ్ల కాలంలో (అని ఏప్రిల్ 2022న) మొత్తం నక్సలైట్లను తుదముట్టిస్తారు కంకణం కట్టుకున్నట్టు చెప్పారు.
డ్రోణ్ ప్రహార్
ఒక (డ్రోన్ లు లేదా) ద్రోణ్ ల ద్వారా బాంబులు వేయడం జరిగితే అది ఎన్ కైంటర్లు అనాల్సిన అవసరమేలేదు. ఇక సామాన్యుడా లేక, మావోయిస్టులో అదేమిటో కూడా తెలియని వాడో అమాయకుడో అనే అవకాశం కూడా లేదు ఎందుకంటే డ్రోణ్ బాంబు ప్రహార్ జరుగుతూ ఉంటే, బాంబులు వేసేవాడు విడిగా ఎవడూ ఉండడుకనుక గుడ్డిగా ఒక్కో ఎంచుకున్న ప్రాంతంలో జనులను ఉమ్మడిగా చంపుతూ ఉంటే దాన్ని ఏమనాలి. రాజ్యాంగమా, మరొకటా అని తెలియనిదేమీ లేదు. అవి జనాన్ని తుది ముట్టడమే అని ముమ్మాటి అవుతుంది కదా.
అనేక సార్లు మనం వింటున్న వార్తలు ప్రకారం ‘‘ఎన్ కైంటర్లు’’ కింద గత ఆరు నెలలనుంచి 130 నక్సలైట్లు అనుకునే మామూలు బతుకులు నలిగిపోతున్నాయని చెప్పారు. అందులో కనీసం 390 నక్సలైట్లను అరెస్టు చేసారు. మే 11 నుంచి జులై 18 వరకు 40 నక్సలైట్లనే చెప్పుకుంటున్నా వారిని చంపేసి నట్టు ప్రకటించారు. వీటిని ఆపరేషన్లు అనాలా, ఆపరేషన్ ప్రహార్ అనాలా, లేక కేంద్ర రాష్ట్రాల, లేదా కో ఆపరేషన్ ఫెడరల్ దేశ సమాజమా అని ఎవరూ ఆలోచించడం లేదు. మన పత్రికలు మాత్రం, ఆ పార్టీవాడు ఫిరాయించి, ఇంకో పార్టీకి ఫిరాయించారో, లేక మరో మహానుభావుడు కాంగ్రెస్నుంచి బి ఆర్ ఎస్ వారో ఫిరాయింపు చేస్తున్నారనే విషయాలుచర్చిస్తున్నారు. చనిపోతున్న జనాల గతి ఏమిటి?
ఖనిజాలు, నిజాలు, మధ్యలో దేవుళ్లు
మధ్యలో దేవుళ్లు కూడా వస్తుంటారు. రాజకీయాలు ఉంటాయి. అంతకుముందు ఖనిజాలు ఉంటాయి. వాటిని కాజే వేసుకునే బడాబడా సంపన్నులు, వారికి కోట్లాది కోట్ల రూపాయలు విరాళాలు ఇవ్వగలిగిన పార్టీలు, ఎన్నికల బాండ్లు దేశాన్నినడుపుతుంటారు. మధ్యమధ్య సుప్రీంకోర్టు ఈ బాండ్ల తప్పుతెలుసా అని బాధపడుతూ ఉంటుంది.
2024 ఏప్రిల్ 16న ఎన్ కౌంటర్ లో సాయుధ దళాలచేతిలో 29 సామాన్యులు మరణించారని నక్సలైట్లకు చెందిన కొన్ని ఆర్గనైజేన్లు (పౌరసంఘం) ప్రకటించాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అక్కడి హో మంత్రి విజయ్ శర్మ మావోయిస్టులతో శాంతి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ మధ్య ప్రకటించారు. ప్రభుత్వం నిషేధించిన సల్వా జుడుం వలె గిరిజన హక్కుల పౌరసంఘాల వర్గం వారు నక్సలైట్లనే పేరుతో న్యాయాతీతంగా ఆదివాసులను చంపేస్తున్నారని ఆరోపించారు. భీబత్సం సృష్టిస్తున్నారని ఆవేదన చెందారు. ఆదివాసుల కు కేవలం పేరుతో కొన్ని పథకాలు అమలు చేస్తున్నారని చెప్పినా, అవేమీ జరగడం లేదన్నారు.
రాజ్యాంగ హక్కుల భగ్నం
ఇంతే కాకుండా ఇటువంటి అనేక సంఘటనలు కూడా జరుగుతున్నాయి. విమానాలద్వారా బాంబులు వేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు నేతృత్వంలో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ఊపా, ఆర్మ్స్ ఆక్ట్ కింద ఎందరినో అరెస్టుచేస్తున్నారనీ. కేసులు పెడుతన్నారని విమర్శించారు. ఖనిజాల మైనింగ్ ప్రాజెక్టులు పనిచేయిస్తూ, ఆదివాసులను ఉన్న చోటునుంచి తరలిస్తున్నారు. ఇవన్నీ రాజ్యాంగ హక్కులను భగ్నంచేయడమే అవుతుంది.
ఎంవోయూలు మావోయిస్టులూ
2003నుంచి 2018 దాకా ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం 272 ఎంవోయూలలో సంతకాలు చేసుకున్నారు. వాటి విలువ కనీసం 16.5 మిలియన్ డాలర్లు ఉంటుంది. అందులో 158 ఎంవోయూలు 2021న రద్దు చేసుకున్నారు. దాని బదులు 104 ఎంవోయూలు సంతకాలు చేసి 6 బిలియన్ల డాలర్లవిలువైన ఖనిజాలను వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తారు. ఎంవోయూలకు మావోయిస్టులకు మధ్య సంఘర్షణ అని వ్యంగ్యంగా చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం సమాధాన్ అనే కొత్త పథకం రచించారు. దాని పేరు SAMADHAN: Smart leadership — Aggressive strategy — Motivation and training — Actionable intelligence — Dashboard-based key performance indicators — Harnessing technology — Action plan for each theatre — No access to financing. దాని పరిణామాలు ఏవిధంగా ఉంటాయో చెప్పలేము.
సామాజికశాస్త్ర వేత్త నందిని సుందర్ విశ్లేషణ
ఈ సందర్భంగా సామాజిక శాస్త్రవేత్త నందిని సుందర్ The Burning Forest: India’s War in Bastar (2016) [ఇదే పుస్తకాన్ని 2019 లో తెలుగులో “రగులుతున్న అడవి: బస్తర్ లో భారత యుద్ధం” గా మలుపు బుక్స్ వాళ్ళు ప్రచురించారు] పుస్తకం లో భయానకమైన సంఘటనల నేపథ్యం వివరిస్తాయి. నందిని సుందర్ 413 పేజీల పుస్తకంలో 17 అధ్యాయాలు రచించారు. దీనిని ‘జగర్నాట్’ పుస్తక సంస్థ వారు 2016లో ప్రచురించారు. నందిని సుందర్ ప్రస్తుతం డిల్లీ యూనివర్సిటీ లో సామాజికశాస్త్ర అధ్యాపకురాలుగా పనిచేస్తోంది.
ఒక సామాజిక శాస్త్ర పరిశోధకురాలుగా ఆమె గత 30 సంవత్సరాలుగా బస్తర్ ప్రాంతంలో ఆదివాసుల జీవితాల మీద అధ్యయనం చేసారు. ఆదివాసి హక్కుల కోసం పోరాటాలలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఈ పుస్తకం రాజ్యం తన ఆధీనంలోని అన్ని వ్యవస్థల (state apparatus) ద్వారా కొనసాగిస్తున్న విధ్వంసం, హింస మీదనే ఎక్కువ దృష్టి పెట్టడం మూలంగా పుస్తకం చదువుతున్నంతసేపు చాలా అలజడికి, ఏమి చేయలేని నిస్సహాయతకు, నిరాశావాదానికి గురికావడం సహజం అనీ, “దేశభక్తి” “రాజ్యాంగం” “పార్లమెంటరీ ప్రజాస్వామ్యం” “చట్టబద్ద పాలన” అని గుండెలు బాదుకునే ప్రతి ఒక్కరు నిజాయితీగా చదవాల్సినవనీ, వాళ్ళే కాదు, “తటస్థ” బుద్ధిజీవులం అని చెప్పుకునే వాళ్ళు కూడ తాము ఎటువైపు నిలబడాలో తేల్చుకోవడానికి ఉపయోగపడే రచన అనీ ‘‘గుండె బస్తరై మండుతుంది’’ అనే నందిని సుందర్ రచించిన ఈ వ్యాసంలో వివరించారు.
‘‘పాలకవర్గం అధికారం చేతులోకి వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా అణచివేతను కొనసాగిస్తుందో యురాన్ థేర్ బార్న్ (స్వీడిష్ సామాజిక శాస్త్రవేత్త, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అధ్యాపకులు) తన ప్రసిద్ధ పుస్తకం “What Does the Ruling Class Do When It Rules?” (1978) లో ఎంతో లోతుగా విశ్లేషిస్తాడు. పాలక వర్గాలు తన ఆధీనంలో వుండే అన్ని అణిచివేత సాధనాలను, పద్ధతులను, వనరులను, వ్యవస్థలను (న్యాయ వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియతో సహా) ఉపయోగించుకొని ఏ విధంగా తమ వర్గ ప్రయోజనాలకు కావాల్సిన పరిస్థితులను ఏర్పర్చుకుంటాయో వివరిస్తాడు. ప్రశ్నించే, ధిక్కరించే గొంతులను నిర్బంధించడం, నిషేధించడం. ఆ సమూహాల మీద నిరంతర నిఘా కొనసాగించడం, వేధించడం. భయభ్రాంతులకు గురిచేయడం, ప్రత్యామ్నాయ వ్యవస్థ ఆలోచనలనే నియంత్రించడం. ఇవన్నీ చేయడానికి రాజ్యం తన చేతిలోని అన్ని అధికార విభాగాలను ఎంత అనైతికంగానైనా, దుర్మార్గంగానైన ఉపయోగిస్తుంది. వీటికంతటికి చట్టబద్ద ముసుగు వేయడానికి, సమాజంలో (ముఖ్యంగా పెటీ బూర్జువా వర్గం) మద్దతు కూడగట్టడానికి అనేక విధాల కోఆప్టేషన్ (co-optation) పద్ధతులను వాడుకుంటుంది’’ అని వివరించారు.
ఈ పుస్తకంలో నందిని సుందర్ బస్తర్ అంటే సహజ వనరుల భండాగారం అనీ, మొత్తం దేశంలో వున్న ఇనుప ధాతువు (iron ore) నిలువలలో పది శాతం అక్కడే వున్నాయనీ. అల్యూమినియం తయారీకి వాడే బాక్సైట్, భూమి పొరల్లో అరుదుగా దొరికే అతి విలువైన ప్లాటినం, ఆభారణాలలో కెంపులుగా మార్చబడే కురువిందరాయి (corundrum), వివిధ రకాల సున్నపు రాళ్ళు (limestones), ఇంకా అనేక రకాల సహజ వనరులు అక్కడ వున్నాయనీ వివరించారు. వీటికి తోడు విస్తారమైన అటవీ సంపద. ఈ సహజ వనరుల సారమంతా పిండుకోవడానికి (extractivism) అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. కాని ఆ వనరుల మీద ఆదివాసీలు వున్నారు. బ్రిటిష్ రాజ్యానికే చెమటలు పట్టించిన 1910 నాటి భూంకాల్ పోరాట స్ఫూర్తితో జనం నిలబడివున్నారు.
సల్వా జుడుం
నందిని సుందర్ మరికొన్ని అంశాలు ఈ విధంగా వివరించారు. సల్వాజుడుం భయానకమైంది. గోండి భాషలో సల్వా అంటె శుద్ధిచేయడం, జుడుం అంటే వేట. సల్వాజుడుం అంటే “శుద్ధిచేయడం కోసం వేట.” ఎవరు మైల పడ్డారు? ఎవరు శుద్ధి చేస్తారు? దేని కోసం వేట? సల్వాజుడుం ను మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఒక “పవిత్ర యుద్ధమని,” మావోయిస్టులను ఎదుర్కొనడం కోసం ఆదివాసులు “స్వచ్ఛందంగా” ఏర్పటు చేసుకున్న “శాంతియుత గాంధేయవాద ఉద్యమం” అని కూడా అన్నారు. అయినా దాడిని ఉధృతం చేసి గ్రామాలను తగలబెడుతూ, జీవనోపాధులను కొల్లగొడుతూ, స్త్రీలపై లైంగిక అత్యాచారాలు చేస్తూ, లెక్కలేనంత హింసను కొనసాగించారు. జన్ జాగరన్ అభియన్ కొన్ని టార్గెట్ చేసుకున్న ఇండ్లను మాత్రమే కాల్చేస్తే, సల్వాజుడుం మాత్రం మొత్తం గ్రామాలనే తగలబెట్టేది. ఇదంతా అక్కడున్న ప్రజలను నిర్వాసితం చేసి వాళ్ళ వనరులను బహుళజాతి మైనింగ్ సంస్థలకు అప్పచెప్పడానికి దుర్మార్గం చేస్తున్నారు. కాని కొన్ని వర్గాల మీడియా మధ్యతరగతి మాత్రం ఆదివాసులను “నాగరీకరించడానికి,” వాళ్ళ జీవితాలలో “వెలుగులు” నింపడానికి వాళ్ళను అడవి నుండి బయటకు తీసుకొని రావడమే సరైన మార్గమని అని అంటున్నారు.
2007లో నందిని సుందర్, రామచంద్రగుహ, ఈఏస్ శర్మ సుప్రీం కోర్ట్ రిట్ పిటిషన్ పై జులై 05, 2011లో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సురిందర్ సింగ్ నిజ్జర్ రాజ్యాంగ వ్యతిరేక సల్వాజుడుం చెల్లదని తీర్పు ఇచ్చారు. కాని చత్తీస్ గడ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సల్వాజుడుం కార్యకర్తలను స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ గా నియమించి, వాళ్ళ హింసకు చట్టబద్దతను కల్పించిందని నందిని సుందర్ విమర్శించారు. సల్వాజుడుం ప్రధానమైన పని గ్రామాల మీద పడి తగలబెట్టి, ప్రతిఘటిస్తే చంపేసి, మిగిలిన వాళ్ళను “రిలీఫ్ క్యాంపు” లలో చేర్చడం. ఇదే ఆదివాసులను “నాగరికులను” చేసే నమూనా అని ఆమె వివరిచారు. ఆదివాసులు అమాయకులని, వాళ్ళని మావోయిస్టు లు బ్రైన్ వాష్ చేసి తమలో కలుపుకుంటున్నారని అదే పనిగా ప్రచారం చేస్తున్నారనీ ఒకవైపు ప్రభుత్వాలు, మావోయిస్ట్ ల మధ్య ఆదివాసులు నలిగిపోతున్నారని (సాండ్ విచ్ సిద్ధాంతం చెప్పే) గందరగోళం సృష్టిస్తున్నారని నందిని సుందర్ స్పష్టంగా వివరిస్తుంది.
బస్తర్ గనులలో వచ్చే రాయల్టీలు (royalties) అన్నీ అక్కడి ఆదివాసులకు దక్కిస్తారా లేదా? విద్యా, ప్రజా ఆరోగ్యం ప్రభుత్వాల ప్రథమ విషయమై అమలవుతాయా? అని (నందిని సుందర్ రచన The Burning Forest: India’s War in Bastar ఆధారంగా) మ్యాగజైన్ ‘‘కొలిమి...ప్రత్యామ్నాయ కళా సాహిత్య సాంస్కృతిక వేదిక’’ లో అశోక్ కుంబము వ్యాసాన్ని రాసారు. ఆయన పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.
విధ్వంసపు దారుల నుంచి
— Harish Rao Thanneeru (@BRSHarish) August 9, 2024
వికసిత తోవలు..
మోడువారిన బతుకుల్లో
మోదుగు పూల పరిమళాలు..
గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ప్రధానంగా ఆదివాసీల మూడు డిమాండ్లయిన స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు భూముల పట్టాలను నిజం చేసింది కేసీఆర్ గారు.… pic.twitter.com/SBI41EzG2G