ముస్లింలను ఓబీసీ జాబితాలోకి చేర్చడంపై అభ్యంతరాలు
x

ముస్లింలను ఓబీసీ జాబితాలోకి చేర్చడంపై అభ్యంతరాలు

కులగణనపై కాంగ్రెస్ తో బీజేపీ మాటల యుద్ధం


తెలంగాణలో సామాజిక, జాతి, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వే జరిగింది. స్థానికంగా దీనిని కులగణన గా పిలుస్తారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అగ్ర వర్ణాల వ్యతిరేకతను అధిగమించి మరీ కులగణనను పూర్తి చేసింది. నిజానికి ఇది రాహుల్ గాంధీ చొరవతోనే జరిగిందని చెప్పవచ్చు. ఈ సర్వే చూపిస్తునే ఆయన దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాడు.

ఇది తెలంగాణలో జరిగిన తొలి సైంటిఫిక్ కులగణన. గతంలోఇలాంటి సర్వే ఒకటి 1931 లో నైజాం పరిపాలనలో జరిగింది. అయితే ఆ కాలంలోనే అనేక సవాళ్లు ఎదురయ్యాయి. పల్లెలకు సరిగా రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. అలాగే మరాట్వాడా, కర్నాటక ప్రాంతాలు కూడా ఇందులో భాగంగా ఉండేవి. అయితే 1948 లో జరిగిన పోలీస్ చర్య తరువాత ఈ సర్వే పూర్తి అయింది.
అన్నిటికంటే కీలకమైన సమస్య ఏంటంటే.. జనాభా లెక్కలు జరిపిన అధికారులు మాత్రం ఉర్దూ మాట్లాడితే.. స్థానిక ప్రజలు వారి మాతృభాషకే పరిమితం అయ్యారు. తరువాత బ్రిటిష్ వారి సాయంతో శాస్త్రీయంగా లెక్కించేందుకు ప్రయత్నించినప్పటికీ సాంకేతిక పరిమితుల వల్ల పూర్తి స్థాయిలో సమగ్ర గణన సాధ్యం కాలేదు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి, తెలుగుతో పాటు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో మాట్లాడగలిగే గణనాధికారులను నియమించింది. అలాగే ఈ రోజు రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పల్లెకు సులభంగా వెళ్లడం వీలైంది.
గతంలో టీఆర్ఎస్ (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి - BRS) ప్రభుత్వం 2014లో ఒక రోజు వ్యవధిలో ఓ సర్వే చేసినట్టు ప్రకటించింది. కానీ, అది కుల గణనగా పరిగణించలేం. తెలంగాణ కుల గణన వివరాలను ప్రభుత్వం ఫిబ్రవరి 4న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాదప్రతివాదాలకు దారి తీసింది. బీజేపీ దీనిని ముస్లింలకు అనుకూలంగా తీర్చిదిద్దినట్లు ఆరోపిస్తుండగా, BRS తన 'కుటుంబ సర్వే'ను ప్రామాణికంగా చూపించేందుకు ప్రయత్నిచింది.
ముస్లిం బీసీలపై బీజేపీ అభ్యంతరం..
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ముస్లిం జనాభాను పెంచి చూపించే ప్రయత్నం చేసిందని అలాగే వారిని ఓబీసీగా చేర్చడం పై అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లిం సంఖ్యను పెంచడానికి హిందూ బీసీల సంఖ్యను తగ్గించిందని ఆరోపించింది.
తాము అధికారంలోకి వస్తే ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించి వారికి కేటాయించిన రిజర్వేషన్ ను తిరిగి హిందూ బీసీలకు మళ్లిస్తామని ప్రకటించింది. తాము ముస్లింలను ఓబీసీలుగా గుర్తించమని ప్రకటించింది.
50 రోజులు.. 56 ప్రశ్నలు..
తెలంగాణ ప్రభుత్వం 50 రోజలు పాటు, 56 ప్రశ్నలతో సాగింది. ఈ ప్రశ్నావళిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ వర్గాలకు కుల జాబితా వివరాలను పొందుపరిచారు.
ఈ జాబితాలో ముస్లిం బీసీ-ఈ గ్రూపులో 60 ముస్లిం కులాలు ఉన్నాయి. గణనాధికారులు ఇంటింటా వెళ్లి, ప్రజలు ఏ వర్గానికి చెందారో వివరాలు అడిగి నమోదు చేశారు.
తక్కువ వర్గాల ముస్లింల పరిస్థితి
ఈ గణన ప్రకారం, 10.08% ముస్లింలు బీసీ కేటగిరీలోకి వస్తారు. 2.48% మాత్రమే OCగా గుర్తించారు. ఈ జాబితా మొదటగా 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో చేర్చారు.
ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నారు. అయితే ముస్లింలను బీసీ లెక్కల్లోకి కాకుండా జనరల్ కేటగిరీలో ఉంచాలని బీజేపీ కోరుతోంది. అయితే ఇప్పుడు బీజేపీ అక్కడ అధికారంలో భాగస్వామి.
ముస్లిం బీసీలుగా గుర్తించిన వారిలో చాలామంది వీధి వ్యాపారాలు, భిక్షాటన, సాంస్కృతిక ప్రదర్శనలతో బతుకు బండిని నెట్టుకొస్తున్నారే. వీటిలో ప్రింటింగ్ ప్రెస్ కార్మికులు, చెప్పులు కుట్టేవారు. కూరగాయలు, బైక్ మెకానిక్ తదితరులు ఉన్నారు.
వీరంతా పశ్చిమ దేశాల నుంచి వచ్చిన వారు కాదు. నిజాంల కాలంలో బలవంతంగా మతం మార్పిడికి గురైన వారు. మిగిలిన రెండు శాతం ముస్లింలు పఠాన్లు, సైకులు, మొగలులు, సయ్యద్ లాంటి వారు కావచ్చు. పేదల ముస్లింల గత చరిత్ర, వారి మత మార్పిడిపై బీజేపీకి ఆందోళన లేదు.
మరోవైపు, బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖత్రీలు తదితరులు అమెరికా, యూరప్‌కు వలస వెళ్లి అక్కడి క్రైస్తవ మతాన్ని స్వీకరించడాన్ని బీజేపీ ప్రశ్నించదు. ఆ దేశాలు వారిని సంక్షేమ పథకాల నుండి తొలగించవు. సంక్షేమ విధానాలు కేవలం మతం ఆధారంగా కాకుండా మానవ విలువలపై ఆధారపడి ఉండాలి.
గణనలో హిందూ బీసీలు, బౌద్ధులు, సిక్కులు కూడా ఈ 46.25% లో ఉన్నారు. రిజర్వేషన్ లకు దూరంగా ముస్లింయేతర ఓసీలు కూడా 13.31 శాతం ఉన్నారని తేలింది.
గతంలో BRS సర్వే OC జనాభా 7% మాత్రమే అని పేర్కొంది. కానీ 2014 నుంచి 2025 వరకు హైదరాబాద్‌లో IT, రియల్ ఎస్టేట్ రంగాల పెరుగుదల వల్ల అగ్రవర్ణ వలసలు భారీగా జరిగాయి. అందువల్ల వారి జనాభా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి
అగ్రవర్ణ జనాభా పెరుగుదల
OC జాబితాలో మార్వాడీలు, జైనులు, బనియాలు, శెట్టీలు, అయ్యంగార్లు, బ్రాహ్మణులు తదితర 18 వర్గాలు ఉన్నాయి. 2014 అనంతరం హైదరాబాద్‌లో IT రంగం అభివృద్ధి చెందడంతో ఉత్తరాది అగ్రవర్ణ వలసదారులు అధికంగా వచ్చారు.
హైటెక్ సిటీ (HITEC City) ఇప్పుడు మాన్‌హాటన్‌ లా మారిపోయింది. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన అగ్రవర్ణ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మంచి వాతావరణం, మెట్రో సిటీ కారణంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఎస్సీ, ఎస్టీల విభజన
ప్రస్తుతం బయటకు వచ్చిన లెక్కల ప్రకారం.. ఎస్సీ జనాభా 17. 43శాతంగా ఉంది. ఎస్టీ జనాభా 10. 45 శాతంగా ఉంది. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
మాల, మాదిగ, ఇతరులను మూడు కేటగిరీలుగా విభజించి 9+5+1% ప్రకారం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనిపై పోరాడటానికి స్వయంగా బీజేపీ మాదిగలను సమీకరిస్తోంది. కానీ ఇదే పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎస్సీ వర్గీకరణలో పెద్దగా ఆసక్తి చూపించట్లేదు.
అయితే కులగణనను బీసీలు వ్యతిరేకిస్తున్నారు. వీరి వ్యతిరేకతను తనకు అనుగుణంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. 2023 లో రేవంత్ రెడ్డి, కేసీఆర్ లకు వ్యతిరేకంగా బీసీ సీఎం ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.
ఇది ఓబీసీల దీర్ఘకాలిక డిమాండ్. కానీ, ఇదే పార్టీ కేంద్రంలో కుల గణనను వ్యతిరేకిస్తోంది. దేశవ్యాప్తంగా కుల గణన చేయకుండా ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించాలని బీజేపీ యత్నిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా తెలంగాణలో ముస్లిం వ్యతిరేక ఎజెండా చుట్టునే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుల గణనలో ముస్లిం ఓబీసీ జనాభా 10.08 శాతం చూపించగానే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముస్లింయేతర ఓబీసీలపై కుట్ర జరుగుతుందని ప్రచారం చేపట్టారు.
అండర్ కటింగ్ చేస్తున్న..
హిందూ ఓబీసీ రిజర్వేషన్ ఉద్యోగాలు, సీట్లను ముస్లింలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ఈ విధంగా సర్వే చేయించి సంఖ్యలను తీసుకువచ్చిందని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ ప్రకారం..కాంగ్రెస్ 10.08 శాతం ముస్లింలను ఓబీసీలు మార్చింది.
లేకుంటే వారంతా జనరల్ కేటగిరీలో ఉండేవారు. ఇవి కేవలం మతతత్వ వాదన మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కులగణన చేపట్టి ముస్లింలను ఓబీసీలుగా మార్చాలి. లేకపోతే దేశం అంతటా మతం, కులాన్ని వేరు చేస్తుంది. కానీ అది దేశ వ్యాప్తంగా ఉన్న దిగువ కుల ముస్లింలకు తీవ్ర అన్యాయం చేస్తుంది.


Read More
Next Story