అమ్మ చనిపోవాలని అనుకుంటే…  పిల్లలు ఎందుకు ‘ఆపలేకపోయారు.
x

అమ్మ చనిపోవాలని అనుకుంటే… పిల్లలు ఎందుకు ‘ఆపలేకపోయారు.

ఇది సింపుల్ ఆత్మహత్య వార్త కాదు – హెచ్చరిక అంటున్నారు ప్రముఖ మానసిక వైద్యులు డా బి కేశవులు


ఇది ఒక కుటుంబ కథ కాదు – ఒక సమాజం ఎదుర్కొంటున్న మానసిక విపత్తు, ఒక తల్లి. ఇద్దరు ఇంటర్ చదువుతున్న పిల్లలు. ముగ్గురు కలిసి చనిపోవాలని తీసుకున్న నిర్ణయం. ఈ మూడు వాక్యాలు చదివిన వెంటనే మన మనసు ఒక్కసారిగా వణుకుతుంది. కానీ ఆ వణుకు ఎక్కువసేపు నిలబడదు. ఎందుకంటే మన సమాజం ఇలాంటి ఘటనలను చాలా త్వరగా ‘వ్యక్తిగత సమస్య’గా మలుచుకునే అలవాటు పెంచుకుంది. “ఇంటి గొడవ అయి ఉంటుంది”, “ఆమె మెంటల్‌గా డిస్టర్బ్ అయి ఉంటుంది. “పిల్లలు అమాయకులు” – ఈ మాటలు మనకు ఒక రకమైన ఊరట ఇస్తాయి. కానీ అదే సమయంలో అసలు నిజాన్ని కప్పిపుచ్చుతాయి.


నిజంగా ప్రశ్నించాల్సింది ఇది – ఒక వ్యక్తి ఆత్మహత్య ఆలోచనకు రావడం ఒక విషయం. కానీ ఇద్దరు పిల్లలు కూడా అదే ఆలోచనలోకి ప్రవేశించడం ఏమిటి? ఇది సాధారణ ఆత్మహత్య కాదు. ఇది ఒక రకమైన మానసిక సంక్రమణ. ఒకరి మనసులో పుట్టిన నిస్పృహ, నిరాశ, అంతులేని ఒంటరితనం మిగతా ఇద్దరి మనసుల్లోకి కూడా మెల్లగా ప్రవేశించింది. ఇది ఒక్క రోజు జరిగిన సంఘటన కాదు. నెలల తరబడి, బహుశా సంవత్సరాల తరబడి సాగిన మానసిక క్షీణత ఫలితం.మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే – ఇటీవలి సంవత్సరాల్లో కుటుంబంతో కలిసి ఆత్మహత్య ప్రయత్నాలు పెరుగుతున్నాయి. ఇవి పేదరికం వల్ల కాదు. అజ్ఞానం వల్ల కాదు. చాలా సందర్భాల్లో చదువుకున్న, పట్టణ, మధ్యతరగతి కుటుంబాల్లోనే జరుగుతున్నాయి. అంటే సమస్య ఆర్థిక స్థితిలో లేదు. సమస్య మనసుల్లో ఉంది.

భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు లక్షన్నర నుంచి లక్ష అరవై వేల మంది వరకు ఆత్మహత్య చేసుకుంటున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే రోజుకు సగటున 450 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నాం. ఇందులో అత్యంత ఆందోళన కలిగించే అంశం – 15 నుంచి 29 ఏళ్ల వయసు గల యువతలో ఆత్మహత్య ప్రధాన మరణ కారణాలలో ఒకటిగా మారింది. రోడ్డు ప్రమాదాలు, ప్రాణాంతక వ్యాధులు కంటే ముందుగా నిలుస్తోంది. ఇది ఒక దేశంగా మనం గమనించాల్సిన అత్యంత భయానక సంకేతం.

పిల్లలు ఎందుకు ఆప లేకపోయారు?

ఇది అత్యంత బాధాకరమైన ప్రశ్న, కారణాలు అనేకం. మొదటిది Emotional Dependency Reversal అనగా పిల్లలు తల్లిపై మానసికంగా ఆధారపడటం బదులుగా తల్లే పిల్లలపై ఆధారపడే స్థితి వచ్చి ఉండొచ్చు.
అప్పుడు, అమ్మని బాధపెట్టకూడదు, అమ్మ బాధ మన వల్లే అనే guilt మైండ్‌ను బ్లాక్ చేస్తుంది.రెండోవది Authority Paralysis అనగా భారతీయ కుటుంబాల్లో, తల్లి మాట = చివరి మాట, ప్రశ్నించడం = అవమానంగా ఫీల్ అవుతారు. పిల్లలకు విరోధించే మానసిక శిక్షణ లేదు. మూడోది Hostel Culture Disconnection అనగా హాస్టల్స్ కేవలము Discipline నేర్పుతాయి,Marks నేర్పుతాయికానీ Emotional Negotiation మరియు Crisis Response నేర్పవు. మన చదువు మైండ్‌ను ట్రెయిన్ చేస్తోంది, కానీ మనసును కాదు. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్.భారతదేశంలో ప్రతి ఏడాది సగటున 1.6 లక్షల మందికి పైగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతిరోజూ దాదాపు 450 మంది. ఇందులో భయంకరమైన నిజం ఏమిటంటే —15 నుంచి 29 ఏళ్ల వయసు గల యువతలో ఆత్మహత్య ప్రధాన మరణ కారణాల్లో ఒకటి. ఇది రోడ్డు ప్రమాదాల కంటే ఎక్కువ. ఇది వ్యాధుల కంటే భయంకరం.ఇక కుటుంబంతో కలిసి ఆత్మహత్య ప్రయత్నాలు —గత పదేళ్లలో గణనీయంగా పెరిగాయి. ఇవి పేదరికం వల్ల కాదు. అజ్ఞానం వల్ల కాదు. చాలా సందర్భాల్లో చదువుకున్న, పట్టణ, మధ్యతరగతి కుటుంబాల్లోనే జరుగుతున్నాయి. అంటే ప్రశ్న స్పష్టంగా నిలుస్తుంది.

ఆధునిక జీవితం చంపుతోందా ?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, ఆధునిక జీవితం – కానీ లోపల పెరుగుతున్న ఒంటరితనం,ఈ ఘటనలోని తల్లి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని.మన సమాజంలో ఇది “సక్సెస్”కు ప్రతీక. స్థిరమైన జీతం. పట్టణ జీవితం.
ఆధునిక సౌకర్యాలు. కానీ ఈ వెలుగుల వెనుక ఒక చీకటి ఉంది. ఆమె భర్త విదేశాల్లో.
పిల్లలు హాస్టల్స్‌లో, ఇంట్లో ఆమె ఒక్కరే.రోజంతా ఆఫీస్.రాత్రి ఖాళీ ఇల్లు.మాట్లాడే మనుషులకన్నా స్క్రీన్‌లే ఎక్కువ.ఇటీవలి అధ్యయనాల ప్రకారం, పట్టణ ఉద్యోగుల్లో 35–40% మంది దీర్ఘకాలిక ఒంటరితనంతో బాధపడుతున్నారు. వర్కింగ్ మహిళల్లో డిప్రెషన్ లక్షణాలు, పురుషుల కంటే దాదాపు రెండింతలు
కానీ చికిత్స తీసుకునేవారు 10–15% మాత్రమే సుమా ! ఎందుకు?ఎందుకంటే మన సమాజం ఇప్పటికీ మహిళకు ఇలా చెబుతుంది, నువ్వు బలమైనదానివి.ఇవన్నీ మానసిక భ్రమలు. ఇంత సౌకర్యాలున్నా బాధ ఎందుకు? ఈ ప్రశ్నలే ఆమెను మౌనంగా చేస్తాయి.ఆ మౌనమే చివరికి ప్రమాదకర నిర్ణయంగా మారుతుంది. ఇది ఏడ్చే డిప్రెషన్ కాదు. ఇది అరచే బాధ కాదు.ఇది సైలెంట్ డిప్రెషన్. ఇది కనిపించదు. కానీ నెమ్మదిగా లోపల్నుంచి మనిషిని ఖాళీ చేస్తుంది.

భయానక మానసిక బంధం...


మన విద్యా వ్యవస్థపై అత్యంత తీవ్రమైన అభియోగం, ఈ కథలో అత్యంత వేదన కలిగించే అంశం ఇదే.
ఇద్దరు పిల్లలు ఇంటర్ చదువుతున్నారు. అంటే వాళ్లకు లాజిక్ తెలుసు, సైన్స్ తెలుసు, సరైన–తప్పు తేడా తెలుసుకునే వయసు ఉంది, అయినా ఎందుకు “అమ్మా, ఇది తప్పు”అని ఎందుకు అనలేకపోయారు?
ఇక్కడే మన విద్యా వ్యవస్థ అసలు ముఖం బయటపడుతుంది. భారతదేశంలో స్కూల్ విద్యలో మానసిక ఆరోగ్యం తప్పనిసరి పాఠ్యాంశం కాదు, కాలేజీల్లో కౌన్సిలర్లు ఉన్నా వారిని కలిసే విద్యార్థులు 5% కంటే తక్కువ, హాస్టల్స్‌లో పిల్లల మానసిక మార్పులను గమనించే వ్యవస్థ దాదాపు లేదు, మన విద్య పిల్లలను ఏమి చేస్తోంది? విధేయుల్ని చేస్తోంది , పోటీ పడే యంత్రాల్ని చేస్తోంది. కానీ చేయనిది ఒక్కటే — సంక్షోభంలో నిలబడి “లేదు” అనగలిగే మనిషిని తయారు చేయడం, అమ్మ మాటను ప్రశ్నించడం, మన సంస్కృతిలో ఇప్పటికీ ద్రోహంలా భావిస్తాం. ఆ సంస్కృతే...ఈ ఇద్దరు పిల్లలను అమ్మతో పాటు పోవడానికి సిద్ధం చేసింది. ఇది ప్రేమ కాదు. ఇది భయానక మానసిక బంధం.

మనసును మర్చిన సమాజం...

మహిళలకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువవుతున్నాయి, మహిళల ఆరోగ్యం అంటే మనం ఇప్పటికీ ఏమి చూస్తున్నాం? కానీ మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం? హార్మోన్లు , థైరాయిడ్, ఐరన్ లోపం, నిద్రలేమి, కానీ ఇవన్నీ మానసిక ఆరోగ్యంతో నేరుగా ముడిపడి ఉన్నాయని, సర్వేలు చెబుతున్నాయి, కానీ ఇవన్నీ మైండ్‌పై ప్రభావం చూపుతాయి. శరీర సమస్య ≠ శరీర సమస్య మాత్రమే కాదు, అది మానసిక సంకేతం కూడా కావచ్చు, కానీ, ఇంట్లో ఎవరు అడగరు, ఆఫీస్‌లో ఎవరు గమనించరు, సమాజం పట్టించుకోదు.మన ఆరోగ్య వ్యవస్థ ఇప్పటికీ పూర్తిగా అంగీకరించలేదు, గణాంకాలు చెబుతున్నాయి, వర్కింగ్ మహిళల్లో 60% పైగా దీర్ఘకాలిక అలసట, 50% పైగా నిద్ర సమస్యలు, కానీ మానసిక పరీక్షలు చేయించుకునేవారు చాలా తక్కువ, ఫలితం శరీర సమస్యలు → మానసిక కుంగుబాటు →చివరకు తీవ్ర నిర్ణయాలు.

ఇది వార్త కాదు – హెచ్చరిక ...


ఈ ఘటనలో ఆ తల్లి పిల్లలను చంపలేదు. మన సమాజం వాళ్లను కాపాడలేకపోయింది.
ఇది కవర్ స్టోరీగా ప్రచురితమై మరుసటి రోజు మర్చిపోతే — ఇదే కథ మరో ఇంట్లో పునరావృతం అవుతుంది. ఎందుకంటే — ఒక తల్లి చనిపోవాలని అనుకుంటే, ఆమె బ్రతకడానికి కారణాలు మనం ఇవ్వలేకపోయామని అర్థం. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, మరో కుటుంబం కూలిపోవడానికి ముందు మనం మారుతామా?




Read More
Next Story