
చైనా వైద్య రంగంలో పిపిపి మోడెల్ ఎలా పనిచేస్తున్నది?
చైనాలో ప్రైవేటు వైద్య సేవల క్వాలిటీ మీద అనుమానాలున్నాయి...
విద్య వైద్య రంగాలలో మన ప్రభుత్వం తన బాధ్యతకు తిలోదకాలు ఇచ్చి వాటిని పూర్తిగా ప్రయివేటు కార్పోరేటు శక్తులకు దాసోహం చేసి వారికి ఇబ్బడి ముబ్బడిగా లాభాలను దోచుకునె అవకాశం కలిగిస్తున్న దని, అంతే కాక వారు ఎన్నోఅమానవీయ పద్దతులకు ఒడి గడుతున్నా ప్రభుత్వం అదుపు చేయలేక పోతున్నదని సగటు భారతీయుని ఆక్రోశం. అందువల్ల చైనా వైద్య రంగం లో ప్రైవేటు సంస్థలు వున్నాయి అని వినటం తోనే వాటి పట్ల వ్యతిరేకత కలగడం సహజం. అయితే చైనాలోని ఆ సంస్థల పాత్రను వివరంగా పరిశీలిస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకుంటాము .
2010- 2020 మధ్య ఆరోగ్య రంగం పై అధికంగా పెట్టుబడులు పెట్టిన దేశాలలో చైనా ఒకటి. ఆ దశ లో ఆరోగ్య రంగం పై వ్యయం 166% పెరుగుతుందని వారు అంచనా వేశారు. అదే సమయంలో భారతదేశం 140% పెరుగుదలను సూచిస్తుంది. వ్యయం విపరీతంగా పెరుగుతుండటంతో ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగి ప్రైవేటు పెట్టుబడిని, నైపుణ్య లను వినియోగించడం వైపు అనేక దేశాలు మొగ్గు చూపుతున్నాయి. . చైనా లో కూడ 2013 నుండి దీనికి అనుకూల విధానం ఆవిర్భవించడంతోను, బలమైన మద్దతు లభించ డంతో చైనాలో పిపిపి సంస్థలు ఆరంభమయ్యాయి.
పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల మధ్య సహకారం కోసం ఏర్పాటు. ఇది సాధారణంగా దీర్ఘకాలిక స్వభావం కలిగి ఉంటుంది. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటు పెట్టుబడులు ప్రభుత్వానికి సహకరించేలా ప్రోత్సహించే పద్ధతి ఇది. అనేక సందర్భాల్లో, పిపిపి అంటే అర్ధం ప్రైవేట్ రంగం ప్రభుత్వ మౌలిక సదుపాయాల పెట్టుబడులకు నిధులు సమకూర్చటమన్నమాట .
ఆరోగ్య పరిరక్షణ పీపీపీలు ఎక్కువగా దీర్ఘకాలిక ప్రాజెక్టులు. సాధారణంగా, ప్రభుత్వమే వాటి లక్ష్యాలను నిర్దేశిస్తుంది. వాటి నిర్వహణకు ప్రైవేట్ రంగాలు బాధ్యత వహిస్తాయి. ప్రైవేట్ రంగాలు పిపిపి ఒప్పందం యొక్క షరతులు, నిబంధనలు, రూపాలు, నమూనాల ప్రకారం వారి చెల్లింపులను అందుకుటాయి.ఇప్పటివరకు ఆరోగ్య సంరక్షణ రంగంలో పిపిపి పెట్టుబడికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాన దేశాలు యునైటెడ్ స్టేట్సు, యునైటెడ్ కింగ్డమ్. ప్రపంచ వ్యాప్తంగా పీపీపీలకు ప్రాధాన్యం పెరుగుతుండటంతో చైనా, భారత్, లెబనాన్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా వాటి ప్రభావం పెరుగుతోంది. అయితే వీటి నిర్వహణ ఒక్కో దేశంలో ఒక్కో తీరుగా వున్నది .
చైనాలో ఆరోగ్య సంరక్షణ రంగంలో పిపిపి యొక్క విజయ వంతమైన అనుభవాలను, వారివైఫల్యాల నుండి నేర్చు కున్న పాఠాలను కొద్దిగానైనా తెలుసుకొవలసిన ఆవశ్యకత మనకుంది.
2003నుండి 2013 వరకు, పిపిపి యొక్క సైద్ధాంతిక నేపధ్యాన్ని,వాటి పని తీరును పరిశీలించే ప్రొజెక్టులు అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. స్థానిక ప్రభుత్వం ప్రకటించిన అనుకూల విధానాలతో అవి ఆదరణ పొందాయి.2013 లో, మౌలిక సదుపాయాల నిర్మాణంలో పిపిపి యొక్క భాగస్వామ్యం అనుమతించబడింది. ఆరోగ్య రంగం సాధారణంగా ప్రభుత్వ సేవలతో కూడి ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు, ఇతర లాభాపేక్ష లేని సంస్థల నుండి పెట్టుబడులు, ప్రభుత్వ పెట్టుబడుల తో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుల మొత్తం రాబడిని పెంచుతాయి. ప్రైవేట్ సంస్థల లాభార్జన స్వభావం, సహకార ప్రక్రియలో స్వయం ప్రయోజనకరమైన పెట్టుబడులు పెట్టడానికి వారిని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ నియంత్రణ ప్రజా ప్రయోజనాలను సంరక్షించడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా సామాజిక ప్రయోజనాలు నెరవేరుతాయి. అందువల్ల, పిపిపి సహకారం యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఇరు పక్షాల ప్రజా ప్రయోజనకర పెట్టుబడులను పెంచడం, సంస్థల స్వప్రయోజన లక్ష్యం గల పెట్టుబడులను తగ్గించడం అవసరం.
చైనాలో, అనేక విధానాలు ఆసుపత్రి నిర్వహణ, వైద్య వ్యవస్థ నిర్మాణంలో సామాజిక మూలధనాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని కలిగిస్తున్నాయి. జనవరి 2018 లో, “నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ “ఆరోగ్య పరిశ్రమను విస్తృతం గా అభివృద్ధి చేయడం, "ఇంటర్నెట్ ప్లస్ వైద్య, ఆరోగ్య సంరక్షణ" అభివృద్ధిని ప్రోత్సహించడం, వైద్య చికిత్స, వైద్య సంరక్షణ, నర్సింగ్ సంరక్షణ రంగాలలోకి సామాజిక నిధులను ప్రోత్సహించడం గురించి నొక్కి చెప్పింది. అదే సంవత్సరం ఆగస్టులో, స్టేట్ కౌన్సిల్ యొక్క జనరల్ ఆఫీస్ వివేకం, భద్రత, క్రమవిధానం, సమ్మిళిత అభివృద్ధి కి కావలసిన వాతావరణాన్ని పెంపొందించడం, ప్రభుత్వ నేతృత్వంలోని సంస్థల అభివృద్ధి, బహుళ పార్టీల భాగస్వామ్యం, న్యాయమైన పోటీ యొక్క ప్రాథమిక సూత్రాలను రూపొందించడం జరిగింది. ప్రభుత్వ లక్ష్యాలతో పోల్చి పిపిపి పనితీరును అంచనా వేసే భావనాత్మక వాతావరణం ప్రతిపాదించడం ద్వారా భాగస్వామ్య విజయానికి కీలక మైన ఒప్పందాలు జరిగాయి.
చైనాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల పరిణామం
సంస్కరణ, ఓపెన్ అప్ విధానాల వల్ల ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో, ప్రభుత్వ యాజమాన్యాలతో ప్రైవేట్ యాజ మాన్యాలు సహజీవనం చేయడం చైనాలో చట్టబద్ధమయ్యింది. అప్పటి నుంచి ప్రభుత్వేతర సామాజిక పెట్టుబడి ద్వారా స్థాపించబడిన వైద్య సంస్థలు పెరుగుతూ పోయాయి. గత కొన్ని దశాబ్దాలుగా, వైద్య పరిశ్రమలో సంస్కరణ లపై సమయానుకూలం గా ప్రభుత్వం అనేక విధాన పత్రాలను జారీ చేసింది.
గతంలో, విలేజ్ క్లినిక్ ల వంటి అవుట్ పేషెంట్ సేవలు అధికంగా ప్రైవేట్ యాజమాన్యం లో వుండేవి. కానీ ఇన్ పేషెంట్ చికిత్సల లో ప్రైవేట్ ఉనికి పరిమితం గా వుండేది. చైనాలో ఆరోగ్య సేవల పంపిణీలో లాభాపేక్షలేని ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించారు. దానితో ఆసుపత్రులపై సార్వత్రికంగా ప్రభుత్వ యాజమాన్యమే వున్న స్థితి నుండి ఇతర యాజమాన్య పద్దతులకు తావు కల్పించే దేశవ్యాప్త సంస్కరణకు వేదిక ఏర్పాటు అయ్యింది. అయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వ యాజమాన్యమే ముందంజలో ఉంది. కొన్ని అధ్యయనాలు చైనాలో ప్రభుత్వ- ప్రైవేట్ ఆరోగ్య సేవల ప్రొవైడర్లు ఎలా పోటీపడుతున్నారో పరిశీలించాయి. రోగులు తమకు నచ్చిన ప్రొవైడర్ ను ఎన్నుకొనే అవకాశం కలిగించారు.
ప్రభుత్వ బీమా వ్యవస్థలోని రోగులను ఆకర్షించాలనుకునే ప్రైవేటు ఆసుపత్రులు తరచూ ప్రభుత్వ ఆసుపత్రుల కంటే తక్కువ ధరలను వసూలు చేస్తూ, తక్కువ, మధ్య ఆదాయ రోగులను ఆకర్షిస్తూ, అధికంగా రోగి సంతృప్తిని సాధిస్తున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే విధ౦గా కొన్ని ప్రభుత్వేతర ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల ధరలకన్నా తక్కువ లేదా సమానమైన ధరలను వసూలు చేస్తున్నాయని కూడ కనుగొన్నారు. అయితే ప్రయివేటు సంస్థల నాణ్యత పట్ల కొన్ని అనుమానాలు వున్నాయి.ప్రయివేటు సంస్థల నాణ్యత పట్ల కొన్ని అనుమానాలు వున్నాయి.ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అందించే సంరక్షణ నాణ్యతను మదింపు చేసే నిర్దిష్టమైన ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. అందువల్ల ప్రైవేటు ఆరోగ్య సేవలలో నాణ్యతను పెంచేలా కఠిన మైన ప్రామాణికాలు నిర్దేసించారు.
వైద్య సేవలలో ఆసుపత్రులు, క్లినిక్ ల ప్రైవేటీకరణ పెరగడం చైనా ఆరోగ్య సంరక్షణ యొక్క ప్రస్తుత, భవిష్యత్తు పథంలో ఒక ముఖ్యమైన ధోరణిగా రూపొందుతున్నది. ఈ పరిణామం రోగి-కేంద్రిత విధానాల కొరకు, వినియోగదారుల అవసరాలు సత్వరం గా తీర్చడానికి, ప్రభుత్వ ఆసుపత్రుల పై పని భారాన్నిపునః పంపిణీ చేయడానికి తోడ్పడుతోంది. అయితే, అనేక నిర్దిష్ట నిబంధనలు, పరిమితులు కారణంగా, ప్రైవేటు వైద్య సేవలు పూర్తి స్థాయిని చేరుకోలేదు.
గత దశాబ్ద కాలంలో, ప్రైవేటు ఆసుపత్రుల లో పడకల సంఖ్య బాగా పెరిగింది. ఆ మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల పెరుగుదల సాపేక్షంగా తక్కువగా ఉంది. చైనాలో ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య 2011 నుండి 2017 వరకు కేవలం 6 సంవత్సరాలలో మొత్తం 16,900 ఆసుపత్రులు [రెట్టింపు] అయింది. అయితే ఇవన్నీ చిన్న స్థాయి ఆసుప త్రులు. ఇప్పుడు చైనా ఆసుపత్రులలో 57.2% ప్రైవేట్ యాజమాన్యం కింద వున్నాయి. సంస్థల సంఖ్య పెరిగినప్పటికీ, కొన్ని ప్రాంతాల ప్రజలకు ఈ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినప్పటికి ప్రభుత్వ ఆసుపత్రు లతో పోలిస్తే ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా సమకూరుతున్నఆదాయం గణనీయంగా తక్కువ. 2016లో ప్రైవేటు ఆస్పత్రులు అత్యధికంగా పెరిగినప్పటికీ మొత్తం ఆదాయంలో వాటి వాటా 10% మాత్రమే వున్నది. ఈ వ్యత్యాసానికి కారణం ప్రయివేటు రంగంలో రోగుల సంఖ్య [ పరిమాణం] తక్కువగా ఉండటమే.
ప్రైవేటు ఆసుపత్రులు చిన్నవి, ప్రాధమిక మైనవి లేక కొన్నిప్రత్యేక నిపుణతకు చెందిన ఆసుపత్రులు అయి ఉంటాయి. అలాగే సమాజం లోని సంపన్న స్థితి పరులకు, విదేశీ రోగులకు సౌకర్యవంతమైన సేవలు అధిక రేట్లకు సమకూర్చే విభాగం లో కూడా ప్రైవేటు ఆసుపత్రులు నెలకొల్పుతున్నారు. ప్రైవేట్ రంగం వృద్ధులకు గృహ సంరక్షణ సేవలను సమకూర్చు తున్నది. ప్రభుత్వ ఆసుపత్రులు సాధారణంగా ఎక్కువ పడకలు, ఎక్కువ సిబ్బంది, ఉన్నత [తృతీయ] స్థాయి సంరక్షణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే పి పి పి వైద్య సేవలు కొన్నిప్రత్యేక ప్రయోజనాలను నెరవేర్చ గలుగుతు న్నాయని తెలిసింది.ఇటీవలి సంవత్సరాలలో కోవిడ్ మహమ్మారి ప్రభావంతో, సామాజిక వైద్య సేవలు కొత్త అభివృద్ధి అవకాశా లనుఅందుకున్నాయి. ప్రభుత్వ సంస్కరణలు బలోపేతం అయ్యాయి. 2009 లో, ప్రైవేట్ , ప్రభుత్వ ఆసుపత్రు లలో ఏక కాలంలో పనిచేయడానికి, వైద్యులు బహుళ ప్రదేశాలలో ప్రాక్టీస్ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. అదనంగా, ఆరోగ్య సంరక్షణలో ప్రైవేటు పెట్టుబడులకు ఉన్నకొన్నిఅడ్డంకులను ప్రభుత్వం తగ్గించింది. 13 వ పంచవర్ష ప్రణాళికలో, ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులలో 100% వరకు విదేశీ యాజమాన్యాన్నికూడా అనుమతించింది. గతంలో కనీసం 30% చైనా యాజమాన్యం వుండాలనేది ఒక షరతు. 2014 లో, అప్పటికే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ పెట్టుబడిదారులు కొనుగోలు చేయడానికి, లేక నిర్వహించడానికి కూడా అనుమతించారు.
ఆసుపత్రి నిర్వహణ లో కలుగుతున్న నష్టాలను పూరించడానికి నష్ట పరిహారంగా ప్రభుత్వ ఆర్థిక పెట్టుబడి ని పెంచడం ఒక మార్గంగా వుండేది. ఆ పెట్టుబడి ప్రభుత్వ ఆసుపత్రుల మనుగడ, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది. చైనాలో ఆసుపత్రుల మొత్తం ఆదాయంలో ఆర్థిక రాయితీల నిష్పత్తి కూడా ఏటా పెరిగి పోయింది. 2014 లో 7.06% నుండి 2017 లో 8.27%కి పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్నట్లుగా ఈ రాయితీలు నిర్ధారిస్తాయి. ఆర్థిక కేటాయింపుల మొత్తం,ఆసుపత్రి యొక్క సాధారణ కార్యకలాపాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఏదేమైనా, చాలా ఆసుపత్రులు జాతీయ ఆర్థిక కేటాయింపులు ఇప్పటికీ సరిపోవని భావిస్తున్నా యి. చాలా ఆసుపత్రులు మూలధన టర్నోవర్ యొక్క ఒత్తిడిని తగ్గించడానికి రుణాలు కూడా తీసుకుంటాయి. పిపిపి ఆసుపత్రుల స్థాపనను ప్రోత్సహించే సందర్భంలో, కొన్నిరకాల ప్రభుత్వ ఆసుపత్రుల విస్తరణను నియంత్రించడం, పెద్ద ఆసుపత్రుల్లో జనరల్ క్లినిక్ లను రద్దు చేయడం జరిగినది. అయితే ఈ చర్యలు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకు పెను సవాళ్లను తెచ్చిపెట్టాయి.
2015 నుండి, కొత్త ఆరోగ్య విధానం కింద చైనాలో ప్రభుత్వేతర ఆసుపత్రుల అభివృద్ధి ఒక పోటీ వాతావరణాన్ని కల్పించింది. ప్రభుత్వేతర ఆసుపత్రులు కూడా వారి స్వంత ప్రయోజనాల కోసం మంచి ఆరోగ్య సంరక్షణ విధానా లను అమలు చేస్తూ బలంగా, అభివృద్ధి చెందసాగాయి. అయితే వైద్య వనరులు, శాస్త్రీయ పరిశోధనలు, శిక్షణా విధానాలు, వ్యవస్థల పరంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కొత్త వైద్య సంస్కరణ ప్రణాళిక తో, సంస్కరణ ప్రక్రియను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సంబంధిత విధానాలను సముచితంగా సవరించింది ప్రభుత్వేతర ఆసుపత్రులు వైద్య సంస్కరణ యొక్క కొత్త విధానానికి కట్టుబడి ఉండాలి. ప్రతిభావంతులకు అవకాశం కల్పించడం, వారికి శిక్షణ గరపడం పై దృష్టి పెట్టాలి, నిజాయితీతో కూడిన నిర్వహణ తో స్థిరమైన, దీర్ఘకాలిక, సుస్థిర అభివృద్ధిని సాధించాలి అని మార్గనిర్దేశం చేశారు.
చైనాలో ఆరోగ్య సంరక్షణ రంగంలో పిపిపి లు
2009 న్యూ హెల్త్ కేర్ సంస్కరణల కాలం నుండి, ప్రభుత్వ ఆసుపత్రుల సంస్కరణను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక విధానాలను ప్రవేశపెట్టింది. 2010 లో, స్టేట్ కౌన్సిల్ యొక్క జనరల్ ఆఫీస్ ప్రైవేట్ ఆసుపత్రులను మరింత ప్రోత్సహించడం మరియు మార్గనిర్దేశం చేయడం గురించి అభిప్రాయాల నోటీసును ప్రచురించింది. రాష్ట్ర కౌన్సిల్ జనరల్ ఆఫీస్ మార్గదర్శకాలు-2015 లో భాగంగా ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులు ఒకే స్థాయిలో అవసరమైన చికిత్సను అందించేలా చూడ టానికి. ఆసుపత్రుల పడకల పరిమాణం, నిర్మాణ ప్రమాణాలు, వైద్య పరికరాల లభ్యతను కచ్చితంగా నియంత్రించ డానికి, ప్రమాణాలకు సరి తూగని ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా పడకల సంఖ్యను క్రమంగా తగ్గించడానికి సమగ్ర చర్యలు చేపట్టారు. డిసెంబరు 2017 లో, 12 వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చర్చించిన ”లా ఆఫ్ ది బేసిక్ మెడికల్ హైజీన్ అండ్ హెల్త్ ప్రమోషన్’ వైద్య సంస్థలు లాభాపేక్షలేని స్వభావానికి కట్టుబడి ఉండాలని నొక్కి చెప్పింది. వైద్య సంస్థల స్థాపన ప్రక్రియలో సామాజిక పెట్టుబడి ఎదుర్కొంటున్న సమస్య లను క్రమంగా పరిష్క రించడానికి, తగినంత వైద్య వనరులు లేకపోవడం, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మార్కెట్ గుత్తాధిపత్యం నెలకొనడం వంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సంబంధిత విధానాలను జారీ చేసింది. బహుళ-స్థాయి వైవిధ్యభరితమైన వైద్య సేవలను అందించడానికి సామాజిక శక్తులకు మద్దతు ఇవ్వడంపై ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సేకరించి తగు నిర్ణయాలు తీసుకుంటున్నారు
ఇటీవలి సంవత్సరాలలో చైనాలో అభివృద్ధి చెందుతున్న పిపిపి చట్ట చట్రాన్నిపరిశీలిస్తే వైద్యరంగంలోకి సామాజిక నిధులు ప్రవేశించేలా ప్రోత్సహించడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 2019 నాటికి సామాజిక వైద్య సంస్థలకు ప్రభుత్వం తన మద్దతును పెంచింది.2020 లో కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా, నివారణ ,నియంత్రణ పనిలో సంబంధిత బాధ్యతలు, విధులను చేపట్టడానికి ప్రభుత్వం ప్రైవేటు సామాజిక వైద్య సంస్థలను ప్రోత్సహించింది.
ఆ వైద్య సంస్థల నిర్వహణ సామర్థ్యం, వాటి వైద్య నాణ్యత భద్రతా స్థాయిని మెరుగుపరచడం సంస్థలను బలోపేతం చేయడం, క్రమంగా ప్రజలచే నిర్వహించబడుతున్న వైద్య సంస్థల ఆరోగ్యకరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఒక దీర్ఘకాలిక యంత్రాంగాన్ని రూపొందించడం, వాటిని ఏకీకృత వైద్య నాణ్యత నిర్వహణ వ్యవస్థలో విలీనం చేయడం జరుగుతోంది. ప్రభుత్వ వైద్య సంస్థలతో పాటు సామాజిక వైద్య సంస్థలు, చైనా వైద్య మరియు ఆరోగ్య సేవా వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా, నివారణ మరియు నియంత్రణ పనిలో చాలా ముఖ్యమైన విధులను నిర్వహిస్తున్నాయి. చైనా కుటుంబ వైద్యుల వ్యవస్థ అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. చైనా తన వైద్యరంగ సామాజికీకరణను నిర్వహణ దిశను నిర్వచించింది. సాంఘికీకరించిన వైద్య నిర్వహణ కోసం సంబంధిత విధానాలను నిరంతరం మెరుగు పరిచింది. ప్రభుత్వ ఆసుపత్రులలో పిపిపి పాల్గొనడానికి తగిన వాతావరణాన్ని అందించింది.
ఈ ప్రోత్సాహక విధానం వల్ల, సామాజిక పెట్టుబడి ప్రవాహం తో, చైనాలో ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య సంస్థాగత ప్రమాణాలు, మార్కెట్ వాటాల అంశాలలో బాగా అభివృద్ధి చెందాయి. సంఖ్య పరంగా, నేడు ప్రైవేట్ వైద్య సంస్థలు గణనీయంగా ఉన్నాయి. అవి చైనా వైద్య మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా ప్రైవేట్ వైద్య సంస్థలు వైద్య సాంకేతికత , తగిన ఉన్నత ప్రమాణాలపై దృష్టి సారించాయి. వారి సేవల నాణ్యతను క్రమంగా మెరుగుపరుచు కొన్నాయి. వాటి పై కచ్చితమైన నియంత్రణ, నిఘా అమలు చేస్తారు. దేశీయ,అంతర్జాతీయ వైద్య సేవా సంస్థలు , ఫార్మాస్యూటికల్సు, వైద్య పరికరాలు, భీమా మరియు స్థిరాస్తి కంపెనీలు వంటివి ఈ మార్కెట్లోకి ప్రవేశించాయి. దానితో చైనాలో ఒక వైవిధ్యమైన సామాజిక వైద్య సేవల నమూనా రూపుదిద్దుకుంది. అయినప్పటికీ ప్రైవేటు రంగం ఇప్పటికీ పరిమితం గానే వున్నది. ఇప్పటికీ వైద్య సేవలకు ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన వనరుగా ఉన్నాయి.
ఆసుపత్రి సంఖ్యల దృక్కోణం నుండి, ప్రభుత్వ ఆసుపత్రులు , ప్రైవేట్ ఆసుపత్రులు ప్రాథమికంగా ఒకేలా ఉంటాయి, కాని వనరుల పరంగా ప్రభుత్వ ఆసుపత్రులకు సంపూర్ణ ప్రయోజనం వున్నది.అంతేకాదు ఆ సమాజంలో ప్రభుత్వేతర వైద్య సంస్థలపై ఒక అపనమ్మకం పాతుకుపోయి వున్నది. దానికి కారణం గతంలో ప్రయివేటు వైద్యులు ప్రజలను పీడించిన తీరును వారింకా మరచి పొలేక పోవడం. మన దేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల నాణ్యత పై అలాంటి అపనమ్మకం పెరుగుతూ వుండటం గమనించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య వైద్య సేవల సరఫరా డిమాండ్ కు అనుగుణంగా లేదు. కనుక పరిపాలనా మార్గాల ద్వారా ఆసుపత్రుల విస్తరణను సాధించడా నికి వారు ప్రైవేటు వైద్య సంస్థలను అనుమతిస్తున్నారు. అయితే అవి పోటీతత్వం లోపించి ప్రాథమిక వైద్య సేవలను మాత్రమే అందించగలుగు తున్నాయి. వాటిలో సేవల ఖర్చు, ప్రమాణాలు సాధారణంగా ప్రభుత్వ వైద్య సంస్థల మాదిరిగానే ఉంటాయి కానీప్రభుత్వ వైద్య సంస్థలు ప్రభుత్వ ఆర్థిక రాయితీల సౌలభ్యాన్ని అదనంగా పొందుతాయి. పైగా వాటికి పన్ను భారం లేదు. ఇక ప్రయివేటు ఆసుపత్రుల కు స్థాపించిన మొదటి 3 సంవత్సరాలలో పన్ను నుండి మినహాయింపు ఇస్తున్నారు,కానీఆ ఆసుపత్రి లాభదాయకంగా మారడానికి 5–8 సంవత్సరా లు పడుతుంది. కనుక 3 సంవత్సరాల పన్ను మినహాయింపు వాటి స్థాపన లో పెద్ద పాత్ర పోషించదు.
చైనాలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రుల సంఖ్య [డేటా సోర్స్: నేషనల్ హెల్త్ కమిషన్ ]
సంవత్సరం ప్రభుత్వ ప్రైవేటు
2010 15000 6000
2015 14000 13000
2019 13000 20000
వీటిలో పడకల సంఖ్య రీత్యా చూస్తే చైనాలో ప్రైవేటు ఆసుపత్రులు తక్కువ పడకలకే పరిమిత మైనట్లు ప్రభుత్వ ఆసుపత్రులు భారీ సంఖ్యలో పడకలు కలిగి వున్నట్లు అర్ధ మవుతుంది.
పడకల పంపిణీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల శాతం క్రింద చూడవచ్చు.
అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు చైనా సంప్రదాయ వైద్యానికి, అల్ప సంఖ్య జనాభా గల ఎత్నిక్ గ్రూపుల ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇస్తుంటే ప్రయివేటు రంగం ఆధునిక అల్లోపతీ వైద్యానికి పెద్ద పీట వేస్తున్నాయి
ప్రభుత్వ ప్రయివేటు
సమీక్రిత ఆసుపత్రులు 40% 60%
సంప్రదాయ+పాశ్చాత్య విభాగాలు 25% 75%
చైనా సంప్రదాయ వైద్యం . 55% 45%
ఎత్నిక్ ఆసుపత్రులు 75% 25%
నర్సింగ్ హోం [వృద్ధుల సంరక్షణ] 10% 90%
( నేషనల్ హెల్త్ కమిషన్ ఆఫ్ ది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా). చైనా హెల్త్ స్టాటిస్టిక్స్ ఇయర్ బుక్ 2020).
మునుపటి అధ్యయనాల ప్రకారం, నాయకత్వం, నిధులు, ఇతర వనరులు అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఇవి కాలక్రమేణా సంస్థాగత ఫలితాలకు దన్నుగా వుంటాయి. ప్రభుత్వరంగం లో వున్నా, పిపిపి ప్రోగ్రామ్లోవున్నా వైద్య సేవల ప్రామాణికత, ఆధునికీకరణ ఈ రంగంలో అభివృద్ధి, సుస్థిరతలకు కీలకమని వారు నమ్ముతారు.
వైద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో సంస్కరణను లోతుగా అమలు చేస్తూ, చైనా ఆ రంగంలో సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నది. వైద్య వనరుల కేటాయింపును తగినట్లు సర్దుబాటు చేస్తున్నది. ఈ సందర్భంలో, అధిక-నాణ్యత వైద్య వనరుల పంపిణీ, అభివృద్ధికి ఒక ముఖ్యమైన సాధనంగా ఆసుపత్రి నిర్వాహకుల దృష్టిని ఆకర్షించింది. హాస్పిటల్ ట్రస్టీషిప్ అనేది వైద్య సేవల రంగంలో ప్రభుత్వ యాజమాన్యం లోని సంస్థలకు కొనసాగింపు. ఆసుపత్రి నిర్వహణ కోసం కార్పొరేట్ నమూనా, ఒక వైపు అధునాతన వైద్య పరికరాలు సిబ్బందిని నియోగించడానికి పెట్టుబడి సమకూర్చింది. మరోవైపు అధునాతన ఆసుపత్రి నిర్వహణ పద్ధతులను ప్రవేశపెట్టింది. ఆసుపత్రి వ్యవస్థ లో ఆశించిన ఆధునీకరణ , అభివృద్ధిని సాధించడానికి తోడ్పడింది.
ఈ పరిశీలన సారాంశం గా మనకు అర్ధమయ్యేది మౌలిక సదుపాయాలు, ప్రజా సేవల రంగంలో పిపిపి ఒక ముఖ్యమైన పెట్టుబడి, ఫైనాన్సింగ్ సాధనం. చైనా పాలనా వ్యవస్థ ఆధునీకరణలో పిపిపి భాగస్వామ్యం ఒక సంస్థాగత ఆవిష్కరణ గాను, సంస్కరణ గాను నిలిచింది. చైనాలో ఆరోగ్య సంరక్షణ రంగంలో పిపిపి లను సమీక్షిస్తే కొన్ని విజయాలు, వైఫల్యాల నుండి నేర్చుకున్న పాఠాలు కనిపిస్తాయి. రెండు దశాబ్దాల ప్రయోగ కృషిలో కొన్ని వ్యవస్థాగత మైన మంచి ఫలితాలు సాధించారు
పిపిపి పెట్టుబడుల వల్ల, చైనా ఆరోగ్య సంరక్షణ రంగం అభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది. ఆసుపత్రులను నడపడానికి సామాజిక పెట్టుబడులను వినియోగించడం పై ఎక్కువ శాతం విధాన పత్రాలు మద్దతు పలుకు తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు మరింత వివరంగా కొత్త విధానాలను ప్రవేశపెట్టేం దుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో వాటి నిర్వహణ పై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ, వాటి నాణ్యత పై పూర్తి ఆజమాయిషి, చార్జీలు సేవలపై పర్యవేక్షణ అధికారం వుంటుంది,
పిపిపి విడిగా పనిచేయడం కంటే ప్రభుత్వం తో కలిసి మెరుగైన ప్రభావాన్ని సాధించగలదు. ఇది ప్రభుత్వ ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది మౌలిక సదుపాయాలకు ప్రైవేట్ ఫైనాన్సింగ్ కోసం ప్రభుత్వాలకు బహుళ పరిష్కారాలను అందిస్తుంది. అందువల్ల, ప్రజా సేవ యొక్క నాణ్యత మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించుతుంది. ఆరోగ్య సంరక్షణ రంగం తదుపరి దశలో చైనా పిపిపి అభివృద్ధికి ఒక ముఖ్యమైన దిశ అని మనం చూడవచ్చు. అందువల్ల చైనా ఆరోగ్య సంరక్షణ రంగంలో పిపిపి నమూనాను మదింపు చేయడానికి ఆచరణాత్మక ప్రాముఖ్యత ఉంది. ఏమయినా అక్కడ వున్న ప్రభుత్వ, ప్రయివేటు వైద్యశాలలు ఏకీకృ త లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నాయి. సామాజిక ఆరోగ్య సంరక్షణ వైపు కలిసి నడుస్తున్నాయి.