అయోధ్య చరిత్ర లో పటేల్- నెహ్రూ పాత్రను రాజ్ నాథ్  వక్రీకరిస్తున్నాడా?
x
మహాత్మాగాంధీతో నెహ్రూ, సర్థార్ వల్లభాయ్ పటేల్

అయోధ్య చరిత్ర లో పటేల్- నెహ్రూ పాత్రను రాజ్ నాథ్ వక్రీకరిస్తున్నాడా?

బాబ్రీ మసీద్ వివాదంలో ఇంతకుముందు లేని అంశాలను బీజేపీ బయటకు చెబుతోంది


ఒక మాజీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, బోధన వృత్తిని మానేసిన తరువాత కొన్ని నిషేధిత జోకులు చెప్పేవారు. అది సోవియట్ జమానా కావడంతో చాలామంది తక్కువగా మాట్లాడేవారు.

1968 లో వార్సా ఒప్పందం కుదిరింది. ఇందులో సోవియట్ ఆక్రమించిన పోలాండ్, బల్గేరియా, హంగేరీ లాంటి దేశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా చెక్ స్లోవాక్ నివాసి తన ఇంటి నుంచి వచ్చిన తరువాత పూర్తిగా మాట్లాడటం ఆపేశాడు.

దీన్ని తోటీవారు గమనించారు. ఎందుకు మాట్లాడటం లేదని వారు అతన్ని అడగగా ఇంట్లో అంతా బాగానే ఉందని కానీ దేశంలో కొత్త చరిత్రను ప్రవేశపెడుతున్నారని చెప్పాడు. ఇప్పటి నుంచి నేను కొత్తచరిత్రను అధ్యాయనం చేయాల్సి వస్తుందని చెప్పాడు.

ప్రస్తుతం భారత చరిత్ర కూడా మార్చబడబోతోంది. కొన్ని దశాబ్ధాల క్రితం భారతీయులకు ఈ జోక్ సరిగా అర్థంకాకపోవచ్చు. అసలు ఇందులో జోక్ ఏముందని ప్రశ్నించవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మనకు వచ్చేశాయి.
మెల్లగా ప్రవేశపెట్టారు..
కొన్ని రోజుల క్రితం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బాబ్రీ మసీద్ కోసం ప్రభుత్వ నిధులు ఉపయోగించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
భారత చరిత్రలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రణాళిక ఇప్పుడు చరిత్రగా మారింది. దీనిని అప్పటి హోంమంత్రి సర్దార్ పటేల్ వ్యతిరేకించారని పేర్కొన్నారు.
రాజ్ నాథ్ సింగ్ మాటలను రెండు కోణాలుగా చూడాల్సి ఉంటుంది. ఇందులో మొదటిది నెహ్రూను స్వతంత్య్ర భారతం శాంతయుత వాదిగా చూపిస్తుందని, ఆయన దృష్టిలో నెహ్రూ ఓ వర్గానికి సపోర్టు చేసేశారు. పటేల్ ను హిందూత్వానికి ప్రతీకగా చూపించే ప్రయత్నం చేశారు.
నిజానికి రాజ్ నాథ్ సింగ్ ఉపయోగించిన పదాలు పటేల్ కు నప్పవు. ఆయన నిజమైన లౌకిక వాది. అతను బుజ్జగింపు రాజకీయాలను నమ్మడు. నెహ్రూ రక్షణ శాఖ నిధులను ఉపయోగించి బాబ్రీ మసీద్ ను నిర్మించాలని ప్రతిపాదించాడని చెప్పారు. కానీ పటేల్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
చరిత్ర జ్ఞానం లేదు..
రాజ్ నాథ్ మాటలను పరిశీలిస్తే ఆయన చరిత్ర మీద ఏమాత్రం అవగాహాన లేదని అనిపిస్తుంది. ఎందుకంటే బాబ్రీ మసీద్ ను 1950 లో కూలిపోలేదు. కాబట్టి దాన్ని నిర్మించాల్సిన అవసరం అంతకన్నా లేదు.
బాబ్రీ మసీద్ ను 1992 లో కరసేవకులు కూల్చివేశారు. దాన్ని అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు ప్రభుత్వం పున: నిర్మిస్తామని ప్రతిజ్ఞచేసింది. అది ఇప్పుడు సాధ్యం కాకపోయినా, తరువాత ఎప్పుడైన జరుగుతుందని ఆయన చెప్పారు. ఆ తరువాత బీజేపీ పీవీని గట్టిగానే అలింగనం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అతని జ్ఞాపకాలను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టింది.
వాస్తవ చరిత్ర ఏంటీ?
బాబ్రీ మసీద్ కు సంబంధించిన సంఘటనల వాస్తవ చరిత్రను రాజ్ నాథ్ సింగ్ తప్పుగా చూపించడానికి ప్రయత్నించాడనేది సుస్పష్టం. నేటీ భారతానికి కొత్త చరిత్రను పరిచయం చేయడం ఈ మాటల వెనక లక్ష్యంగా కనిపిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మాట్లాడుతూ.. 500 సంవత్సరాల త్యాగం, శతాబ్ధాల బాధ తరువాత రామ మందిర నిర్మాణం సాధ్యమయిందని అన్నారు. దీనికి ఎలాంటి ఆధారాలు లేవు.
1949 డిసెంబర్ 22-23 మధ్య రాత్రి స్థానిక హిందూ నాయకుడు అభిరామ్ దాస్, మరో ఇద్దరు కార్యకర్తలతో కలిసి బాబ్రీ మసీద్ గోపురం కింద రామ్ లల్లా, లేదా బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించాడు.
అయితే దీనివల్ల మసీద్ కు ఎలాంటి భౌతిక నష్టం కలగలేదు. అయితే ఇది జరిగిన 43 సంవత్సరాల తరువాత ఇది పూర్తిగా అక్కడి పరిస్థితి మారిపోయింది. చివరికి ఇది పూర్తిగా పోలీసులు, సంఘ్ పరివార్ లోని పెద్దలు, బీజేపీ నాయకులు, దాని అనుబంధ సంస్థల కనుసన్నల్లోనే ధ్వంసం చేయబడింది.
మసీద్ దగ్గర వేలాది మంది..
మసీద్ లో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన తరువాత స్థానిక హిందూ యువత అక్కడ రాముడు వెలిశాడని అయోధ్య, ఫైజాబాద్ తో పాటు లక్నోలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీనితో లక్షలాది మంది ప్రజలు అక్కడ గూమిగూడి అక్కడ మసీద్ కార్యకలాపాలు నిలిపివేయించగలిగారు.
తరువాత వారాల్లో ప్రధాని నెహ్రూ, హోంమంత్రి పటేల్ ప్రభుత్వంలో ఉండటంతో వారి పనితీరు వేర్వేరు సూత్రాలను ఆచరించడంలో పాటు అయోధ్య పరిణామాలపై ఇద్దరు వేర్వేరు అభిప్రాయాలను ప్రకటించడానికి దారితీసింది.
రెండు ధృవాలు..
మరోవైపు కాంగ్రెస్, హిందూ మహాసభ,ఆర్ ఎస్ఎస్ జంట సంస్థల నుంచి రాజకీయ నాయకుల గుంపు, ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ కమ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కేకే నాయర్ నేతృత్వంలోని కొంతమంది నాయకులు ఉన్నారు.
ముఖ్యంగా అప్పుడు నెహ్రూ- పటేల్ కూటమికి వ్యతిరేకంగా అప్పటి యూపీ సీఎం గోవింద్ వల్లభ్ పంత్, హోంమంత్రి లాల్ బహదూర్ శాస్త్రితో సహ అనేకమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
500 సంవత్సరాలకు పైగా ఉనికిలో కేవలం 100 సంవత్సరాల పాటు వివాదాస్పదమైన ఒక పురాతన మసీద్ లోపల రామ్ లల్లా విగ్రహాన్ని రహస్యంగా ఏర్పాటు చేసిన కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి.
ఇది కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన అనేకమంది అధికారులను, ఇతర నాయకులను ఇందులోకి లాగింది. కానీ ఇవేవీ రాజ్ నాథ్ సింగ్ ఆరోపణలకు బలం చేకూర్చేవి కావు. డిసెంబర్ 22-23 తేదీలలో అర్థరాత్రి జరిగిన దొంగతన చర్య తరువాత ఈ మార్పులు అన్ని జరిగాయి.
నెహ్రూ ఆందోళన..
డిసెంబర్ 26, 1949 నెహ్రూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి పంత్ కు ఒక కేబుల్ పంపారు. అందులో అయోధ్య లో జరుగుతున్న పరిణామాలు కలవరపెడుతున్నాయని పేర్కొన్నారు.
ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా ఆసక్తి చూపుతారని ఆశిస్తున్నారు. చెడు పరిణామాలకు దారితీసే ప్రమాదకరమైన ఉదాహరణ అక్కడ ఉన్నాయని చెప్పారు.
మహాత్మాగాంధీ హత్య తరువాత పటేల్, ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ పై కూడా కఠినంగా వ్యవహరించాడు. ఇదే సమయంలో పంత్ కు పటేల్ పట్ల సానుకూల దృక్ఫథం ఉంది.
పర్యవసానంగా విగ్రహ ప్రతిష్టాపన సమయంలో తన ఆందోళనను స్ఫష్టంగా వ్యక్తం చేస్తూ నెహ్రూ చెప్పిన మాటలపై పటేల్ పంత్ తో టెలిఫోన్ లో మాత్రమే మాట్లాడారు. అయితే పంత్ పై ఒత్తిడి పెంచడానికి నెహ్రూ మరోక లేఖ రాశాడు.
ఆ తరువాత ఆయన జనవరి 7, 1950 న సి. రాజగోపాలాచారీకి ఒక లేఖ అధికారికంగా రాశాడు. అందులో పంత్ నెహ్రూకు ఫోన్ చేసి తన నోట్ అందుకున్న సంగతి పేర్కొన్నారు.
తాను చాలా ఆందోళన చెందుతున్నానని, వ్యక్తిగతంగా అనేక విషయాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన తగు చర్య తీసుకోవాలని అన్నారు. ముందు అయోధ్యలో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రసిద్ధ హిందువుల సాయం కోరారు.
అయోధ్యలో పరిస్థితిని మార్చాలని, బాబ్రీ మసీద్ నుంచి రామ్ లల్లా విగ్రహాన్ని తొలగించాలని నెహ్రూ ఆసక్తి చూపినప్పటికీ పటేల్ హోంమంత్రిగా ఉన్నందున నెహ్రూ కేవలం క్యాబినేట్ పాలనా వ్యవస్థను విశ్వసించారు. పటేల్ అంతర్గత భద్రతా విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి సలహాలు ఇవ్వడానికి పంత్ కు అనుమతి ఇచ్చారు.
పటేల్ అభిప్రాయం..
అయోధ్యలో యథాతథ స్థితిని మార్చకూడదని, మసీద్ తాళం వేసి ఉన్నప్పటికీ విగ్రహాన్ని బాబ్రీ మసీద్ లోపల ఉంచడానికి అనుమతించాలని పటేల్ ముందుగానే అభిప్రాయపడ్డారు.
ఇది జనవరి 9, 1950న పంత్ కు ఆయన రాసిన లేఖలో వెల్లడైంది. ఈ సమస్యను రెండు వర్గాల మధ్య పరస్పర సహనం, సద్భావంతో పరిష్కరించుకోవాలని పటేల్ అభిప్రాయపడ్డారు.
గతాన్ని పరిశీలిస్తే సామరస్యపూర్వక పరిష్కారానికి అవకాశం అవకాశం తక్కువగా ఉందని, ఫైజాబాద్- అయోధ్యలో జరిగిన రక్తపాతం ఇది రూఢీ చేస్తుందని అన్నారు. మసీద్ లోపల విగ్రహాలను తొలగించడానికి హిందువులు అనుమతి ఇవ్వరని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
‘‘దేవుని ప్రతిష్టించడం వెనక చాలా భావోద్వేగం ఉందని, అది తాను గ్రహించినట్లు పంత్ కు లేఖ రాసిన లేక ద్వారా ఆయన తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. అదే సమయంలో ముస్లింలతో కూడా మాట్లాడాలని కోరుకున్నారు’’
చరిత్రను మలుపు తిప్పడం..
అప్పటి చర్యలతో నెహ్రూ అసంతృప్తి చెందాడు. కానీ పెద్దగా ఏమీ చేయలేదు. అతనికి వేరే మరిన్ని ముఖ్యమైన పనులు ఎదురుపడ్డాయి. వాటిలో ఒకటి దేశ రాజ్యాంగాన్ని ఆమోదించడం, అంతేకాకుండా దేశ విభజన తరువాత భారత్ లో మరోసారి హింస చెలరేగే ప్రమాదం ఉంది.
ఇది కూడా ప్రధానంగా ముస్లింలపైనే జరిగే అవకాశం ఉంది. మసీద్ ను దాని పాత స్వభావానికి పునరుద్దరించాలని నెహ్రూ వాంఛించరనడంలో సందేహం లేదు. కానీ దీనికోసం రాష్ట్ర నిధులను ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పటేల్, నెహ్రూతో విభేదించారు. కానీ రాజ్ నాథ్ పేర్కొన్న దాని కారణంగా కాదు.
నెహ్రూ- పటేల్ మధ్య అంతరం ఉందనే విషయాన్ని తిరస్కరించడం సాధ్యం కాదు. పటేల్ ప్రధాని కాకపోవచ్చు, కానీ ఆయన కాంగ్రెస్ లో సంస్థలో ఆధిపత్యం చెలాయించారు.
ప్రతి రాష్ట్రంలోనూ ఆయనకు విశ్వాసపాత్రులు ఉన్నారు. గాంధీ హత్య తరువాత హిందూ మితవాదం పూర్తిగా అప్రతిష్టపాలైంది. వారు దీనిని స్ఫష్టంగా వ్యక్తం చేసినప్పటికీ ఈ వర్గం హిందూత్వ భావాల పట్ల లోతుగా పాతుకుపోయిన సానుభూతి ఉంది.
బాబ్రీ మసీద్ పునరుద్దరణ కోసం నెహ్రూ తపన పడ్డప్పటికీ మత అసహనం, విశ్వాస ఆధారిత రాజకీయాలపై యుద్దంలో గెలవడానికి అయోధ్యలో జరిగిన యుద్ధం మొదటిది కావడంతో దారిలో కొన్ని యుద్ధాలను స్పృహతో ఓడించాలని నెహ్రూ మనస్సు భావించింది. రాజ్ నాథ్ సింగ్ చరిత్రను నిష్పాక్షికంగా చూడరు. ప్రధానంగా దానిని ప్రస్తుత యుద్ధాలలో ఉపయోగించాల్సిన సాధనంగా భావిస్తారు.
(ఫెడరల్ అన్ని వైపుల అభిప్రాయాలను గౌరవిస్తుంది. వాటిని ప్రచురించడానికి వేదికగా నిలుస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. అవి ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబిచవు)
Read More
Next Story