ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందా, నిధులపై శ్వేత పత్రం చెప్పిందేమిటి !
x
తెలంగాణ అర్థిక పరిస్థితి మీద ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేత పత్రం ప్రవేశపెట్టింది

ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందా, నిధులపై శ్వేత పత్రం చెప్పిందేమిటి !

ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారిందని తమకు ముందు తెలియలేదని మాట్లాడుతున్నారు. దీనర్థం ఏమిటి?


ఎం కోటేశ్వరరావు

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత రెడ్డి ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే చెప్పినట్లుగా 2023 డిసెంబరు 20వ తేదీన రాష్ట్ర ఆర్థిక స్థితి మీద శ్వేత పత్రం ప్రకటించింది. ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంథనశాఖలను నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క పత్రాన్ని అసెంబ్లీకి సమర్పించారు.

ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) పార్టీ నాడెట్లుండె-నేడెట్లుండే రేపు ఎలా ఉండబోతుందో చూడండి అంటూ భారీ ఎత్తున మీడియాలో ప్రకటనలు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన పత్రంలోని వివరాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి.

అప్పుల గురించి గత ప్రభుత్వం బడ్జెట్‌ ఇతర పత్రాల్లో పేర్కొన్నదానికి భిన్నంగా ఎక్కువ మొత్తంలో అప్పులు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.2014లో రాష్ట్ర విభజన సమయంలో ఉన్న అప్పు రు.72,658 కోట్లు. 2023 డిసెంబరు నాటికి అది రు.6,12,343 కోట్లకు పెరిగింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న (ఎఫ్‌ఆర్‌బిఎం) రుణం రు.3,89,673 కోట్లు.పదిహేడు నిర్దిష్ట అవసరాల కోసం( స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌) తీసుకున్న అప్పు రు.1,27,208 కోట్లు, ఇవిగాక ప్రభుత్వ హామీతో 14 సంస్థలు తీసుకున్న మొత్తం రు.95,462 కోట్లు ఉన్నాయి.

ఇవిగాక జెన్‌కో, ట్రాన్స్‌కో, సింగరేణి వంటి వివిధ సంస్థలు స్వంతంగా తీసుకున్న రుణాలు రు.59,414 కోట్లు కూడా కలుపు కుంటే మొత్తం బకాయిలు రు.6,71,757 కోట్లని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా లోకానికి చూపించిన కాళేశ్వరం పధకానికి రుణ మంజూరు రు.97,449 కోట్లు కాగా విడుదల చేసింది రు.79,287 కోట్లు, దీని అప్పు ఇంకా రు.74,590 కోట్లు ఉంది.

ఇక ఈ రుణాలకు గాను చెల్లిస్తున్న అసలు, వడ్డీలు 2015లో మొత్తం రు.7,255 కోట్లు(బడ్జెట్‌ రాబడిలో 14శాతం) ఉంటే 2023లో రు.53,978 కోట్ల(బడ్జెట్‌లో 34శాతం)కు చేరాయి. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల ప్రకారం రాష్ట్ర జిఎస్‌డిపిలో 25శాతం తీసుకోవచ్చు. కానీ 27.8శాతంగా ఉన్నాయి.

ఇవిగాక ఇతరంగా తీసుకున్న అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే 36.9శాతానికి చేరాయి.బడ్జెట్‌ కేటాయింపులు ఘనంగా చెప్పుకున్నప్పటికీ ఖర్చు చేయటం లేదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో తేడా ఎక్కువగా ఉందని శ్వేత పత్రం పేర్కొన్నది.2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్‌ కేటాయింపుల్లో మొత్తంగా 87శాతం ఖర్చు చేశారు. తెలంగాణా ఏర్పడిన తరువాత అది 82.3శాతానికి దిగజారింది. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం 2021-22 పద్దెనిమిది సాధారణ రాష్ట్రాలలో రాజస్థాన్‌ 116.4శాతంతో ప్రధమ స్థానంలో ఉండగా పదిహేడవదిగా ఉన్న తెలంగాణాలో 79.3శాతమే ఖర్చు చేశారు. చివరిదిగా 74.7శాతంతో పంజాబ్‌ ఉంది.

ప్రస్తుతం తక్షణమే చెల్లించాల్సిన బిల్లుల మొత్తం రు.40,155 కోట్లు ఉంది. ఇప్పటి వర్తమాన సంవత్సరంలో బడ్జెట్‌లో సగమే ఖర్చు చేశారు. నిధులు లేనపుడు వేస్‌ అండ్‌ మీన్స్‌ పేరుతో ఆర్‌బిఐ నుంచి రుణాలు తీసుకొనే సౌకర్యం ఉంది.ప్రస్తుతం అలా తీసుకోకపోతే రోజు గడవని స్థితి. అందుకే ప్రతి నెలా ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు ఒకటవ తేదీనే చెల్లించలేని స్థితి. పిఆర్‌సి, కరువు భత్యం వాయిదాల పద్దతిలో చెల్లిస్తుందగా, సకాలంలో మంజూరు చేయకుండా సంవత్సరాల తరబడి నిలిపివేస్తున్నారు. ఇక బిల్లులు చెల్లింపు చెప్పనవసరం లేదు.2015-16లో కేవలం రెండు సార్లు మాత్రమే మాత్రమే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగా తరువాత సంవత్సరాల్లో క్రమంగా పెరుగుతూ 2022-23లో ఏడాదిలో 328 రోజులు తీసుకున్నారు.

వర్తమాన సంవత్సరంలో నవంబరు 23 నాటికి 214 రోజులు తీసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రేవంత రెడ్డి సర్కార్‌కు సైతం మరో మార్గం లేదు.2014-15లో గరిష్టంగా 303 రోజులు నగదు నిల్వలు ఉండగా ప్రస్తుతం అవి 30 రోజులకు పడిపోయాయి.

నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణా ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నందున ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. రేవంతరెడ్డి సర్కార్‌ ప్రకటించిన శ్వేత పత్రంలోని అంశాలు నిధులకు సంబంధించి అలాంటి వివక్ష ఉన్నట్లు లేదనే చూపాయి. 2014లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణాను ఏర్పాటు చేసినపుడు ఆస్తులు-అప్పుల విభజన 58-42 దాషామాతో జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 1956-57లో వాస్తవ వ్యయం రు.79 కోట్లు కాగా తెలంగాణా వాటా రు.33 కోట్లు. రాష్ట్రం విడిపోయే నాటికి మొత్తం వ్యయం రు.11,94,945 కోట్లు కాగా తెలంగాణాలో ఖర్చు రు.4,98,053 కోట్లు, అంటే 41.68శాతం ఉంది.( ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ, పరిశోధనా సంస్థల పెట్టుబడులను కూడా కలుపు కుంటే తెలంగాణాలో అంతకంటే ఎక్కువ మొత్తమే ఖర్చు జరిగిందన్నది స్పష్టం.

తెలంగాణాతో పోలిస్తే ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన సంస్థలు పరిమితమే అన్నది తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అనుబంధంగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో వచ్చిన ప్రైవేటు పరిశ్రమల పెట్టుబడులు వీటిలో లేవు. వీటి గురించి శ్వేత పత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు గురించి మాత్రమే పేర్కొన్నారు)

అంకెలతో ఎలాంటి ఆటలనైనా ఆడుకోవచ్చన్నది తెలిసిందే. అందువలన శ్వేత పత్రాల అంకెలతో అదే జరగదని చెప్పలేము. బడ్జెట్‌ పత్రాల్లో ఈ వివరాలన్నీ ఉన్నప్పటికీ అవి సామాన్యులకు ఒక పట్టాన అర్ధం కావు. అధికార యంత్రాంగం గారడీ చేస్తుంది. శ్వేత పత్రంలో వాటి సారాన్ని ఒక దగ్గరకు చేర్చుతారు గనుక సూటిగా అర్ధం అవుతాయి.ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారిందని తమకు ముందు తెలియలేదని మాట్లాడుతున్నారు.శ్వేత పత్రంలో వాటి సారాన్ని ఒక దగ్గరకు చేర్చుతారు గనుక సూటిగా అర్ధం అవుతాయి.ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారిందని తమకు ముందు తెలియలేదని మాట్లాడుతున్నారు.శ్వేత పత్రంలో వాటి సారాన్ని ఒక దగ్గరకు చేర్చుతారు గనుక సూటిగా అర్ధం అవుతాయి.ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారిందని తమకు ముందు తెలియలేదని మాట్లాడుతున్నారు.

అందువలన ప్రకటించిన హామీలను తక్షణమే అమలు జరపకుండా సాగదీసే అవకాశం ఉంది. ఈ పత్రాన్ని దాని కోసం వినియోగించుకోకూడదు.ఏటిఎంలో అలా కార్డు పెడితే ఇలా నగదు బయటకు వచ్చినట్లుగా వెంటనే చేసిన వాగ్దానాలను అమలు జరపాలని చూస్తున్న జనం ఏదో ఒక పేరుతో వాయిదా వేస్తే సహించరు. వెంటనే లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున ఫిబ్రవరి లేదా మార్చినెలలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం లేదు.ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ అనుమతి తీసుకొని లోక్‌సభ ఎన్నికల తరువాతే ప్రవేశ పెడతారు. అందువలన ఆరు నెలల వరకు రేవంత రెడ్డి సర్కార్‌ మీద పెద్దగా వత్తిడి ఉండకపోవచ్చు. తరువాతే అసలు కథ ప్రారంభం అవుతుంది.

Read More
Next Story