
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
‘‘సిద్ధరామయ్య, దేవరాజ్ ఉర్స్ ఒక్కటి కాదు’’
కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు సృష్టించిన సిద్ధరామయ్య
క్రికెట్ రాజకీయంగా మారినప్పుడు.. రాజకీయాలు ఆటగా ఎందుకు మారకూడదు? ఇది సీఎం సిద్ధరామయ్య మాట. కర్ణాటక ముఖ్యమంత్రిగా అత్యధికాలం పాలించిన వ్యక్తిగా ఆయన కొత్త రికార్డు తన పేరు మీద లిఖించుకున్నారు.
దిగ్గజ దేవరాజ్ ఉర్సు రికార్డును ఆయన బద్దలు కొట్టారు. క్రికెటర్ రవీంద్ర జడేజా సెంచరీ చేశాక తన బ్యాట్ ను కత్తిసాములా తిప్పుతాడు. ప్రస్తుతం సిద్ధరామయ్య కూడా ఇదే తరహ చేయడాన్ని దాదాపు చేస్తున్నారనే అనుకోవాలి.
తన డిప్యూటీ డీకే శివకుమార్ సహ అనేక మంది పోటీదారుల మధ్య సిద్ధరామయ్య ఈ రికార్డు బద్దలు కొట్టడం మామూలు విషయం కాదు.
సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఏడు సంవత్సరాల 240 రోజులు సేవలో ఉన్నారు. ఇది దేవరాజ్ ఉర్స్ కంటే ఒక రోజు ఎక్కువ. అనేక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది ఎక్కువ ఏం కాదు.
దేశంలో 20 ఏళ్లకు పైగా క్రమం తప్పకుండా పరిపాలించిన వ్యక్తులుగా అందరి కంటే ముందున్నది సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ 24 సంవత్సరాల 165 రోజులుగా ఉన్నారు.
తరువాత వరుసలో 24 సంవత్సరాల పేరు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పేరు మీద ఉంది. బెంగాల్ ముఖ్యమంత్రిగా జోతి బసు 23 సంవత్సరాలు ఉన్నారు. వీటితో పోలిస్తే సిద్ధరామయ్య రికార్డు ఏమంత గొప్పది కాదు.
తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ..
కర్ణాటకలో చాలాకాలం వరకూ ఏ ముఖ్యమంత్రి వరుసగా ఐదు సంవత్సరాలు పాలించలేదు. గత నెల వరకూ సిద్ధరామయ్యకు డీకే నుంచి తీవ్ర పోటీ ఎదురైంది.
గత రెండు నెలల్లో సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉందని అనిపించినప్పుడూ కాంగ్రెస్ నాయకత్వం అతని డిప్యూటీ సహకారంతో ఉర్స్ రికార్డు బద్దలు కొట్టడానికి అనుమతిస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. ఆట ముగిసే లోపు సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టడానికి గరిష్ట అవకాశం వచ్చినట్లుగా.
మరో రికార్డు..
ఇప్పుడు సిద్ధరామయ్య ముందు మరో రికార్డు ఉంది. ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కూడా ఈ ఘనత సాధిస్తారని భావిస్తున్నారు. ఇది కర్ణాటకలోఒక మంత్రి అత్యధిక బడ్జెట్ లను ప్రవేశపెట్టిన రికార్డు అవుతుంది.
వచ్చే నెలలో ఆయన బడ్జెట్ ను ప్రయత్నిస్తే అది ఆయనకు 17 వ బడ్జెట్ అవుతుంది. తక్కువ కాదు. మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే 13 బడ్జెట్ లలో తరువాత స్థానంలో ఉన్నారు.
దేవరాజ్ ఉర్స్ కాలంలో కాంగ్రెస్ ఆధిపత్యం..
కర్ణాటకకు ఏడు సంవత్సరాల 240 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసింది రికార్డుగా పరిగణించబడితే దానికి కారణం రాష్ట్రంలోని సామాజికంగా విచ్చిన్నమైన ఓటర్ల స్వభావాన్ని గుర్తించవచ్చు.
1970 లలో దేవరాజ్ ఉర్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఆయన 1972-77 నుంచి 1978-80 వరకూ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఆ కాలంలో కాంగ్రెస్ ఆధిపత్యం సంపూర్ణంగా ఉంది. జూన్ 1975 నుంచి 1977 వరకూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో ఆయన సీఎంగా ఉన్నారు. ఉర్స్ ఇందిరాగాంధీకి విశ్వాసపాత్రుడు.
అత్యవసర పరిస్థితి కారణంగా కాంగ్రెస్ మొదటి సారి విడిపోయినప్పుడూ ఆమెతోనే ఉన్నారు. అయితే 1979 లో ఇందిరా గాంధీతో విభేదాలు వచ్చాయి. తరువాత ఆమె నుంచి విడిపోయారు. 1980 లో ఇందిరాగాంధీ ప్రధానిగా వచ్చాక ఆయన మద్దతుదారులు తిరిగి వచ్చారు. తరువాత ఆయన రాజీనామా చేశారు.
సిద్ధరామయ్య కాంగ్రెస్ కు వెళ్లడం..
సోషలిస్ట్, జనతాదళ్ సభ్యుడు అయిన సిద్ధరామయ్యకు ఈ విధేయత పనికిరాలేదు. ఆయన తన గురువు హెచ్ డీ దేవేగౌడ, ఆయన కుమారుడు హెచ్ డీ కుమార స్వామితో విడిపోయిన తరువాత 2006 లో కాంగ్రెస్ లో చేరారు.
జనతా దళ్ లో అప్పటికే రామకృష్ణ హెగ్దే, దేవేగౌడ, అబ్దుల్ నజీర్, లక్ష్మీ సాగర్, జీహెచ్ పటేల్, ఎస్ ఆర్ బొమ్మై వంటి నాయకులలో ఒకడిగా సిద్ధరామయ్య ఉన్నారు. కాంగ్రెస్ వాతావరణానికి ఇది చాలా భిన్నం.
ఇది సాధారణ నాయకులు చెప్పుకోదగ్గ స్థాయిలో లేరు. ఒకటి లేదా ఇద్దరు నాయకుల ఆకర్షణపై ఎక్కువగా బేస్ అయి ఉంది. సిద్ధరామయ్య జనతాదళ్ నుంచి వైదొలగిన తరువాత ఆయన పార్టీలో ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
కానీ ఆర్థిక శాఖ నిర్వహించడంలో సమర్ధుడైన నాయకుడిగా పేరు రావడంతో కాంగ్రెస్ లో ఉన్న వ్యతిరేకత తగ్గింది. కొత్తగా చేరిన వ్యక్తి టెన్ జన్ పథ్ నాయకులతో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ను విడిచిపెట్టి దారి తప్పిన దేవరాజ్ ఉర్స్ మాదిరిగా కాకుండా సిద్ధరామయ్య అప్పుడూ సోనియా గాంధీతో మంచి సంబంధాలు ఏర్పరచుకుని తన రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాడు.
ఆటను మార్చేసిన ఉర్స్..
ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పోలిక ఉండకూడదు. 1956 నుంచి రాష్ట్ర సమకాలీన చరిత్రలో సాటిలేని వ్యక్తిగా పరిగణించబడే ముఖ్యమంత్రి దేవరాజ్ ఉర్స్. ఉర్స్ కు తనకు పోలీక వద్దని సీఎం సిద్ధరామయ్య వినయంగా అంగీకరించాడు. ఇద్దరు మైసూర్ జిల్లాకు చెందినవారు.
దేవరాజ్ కర్ణాటకలో ఆధిపత్య వర్గాలుగా ఉన్న ఒక్కలిగ, లింగాయత్ కులాలను విభజించి, వారి రాజకీయా ప్రభావాన్ని తగ్గించాడు. కర్ణాటకలో భూ సంస్కరణలను అమలు చేశాడు.
రాజకీయాలలో పాలనలో వెనకబడిన తరగతుల సభ్యులకు అవకాశాలను సృష్టించాడు. ఆయన రాష్ట్రంలో మొట్టమొదటి వెనకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేశాడు.
వెనకబడిన తరగతులకు ఉర్స్ చేసిన సహయంలో రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయ మార్పులకు పునాది వేసింది. 1983 లో కాంగ్రెస్ వ్యతిరేక నినాదంతో జనతా పార్టీ(జనతా దళ్ గా మారింది) ఆవిర్భావంతో సిద్ధరామయ్య వంటి వెనకబడిన తరగతుల వ్యక్తుల ముందంజలో ఉన్నారు. ఉర్స్ మాదిరిగానే సిద్ధరామయ్య కూడా వెనకబడిన తరగతులు, దళితులు మైనారిటీల సంకీర్ణాన్ని(అహింద) ప్రొత్సహించారు.
వీరిద్దరు పంచుకునే మరో రికార్డు ఏంటంటే.. పూర్తి కాలం పదవీకాలం పూర్తి చేసిన ఇద్దరు ముఖ్యమంత్రులు వీరే 1972-77 ఉర్స్ 2013-18 మధ్య సిద్ధరామయ్య కాంగ్రెస్ కు చెందిన ఎస్ ఎం కృష్ణ కూడా 1999-2004 మధ్య తన పదవీకాలాన్ని పూర్తి చేయగలిగేవాడు. కానీ సాంకేతికంగా ఆయన పదవీకాలం ముగిసేలోపు ఆయన స్వయంగా ఎన్నికలకు పిలుపునిచ్చారు.
రాజకీయ అస్థిరత..
కాంగ్రెస్ రాజకీయంగా బలహీనపడటం, తరువాత వెనకబడిన కులాల ఆధారిత జనతాదళ్ ఆవిర్భావం తరువాత విడిపోయి బీజేపీ ఆవిర్భావానికి దారితీసింది. ఇవి రాజకీయంగా అస్థిరతకు దోహదపడింది.
తరువాత రాజకీయ ఎన్నికల లెక్కల ప్రకారం కర్ణాటకలో అన్ని వర్గాల నుంచి మద్దతు పొందిన పార్టీ మాత్రమే సొంతంగా మెజారిటీ సాధించగలిగింది. ఆ కోణంలో సిద్ధరామయ్య ప్రవేశం కాంగ్రెస్ కు సాయపడింది. ఆయనతో ఓబీసీ మద్దతు కూడా సాధించాడు. దానితో పార్టీ అధికారంలోకి రాగలిగింది.
2008 నుంచి పదేపదే అధికారంలో ఉన్నప్పటికీ 224 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ ఎప్పుడూ సొంతంగా సాధారణ మెజారిటీని సాధించలేకపోయింది. ఎందుకంటే అది ఇప్పటి వరకూ దళితులు, మైనారిటీల మద్దతును పొందలేకపోయింది.
2008 లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడూ పూర్తికాలం కొనసాగుతానని హమీ ఇచ్చిన అగ్రనాయకుడు బీఎస్ యడ్యూరప్ప తన వ్యక్తిగత వైఫల్యాలతో ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేకపోయారు.
రెండు పదవీకాలాలు పూర్తి చేస్తారా?
సిద్ధరామయ్య ఆధిపత్య ఒక్కలిగ, లింగాయత్ వర్గాల నుంచి కొంత వరకూ దూరమైనప్పటికీ తన రాజకీయ చతురతను ఉపయోగించి తన మందను కలిసి ఉంచి తాను ఉన్న స్థితికి చేరుకోగలిగాడు.
వీటితో పాటు పేదలు, మైనారిటీలు, మహిళలకు ఐదు పథకాలు రూపొందించాడు. ఇవి చివరకు 2023 లో కాంగ్రెస్ అద్భుతమైన విజయంలో ప్రధాన పాత్ర పోషించాయని చాలామంది నమ్ముతారు.
ఇప్పుడు కీలకమైన ప్రశ్న ఏమిటంటే ఆయన తన పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేయడానికి అనుమతిస్తారా? మరో రికార్డును రెండు పూర్తి పదవీకాలాలను పూర్తి చేయడానికి అనుమతిస్తారా? ఇది మరొక కథ
Next Story

