
ఓటర్ జాబితా
పార్టీ కేడర్ వ్యవస్థ కూలిపోవడంతోనే ‘సార్’ వివాదాలా?
బీహార్ ఎన్నికల వివాదాలు ఎలాంటి పాఠాలు నేర్పుతున్నాయంటే..
దేవేంద్ర పూల
మనదేశంలో ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సార్) రాజకీయ ఘర్షణలకు కారణమైంది. ప్రతిపక్ష నాయకుడు, అనధికార కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ ప్రచారం నిర్వహిస్తున్నాడు.
ఎన్నికల కమిషన్ తాను చట్టపరంగా ఈ పని చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిపక్షాలు సహ ఇతర పక్షాలు ‘సార్’ ను ఆపాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినా వారికి ఉపశమనం దక్కలేదు.
ఇందుకు భిన్నంగా ముసాయిదా దశలో రాజకీయ పార్టీలు ఎందుకు సైలెన్స్ గా ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్య సంక్షోభ మూలాన్ని సూచిస్తుంది. ఇవి భారత రాజకీయాలలో పరివర్తన లక్షణంగా కనిపిస్తుంది.
పార్టీల విశ్వాసం తగ్గుతోంది
పార్టీ విధేయతలు తగ్గడం, మారుతున్న రాజకీయ ప్రాధాన్యాలు ఓటర్ల జాబితాను కాపాడిన నెట్వర్క్ లను నిష్క్రియాత్వం చేశాయి. వాటి స్థానంలో పార్టీలు ఎక్కువగా కన్సల్టెంట్లు, డిజిటల్ వ్యూహాలపై ఆధారపడుతున్నాయి.
ఇవి కేవలం రాజకీయ కథనాలు రూపొందించడంలో ఎక్కువగా ఉపయోగపడతాయి. కానీ క్షేత్రస్థాయిలో ఓటరు జాబితా నిఘాకు తగినంత ప్రాధాన్యం ఇవ్వవు. ఇదే తప్పులకు కారణమై తరువాత వివాదాలకు కేంద్రంగా మారింది.
బూత్ స్థాయి నిఘా వర్సెస్ డిజిటర్ రాజకీయాలు..
1. పార్టీ విధేయతలు, క్యాడర్ నెట్ వర్క్ లు వేగంగా బలహీనపడుతున్నాయి
2. ఒకప్పుడు స్థానిక కార్యకర్తలు, కచ్చితమైన ఓటర్ జాబితాను నిర్ధారించేవారు
3. పార్టీలు ఇప్పుడు కన్సలెంట్లు, డిజిట్ వ్యూహాలపై ఆధారపడుతున్నాయి
4. ఈ కొత్త సాధనాలకు ఓటర్ జాబితా ధృవీకరణ సామర్థ్యం లేదు
5. మార్పు ఓటర్ జాబితాలో తప్పులు, వ్యవస్థపై అపనమ్మకాన్ని పెంచుతుంది
ఈ చర్యల ఫలితంగా ప్రజాస్వామ్యం బలహీనపడుతోంది. దీనిని ప్రారంభ దశలోనే గుర్తించి లోపాలు సరిదిద్దే సంస్థాగత సామర్థ్యం బలహీనపడుతుంటే, ఈ అవకతవకల ఆరోపణలు మాత్రం గట్టిగా పెరుగుతున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత రాజకీయ పార్టీలకు కళ్లు, చెవులుగా పార్టీ కార్యకర్తలే ఉన్నారు. దానితో పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు సంబంధాలు బలంగా ఉండేవి. ఇవన్నీ కూడా రోజువారీ సమీకరణ ద్వారా బలోపేతం చేశారు.
ఈ కార్యకర్తలు ప్రచారం చేయడానికి మాత్రమే కాకుండా ఓటర్ల జాబితాలను అనధికారికంగా నిర్వహించే ఆడిటర్లు కూడా. ప్రతి ఇంటిని గుర్తించడం నకిలీ ఓటర్లను గుర్తించడం, అధికారిక ప్రక్రియల ద్వారా తమ మద్దతుదారులను కాపాడేవారు.
తగ్గుతున్న మౌలిక సదుపాయాలు..
ప్రస్తుతం ఈ వ్యవస్థ కునారిల్లుపోతోంది. ఓటర్లలో పార్టీ విధేయతలు తగ్గడం, రాజకీయ చైతన్యం పెరగడంతో దీర్ఘకాలిక కేడర్ అనేది కొనసాగించడానికి అవరోధంగా మారాయి. పార్టీలు కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా క్షేత్ర స్థాయి జాబితాలకు బదులు, డిజిటల్ సాంకేతికత ఉపయోగించుకుని ముందుకు సాగుతున్నాయి.
కన్సల్టెంట్లను నియమించుకుని అవుట్ సోర్స్ రాజకీయాలను చేస్తున్నాయి. ఈ పరిణామాలు రోల్ లోపాలకు మించి ఉన్నాయి. సైద్దాంతిక గుర్తింపు నుంచి సమస్య ఆధారిత రాజకీయాల నుంచి పార్టీలు తమ విధానాలు మార్చడం కూడా దీనికి కారణం.
మధ్యవర్తిత్వ పోషణ..
ఓటర్లు ఎన్నికలలో తమ ప్రాధాన్యతలను ఎంచుకుంటారు. స్థానిక కార్యకర్తలు మాత్రం తమ పార్టీల కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. ఒకప్పుడు వివిధ సేవలతో ముడిపడి ఉన్న వీరు తరువాత క్లయింటలిజం, సంక్షేమ పథకాలు, నగదు ప్రొత్సహాకాలు చివరి నిమిషంలో జరిగే సమీకరణలు వంటి ఈవెంట్ మేనేజ్ మెంట్ గా రూపాంతరం చెందింది.
ఇది కార్యకర్తలను పెంచి పోషించే నిరంతర శ్రమతో కూడిన పాతతరం పద్దతులకు స్వస్తి చెప్పడానికి కారణమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మధ్యవర్తిత్వం పనిచేస్తున్న కన్సల్టెంట్ ప్రచారాలకు ప్రాధాన్యం ఇస్తోంది. బీహార్ లో దీని పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తప్పుడు తొలగింపులు, అవకతవక ఆరోపణలు వచ్చినప్పుడూ పార్టీలు బూత్ స్థాయి మినహయింపులను ముందస్తుగా నిరోధించడానికి బదులుగా వాక్చాతుర్యంతో రాజకీయాలు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఓట్ చోరి జరిగిందని యాత్రలు చేస్తూ ఆరోపణలు చేయడంలో ప్రతిపక్షాలు బిజీగా కాలం వెళ్లదీస్తున్నాయి.
ఎన్నికల పునాది పై అనుమానం పెంచడం..
ఒకప్పుడు ఎన్నికల జాబితాలపై ప్రజల నమ్మకాన్ని పెంచడంలో సహాయపడిన సాంప్రదాయ కేడర్ ఆధారిత ధృవీకరణ ఇప్పుడు అదే తీవ్రతతో పనిచేయడం లేదు. ప్రతి వాడలో డ్రాప్ట్ రోల్స్ ను స్వచ్చంద సేవకులు పరిశీలించే బదులు, పార్టీలు ఇప్పుడు కేంద్రీకృత డేటా బోష్ బోర్డులు, వార్ రూమ్ లపై ఆధారపడుతున్నాయి. ఇవి తప్పుగా నమోదైన పేర్లు, వలస గృహాలు గుర్తించడంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాయి.
ఇది సాంకేతిక లోపం కాదు. భారత ప్రజాస్వామ్యం పనిచేసే విధానంలో నిర్మాణాత్మక మార్పు. క్లయింట్లవాదం వ్యక్తిగతీకరించిన తరువాత ప్రొగ్రామాటిక్ ఆధారంగా దాని స్వభావం మారుతోంది. అప్పుడు దాని దుష్ప్రభావం అనేది ఓటర్లు, పార్టీ కార్యకర్తలపై పడుతుతోంది. వారి బాధ్యతలను బలహీనపరుస్తోంది.
రాజకీయ పార్టీలు, వాటి సాంకేతిక వ్యవస్థ నుంచి బయటకు వచ్చి చూసినప్పుడూ సార్ వంటి వ్యవస్థాగత ప్రక్రియలు, క్షేత్ర స్థాయి ఓటర్ల జాబితాను పరిశీలించినప్పుడూ అవి బహిర్గమవుతాయి. ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియ ఓటర్ కు అనుకూలమైనది, సరిదిద్దదగినదని పేర్కొనవచ్చు.
కానీ దిద్దుబాటు అనేది పౌరులను అభ్యంతరాలు దాఖలు చేయడానికి, విచారణలకు హాజరు కావడానికి, పునరుద్దరణకు నిర్ధారించడానికి సమీకరించే సామాజిక మీడియేటర్లలా ప్రభావవంతంగా ఉంటుంది.
ప్రాథమిక స్థాయి జవాబుదారీతనం..
బీహార్ ఓటర్ల జాబితా సవరణ చుట్టూ జరుగుతున్న చర్చలు ఎన్నికల నిర్వహణ దుర్భలత్వాన్ని మాత్రమే కాకుండా భారత రాజకీయాల మారుతున్న సామాజిక శాస్త్రాన్ని కూడా వెల్లడిస్తాయి. వాస్తవానికి తొలగింపులపై సాంకేతిక వివాదంగా కనిపిస్తున్నప్పటికీ పౌరులతో ఎలా వ్యవహరిస్తాయో అనే దానిలో మార్పును సూచిస్తుంది.
స్థానిక కార్యకర్తల పాత్ర తగ్గడం వల్ల ఎన్నికల ప్రక్రియలు అధికార తప్పిదం, రాజకీయ అపనమ్మకం రెండింటికి గురయ్యే అవకాశం ఉంది. అయితే ఓటు దొంగతనం అనే ప్రచారం సంస్థాగతంగా దాని పనితీరు కాస్త పెరుగుతుందని చెప్పవచ్చు.
ఈ కోణంలో ‘సార్’ ను చూస్తే ప్రజాస్వామ్య విశ్వసనీయతను పెంపొందించిన మౌలిక సదుపాయాల లేమితనం గుర్తుకు వస్తుంది. దానిని తిరిగి పెంపొందించడానికి పార్టీలు తిరిగి పాత పోషక క్లయింట్ సంబంధాలను తీసుకురావడం కాకుండా డిజిటల్ ప్రచారం, కేంద్రీకృత సంక్షేమ రాజకీయాలతో కలిసి జీవించగల అట్టడుగు స్థాయి జవాబుదారీతనం వినూత్న విధానాలు కొత్త రూపాల్లో తన ఉనికిని చాటుకోవాలి.
(ఫెడరల్ అన్ని వైపులా నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తుంది. ఇందులోని అభిప్రాయం, సమాచారం అంతా రచయితకు చెందినవే. ఫెడరల్ కేవలం ఒక వేదికగా మాత్రమే ఉపయోగపడింది. ఇవి ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)
Next Story