చీకట్లో మగ్గుతున్న శ్రీలంక....
x

చీకట్లో మగ్గుతున్న శ్రీలంక....

ఒకప్పుడు జిగేల్ మని వెలిగిపోయే కొలంబో, కాండి వంటి మహానగరాలు వీధి దీపాలు కూడా వెలగక చీకట్లో తారాడుతున్నాయి...


-ప్రొఫెసర్ కె.శ్రీనివాసులు

కొలొంబోలోని బండారనాయకె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బైటకు రాగానే ‘‘శ్రీలంకకు స్వాగతం’’ అన్న ఒక పెద్ద హోర్డింగ్ కనిపిస్తుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు టూరిజం ఎంత ముఖ్యమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. శ్రీలంక (Sri Lanka) స్థూల జాతీయాదాయంలో పది శాతం పర్యాటకరంగం నుంచి రావడమే కాకుండా, అతి ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం తీసుకు రావడంలో పర్యాటక రంగం మూడో స్థానంలో ఉంది. భారత దేశం, బ్రిటన్, చైనా ల నుంచి పర్యటకులు పెద్ద సంఖ్యలో శ్రీ లంకకు రావడం వల్ల ఇక్కడ లక్షలాది మందికి ఉపాధి లభిస్తోంది. పర్యాటకంపై ఆసక్తితో విమానాశ్రయం నుంచి వెల్లువలా వస్తున్న ఆ రద్దీని గమనిస్తే, గత ఏడాది సెప్టెంబర్ లో దేశాధ్యక్షుడుగా ఎన్నికైన అనుర కుమార దిస్సనాయకె (Anura Kumara Dissanayake) ఆధ్వర్యంలోని ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించడానికి ఈ ద్వీపంలో భద్రతపై ఒక నమ్మకాన్ని కలిగించింది.

ఒక దాని వెంట ఒకటి చొప్పున అనేక వరుస సంఘటనలు జరగడంతో పర్యాటక రంగంపై దెబ్బపడింది. చర్చిలు, స్టార్ హోటళ్ళే ధ్యేయంగా 2019 ఏప్రిల్ లో ఐఎస్ఐఎస్ నాయకత్వంలోని తీవ్రవాద ముఠాలు దాడి చేయడంతో 260 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 42 మంది విదేశీ పర్యాటకులున్నారు. అంతర్జాతీయ పర్యాటక రంగంగా శ్రీలంకను అబివృద్ధి చేయాలని భావిస్తున్న సమయంలో ఇక ఆ దేశం అంత సురక్షితమైనది కాదనే భావన ఈ సంఘటన వల్ల ఏర్పడింది. ప్రత్యేక తమిళ ఈలం కోసం దశాబ్దాల పోరాటం జరిగినప్పటికీ, అంతర్యుధ్ధంతో అతలాకుతలమైనా అది ఉత్తర ప్రాంతానికి పరిమితమైంది. దాడులతో తూర్పు ప్రాంతం చెలించిపోయినప్పటికీ తనకున్న పర్యాటక ఆకర్షణని శ్రీలంక తిరిగి నిలబెట్టుకుంది.

కోవిడ్ మహమ్మారి వ్యాపించడంతో ప్రపంచంలోని ఇతర దేశాల్లాగానే శ్రీలంకలో కూడా ఏర్పడిన సంక్షోభం వల్ల బైట దేశాలనుంచి వచ్చేవారికే కాకుండా స్వదేశస్తులకు కూడా లాక్ డౌన్ విధించడంతో పాటు అన్నిటినీ మూసేశారు. అసాధారణమైన షట్ డౌన్ తీవ్రత ప్రభావానికి గురికావడంలో శ్రీలంక మినహాయింపు లేకపోయినప్పటికీ, పర్యాటకం పైన ఆధారపడడం అనేది కొట్టవచ్చినట్టుగా కనిపించింది. ఈ ద్వీపంలోని విస్తరించిన అన్ని ప్రాంతాల జనాభా పైన ఇది ఎంత ప్రభావం చూపిందో ఊహించుకోవచ్చు.

గుర్తించాల్సిన మూడవ విషయం ఏమిటంటే, ఆర్థికంగా శ్రీలంక పెద్ద బలంగా, విస్తరించేలా లేదు సరికదా, అంతర్జాతీయ రాజకీయార్థిక విషయంలో విదేశీ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. విదేశీ మారక నిల్వలు బాగా క్షీణించడంతోపాటు, అప్పు పుట్టే అవకాశాలు కూడా కనుమరుగయ్యాయి. ఫలితంగా పెట్రోలు, వంట గ్యాస్, ఆహార పదార్థాల కొరత ఏర్పడడంతో అక్కడి జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. అప్పులపాలైన ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా పెట్రోలు బంకుల వద్ద పొడవాటి క్యూలైన్ దృశ్యాలు ప్రజల అనుభవంలోకొచ్చినా అవి సాధారణ స్థితికి వచ్చాయి. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం వల్ల పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. కాస్త నిర్మొహమాటంగా చెప్పాలంటే, యూరప్ లో అబివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ యుద్ధ ప్రభావంనుంచి ఏ మాత్రం మినహాయింపు కాదు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచిన నిరసన అల్లర్లు, ప్రజా ప్రదర్శన దేశం పరిస్థితికి అద్దం పట్టేవి గానే కాకుండా, పాలక వర్గంపైన ఉన్న అసంతృప్తిని బహిర్గతం చేశాయి. ఇతరుల పాలన లాగానే రాజపక్స పాలనలో కూడా సంక్షోభం స్వారీ చేస్తున్నప్పుడు, ఆ సంక్షోభాన్ని కోవిడ్, ఇతర ప్రకృతి కారణాల ప్రభావం ఉన్నా లేకపోయినా, తాము తటస్థంగా ఉన్నట్టు చట్టబద్దంగా వాటిపైన ఆ అపవాదును నెట్టివేయడం సహజం. ఒక దృక్పథం ద్వారా వ్యక్తమైన ప్రజల ప్రతిస్పందనను నిర్లక్ష్యం చేసి ఎక్కువ కాలం పక్కన పెట్టలేం. రాజపక్సతో పాటు అతని ఇద్దరు తోబుట్టవులు గోటబయ దేశాధ్యక్షులుగా, మహేంద్ర ప్రధానిగా 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెలగబెట్టిన కుటుంబ పాలనా కాలంలో ముఖ్యమైన పదవులన్నిటినీ వారే అనుభవించారు. వారి కుటుంబ సభ్యులు అనేక మంది కేంద్రీకత అధికారంతో ప్రజల అవసరాలను పట్టించుకోకుండా ఈ ద్వీపాన్ని బాధ్యతారహితంగా పాలించారు. రైతుల సంసిద్ధతతో సంబంధం లేకుండా, రసాయనిక ఎరువులను ఆపేసి, తక్షణం ప్రకృతి వ్యవసాయానికి మారాలనే విధానం వల్ల, వ్యవసాయోత్పత్తిలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ఈ చర్యల వల్ల ఆదాయం గణనీయంగా పడిపోతూ అనేక ఆర్థిక వైపరీత్యాలకు దారి తీసింది.

సుదీర్ఘకాలం తరువాత ఆదాయాలను సమకూర్చే అత్యంత ఎక్కువ పెట్టుబడి పెట్టే హంబనతోట అంతర్జాతీయ ఓడ రేవు వంటి మౌలిక సదుపాయాల వ్యూహాత్మక ప్రాజెక్టును నిర్మించారు. హైవే రోడ్ల కోసం చైనాలోని ఎగుమతి దిగుమతి బ్యాంకు నుంచి అమెరికన్ బిలియన్ డాలర్లను అప్పుగా తెచ్చుకోవడం, అప్పటికే విదేశీ అప్పుల భారంలో మునిగిన శ్రీలంకకు మరింత భారమైంది. పెట్టుబడి, సాంకేతికతను తీవ్రతరం చేయాలనే క్రమంలో వ్యవసాయంపైన, చేపల పెంపకంపైన, ఉప్పు పండించడం పైన ఆధారపడిన స్థానిక ప్రజల జీవనోపాధిని కోల్పోయి, బాగా దెబ్బతిని నిరాశ్రుయులవడమే కాదు, చిన్న చిన్న వ్యాపారాలు, నివాసాలు కూడా దెబ్బతిన్నాయి. రైతులు, పాల ఉత్పత్తిదారులు, చేపలుపెంచే వృత్తుల వారికి భద్రత కల్పించడానికి ప్రయత్నించాల్సిన కొన్ని రంగాలు, దుర్భరమైన జీవితాలు గడిపే వారిని సహకార రంగం ద్వారా వారి ఉన్నతికోసం, స్వయం ఉపాధి ద్వారా ఉత్పత్తి చేసేవారిని దెబ్బతినకుండా చూడాల్సి ఉంది.

ఇదేమీ అతిశయోక్తి కాకపోయినప్పటికీ, ఇదొక సంక్లిష్టమైన పాలనాకాలం. ఎన్నికల్లో ఆధిక్యతను సాధించామని నమ్మిస్తూ అధికారంలోకొచ్చి, కేంద్రీకృతంగా, వ్యక్తి కేంద్రంగా, ఏకపక్షంగా, నియంతత్వ విధానాలతో విశ్వసనీయతను పోగొట్టుకుని ప్రజాదరణ కోల్పోయారు. గొటబయా ప్రభుత్వం నవీన ఉదారవాద ధోరణికి చక్కని ఉదాహరణగా నిలిచిపోయింది. దీర్ఘకాలికంగా సాగిన ప్రజా వీధి ప్రదర్శనల నిరసనలతో తనను తాను రక్షించుకోవడం కోసం దేశాధ్యక్షుడు రాజీనామా చేసి ద్వీపాన్ని ఒదిలేసి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది.

తమ సామాజిక, ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోవడంతో ప్రజల్లో ఈ పరిపాలన పై గూడుకట్టుకున్న ద్వేషం ఆ కుటుంబంపై , దాని అంతులేని అధికారంపై, అంతులేని అవినీతిపై తీవ్రంగా ప్రభావం కలగచేసింది.

శ్రీలంకలోని రాజకీయ వర్గాలపైన ఉన్న అసంతృప్తి చిన్న వ్యాపారం చేసుకుని బతికే ఒక వృద్ధురాలు ‘‘వారంతా ఒకటే, ఒకే రకంగా ఉంటారు’’ అ నే మాటల్లో రాజకీయ నాయకుల పలు విధాల దురాశ పారదర్శకంగా వ్యక్త మైంది. ఆర్థిక మాంద్యం వల్ల తమ ఆర్థిక భద్రత, సామాజిక రక్షణలు ప్రభావితమై, ఆహారం, ఇంధనం, నిత్యావసరాలు అందకుండా తయారయ్యాయి. జీవితాలు, ముఖ్యంగా భద్రంగా ఉండే మధ్యతరగతి వారి జీవితాలు అంచనా వేయలేని విధంగా తయారయ్యాయి.

కొత్త పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక భిన్నమైన వాగ్దానాలు చేసిన నాయకత్వం, సంప్రదాయంగా వచ్చే పార్టీల పాలనకు భిన్నంగా రాజకీయార్థిక రంగాల్లో నూతన శకారంబం లాగా శ్రీలంకలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కానీ, అది ఎదుర్కొనే సవాళ్ళు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. చైనా నుంచి తెచ్చుకున్న సార్వభౌమాధికార బాండ్లద్వారా 44.5 అమెరికన్ బిలియన్ డాలర్ల అప్పు ఉంది. భారంగా తయారైన ప్రజల జీవితాలు ఒక మేరకు భరించేలా, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) నిబంధనల సడలింపులతో అప్పులు తిరిగి చెల్లించడానికి సంప్రదింపులు జరపవచ్చు. వైపరీత్యానికి గురైన శ్రీలంక జాతి తన ఆర్థిక వసూళ్ళ పైనే దాని విజయం ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో భారతదేశం పట్ల సగటు శ్రీలంక పౌరుల్ల్ విశ్వాసం ఇనుమడించింది. ఆ మధ్య శ్రీలంక ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నపుడు భారత్ అందించిన భారీ సాయం దీనిక కారణం కావచ్చు.

శ్రీలంకను సందర్శించే ఒక బైట వ్యక్తిగా చూసినప్పుడు, ఒకప్పుడు జిగేల్ మని వెలిగిపోయే కొలంబో, కాండి వంటి మహానగరాలు వీధి దీపాలు కూడా వెలగక చీకట్లో మగ్గుతున్నాయి. తప్పించుకోలేని ఒక అనివార్య విషాదం లోపల ఒక శూన్యంతో నిండి ఉంది.

ఈ ద్వీపాన్ని వీడుతున్నప్పుడు బరువైన హృదయంతో ప్రసిద్ధ ఆంగ్ల కవి బ్రెర్ టోల్ట్ బ్రెహ్ట్ ప్రసిద్ధ పద్యపాదాన్ని పున:శ్చరణ చేసుకుంటారు. ‘‘విల్ దేర్ బి సింగింగ్ ఇన్ ది డార్క్ టైమ్స్ దేర్ విల్ బి సింగింగ్ అబౌట్ డార్క్ నెస్’’(చీకటి కాలంలో గానం చేసేటప్పుడు, చీకటి గురించే గానం చేయాలి) అన్న మాటలు నేటి శ్రీలంక విషాదానికి సరిగ్గా సరిపోవచ్చు.

(అనువాదం : రాఘవ)

(కర్లి శ్రీనివాసులు ఉస్మానియా యూనివర్సిటీ లో రాజనీతి శాస్త్ర విభాగం నుంచి ప్రొఫెసర్ గా ఉద్యోగ విరమణ తీసుకున్నారు. ఇటీవల ఆయన శ్రీలంకలో పర్యటించారు

Read More
Next Story