కొన్ని హామీలను విస్మరిస్తే కాటేస్తాయి...
x

కొన్ని హామీలను విస్మరిస్తే కాటేస్తాయి...

కెసీఆర్ తప్పొప్పులు- రేవంత్ కర్తవ్యాలు. బహుజన మేధావి బిఎస్ రాములు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్న హమీలు...



సకాలంలో చికిత్స చేయకపోతే చీమే గదా అనుకుంటే గాంగ్రిన్ అయి కాలు కొట్టేయాల్సి వస్తుంది. ఇంకా ఆలస్యం చేస్తే శరీరమంతా పాకి ప్రాణాలకే ముప్పు వస్తుంది. ఏడాదిన్నర దాటి పోయింది.
సకాలంలో సత్వర న్యాయం చేయక పోతే అసంతృప్తి దారి మళ్లి అనుకూలురు, తటస్తులు వ్యతిరేకులుగా మారుతారు. సరైన సమగ్ర దృష్టి గల సలహాదారులు లేక కాంగ్రెస్ పాలనలో అనేక రంగాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
రేవంత్ మర్చిన కొన్ని విషయాలు
దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన చేయూత, పెన్షన్, ఇళ్ల స్థలం జిల్లాల వారీగా వెంటనే ప్రారంభించడం అవసరం.
ప్రతి జిల్లాలో రచయితలు కళాకారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గురు కుల పాఠశాలలకు , హాస్టల్లకు లైబ్రరీలకు , స్కూల్లకు కాలేజీలకు తెలంగాణ రచయితల పుస్తకాలు కొంటే వందల కోట్లు ఖర్చేమీ కాదు. కాని వేలాది రచయితలు, లక్షలాది విద్యార్థులు సంతోష పడుతారు. వీరంతా వాయిస్ గ్రూపు.
పత్రికలకు ప్రకటనల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీరికి చేసే ఖర్చును కూడా అలా భావించాలని చెప్పే సలహా దారులే ప్రభుత్వంలో కరువయ్యారు.
తెలంగాణ సారధి వెలుపల గల వేలాది కళాకారులకు గత కాంగ్రెస్ కాలంలో కల్పించినట్టు అవకాశాలు కల్పిస్తే వారికి గౌరవం ప్రభుత్వానికి ప్రచారం వారికి ఉపాధి లభిస్తుంది.
జాన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు రంగాల వారికి లక్ష నగదుతో సత్కరించారు. మహనీయుల జన్మదినోత్సవాలలో వారి పేరిట, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు లక్ష చొప్పున పురస్కారం అందజేశారు.
రేవంత్ ఇటీవల కోటి రూపాయల పురస్కారం వల్ల రేంజి పెరిగింది . కనుక ఇపుడు కనీసం పది లక్షల చొప్పున సీనియర్లకు, అయిదు లక్షలు రెండు లక్షలు జిల్లా స్థాయిలో... యాభయి వేల చొప్పున మండల స్థాయి లో పురస్కారాలివ్వడం వల్ల సమాజంలో వారికే కాకుండా ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుంది. శ్రీకృష్ణ దేవరాయలు అందరివంటి రాజే . కవులను ఆదరించడం వల్ల చరిత్రలో నిలిచి పోయారు.
ఇక కెసిఆర్ తప్పొప్పులు
ఇంత కాలం రాయవద్దనుకున్నాను. ఎందుకంటే వారు తప్పులు సరిదిద్దుకొని తిరిగి అధికారంలోకి రాకూడదని! అయితే ఇపుడు రాసేటప్పుడు కేసిఆర్ సన్నిహితుడిగా పలు విషయాలు తెలిసిన వాడిగా ఏక పక్షంగా కాకుండా తప్పొప్పులు రెంటినీ రాయడం భావ్యం. తద్వారా అందరికీ మేలు జరుగుతుంది.
కేసిఆర్ పాలన విశిష్టత
తీసుకోవలసినంత మందిని ఉద్యమ కారులను ప్రభుత్వ సేవలో , ప్రజాసేవలోకి తీసుకోవలసిన దాంట్లో 25 శాతమే తీసుకొని మిగతా అంతా ఇతరులతో నింపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా మానేసి అయిదు శాతం కూడా ఉద్యమ కారుల సేవలు వినియోగించుకోవడం లేదు. వారు బిజేపి వంటి వాటికి మద్దతుగా మలుపుతిరుగుతున్నారనే సోయి కోల్పోయి యూ యూట్యూబ్ , ఫేస్ బుక్ వాట్సప్ రాక ముందు నాటి పాత రాజకీయాలను నడుపుతున్నది కాంగ్రెస్.
నేను కెసిఆర్ కార్యక్రమాలను పథకాలను ప్రశంసిస్తూ పరిచయం చేసూ 5 పుస్తకాలు రాసాను. అవన్ని ముందుగా పత్రికలలో వచ్చినవే. అభివృద్దికి వెలుగు నీడలునట్లే కెసిఆర్ కార్యక్రమాలలోని లోపాలను ప్రత్యక్షంగా గమనిస్తూ వచ్చాము. సంస్థాగతంగా కలిసి పని చేసాం గనక అంతర్గతంగా వివరించాము. సందేహాలు వ్యక్తం చేసాము. మాట ఒకటి చేసేది మరొకటి ఎలా సాగుతూ వచ్చిందో గమవించి అనేక వ్యాసాలు రాసాను. టీవీ ప్రసంగాలు చేసాము.
2009 లోనే బహిరంగ విమర్శ
2009 జూన్ లోనే ఆంధ్రభూమిలో " "తెలంగాణను కాటేస్తున్న కారు దొరతనం" వ్యాసం రాసాము. పుస్తకాలలోను పాజిటివ్ కోణంలో కూడా వివరించాము. మేము అవినీతి గురించి కాకుండా ఇతర అంశాలను,ప్రస్తావిస్తున్నాము. మేము వారి. పరిపాలన విధానాలను కుల తత్వం, కుటుంబ తత్వం, బీసీల పట్ల వారి నాయత్వం ఎదుగుదల పట్ల విముఖత , స్త్రీల నాయకత్వం పట్ల వ్యతిరేకత, గమనించాము.
ఓటు బ్యాంకు నిర్మాణానికి పరిమితమైన దృష్టి
చివరకు తేలిందేమంటే ప్రతి పథకం ఓటు బ్యాంకు నిర్మాణానికే పరిమితమై పోతున్నదని తెలిసి వచ్చింది. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు , విశ్లేషణలు, బీసీ కమిషన్ చైర్మన్ గా తెప్పించుకుని అధ్యయనం చేశాక, 2005 నుండి కలిసి మాట్లాడుతున్న ఆదర్శాలకు, ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలకు, ఆలోచనలకు గల వైరుధ్యాన్ని గమనించాము. వాటన్నిటిని ఇక్కడ పేర్కొనడం కుదరని పని .
కెసిఆర్ చేసిన మంచి పనులు
కెసిఆర్ చేసిన మంచి పనుల్లో కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త డివిజన్లు కొత్త మండలాల ఏర్పాటు. గురుకుల పాఠశాలల ఏర్పాటు. మెడికల్ కాలేజీల ఏర్పాటు. విదేశాల్లో ఉన్నత విద్యకు ఓవర్ సీస్ స్కాలర్ షిప్ ల ఏర్పాటు. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు , వృద్దులకు 42 లక్షల మందికి ఆసరా పథకం ప్రవేశ పెట్టడం. ఇది చాలా గొప్ప కార్య క్రమం. కోటి ఇరవై లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా చేయూతనిచాయి. 42 లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి.
కులవృత్తుల వారీగా చేపలు , గొర్రెల పెంపకం మొదలైనవి. ఇవి కాగితాల మీద ఖర్చు రాసిన స్కీములు.
కెసిఆర్ చేసిన పొరపాట్లు తక్కువేమీ లేవు.
ప్రతిపక్షం లేకుండా కలిపేసుకోవడం అతి పెద్ద పొరపాటు. అది నియంతృత్వానికి దారి తీసింది. బీసీ , ఎస్సీ వర్గాలకు స్వయం ఉపాధి పథకాలను ఆర్థిక చేయూతని నిలిపి వేయడం హేయమైన చర్య. మరొక ఘోరమైన తప్పు ఉన్నత విద్యను శిథిలం చేయడం. ప్రజలు కలువ లేని ముఖ్యమంత్రిగా మారడం. సెక్రెటేరియట్ కు రాకుండా ఇంటికాడికే రప్పించుకొని ఇంటికాన్నుంచి నడపడం. మంత్రులకు ఏ విషయంలోనూ నిర్ణయాలు తీసుకొనే చొరవ చంపడం, వారికి ఏ అధికారాలు లేకుండా చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడం జరిగింది. ఇది గిన్నిస్ బుక్ లో ఎక్కాల్సిన దుష్ట సంస్కృతి.
పరిపాలన ఎలా సాగుతున్నదో పర్యవేక్షించక పోవడం, ఫీడ్ బ్యాక్ పట్ల నిర్లక్ష్యం. దీన్ని పదే పదే రాజకీయ ప్రకటనలతో బయటికి రాకుండా కట్టడి చేయడం.
ప్రజల మధ్య లేకపోవడం వల్ల చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకోవడం. ఈ కోటరీని ఛేదించి ఎవరూ కలువలేని స్థితి. మద్యం మత్తు లో మునిగితేలడం, అన్నీ తనకు తెలుసనుకోవడం. తనకు తెలియని రంగాల్లో స్వంత నిర్ణయాలు తీసుకోవడం.
ఎదుగుతున్నవారిని సహించలేక పోవడం అతి చెడ్డ గుణం
ఎదుగుతుంటే సహించ లేకపోవడం. ఆలే నరేంద్రను, ఈటల రాజేంద్రను ఒకే విధంగా అకస్మాత్తుగా వేటువేసి బయటకు పంపడం. బండ ప్రకాశ్ ను అకస్మాత్తుగా రాజ్య సభ నుండి తప్పించి ఎమ్మెల్సీ చేయడం. ఈ విషయంలో నరేంద్ర మోడీకి అనుకూలంగా మారడం. ఇలా బీసీ నాయకత్వాన్ని ఎదగనీయకుండా కిందకు అసహనంతో పడదోయడం.
ఇలా అభివృద్ది సంక్షేమ పథకాల లిస్టులలేని ఈ లిస్టుకూడా చాంతాడంత వుంటుంది. ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రజల మీద రుద్దడం. మద్యం ఏరులై పారించి యువత జీవితాలను నాశనం చేయడం. ఉపాధి కల్పన గాలికి వదిలేయడం . రైతుబంధు, ధరణి పేరిట దశాబ్దాలుగా దున్నుకుంటున్న ఫీల్డు మీది రైతులకు కాకుండా వారికి అవకాశం లేకుండా కౌలుదారు, ఆక్రమణదారు, అనుభవదారు కాలం తొలగించి ఎపుడో ఆశ వదులుకున్న భూములను తిరిగి భూస్వాములకు, ధనిక రైతులకు, ప్రభుత్వానికి దఖలు పరిచి భూ నిర్వాసితులను చేయడం . దీని వల్ల లక్షలాది రైతుకూలీల జీవితాలు నాశనమయ్యాయి.
కేసీఆర్ హయాంలో అంచనాల వ్యయాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఇతర రాష్ట్రాలతో, ఇతర దేశాలతో పోల్చి చూడవచ్చు. అన్ని రంగాలలో కలిపి ఒక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ అంత వెనకేసుకొని అది చూసుకొని విర్ర వీగడం . ఇదంతా ఆంధ్రా లాబీలు, తెలంగాణ ఉద్యమాల పట్ల విర్ర వీగిన క్రమం లాంటిదే.
ప్రజల నుండి ప్రభుత్వాల నుండి దోచి దాచిన డబ్బుతో ఏ పార్టీతోనైనా ఒప్పందాలు కుదుర్చుకొని తిరిగి అధికారం సంపాదించాలని ఆరాటం. లేకపోతే క్రమం ఆ సంపదంతా అనేక ప్రభుత్వ చర్యల ద్వారా ఎట్లా వచ్చిందో అట్లా తుడిచి పెట్టుకు పోతుందనే భయం నేడు వారి రాజకీయాలను నడిపిస్తున్నది.
తమ మాట విశ్వసనీయత కోల్పోయిందని, సామాజిక, సాహిత్య ఉద్యమ కారులను పావులుగా కదిలిస్తూ తెలంగాణ అస్తిత్వం కోల్పోతున్నది అనే గగ్గోలుకు తెర తీసారు. వారే తెలంగాణకు ప్రతినిధులైనట్టు ఇంకెవరూ మేధావులు కళాకారులు జర్నలిస్టులు, రచయితలు లేనట్టు బయలు దేరారు. ఫలానా పోస్టు నింప లేదు కాబట్టి ఆంధ్ర లాబీతో ఏకమయ్యారు అని ప్రచారం చేయడం ఒక దిగ జారుడు తనం.
కేసీఆర్ అనేక రాజ్యాంగ పోస్టులను కోర్టులు ఆదేశించేదాక నియమించ లేదని, ఏండ్ల తరబడి యూనివర్సిటీవీసీలను నియమించలేదని గుర్తు చేసుకోవడం అవసరం


Read More
Next Story