దేశంలో మంచి పరిపాలన ఎపుడు సాధ్యమౌతుంది?
x

దేశంలో మంచి పరిపాలన ఎపుడు సాధ్యమౌతుంది?

ఈ రోజు సుపరిపాలన దినోత్సవం


ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన సుపరిపాలనా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి జన్మదినమైన డిసెంబరు 25 ను సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం 2014 లో నిర్ణయించింది.

అటల్ బిహారి వాజ్‌పేయి 25 డిసెంబర్ 1924 న గ్వాలియర్ నగరంలో జన్మించారు. ఆయన 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1947 సంవత్సరంలో వాజ్‌పేయి జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ పత్రికల్లో పనిచేశారు. 1951 లో శాం ప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితో భారతీయ జనసంఘ్ లో చేరారు. 19696 లో 1999 లో రెండు పర్యాయాలు. వాజ్ పేయికి భారత పార్లమెంట్ చరిత్రలో ప్రముఖమైన స్థానం ఉంది. ఆయన ప్రముఖ పార్లమెంటరీయన్ ప్రసిద్ధి గాంచారు. ఈ కారణంగా1994 లో ప్రముఖ పార్లమెంటేరియన్కిచ్చే గోవింద వల్లభ పంత్ పురస్కారానికి ఎంపికయ్యారు. వాటిపై శాసనసభ్యులకి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. 1971 లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో మనదేశం పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ నుండి వేరుపడ్డ బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. వాజ్‌పేయి ప్రతిపక్ష నేతగా ఉన్న ఆ సమయంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆ విజయానికి గానూ అభినందించారు. అంతటి గొప్ప వ్యక్తిత్వం ఆయనది.

అటల్ బిహారి వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు 1994 లో పద్మ విభూషణ్ బిరుదును, 2015 లో దేశ అత్యున్నత బిరుదైన భారతరత్నతో సత్కరించింది. వాజ్‌పేయి తన రాజకీయ జీవితంలో చాలాకాలం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న అధికారపార్టీ ప్రశంసలు పొందారు.

ఇతిహాస, పురాణ ప్రాచీన గ్రంథాలలో సుపరిపాలన ప్రస్తావన:

సుపరిపాలన భావన భారతదేశంలో నూతనంగా ఆవిర్భవించినది కాదు. పాశ్చాత్య దేశాలు నుండి భారతీయులు సుపరిపాలన గురించి నేర్చుకోలేదు. సుపరిపాలన భారత సంస్కృతిలో అంతర్భాగం. రామాయణంలో రాముడు భరతుడికి సుపరిపాలన గురించి వివరిస్తూ రాజ ధర్మాన్ని వివరిస్తాడు. మహాభారతంలోని శాంతి పర్వంలో, అనుశాసన పర్వంలో సుపరిపాలనకు సంబంధించిన అంశాలు సవివరంగా వివరించడం జరిగింది.

అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ధర్మరాజుకు సుపరిపాలన గురించి వివరించాడు. భీష్మ పితామహుడి ఉద్దేశంలో రాజు అతని కుమారుడు రాజ బంధువులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవులను పొందే ముందు ధర్మాన్ని రక్షిస్తామని, ప్రజల అవసరాలను తీరుస్తామని ప్రమాణం చేయాలి. వారు అన్యాయంగా ప్రవర్తించరాదు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడరాదు. ఈ అంశాలను వారు విస్మరిస్తే రాజ్యం నరకంగా మారుతుంది. భీష్మ ఢి ఉద్దేశంలో సుపరిపాలన ఆ కాంక్షించే ప్రభువులు నైతిక విలువలను విస్మరించ రాదు. ఆచార్య చాణక్యుడు తన అర్థశాస్త్ర గ్రంథంలో సుపరిపాల నకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించాడు. చాణక్యుడు దేశంలో సుపరిపాలన అంటే “ ప్రజల సంతోషమే రాజు సంతోషం. ప్రజల సంక్షేమంలోనే ప్రభువు సంక్షేమం ఉంది. రాజు సంక్షేమ కోసం కాకుండా ప్రజల సంతానం కోసం మాత్రమే పరిపాలన గావించాలి. భారతీయ పురాణ ఇతిహాసగ్రంథాల్లో సుపరిపాలనే రాజధర్మంగా అభివర్ణించడం జరిగింది.

సుపరిపాలన సవాళ్లు:

సుపరిపాలనను ఆచరించడంలో మన దేశంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అందులో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం రాజకీయాల్లోకి నేరచరితులు ప్రవేశం. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో కొంత మంది నేర చరితులు ప్రజాప్రతినిధులు ఎన్నిక కావడం దురదృష్టకరం. అన్ని రాజకీయ పార్టీలు ఎంతోకొంత మేర నేరచరిత్రను తమ పార్టీలో చేర్చుకుని వారికి చట్టసభల ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తున్నాయి. చట్టాలను ఉల్లంఘించే వారు చట్టాలు రూపొందించేవారు గా ఎన్నుకోబడరాదు. ఈ రకంగా జరిగితే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. దురదృష్టవశాత్తు మన చట్టసభల్లో నేరచరితులు ప్రాతినిధ్యం పెరుగుతోంది. లభిస్తున్న గణాంకాల ప్రకారం 2004 లో 24% మంది, 2009 లో 30% మంది, 2014 లో 34% మంది 2019 లో 43% మంది నేర చరితులుగా అభియోగాలను ఎదుర్కొంటున్న వారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. భారత లా కమిషన్ తన 179 వ నివేదికలో నేర చరితులు చట్ట సభలకు ఎన్నిక కాకుండా ఉండటం కోసం 1951 లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని, నేరచరిత్ర కలిగిన వారిని ఐదు సంవత్సరాలు లేదా వారు నిర్దోషులుగా తీర్పులు వచ్చే వరకు నిర్దోషులుగా తీర్పు వచ్చేంతవరకు వారిని చట్టసభలకు పోటీ చేయకుండా నిషేధం ఉండాలని అభిప్రాయపడింది. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అందులో 33 -ఏ సెక్షన్ ను చేర్చడం జరిగింది. ఈ సవరణ ప్రకారం చట్టసభలకు పోటీచేసేవారు తమపై ఏదైనా క్రిమినల్ కేసులు ఉంటే ఆ సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు స్పష్టంగా తెలియజేయాలి. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. సుపరిపాలన ను శిస్తే రాజకీయ పార్టీలు నేర చరిత్రను తమ పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీకి నిలపరాదు. ప్రజలు నేర చరితులను తమ ప్రతినిధులుగా ఎన్నుకో రాదు.

పరిపాలనా వికేంద్రీకరణ:

సుపరిపాలనలో పరిపాలనను వికేంద్రీకరించాలి. మన దేశంలో ప్రభుత్వ పాలన కేంద్రీకృతమైనట్లు విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు మరిన్ని అధికారాలు కల్పించాలి. స్థానిక ప్రభుత్వాలను 73,74 రాజ్యాంగ సవరణల ద్వారా కొంత బలోపేతం చేసినప్పటికీ అవి అనేక రాష్ట్రాలలో నిధులు లేని విధులు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. స్థానిక సమస్యల పరిష్కారం కోసం స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి. సత్వర న్యాయం లభించాలి. అనేక కారణాల వల్ల ప్రజలకు న్యాయస్థానాల్లో సత్వర న్యాయం లభించడం లేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. తగిన సమయంలో లభించ ని న్యాయం అన్యాయంతో సమానం అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత కారణంగా, సరైన వసతులు లేని కారణంగా లక్షల్లో కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. కేసుల సత్వర నివారణకు అవసరమైన సంస్కరణను న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టాలి.

అవినీతి రహిత పాలన:

సుపరిపాలన అంటే అవినీతి రహిత పాలన. దురదృష్టవశాత్తు ప్రభుత్వ పాలనలో అవినీతి పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలోని కొన్ని ప్రభుత్వ శాఖల లో లంచాలు ఇవ్వకపోతే పనులు జరగడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అవినీతి నిరోధక శాఖలైన సీబీఐ, ఏసీబీ, విజిలెన్స్ కమిషన్లు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా పని చేయానివ్వాలి. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు సిబిఐ ని పంజరం లో చిలక లా అభివర్ణించడము గమనార్హం. అవినీతికి పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించాలి.

పారదర్శక పాలన ప్రజల భాగస్వామ్యం:

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. పరిపాలనలో పారదర్శకత ఉండాలి. ఇందు కోసం 2005 లో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించడం హర్షించదగ్గ పరిణామం. ఐతే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర సమాచార కమిషన్ లోనూ, రాష్ట్ర ల సమాచార కమిషన్ లోనూ ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఇటువంటి చర్యలు సుపరిపాలనకు వ్యతిరేకం. సుపరిపాలనలో ప్రజలకు నిర్ణయీకరణలో పాత్ర ఉండాలి. ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ చట్ట బద్ధమైన వ్యవస్థల ద్వారా ప్రభుత్వ నిర్ణయాలలో భాగస్వాములు కావాలి.

పార్టీ ఫిరాయింప చట్టాన్ని సదుద్దేశం తో రూపొందించిప్పటికీ అందులో ఉన్న కొన్ని లోపాల వల్ల ఆ చట్టం యొక్క ఆశయాలు నెరవేరలేదు. ఈ చట్టాన్ని పకడ్బందీగ అమలు చేయడం కోసం అవసరమై న చర్యలు గైకొనాలి. ఇవన్ని జరిగినప్పుడే సుపరిపాలన సాధ్యం అవుతుంది.




Read More
Next Story