
అమెరికాతో స్నేహం ఎందుకు ప్రాణాంతకం అంటే...
భారత్ చుట్టూ క్రమంగా ఉచ్చు బిగిస్తున్న వైట్ హౌజ్..
‘‘మా చమురు ను కొనండి.. రష్యాను వదిలేయండి.. మీ మార్కెట్లను తెరవండి’’ ఇది అమెరికా వాదన. భారత్ పై ఒత్తిడి తేవడానికి తన మిత్రులను కూడా వాడుకుని భారత్ పై ఒత్తిడి తేవడానికి వాడుకుంటోంది. అయితే ఇదే సమయంలో చైనాను మాత్రం స్వేచ్ఛగా విడిచిపెడుతోంది.
అమెరికాకు చాలా సంవత్సరాలుగా విదేశాంగ కార్యదర్శిగా సేవలు చేసిన హెన్రీ కిసింజర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ‘‘అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం కానీ మిత్రుడిగా ఉంటే మాత్రం ప్రాణాంతకం’’
ఈ శతాబ్ధంలో అమెరికాతో సన్నిహిత సంబంధాలు నెరిపిన భారత్, అమెరికా రాజకీయాలలోని కపటత్వం, ఏకపక్ష లావాదేవీల వల్ల బాధితురాలిగా మారుతోంది. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ... పాకిస్థానీ సైనిక నియంతలకు వైట్ హౌజ్ మద్దతు ఇవ్వడం, భారత ప్రజాస్వామ్యానికి క్రిమ్లిన్ నమ్మకమైన మిత్రుడిగా ఉందని పేర్కొన్నారు. ఇవి వాషింగ్టన్ తో స్నేహం చేయడం వల్ల నిజంగా ఎలాంటి ఫలితం లేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.
వెనెజువెలా దోపిడి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనెజువెలా పై పూర్తి స్థాయిలో పట్టుబిగించారు. దాంతో తమ దగ్గర నుంచే ఎక్కువ స్థాయిలో ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపివేయాలని న్యూఢిల్లీపై నిరంతరం ఒత్తిడి తేస్తున్నారు.
ఈ ఏడాది మే నెల నుంచి, అమెరికా, భారత్ నుంచి ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ), ఎల్పీజీ రెండింటిని సరఫరా చేసే అతిపెద్ద దేశంగా ఎదిగింది. కేవలం ఏప్రిల్, మే నెలల మధ్యనే భారత్ కు అమెరికా ఎల్ఎన్జీ దిగుమతులు 227 శాతం, ఎల్పీజీ ఎగుమతులు 63 శాతం పెరిగాయి.
అమెరికా, వెనెజువెలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన తరువాత దాని ఒత్తిడితో అక్కడి నుంచి కూడా భారీ స్థాయిలో చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ ఘటనను చాలామంది ట్రంప్ ను గొప్ప చమురు దొంగగా అభివర్ణిస్తున్నారు.
కొంతమంది నయా వలసవాద వనరులు దోపిగా పేర్కొంటున్నారు. వెనెజువెలా నుంచి వచ్చే చమురు వల్ల అమెరికా ఆర్థికంగా లబ్ది పొందుతోంది. యూఎస్ ఆంక్షలు, లైసెన్స్ ఒప్పందాల ద్వారా వచ్చే రాబడి, రాయల్టీలు, ఫెడరల్ పన్నులు, ఇలా మొత్తం ఆదాయం కేవలం అమెరికా ట్రెజరీ డిపార్ట్ మెంట్ లో జమ అవుతున్నాయి. వీటిని వెనెజువెలాకు ఎప్పుడు ఇవ్వాలనేది కేవలం అమెరికా మాత్రమే నిర్ణయిస్తుందట.
భారీ ఒత్తిడి..
అమెరికా మూలం, దాని నియంత్రణలో ఉన్న ఇంధన సరఫరాలపై భారత్ ఎక్కువగా ఆధారపడటంతో వాషింగ్టన్ సంతృప్తిగా లేదు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసి, దాదాపు పూర్తిగా అమెరికా మూలం లేదా అమెరికా నియంత్రణలో ఉన్న ఇంధన వనరులను మారేలా భారత్ ను ప్రేరేపించడానికి అమెరికా, లిండ్సే ఓ గ్రాహం రష్యా, ఇరాన్ పై ఆంక్షల చట్టం ను ఉపయోగించుకుంటుందని ఒక స్టేట్ డిపార్ట్ మెంట్ అధికారి చెప్పినట్లు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఇటీవల పేర్కొంది.
రష్యా చమురు దిగుమతుల విషయంలో న్యూఢిల్లీపై ఒత్తిడి తెచ్చేందుకు విస్తృతమైన ఆంక్షల బెదిరింపును ఉపయోగించి భారత్- రష్యా సంబంధాలను బలహీనపరచడమే లక్ష్యంగా కనిపిస్తోంది. దీనివల్ల రష్యా ఆయుధాలపై భారత్ ఆధారపడటం, అలాగే అమెరికా సైనిక పరికరాలపై మొగ్గు చూపుతుందని పేర్కొన్నారు.
రిఫైనరీల నిర్వహణ, తగ్గిన రాయితీలు, కొత్త అమెరికా ఆంక్షల వల్ల పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఒత్తిడి కారణంగా 2026 లో భారత్, రష్యా చమురు కొనుగోళ్లు కాలానుగుణంగా తగ్గుదల కనిపిస్తోంది. నయారా ఎనర్జీ వడినార్ ప్లాంట్ వంటి ప్రధాన రిఫైనరీలలో ప్రణాళికబద్దమైన నిర్వహణ కారణంగా 2026 లో జనవరిలో దిగుమతులు భారీగా పడిపోయాయి.
2026 లో ఏప్రిల్ లో 15 శాతానికి పైగా తగ్గాయి. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లలో జూలైలో రికార్డు స్థాయికి పుంజుకున్నప్పటికీ రిఫైనరీలు జాగ్రత్తగా తమ సరఫరాలను వైవిధ్యపరచడంతో ఆగష్టు, సెప్టెంబర్ నాటికి మళ్లీ కొన్ని నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి.
డామెక్లస్ కత్తి...
రష్యా ఇంతకుముందులా రాయితీ ధరలకు చమురును విక్రయించడం లేదు. అయితే రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం అమెరికా ఒత్తిడే ప్రధాన కారణం. ముఖ్యంగా పెట్రోలియం కొనుగోలుదారులను ప్రత్యేకించి భారత్ ను లక్ష్యంగా చేసుకుని ఇటీవల సంతకం చేసిన ఎస్ఆర్ఐఏ రూపంలో ఢిల్లీపై వేలాడుతున్న డెమోక్లెస్ కత్తి వంటి పరిస్థితి దీనికి కారణమని వారు అంటున్నారు.
రష్యా, చమురుకు చైనా అతిపెద్ద కొనుగోలుదారు. అయితే ట్రంప్ మాత్రం దానిని పట్టించుకోవడం లేదు. అమెరికా, చైనాలు ఇప్పుడు బుసాన్ ఒప్పందాన్ని జనవరి 2027 వరకు పొడిగించాయి. ఈ ఒప్పందం జాతీయ భద్రతా మినహాయింపుల ద్వారా బీజింగ్ కు రక్షణను అందిస్తుంది.
తన రెండో అధ్యక్ష పదవిలో తొలినాళ్లలో ట్రంప్ చైనా పై ఆంక్షలు విధించగానే అది కీలక మినరల్స్ ను అమెరికాకు అందకుండా చేసింది. ఇదే ట్రంప్ ను భయపెడుతోంది. అందువల్ల అది భారత్ ను లక్ష్యంగా చేసుకుంది. భారత్ తో సహ ఇతర దేశాలపై ఆంక్షల కత్తి వేలాడుతోంది.
వాణిజ్య పరపతి..
అమెరికా ప్రాథమిక లక్ష్యం ఆదాయాన్ని సంపాదించడమే. భారత్ ఏమైన వారికి ఫర్వాలేదు. దీనికోసమే వారు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాలని పట్టుబడుతున్నారు. దానికోసమే టారిఫ్ లను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.
ప్రధాన వాణిజ్య రాయితీలను రాబట్టడానికి ముఖ్యంగా అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కోసం విశాలమైన భారత మార్కెట్లను తెరవడానికి, అలాగే అమెరికాలో తయారైన సైనిక పరికరాలను కొనుగోలు చేయడానికి కూడా ఈ సుంకాల యుద్ధాన్ని ఉపయోగించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తోంది.
భారత్ కు యుద్ద డ్రోన్లకు సప్లై చేస్తున్న అమెరికా సంస్థ పవరస్, ఇప్పుడు పాకిస్తాన్ తో చేతులు కలిపింది. ఇది ఆందోళన కలిగించే అంశం. అయితే భారత్ కు అమెరికా నమ్మకద్రోహం చేయడం కొత్తేం కాదు. యుద్ద అనుభవం ఉన్న ఉక్రెనియన్ డ్రోన్ సాంకేతిక నిఫుణులను నియమించుకున్న ఈ సంస్థ పెట్టుబడిదారుల జాబితాలో ట్రంప్ కుమారులు, అల్లుడు ఉన్నారు.
బంగ్లాదేశ్ లో యూనస్ నేతృత్వంలోని ఇస్లామిస్ట్ ప్రభుత్వాన్ని స్థాపించడానికి టర్కీ, పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు డీప్ స్టేట్ నిరంతరం మద్దతు ఇవ్వడానికి ఇది ఒక కారణం కావచ్చు. ఈ విషయం భారత్ భద్రతా ఆందోళనలను మరింత పెంచి, అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలుకు దారి తీస్తుందని భావిస్తుంది.
జీ2 లో చైనా అగ్రరాజ్యంగా ట్రంప్ పరిగణిస్తున్నారు. చైనాతో ఘర్షణ తలెత్తిన పక్షంలో వాషింగ్టన్ నుంచి భారత్ నిజమైన మద్దతును ఆశించడం కష్టమే. చైనాతో సంబంధాలను సాధారణీకరించడానికి మోదీ ప్రభుత్వం ఇంతలా తొందరపడటానికి ఇదే కారణం కావచ్చు. అయితే వాషింగ్టన్ ధృతరాష్ట్ర కౌగిలిని ఎలా ఎదుర్కుంటుంది.. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ఎలా కాపాడుకుంటుంది అనేది రాబోయే కాలంలో భారత విదేశాంగ విధానానికి ప్రధాన సవాల్ గా మారబోతోంది.
(ది ఫెడరల్ అన్ని రకాల అభిప్రాయాలను గౌరవిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు కేవలం రచయితవి మాత్రమే. అవి తప్పనిసరిగా ది ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)
Next Story
