గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసాలో యూకే కొత్త గైడ్‌లెన్స్‌..
x

గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసాలో యూకే కొత్త గైడ్‌లెన్స్‌..

చదువు కోసం యూకేకు వెళ్లే విద్యార్థులకు చిక్కొచ్చి పడింది. కొత్త ఏడాది నుంచి గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసాలో వస్తున్న కొత్త నిబంధనలేంటో చూద్దాం..


యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోందని మైగ్రేషన్‌ అడ్వైజరీ కమిటీ (ఎంఎసీ) తేల్చింది. ఉన్నత విద్యా సంస్థల్లోని అంతర్జాతీయ విద్యార్థులలో చైనీయుల కంటే భారతీయులే ఎక్కువ ఉన్నారని పేర్కొంది. 2022లో బ్రిటన్‌లో చదువుకునేందుకు 1,39,700 మంది భారతీయ విద్యార్థులు వెళ్లారు. చైనా నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే 30 శాతం మంది మనవారే ఉన్నారు. 23 శాతం (1,08,200 మంది) విద్యార్థులతో చైనా రెండో స్థానంలో నిలిచింది. 2018-19, 2022-23 మధ్యకాలంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కోసం వెళ్లిన ఇండియా విద్యార్థుల సంఖ్య చైనా కంటే ఎక్కువుంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల సంఖ్యలోనూ మనవారిదే పైచేయి.

ఆ నిబంధనల వల్లే..

అండర్‌ గ్రాడ్యుయేట్‌ లేదా మాస్టర్స్‌ డిగ్రీ చదివిన విదేశీ విద్యార్థులు తమ కోర్సుల అనంతరం రెండేళ్లపాటు ఆ దేశంలోనే ఉండేలా వీసా నిబంధనలున్నాయి. దీంతో యూకేకి వెళ్లి చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. ఈ గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసాను సెప్టెంబర్‌ 2019లో బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

అప్పటి నుంచి గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా మంజూరు చేసిన 1,76,000 మంది విద్యార్థులలో 42 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఈ వీసాతో విద్యార్థి డిపెండెంట్‌ కూడా యూకేలో నివసించవచ్చు. పని కూడా చేసుకోవచ్చు. ఈ వీసా కింద ఇప్పటివరకు 37,000 మంది డిపెండెంట్‌లకు వీసాలు మంజూరయ్యాయి. స్కిల్డ్‌ వర్కర్‌లా కాకుండా.. విద్యార్థి లేదా డిపెండెంట్‌ ఏ రకం పనైనా చేసుకోవచ్చు.

లోపిస్తున్న ప్రతిభ..

కొత్త విశ్వవిద్యాలయాలు తక్కువ ఖర్చుతో కోర్సులను అందిస్తున్నాయి. దీంతో విద్యార్థులు వాటిల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఆ యూనివర్సిటీల్లో నాణ్యత ఉం‌డని కారణంగా ప్రతిభ లోపిస్తుంది.

కొన్ని విశ్వవిద్యాలయాలు ఒక సంవత్సరానికి రూ. 5 లక్షలు తీసుకుని కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఒక-సంవత్సరం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మాస్టర్స్‌లో ఉన్న భారతీయ విద్యార్థి తన డిపెండెంట్‌ను తీసుకువస్తే దంపతులిద్దరూ మూడేళ్ల కాలంలో చిన్నపాటి ఉద్యోగాలు చేసి 1.15 కోట్లు సంపాదించవచ్చు. మూడు సంవత్సరాల పాటు ఉన్నందుకు అయిన ఖర్చు తీసేసినా.. కొంత డబ్బుతో తిరిగి ఇండియాకు చేరుకోవచ్చు.

ఆర్థిక కష్టాలు

‘‘నేను, నా భర్త ఇక్కడ ఫీజు చెల్లించడానికి, లండన్‌కు రావడానికి రుణం ఇండియాలో రుణం తీసుకున్నాము. మేం దానిని తిరిగి చెల్లించగలిగాము. మా ఇంటిని మరో ఇద్దరు జంటలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఖర్చులను తగ్గించుకుని ఆదాయంలో ఎక్కువ భాగాన్ని సేవ్‌ చేయగలుగుతున్నాం’’ అని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నుంచి లండన్‌కు వచ్చిన నేహా సోలంకి చెప్పారు. నేహా పగలు ఓ ఇంట్లో సహాయకురాలిగా, సాయంత్రం భారతీయ రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పనిచేస్తున్నారు.

తన భర్త ఏ యూనివర్శిటీలో చదువుతున్నారు.. ఎంత ఫీజు చెల్లిస్తున్నారన్న విషయాలను వెల్లడించేందుకు ఆమె నిరాకరించింది. తన భర్త కూడా రెండు ఉద్యోగాలు చేస్తుంటాడు. ఎలక్ట్రికల్‌ వస్తువులను విక్రయించే దుకాణంలో వారానికి 20 గంటల పాటు పనిచేయడమే కాకుండా, సాయంత్రం పూట ఓ ఇండియన్‌ రెస్టారెంట్‌లోని వంటపనివారికి సాయం చేస్తాడు. ‘‘భారతదేశంలో ఉద్యోగాలు లేవు. ఇక్కడ కష్టపడి పనిచేస్తే సక్రమంగా జీతం వస్తుంది. ఇక్కడ మా మూడేళ్లు పూర్తయ్యాక మేం తిరిగి వెళ్లవలసి వస్తే.. స్వదేశానికి వచ్చి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన డబ్బును కూడబెడుతున్నాం’’ అని సోలంకి ది ఫెడరల్‌తో అన్నారు.

రిషి సునక్‌ ప్రభుత్వ నిర్ణయం..

మైౖగ్రేషన్‌ అడ్వైజరీ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా నిబంధనలను సమీక్షించాలని రిషి సునక్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం యూకేలోకి వలసలు ఎక్కువయ్యాయి. ఏడు లక్షలు దాటిపోయాయి. మరోవైపు ఇమ్మిగ్రేషన్‌ను తగ్గించాలని రైట్‌-వింగ్‌ కన్జర్వేటివ్‌లు ప్రధాని సునక్‌ను ఒత్తిడి చేస్తున్నారు.

కొత్త నియమాలు

ఈ సంవత్సరం మేలో యూకే ప్రభుత్వం పరిశోధనాధారిత కోర్సులో ఉంటే తప్ప డిపెండెంట్‌ను తీసుకురాకుండా నిషేధించే నిబంధనలను మార్చింది. అంతర్జాతీయ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులలో డాక్టోరల్‌ విద్యార్థులు కేవలం 3 శాతం మాత్రమే ఉన్నారు. జనవరి 2024లో నియమాలు అమల్లోకి రానున్న ఈ నిబంధనలతో యూకేకి వచ్చే డిపెండెంట్‌ల సంఖ్యపై ప్రభావం చూపుతుంది.

దుర్వినియోగాన్ని అరికట్టేందుకే..

‘‘దుర్వినియోగాన్ని అరికట్టడానికి, యూకే ఉన్నత విద్య నాణ్యత పరిరక్షణకు’’ గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా నియమాలను మార్చాల్సి వచ్చిందని కొత్త హోం సెక్రటరీ జేమ్స్‌ క్లీవర్లీ ప్రకటించారు. వీసా జారీలో కొత్త నిబంధనలు భారతీయ విద్యార్థులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.

Read More
Next Story