
మావోల తోవలో అలజడి: రచయిత జూకంటి జగన్నాథం ఏమంటున్నారంటే...
చేతులు మారుతున్న ఆయుధం ... రాజ్యాంగం
ఇటీవల నక్సల్స్ ఉద్యమం (Naxal Movement) లో ఉన్నత స్థానంలో ఉన్న నాయకులు మల్లోజుల వేణుగోపాల్ రావు తక్కళ్లపల్లి వాసుదేవరావులు తమ సహచరులతో కలిసి పెద్ద మొత్తంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా తమ ఆయుధాలను రాజ్యం చేతుల్లో పెట్టారు. దానికి ప్రతిగా బదులుగా మహారాష్ట్ర చతిస్ గడ్ ముఖ్యమంత్రులు ఆయుధాలు అందజేసిన వారికి భారత రాజ్యాంగ ప్రతిని అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా అటు ఆయుధాలను త్యజించిన వారిలో గాని, ఇటు రాజ్యాంగాన్ని అందజేసిన వారి రాజ్య స్వరూప స్వభావాలలో గౌతమ బుద్ధుడు, పూలే, అంబేద్కర్ ల విచార దారాను కొనసాగించే అవకాశాలు మరింత మెరుగు అవుతాయా లేదా ఎదురు చూడాలి.
అయితే ఆయా నాయకులు ఆయుధంతో పాటు తమ అభిప్రాయాలను ఆశయాలను మార్చుకొని రాజ్యానికి అప్పగించారా? లేక తాత్కాలిక విరమణ చేశారా?. దీని మీద మైదాన ప్రాంతాలలోని వివిధ రంగాలలోని మేధావులు మల్లగుల్లాలు పడుతుంటే, ప్రజా సంఘాల నాయకులు ఆ దిశగా తర్జనభర్జనలు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ప్రజా సమస్యలను పరిష్కరించి ఆయుధం స్థానాన్ని రాజ్యాంగం పూరిచగలుగుతుందా?
కాక తిరిగి రహస్య పోరాటాలు ముందుకు సాగుతాయి? ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాల పైన తక్షణం విజ్ఞులు రాజనీతి కోవిదుల చర్చలలో ప్రస్తుతం చురుకుగా చోటు చేసుకుంటున్నది.
ఈ చర్చ కన్నా ముందు ప్రపంచ వ్యాప్తంగా 22వ శతాబ్ది పూర్వార్ధంలో సమాజ వచ్చిన చలనా చలనాల ప్రతిఫలనాలు పునాదిలో జరిగిన చేర్పులు మార్పులను ఒకసారి రాజనీతి ,సామాజిక ,ఆర్థిక పౌర సాంకేతిక శాస్త్ర రంగాల వెలుగులో అధ్యయన పరిశీలన చేసుకుంటే కొంతమేరకైనా మేలు జరుగుతుంది.
ప్రపంచీకరణ అత్యాధునికత వేగవంతంగా పరుగెడుతున్న చోట ప్రజా పోరాటాలు దీర్ఘకాలిక ప్రాతిపదికన కొనసాగించడం అంత సులభమైన విషయం కాదు. పైగా సంక్లిష్టమైన స్థితిలోకి వ్యవస్థను నటబడుతుంది నెట్టబడుతుందని చెప్పాలి. సమాజం పునాదిలో జరుగుతున్న మార్పుల వలన ఉపరితలంలో అగుపించే ఉద్యోగాలలో వ్యక్తులలో వ్యవస్థలో స్థిరత్వం ఉండడానికి వీలు లేని ఒక సంక్షోభ వాతావరణం ఏర్పడినది.
క్రమంగా భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ విధానంగా పరివర్తన చెందినది. జాతీయ పెట్టుబడిదారుడు అంతర్జాతీయ క్యాపిటలిస్టు గా ఎదిగాడు. ఇదే కాలంలో బహుళ జాతి సంస్థలు మార్కెట్లను ఆక్రమిస్తున్నాయి . భూమి పంటలు పండించే సాధారణ స్వభావం మార్చుకొని రియల్ ఎస్టేట్ గా రూపాంతరం చెందుతుంది.
కనబడే ప్రభుత్వాలను తెర వెనుక ఉండి నడిపే డ్రైవింగ్ ఫోర్స్ ఒత్తిడి కారణంగా శాసనకర్తలు తీసుకుని నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది. పైగా ఆయా ప్రభుత్వాలను చెప్పుకోదగ్గ స్థాయిలో కట్టడి చేస్తుంది. తత్ఫలితంగా అభివృద్ధి అని ప్రభుత్వాలు చెప్పే ప్రచారంలో లాభక్తుల దగ్గరికి వచ్చేసరికి కరి మింగిన వెలగ పండు డొల్ల తనం అవుతుంది. కనిపిస్తుంది.
లాభాల దాహం తీరని జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులు అందరూ ఒక్కటిగా తమ తమ ఉత్పత్తులను ఆయా దేశాలకు ఎగుమతి చేస్తాయి.రవాణా చేస్తాయి. ఎగుమతి దిగుమతులపై ఆయా దేశాల మీద ఒత్తిడి తెచ్చి సుంకాల రాయితీని పొందుతాయి దీనితో ఎగుమతి దిగుమతుల సుంకాల మధ్య అంతరం ఏర్పడుతుంది తద్వారా ఎక్కువ దేశాలు నష్టపోతే, కొన్ని సంపన్న దేశాలు రాభ పడుతుంటాయి.ఇదే నేటి ప్రపంచీకరణ తీసుకువచ్చిన వాణిజ్యయుద్ధ నీతి తంత్రం.
జాతీయంగా అంతర్జాతీయంగా ఏర్పడిన ఇటువంటి పరిస్థితులలో రహస్య సాయుధ వాదులు కొందరు అనేకానేక కారణాల వలన తమ ఆయుధాలను పాటు లొంగిపోతున్నారు. పోరాట బాట వీడిన సదరు వ్యక్తులకు రాజ్యాంగ ప్రతులను పొందుతున్నారు. ప్రభుత్వ నాయకులు అందజేస్తున్నారు. ఇక్కడే తిరకాసు అంతా ఉంది.
ఆయుధాలతో సహా లొంగి పోవడం అంటే తమ ఆశయం పట్ల విశ్వాసం సడలి పోయినట్టు గా భావించాల్సి వస్తుంది. రాజ్యాంగ ప్రతిని వారి చేతులకు అందజేయడం అంటే రాజ్యం పట్ల విశ్వాసం విధేయత కలిగి ఉండడం గా అన్వయించుకోవాల్సీన స్థితి ఏర్పడుతుంది.
అసలు రాజ్యం రాజ్యాంగాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించి ప్రజా సమస్యల పరిష్కారం ఆచరణలోకి అమల్లోకి తీసుకువస్తే అసలు పోరాటాల యొక్క అవసరమే ఉండదు. కానీ రాజ్యం తీసుకున్న నిర్ణయాల పైన జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారుల ప్రభావం ఉంటుందని ముందే మాట్లాడుకొని ఉన్నాం్ ఇటువంటి పరిస్థితుల్లో అసలు రాజ్యాంగాన్ని అమలు చేయడం శాసనకర్తలకు అసాధ్యంగా పరిణమిస్తుంది.
వీటన్నిటి పర్యాసానంగా సంపద అంతా పిడికెడు మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది. పెద్ద ధన వంతులకు పేదలకు మధ్య పూడ్చలేని ఆగాధం పెరిగిపోతుంది. శాసనసభలు బలహీన పడిపోతుంటాయి. నాయకులు ఏం చేయాలో దిక్కుతోచక అభివృద్ధి సంక్షేమం అనే మాటలను చర్విత చరణంగా వల్లె వేస్తుంటారు. ఎటు పాలు పోక ప్రజలకు ఉచితాల తాయిలాల ఆశలను తెరమీదికి తీసుకు వస్తాను.
పైన ఉదాహరించిన అనేకానేక విషయీవిషయాల వలన ప్రజల నిత్యావసర జీవితం తీవ్రమైన ఆటుపోట్లకు గురి అవుతుంది. పైగా సహజ ప్రకృతి వనరులు అంటే అడవులు నదులు గాలి తీవ్రంగా నష్టపోతాయి. విలువలు సంస్కృతి దిన దినం లుప్తమైపోతాయి. రైతులు,కుటీర పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతాయి. చివరికి ఆయా వృత్తులను ఆశ్రయించి జీవిస్తున్న వారు అటు ఉత్పత్తులకు గిట్టుబాటు రాక ఇటు ఉత్పత్తి ఉపకరణాల వ్యయం పెరిగిపోవడం వలన వాళ్లుకు తల మించిన అప్పుల పాలై తీర్చే మార్గాలు లేక ఆత్మహత్యలే శరణ్యమైపోతాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే సంవత్సరం సంవత్సరానికి గతంలో కన్నా మిక్కిలిగా ఆత్మహత్యల వైపు దారితీస్తున్నాయి .
అజ్ఞాతవాసం, ఆయుధం వీడి రాజ్యాంగం చేతబూనిన వారినీ , వారు భవిష్యత్తులో చేపట్టబోయే చట్టబద్ధ ప్రజా సమస్యల పరిష్కార ఉద్యమాలను ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాలు ఎలాంటి అలమరికలు లేకుండా స్వేచ్ఛగా పని చేసుకునిస్తారా ? అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల కొశ్సన్.
(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రచయిత సొంత అభిప్రాయాలు)
Next Story