నేడు యం.యస్ ఆచార్య తెలంగాణ కలం వీరుడి స్మారకోపన్యాసం
x
MS Acharya

నేడు యం.యస్ ఆచార్య తెలంగాణ కలం వీరుడి స్మారకోపన్యాసం

ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ (డిల్లీ) ఎ. కృష్ణారావు ‘జర్నలిజం, సాహిత్యం, మారుతున్న ప్రమాణాలు’ అనే విషయం మీద ప్రసంగిస్తారు


యం యస్ ఆచార్య తెలంగాణ వీరుడు, జర్నలిస్టు, రచయితకు 101 జయంతి ఇటీవల 3 అక్టోబర్ 2025 న. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ లో ఆచార్య స్మారక ప్రసంగాన్ని 14 నవంబర్ 2025న ఏర్పాటు చేసారు.

ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ (డిల్లీ) శ్రీ ఎ. కృష్ణారావు జర్నలిజం, సాహిత్యం, మారిపోయిన ప్రమాణాలు అనే విషయం పై సెనేట్ హాల్ లో 10.30 గంటలకు ప్రసంగిస్తున్నారు. వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ కె ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహిస్తున్నారు.

ఎ కృష్ణారావు

30 సంవత్సరాల తరువాత ఈ తరం జర్నలిస్టుకు తెలుసో లేదో చెప్పలేము. కనుక కృష్ణుడు మారిపోయిన ప్రమాణాల గురించి మాట్లాడవలసిందే కదా.

ఆతరం వారికి వరంగల్లు ప్రజాప్రియుడని తెలుసు. ఆనాటి స్వాతంత్ర్య యోధుడు, మరో ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, రాజ్యాంగం వచ్చిన తరువాత తొలి పార్లమెంట్ సభ్యుడు కీర్తిశేషులు పెండ్యాల చిన రాఘవరావు చెప్పిన మాటలు ఇప్పుడు ప్రస్తావించడం సమంజసం.

‘‘ఆచార్యో భవ... ‘‘జనధర్మ అయ్యగారు’’గా జనం నాల్కలపై నిలచిన అందరి తలలో నాల్కగ అభిమానం చూరగొన్న జగమెరిగిన ఎం.ఎస్‌. ఆచార్య జందెం వేయటం... కాదు గాని` చంద్రునికో నూలుపోగు- ఎడద సంద్రంలో ఒక పొంగు ప్రేమాభిమానాలు పెల్లుబికిన` ఆనంద వేళ-ఆచార్యా, స్వీకరించండీ! అభినందన! పేరున్న పెద్ద పత్రికలు మా వూరిని చిన్నచూపు చూసినప్పుడు, స్థానిక వార్తలకు స్థానం కరువైనప్పుడు, మీరు వెలిగించిన ఒక దీపశిఖ- మారుమూల గ్రామాల్లోని` ఈ నాటి ఈ మాత్రపు చైతన్యదీప్తికి ఆలంబనమైంది.’’

ఇదీ జనధర్మ, పేపర్ అయ్యగారు, పెద్దఅయ్యగారు అని అప్యాయంగా పిలుచుకున్న స్వతంత్ర యోధుడు, జర్నలిస్టు, వరంగల్ వాణి దినపత్రిక జనధర్మ వారపత్రికల ఎడిటర్ యం యస్ ఆచార్య. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత గొప్ప స్వాతంత్య్ర యోధుడు కీర్తి శేషులు పెండ్యాల చిన రాఘవరావు చెప్పిన మాటలు. ప్రత్యేకంగా ఎవరూ రాయలసిన అవసరం లేకుండా యం యస్ ఆచార్య జీవన ఉజ్జీవనం అనిపేంచే గాధ రాసింది చిన రాఘవరావు గారు. వరంగల్ జిల్లాలో ప్రముఖులైన స్వాతంత్య్రోద్యమ వీరులు ఉన్నారు. వారిలో గొప్ప వారు. రాఘవరావు. 1952లో తొలి ఎన్నికలలో రెండు శాసనసభ నియోజకవర్గాల్లో, పార్లమెంట్ సీట్ కూడా నిలిచి గెలిచిన మహానేత రాఘవరావు గారు.

‘‘ముప్పయ్యేళ్ల నాడు దిక్కు కోసం కొట్టుమిట్టాడుతున్న సామాన్యుల సాహిత్యోపజీవులకు మీ జనధర్మ నిజానికి పెద్దదిక్కే అయ్యి నిలిచింది కాకతీయుల ఈ గడ్డ- ఇంటింటిలోని ప్రతియింటి పాత చుట్టమైంది. పెద్ద పత్రికలు చేయలేని పనిని చిన్నపత్రికలు చేసి చూపించగలవు. అన్న సత్యాన్ని ఋజువు చేసిన ఘటికులు మీరు! తెలుగునాట ఓ కొత్త పత్రిక పుట్టడమే ఓ వింత! బట్టకట్టి పదికాలాలపాటు బతకటం మరింత వింత - అలాంటి అస్తవ్యస్తపు శూన్యావరణంలో ‘ఇదుగో నేనున్నానంటూ ఎగసివచ్చిన మీ జనధర్మ ఇవాళ ‘వరంగల్‌ వాణి’ దినపత్రికగా ఎదిగిపోవడం నేపధ్యంలో కష్టాల గడగండ్లను, చిరునవ్వుతో స్వీకరించే మీ స్థితప్రజ్ఞతః ‘వననూలి’ వంటి

నిరంతర రచనా వ్యాసంగ దీర్ఘా నిమగ్నత`

చెప్పకనే చెప్పే అక్షర సత్యాలు!

పట్టువదలని విక్రమార్కులు మీరు!

అనవరత జాగరూకతే- ప్రజాస్వామ్యం

సాఫల్యానికి రక్షః మనుగడకూ, అభిప్రాయ ప్రకటనా స్వేచ్ఛయే శ్రీరామరక్ష!

జర్నలిస్టులను తయారు చేసిన కళాశాల జనధర్మ వార పత్రిక, 1958 నుంచి 1994దాకా జీవించిన యం యస్ ఆచార్యగారు. వారు తయారు చేసిన వారిలో ఒక అశోక్ అనీ, నా పేరును చేర్చిన వారు.

‘‘ఎంతో ఉతృష్ట లక్ష్యంతో అలనాడు మీరు సాహసంతో వేసిన ముందడుగు ఇవాళ ఈ వెలుగుబాటలో ఎందరో -ఒక అశోక్‌, ఒక శ్రీధర్‌, మరెందరో? బౌద్ధిక లోకంలో, ప్రతిష్ఠనార్జించి, చరిత్ర సృష్టించిన పత్రికా రచనకు ఒరవడి దిద్దిన కాకతీయ ఉజ్వల తెలంగాణం మారుమూల గ్రామాల్లో సైతం సారస్వత పరిమళాలు వెదజల్లిన అడ్లూరి వారి ‘భాగ్యనగర్‌’- ఇవాళ ఇవి లేని లోటును తీర్చి, తర్వాత ఎన్నో పత్రికలకు మార్గం తీర్చి- తదుపరివార్త అచ్చులో పడాలనుకునే విలేకరి తహ తహ తన రచన ప్రముఖంగా కనిపించాలనుకునే వాళ్ల తపన అన్నిటికీ, అందరికీ అందుబాటులో మీ జనధర్మ! గ్రామీణ విద్యుత్‌ వినియోగదారుల అవస్థ విద్యారంగ అవ్యవస్థ కువ్యవస్థ ‘మూల్గేనక్క పై’ తాటిపండు పడ్డచందంగా పుండే నడ్డి విరిగిన రైతన్నల కడగండ్ల గాధలు: స్వాతంత్య్ర సమరయోధుల స్వీయగాధలు: సమస్యల చిత్రణ- భావచిత్రాలు- ఒకటేమిటి సకలకళా సమూహారంలా నడుస్తున్న చరిత్రకు అద్దం పట్టింది జనధర్మ, వరంగల్‌ వాణి- ‘జనవాణి’గా- ఏలికలకు హెచ్చరికగా-నిలచినాయి నేడు’’

అని రాఘవరావుగారు వివరించారు. రాఘవరావుగారు వరంగల్లులో జనధర్మకు తన స్వతంత్రపోరాట గాధను సీరియల్ గా అద్భుతంగా రచించారు. ఆరోజుల్లో రాఘవరావుగారి సీరియల్ చదవడానికి ఎందరో ఎదురుచూసేవారు. నేను ప్రెస్ లో కంపోజ్ చేస్తున్న రోజుల్లో రాఘవరావుగారు తన రచన భాగాలను స్వయంగా వచ్చి నాన్నగారితో గంటలకొద్దీ మాట్లాడుతూ ఉంటే నేనే కంపోజ్ ఆపేసి, మా చుట్టు ఉన్న వర్కర్లలకు కూడా ఒక్క అక్షరం కూడా వదలకుండా వినడం నాకు తెలుసు.

పెండ్యాల రాఘవరావు స్వాతంత్ర్య సమరయోధుడు, వరంగల్ జిల్లాలోని చిన్నపెండ్యాల గ్రామంలో 15 మార్చి 1917 సంవత్సరంలో జన్మించాడు. ఆయనను చినపెండ్యాల రాఘవరావు, అని చిన రాఘవరావు అంటారు. ఒక పార్లమెంట్ స్థానానికి గెలవడంతో పాటు, ఆ మొదటి ఎన్నికల్లో ఒక లోక సభకు రెండు శాసన సభల్లో ఒకే సారి గెలిచారు. రెండు రాష్ట్రస్థానాల్లో రాజీనామాచేశారు. 1952 సంవత్సరంలో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ తరపున మొట్టమొదటిసారిగా వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత పార్లమెంటుకు భారతీయ కమ్యూనిష్ఠు పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. శ్రీ పెండ్యాల రామచంద్రరావు గారి కుమారుడు. వరంగల్ ఉన్నత పాఠశాలలో చదువుకొన్నారు. ఇతడు Conversion Movement (1935-36) ను వ్యతిరేకించి, 1938లో కాంగ్రెసు సత్యాగ్రహంలో చేరారు. బ్రిటిష్ ప్రభుత్వం అందులకు రూ. 300 జరిమానాను విధించి ఖైదు చేసింది. తర్వాత ఆంధ్ర మహాసభలో చేరాడు. ఇతడు రజాకర్ల ఉద్యమాన్ని వ్యతిరేకించి Peoples Democratic Front సభ్యునిగా చేరాడు. 1952లో 1వ లోక్‌సభకు (వరంగల్లు నియోజక వర్గం, హైదరాబాద్ రాష్ట్రం) లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. యం యస్ ఆచార్య షష్టి పూర్తి సందర్భంలో 1988న ప్రచురించిప ఒక అభినందన సంచికలో రాఘవరావుగారు రచించిన ఆచార్య జీవనగాధ ఇది.

సూర్యాపేట నుంచి నెల్లికుదురు దాకా

నల్లగొండ సూర్యాపేట లో అమ్మగారి ఇంట్లో పుట్టిన యం యస్ ఆచార్య గారు వరంగల్లు నెల్లికుదురు ను పెరిగారు. అంటూ రాఘవరావుగారు

`అదృష్టవశాత్తు మీ బిడ్డలు సైతంవన్నె తెస్తున్నవారైనారు పత్రికా ప్రపంచానికి- అది చాలు మీ జన్మసార్థకతకు, ధన్యతకు! `ఈ ముప్ఫయ్యేళ్ళ మన స్నేహబంధాన్ని ఎట్లా మరచిపోగలను నేను! విశిష్టాచార సాంప్రదాయల కుదురు మీ నెల్లికుదురు! మీ మాడభూషణం వారి కుదురు విద్వత్తుకు కుదురు! ఎదుటి వారికి బెదురు! పండితులైన మా మాతగారి సరసన మీ తాతగారొకరు. ద్రావిడ ప్రబంధాల గోష్ఠి కాలక్షేపం చేస్తూ ఉండేవారని గుర్తు చేస్తున్నాను’’ అంటూ రాఘవరావుగారు పేర్కొన్నారు.

తన అభినందన రచనలో రాఘవరావు గారు ఈ విధంగా ముగించారు. ‘‘మిత్రా! మన మైత్రీబంధం జన్మాంతరాలదనీ, ఈ ప్రాంతం ప్రతి సామాజిక జీవన వృత్తంలో మీ ప్రమేయం లేని ` ఏ కార్యక్రమమూ, ఏ సత్కార్యమూ లేదేమో ` మాలోని ప్రతిభావ్యుత్పత్తుల మూలంగా ఇక్కడ ఏ ఒక్కరికీ ఏ మాత్రం మేలు జరిగినా ` అందుకు పరోక్షంగా కారణభూతులు మీరే. అందుకే ఆచార్యా! మీకీ అభినందనలు! ` శత సహస్ర మాసపూర్ణ జీవితం ` దైన్యమెరుగని జీవితం అని పెండ్యాల చిన రాఘవరావు అన్నారు. వందేళ్ల తరువాత గుర్తు చేసుకుంటున్నారు. తన జనధర్మ ఆగిపోతే 70 సంవత్సరాలలో 12 జులై 1994న ఆగిపోయింది.

(ప్రొఫెసర్ ఎం రాజగోపాలాచార్య, ఈరచయిత (ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్) కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇద్దరూ బంగారు పతకాలు సాధించడం ఆచార్యగారు సంతోషించడం మా అదృష్టం. ఆ ఇద్దరు కలిసి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య పేరున బంగారు పతకం నెలకొల్పడం మరో స్వర్ణావకాశం. ముఖ్యంగా రాజగోపాలాచార్య శిష్యుడైన కవి జర్నలిస్టు కృష్ణుడు ఆచార్య ప్రసంగించడం, ఈ రచయితతో కలిసి ఉదయం పత్రికలో సహపాత్రికేయుడు కావడం ఇంకో విశేషం)

Read More
Next Story