ఓటు చోరీ, రిగ్గింగ్‌ ఒకే తాను ముక్కలే...
x

ఓటు చోరీ, రిగ్గింగ్‌ ఒకే తాను ముక్కలే...

సుప్రీంకోర్టే ఈ ఓటు దొంగల గుట్టు రట్టు చేయటానికి పూనుకోవాల్సిన సమయమిది


-పాపని నాగరాజు

అనైతిక, అక్రమ విధానాలు, ఓట్లు దొంగలించి, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రపన్నుతుంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాపైన ఎన్నికల కమిషనే ఓట్ల చోరిలో భాగం కావడం దేశ సార్వభౌమత్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ముఖ్యంగా రాజ్యాంగాన్ని అపాహాస్యం చేయడమే అవుతుంది. ఈ అంశం నేడు ఈ అంశం ముందు చర్చించడానికి కారణం కర్ణాటక రాష్ట్రంలో 2024లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిన బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ స్థానంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌ ఓటర్ల జాబితాను ఆ పార్టీ పరిశీలించి గ్రహించిన ఓట్ల గల్లంతు విధానమే.
అంతేకాదు, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియ ద్వారా ఓటు జాబితాలోకి ఉన్న వారిని తీసివేసి, లేని వారితో నింపి, బీహార్‌ ఎన్నికలను దొంగ ఓట్లతో గెలవాలని చూడటమే. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. అదేమంటే, తొలగించిన లేదా చేర్చిన ఓటర్‌లలో ఏ కులం వారు అనేది. అయుతే ఈ నిజాన్ని ఎన్నికల కమిషన్‌ లేదా కేంద్ర ప్రభుత్వం బహిర్గతం పరచలేదు, వీరిని నమ్మలేం. ఎందుకంటే దొంగలు వీరే కనుక. అయితే ఈ అసలు దొంగల్ని బయటేయడానికి సుప్రీంకోర్టే ఈ ఇంటికి దొంగల గుట్టు రట్టు చేయటానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది.
మరో పక్క ఈ విషయాన్ని బహిర్గతపరిచిన కాంగ్రెస్‌ పార్టీ లేదా ప్రతిపక్షాలు వివిధ పౌర సంస్థలతో కలిపి ఏరకంగానైనా కానీవండి ఓట్ల దొంగతనంపై లేదా చేర్చినటువంటి ఓటర్ల జాబితాలో ఏ కులం వారు అన్న విషయాన్ని నెగ్గుతేర్చాల్సిన నైతికత వీరి మీదే ఎక్కువగా ఉంటుంది.
ఇదంతా ఉండగా, అన్ని ప్రతిపక్షా పార్టీలతో కలిసి ప్రజా ఆందోళనకు దిగటం అనేది గర్వించదగ్గది. పైగా ఈ స్థితిలో ఎన్నికల కమీషన్‌ పూర్తి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. ఒక రాజకీయ పార్టీ మాదిరిగా ప్రధాన ప్రతిపక్షానికి సవాల్‌ విసిరింది. అక్కడితో ఆగకుండా ప్రమాణ పూర్వకమైన ధృవీకరణ అయినా సమర్పించాలి లేదా దేశ ప్రజలకు క్షమాపణ అయినా చెప్పాలని సవాల్‌ చేసింది. అంతకు ముందు 2022 నవంబర్లో ఈవీఎం గోల్మాల్‌పై హర్యానాలోని పానిపట్‌ జిల్లా భువనలఖు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందుకు రీకౌంటింగ్‌ నిర్వహించాలని సుప్రీంకోర్టులో గ్రామ ప్రతిపక్ష నేత పిటిషన్ వేశారు. 13 సంవత్సరాల తర్వాత ఆ ఫిర్యాదు దారుడు గెలుపొందారు.
అయినా, బిజెపి నాయకత్వంలోని `ఎన్‌డిఏ కూటమి రాజకీయ విధానాలను బలంగా వ్యతిరేకించే పరిస్థితి నెలకొనడం శుభ పరిణామం. నిజానికి ఎన్డీఏ కూటమి మొదటిసారి చేపట్టినప్పడు ఇదే తరహాలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను మారుస్తామని కుట్ర చేసినప్పుడు దేశంలోని పౌర సంస్థలు, మేధావులు, వివిధ లౌకిక, ప్రజాస్వామ్యక శక్తులు, పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ కారులు, కుల నిర్మూలనవాదులు అందరూనూ పెద్ద ఎత్తున ప్రజాందోళనలు చేపట్టారు.
ఎన్డీఏనే కాదు అంతకు ముందు కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశంతో పాటు వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ, భూస్వామ్య, పాలక పార్టీలు తాము అధికారంలో రావడానికి తమ ప్రైవేటు సైన్యాల ద్వారా, ప్యాక్షనిస్టు గ్రూపులతో ఓటును రిగ్గింగ్‌ పేర దొంగిలించడం జరిగింది. ఇప్పుడు టెక్నాలజీ రూపంలో ఈవీఎంల ద్వారా ఓట్లను కొల్లగొడుతున్నారు. ఈ విషయం పట్ల దేశంలో ఉన్న జాతీయా, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు, ప్రజాస్వామ్య మేధావులు, పౌర సంస్థలు వ్యతిరేకించాయి. ఒక్కమాటలో అధికారంలో ఉన్న పార్టీలకు రాజ్యాంగ వ్యవస్థలే కొమ్ము కాసి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా సందర్భాలు కోకళ్ళలుగా మనం చూసాం. ఆయా పాలక పార్టీలు వాళ్లు అధికారం చేపట్టిన కాలంలో రిగ్గింగ్‌ చర్యలను చేపట్టడం తప్పని పునర్‌ సమీక్షించుకొని మరొక్కసారి పునరావృతం కాకుండా, పౌరుల హక్కులను కాపాడే నైతిక బాధ్యతను భుజాన వేసుకొని మాట్లాడాల్సింది.
ఈవీఎంలదే కాదు, ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలం కావడంతో అధికారంలోని పాలకులే అధికారాన్ని చేపట్టడం కోసం మొత్తం వ్యవస్థల్ని నాశనం చేస్తున్న పరిస్థితి ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచిన వయోజనుల ఓటు హక్కును హరించేటువంటి విష సంస్కృతికి ఎన్డీఏ కూటమి తెగబడటం అనేది దేశానికి నష్టదాయకం. మొత్తంగా దేశంలో పౌర సంస్థలను నిషేధించడం, ప్రశ్నించే వారిని అర్భన్‌ నక్సలైట్స్‌గా ముద్ర వేయడం, ఇలా అనేకంగా చేపట్టి మళ్లీ అధికారంలోకి రావాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
ఇక్కడ ప్రతిపక్షాలు కేవలం వాళ్ళ అధికార దాహం కోసం కాకుండా, పౌర సమాజ హక్కులని, లేదా రాజ్యాంగ విలువలని కాపాడాల్సిన బాధ్యత భుజానే చేసుకుంటే తప్ప వీరికి ప్రజల మద్దతు భారీ స్థాయిలో రావటం సాధ్యం కాదు. ఓటర్ల దొంగతనం గురించి ప్రతిపక్షాలు ఆరోపించినప్పుడు అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పాలన వ్యవస్థలో ఉన్న వారిపై ఉంటుంది. భారత ప్రజల ఓటు దొంగలించి అధికారం కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకోకూడదు.
సుమోటోగా స్వీకరించి ఈ ఎన్నికల విధానం మీద, భారత ప్రజల ఓటు హక్కును అమలు పరిచే విధానం మీద కేసును ఫైల్‌ చేసి విచారణ చేపట్టే అధికారం భారత ప్రధాన న్యాయస్థానానికి ఉన్నదన్న విషయం మరువలేనిది. ప్రజలకు ఆ మేరకు వాటి మీద గౌరవం ఉన్నది అంటే ప్రజల హక్కుల రక్షణ లాంటి పనిని చేపట్టినప్పుడు ఖచ్చితంగా ఉంటుందనేది మనం మర్చిపోరాదు.
ఈ ఓట్ల దొంగతనంపై నోరెత్తకుండా ప్రధానమంత్రి ఊరుకోవటం అనేక రకాల అనుమానాలకు దారితీస్తుంది. అధికారమే తమ లక్ష్యంగా పెట్టుకొని అనేక వివాదాలైన కులాల ` మతాల, తెగల మధ్యలో ఘర్షణలకు తెరలేపిన నరేంద్రుడీ లాంటి ప్రధానమంత్రి భారత ప్రజల అనుమానాన్ని నివృత్తి చేస్తారని అనుకోవటం అవివేకమే. ఓట్ల దొంగతనాన్ని సరిదిద్దటంలో ఈసీ పునర్‌ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దిద్దుబాటు చేయకపోవడం అనేది ప్రమాదం. ఈ దేశ ప్రజల హక్కులు పొందటం కోసం ఓటు ద్వారా వ్యక్తం చేసి సాధించుకునే నిర్ణయం ఉందన్న విషయం పాలకులు విస్మరించరాదు. ఈ దోంగతనం వలన ప్రపంచ దేశాలు మనదేశంకోసం చెడుగా మాట్లాడుకోవడంకు మన పాలన వ్యవస్థ రావడం కూడా మన దేశానికి కళంకితమే. దేశ ప్రతిష్టను దిగదార్చటమే.
ఈసికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన 300 మంది పార్లమెంటు ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం, అరెస్టు చేయడం నరేంద్ర మోడీ యొక్క భయానికి సంకేతాలుగా చూడవచ్చు. దేశంలో వివిధ రకాల ప్రజల పౌరుస్వామ్య హక్కులని పారదర్శకత్వంతో అమలు చేయటానికి సంసిద్ధులై ఉండాలి.
అధికారంలోకి వచ్చిన ప్రతి పాలక పార్టీ ప్రజలు వ్యక్త పరిచే అనేక విషయాలను దురుద్ద్దేశంతో కాకుండా దేశ సమగ్రతను కాపాడే దాంట్లో భాగంగానే చూస్తూ ఉండాల్సింది. ప్రశ్నించిన మనిషిని నక్సలైట్‌గా చూడటమే దుర్మార్గం. ఇది విస్మరించిన నాడు దేశం సుభిక్షంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగం చేసుకోవాలని సంకల్పం ఉన్నప్పుడు వాటి రక్షణకు బంగం కలిగించే రాజ్యాంగేతర శక్తులను ఎవరికివారుగా నియంత్రించుకోవలసిన ఆవశ్యకత ఉన్నదని ఈనాటి కాలాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది.
(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రయిచత సొంత అభిప్రాయాలు)
(రచయిత తెలంగాణ కుల నిర్మూలన వేదిక అధ్యక్షులు)


Read More
Next Story