
వక్ఫ్ టు రామేశ్వరం... మోదీ మనసులో ఏముంది?
“తిరుపతిలో అన్యమత ఉద్యోగులను కూడా తొలగించాలంటూ వక్ఫ్ కమిటీలలో వ్యూహాత్మకంగా ఇతర మతస్తులను నియమించడం ఎలా సమర్థనీయం?”
పార్లమెంట్ లో వక్ప్‌బిల్లు మీద హోరాహోరీ పోరాటం ఒక విషయాన్ని స్పష్టం చేసింది. రాజ్యాంగం 25 నుంచి 28 అధికరణాల వరకు మత స్వేచ్ఛకు ఇస్తున్న ప్రాథమిక హక్కుల పై దాడిగా ప్రతిపక్షాలు ఈ బిల్లును ఎదుర్కొన్నాయి. హోం మంత్రి అమిత్ షా, బిల్లును ప్రతిపాదించిన న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు ఇదేదో పేద ముస్లింలకు మేలు చేయడానికి తెచ్చినట్టు గొప్పలు పోయారు కానీ వారి భాష, ఇచ్చిన ఉదాహరణలు చూస్తే రాజకీయ కోణం తెలిసిపోయింది. ఈ పార్లమెంటు భవనం కూడా వర్క్ వక్ప్‌కిందకే వస్తుందని వారు వాదిస్తారని రిజుజు ముస్లింలనుఉద్దేశించి అన్నారు. చర్చను కాంగ్రెస్ వైపు మళ్ళించి దేశ ఆస్తులను ముస్లింలకు అప్పగించడం జరిగిందన్న దురభిప్రాయాన్ని కలిగించి మతాల స్పర్ధగా మార్చే అస్త్రమే ఈ చట్ట సవరణ.
వక్ఫ్‌బోర్డులో ని 22 మంది సభ్యులలో నలుగురు ముస్లి మేరతులు ఉండాలని నిర్ణయించటం నిస్సందేహంగా వారి మత భావాలను దెబ్బతీసే అంశం అవుతుంది. ఈ చట్టం ప్రకారం ఏది వక్ఫ్ ఆస్తి ఏది కాదు అని నిర్ణయించే అధికారం కోర్టులకు కాకుండా కలెక్టర్లకు ఇతర అధికారులకు ఇస్తున్నారు. రాష్ట్రపతి బిల్లును వెంటనే ఆమోదించేశారు గానీ ఈ లోపునే మహారాష్ట్ర ము ఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తమ రాష్ట్రంలో వేలాది అక్రమ వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని తీరతామని హెచ్చరిక చేశారు.
తిరుపతిలో అన్యమత ఉద్యోగులను కూడా తొలగించాలంటూ ఇక్కడ మాత్రం వ్యూహాత్మకంగా ఇతర మతస్తులను నియమించడం పరస్పర విరుద్ధం. దేవాలయాలను పూర్తిగా మత సంస్థలకు అప్పగించాలంటూ ఇటీవల విజయవాడలోనే భారీ సమీకరణ జరిగింది, కులమత లింగ వివక్ష లేకుండా పౌరులందరూ ఒకే హక్కులు కలిగి ఉండటం ప్రజాస్వామ్యం కనుక రక్షణలు ఎప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్న వారికే కల్పించబడతా కల్పించబడతాయి భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యత సామరస్యం భవిష్యత్తు భద్రతకు అత్యవసరమని అరక్షణమైన మర్చిపోకూడదు.రాజ్యాంగం మైనారిటీ మతాలకు ప్రత్యేక రక్షణ కల్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థ బాధ్యత గుర్తించడం, దేశ సమైక్యతను కాపాడుకోవడం కోసమే.
ఆ ప్రాథమిక సత్యాన్ని తలకిందులు చేసే రాజకీయమే ఇప్పుడు దశలవారిగా జరుగుతున్నది. ముస్లింలు క్రైస్తవులు హిందువులు ఎవరైనా భారతీయులైనన్న రాజ్యాంగ స్పృహను దెబ్బతీసేలా ముస్లిం సంస్థల ఆస్తులు వశపరచుకోవటం పెద్ద విజయం లాగా చూపించటం బీహార్ యుపి కేరళ, బెంగాల్ గుజరాత్ వరుసగా వచ్చే ఎన్నికల కోసం నడిపించే ఓట్ల రాజకీయమే. దీని తర్వాత క్రైస్తవ చర్చి ఆధీనంలో వక్ఫ్ కన్నా ఎక్కువ ఆస్తులున్నాయని అప్పుడే మాట్లాడ్డం ప్రారంభించారు.వాస్తవానికి ఈ విషయమై ఆరెస్సెస్ అధికార పత్రిక ఆర్గనైజర్‌లో వ్యాసం వేశారు కూడా.కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, లోక్‌సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీల విమర్శల తర్వాత హడావుడిగా ఉపసంసహరించుకున్నారు.2019లో బిజెపి రెండో సారి అధికారంలోకి రాగానే కాశ్మీర్ 370 అధికరణం రద్దుకు పాల్పడటం వెనుక ఏ వ్యూహం ఉందో మూడోసారి నెగ్గాక వక్ఫ్‌మీద దాడి కేంద్రీకరించటం వెనకా అదే వుంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మొదటిసారిగా వైసిపి,అలాగే బిఆర్‌ఎస్ ఈ బిల్లుపై బిజెపి కి వ్యతిరేకంగా ఓటు చేయడం విశేషం. బిల్లు ఆమోదం పొందాక ఇది చారిత్రిక మూలమలుపు అని ప్రధాని నరేంద్ర మోదీ లాగూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రకటన విడుదల చేయడం యాదృచ్చికం కాదు. దక్షిణాది సీట్ల తగ్గింపు, వక్ఫ్ బిల్లు రెండు విషయాల్లో వ్యవహరించిన దాన్నిబట్టి చూస్తే టిడిపి అధినేత చంద్రబాబు మోదీని ఏ మాత్రం వ్యతిరేకించరాదని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుందని హిందూ ప్రత్యేక వ్యాసం ప్రచురించింది.
ఇటీవల తిరుపతిలో జరిగిన పరిణామాలు, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ మరణం పై సాగుతున్న వివాదం విద్వేషపూరిత వ్యాఖ్యలు అన్నీ గమనిస్తే చాప కింద నీరులా తెలుగు రాష్ట్రాల్లోనూ మత రాజకీయాలు చొరబడుతున్న తీరు తీరు కళ్ళకు కడుతుంది. ఇక్కడ బిజెపి పెద్ద శక్తి కాకపోయినా వామపక్షాలు ఎక్కువ కేంద్రీకరిస్తున్నాయంటూ మాట్లాడే వాళ్లకు ఈ పరిణామాలే హెచ్చరికలవుతాయి. వక్ఫ్ బిల్లును గజెట్ అయ్యాక సుప్రీంకోర్టులో సవాలు చేస్తామంటున్న నేపథ్యం ఒకవైపుంటే అటు నుంచి మతపరమైన స్పందనలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సిందే
నాగపూర్ టు రామేశ్వరం..
ఈ బిల్లుకు కాస్త ముందుగా మార్చి 30న ప్రధాని నరేంద్ర మోదీ - పదవి చేపట్టిన తర్వాత 11 ఏళ్లకు- నాగపూర్ లోని ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించటం- బిల్లు గెజెట్ అయిన మరురోజే రామనవమికి రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జి ప్రారంభించి అయోధ్యతో ముడిపెట్టడం ఒక వ్యూహంలో భాగమే. ఔరంగజేబు సమాధికి సంబంధించిన నాగపూర్‌లో ఆ కార్యాలయానికి దగ్గర్లోనేలోఅల్లర్లు జరగటం, కాశీ మధురల్లో మసీదు మందిర వివాదాలలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పాల్గొనవచ్చు నని దాని కీలక నాయకుడైన దత్తాత్రేయ హూసబ్లే కాషాయ జెండా వూపడం ఒక వరస లోనే జరిగాయి. మోదీ నాగపూర్ లో ఆర్‌ఎస్‌ఎస్ మూల స్తంభాలైన హెగ్డేవార్,గోల్వాల్కర్ల స్మృతి చిహ్నాలను సందర్శించటం అలానిర్ణయించుకున్నదే. గతంలోవాటిని సందర్శించిన ప్రధానమంత్రి వాజపేయి మాత్రమే. తొలుత ఆర్‌ఎస్‌ఎస్ ప్రచాంక్‌గా బయలుదేరిననరేంద్ర మోదీ ఈ 11 ఏళ్లలో అక్కడికి వెళ్లిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడే ఎందుకు వెళ్లారు?ఆర్‌ఎస్‌ఎస్ తమను ఎంతగా ఉత్తేజపరిచిందో ఎందుకు చెప్పారు? ఈ మొత్తం పరిణామాలలో పెద్ద రాజకీయమే వుంది.
మోదీవ్యక్తిగత నాయకత్వ శైలి సంఘపరివార్ పెద్దలకు నచ్చలేదంటూ వచ్చే కథనాలు పరివార్ పాచికలు మాత్రమే. ఆర్‌ఎస్‌ఎస్ సాంస్కృతిక సంస్థ మాత్రమేనని బిజెపి ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం లేదనేభ్రమను కొనసాగించే ఎత్తుగడ అది. మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన మంత్రివర్గం మొత్తం శాఖల వారీగా ఆర్‌ఎస్‌ఎస్ ముందు సమీక్షకు హాజరైందరి మర్చిపోకూడదు. 2024 ఎన్నికలకు ముందు దేశానికి హిందూత్వ సంకేతం ఇవ్వడం కోసంగత అయోధ్యలో రామ మందిరం సంప్రోక్షణ కార్యక్రమానికి మోదీ తోపాటు ప్రస్తుత ఆర్‌ఎస్‌ఎస్ సద్నేత మోహన్ భగవత్ కూడా హాజరయ్యారు. సంబంధం ఉందని లేదని రకరకాలుగా చెప్పడం నిరంతర తతంగమే.
మోదీ ప్రస్తుత పర్యటనసంస్థతో రాజీ వంటిదని కొందరు ఇస్తున్న వివరణ అర్థం లేనిది. అసలు అవి ఎప్పుడు దూరంగా ఉన్నాయి?ఒకప్పుడు వాజపేయినే ఈ మాట అన్నారు- మేము విడిపోయిందెప్పుడు అని. 2024లో మెజార్టి రాలేదుగనక మోదీని మార్చాలని ఆరెస్సెస్ భావిస్తున్నందునే ఆయన సర్దుబాటు కోసం వచ్చారని శివసేన ఎంపి సంజయ్ రౌత్ అపహాస్యం చేస్తే నాలుగోసారి కూడా మోదీనే ప్రధాని అని మ హారాస్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కుండబద్దలు కొట్టడంలో సంకేతం అదే. ఒక హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు అవకాశంగా తీసుకుని మోదీ సర్కార్ ఇటీవలే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపెఆరెస్సెస్‌లో పాల్గొనడంపై ఎత్తివేసింది. చట్టపటాలు వేసుకొని తిరిగే అవకాశం తనకు తానే ఇచ్చుకుంది.
బిజెపి సొంతశక్తితో ఎదిగింది కనుక గతంలో వలె ఆర్‌ఎస్‌ఎస్ సహకారం అవసరం లేదని ఎన్నికలకు ముందు ఒక ఇంటర్వ్యూలో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డావ్యాఖ్యానించడం నిజమే. తాను ఏదో దైవ కార్యం నిర్వహించడానికి పంపబడినట్టు అనిపిస్తుంది తప్ప సాధారణ జీవపదార్థంతో వున్నట్టు అనుకోనని మోదీ అప్పుడే మరోసందర్భంలో చెప్పారు. ఈ రెండు ప్రకటనలు ఆర్‌ఎస్‌ఎస్ వారికి నచ్చలేదనీ చాలా కథనాలేనడిచాయి.
ఎన్నికలలో బిజెపి స్వంతంగా మెజారిటీ కోల్పోయి 243 స్థానాలకు పరిమితమైనాక మోహన్ భగవత్ ఎవరైనా తాము సేవకులమనే భావన మరచి దైవ స్వరూపులమని అహంకరించడం ప్రారంభించినప్పుడు దెబ్బతింటారని అన్నారు. మామూలుగానే ఆర్‌ఎస్‌ఎస్ అధినేత కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తమ కేంద్ర కార్యాలయం నుంచి సూక్తులు వినిపిస్తుంటారు. నిజంగా చెప్పాలంటే సనాతన సంప్రదాయంలోనూ మొదట దశలో రాజును దైవ ప్రతినిధిగా చెప్పి ,తర్వాత నేరుగా దేవుడు గానే అభివర్ణించడం చూస్తాం అటు రాజ్యం ఇటు మతం కూడా రాజు చేతుల్లోనే ఉండటానికి అది మార్గం. మతాధిపతులు సంధాన కర్తలుగా రాజ్య వ్యవస్థకు అనుగుణంగానే తమ పాత్ర నిర్వహించేవారు. ఇప్పుడు మోదీ భగవత్ ల సంభాషణ అచ్చంగా అదే చెప్తుంది. ఈ ప్రక్రియ ప్రహసనం ఇలా సాగుతూనే వుంటాయి.
పవన్ స్పెషల్ రోల్
కాశీ మధుర మసీదు మందిర వివాదాల్లో ఆరెస్సెస్ కార్యకర్తలు పాల్గొనవచ్చునని దత్తాత్రేయ హోసబులే చేసిన ప్రకటనతోబట్టి సంఘపరివార్ ఆ వివాదాలను తీవ్రం చేయాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయోధ్య కాశి మధుర మూడు చోట్ల వివాదాలపై ఉద్యమించాలని తాము గతంలోనే అధికారికంగా నిర్ణయించామని హోసబ్లే గుర్తు చేస్తున్నారు. 1991 ప్రార్థన స్థలాలు చట్టం ప్రకారం అయోధ్య మినహా మరి ఎక్కడ ఇలాంటి వివాదాలకు ఆస్కారం ఉండదు. 1947 ఆగస్టు15న ఆయా ప్రార్ధన స్థలాలలో ఉన్న యధాతధ స్థితిని కొనసాగించవలసి ఉంటుందని ఆ చట్టం స్పష్టం చేస్తోంది. అయినా సుప్రీంకోర్టు కూడా ఇలాంటి పిటిషన్లను విచారణకు స్వీకరించి వివాదాలకు అవకాశం ఇచ్చింది. వక్ఫ్ బిల్లు నేపథ్యంలో ఇక ప్రతి చోటా వివాదాలు మొదలు కావచ్చు. ఇదేదో ఉత్తరాది సమస్య తప్ప దక్షిణాన అందులో తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి వుండబోదని ఎవరైనా అనడం హాస్యాస్పదం.ఎందుకంటే ఆలయాల వివాదాలు మతాల తేడాలు కీలకంగా మాట్లాడే సనాతన వాద నేతగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. తమిళనాడులో అన్నాడీఎంకే మళ్ళీ బిజెపితో చర్చలు ప్రారంభించడం ఒకటైతే పవన్ కళ్యాణ్ తమిళంలో ఇంటర్వ్యూలిస్తూ అక్కడ కూడా రాజకీయంగా ప్రచారానికి హడావుడి పడుతున్నారు.
మీ కన్నా మేమే సనాతన ధర్మానికి ఎక్కువగా కట్టుబడి ఉన్నామని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణం పై సందేహాలు సంవాదాలను కేవలం వైసిపి టిడిపి తగాదాగా ఘర్షణగా చూపించే ధోరణిలో మంత్రి లోకేశ్ తీవ్ర హెచ్చరికే చేశారు, తెలంగాణలో బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ వంటి వారు దూరంగా ఉన్నట్టు మాట్లాడుతూనే ప్రతి సందర్భంలో మతాలు మధ్య చిచ్చు రాజేస్తూన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ మాటలు సరేసరి. వక్ఫ్‌నుంచి టీటీడీ వ్యవహారాల వరకూ,నాగపూర్ నుంచి రామేశ్వరం వరకూ ప్రతిదీ వివాదాస్పదమై మత రాజకీయాలను మన ముంగిట్లోకి తెచ్చి నిలబెడుతున్నదని గ్రహించవలసి వుంటుంది.