టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లా నిష్క్రమణ ఏం సూచిస్తుంది?
x

టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లా నిష్క్రమణ ఏం సూచిస్తుంది?

రాజకీయాల్లో జరిగేది ఆటలకు ఎందుకు అంటగడుతున్నారు?


వచ్చే నెలలో భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ జరగబోతోంది. అందుకు వివిధ జట్లు తమ సన్నాహాలను ముగింపు దశకు తీసుకొచ్చాయి. ఆస్ట్రేలియా తమ జట్టు ఫాస్ట్ బౌలింగ్ దళానికి నేతృత్వం వహిస్తున్న కెప్టెన్ కమిన్స్, హజల్ ఉడ్ కు ఉన్న ఫిట్ నెస్ సమస్యలు వారి ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.

దక్షిణాఫ్రికా జట్టు గాయాల బారిన వారు కోలుకోవడం గురించి ఆలోచిస్తోంది. ఇంగ్లాండ్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఇలా టాప్ జట్లన్నీ కూడా తమ ప్రణాళికలకు తుది రూపునిస్తున్నాయి. కానీ కొన్ని రాజకీయ కారణాలు ఇప్పుడు క్రికెట్ ను లైమ్ లైంట్లోకి తీసుకొచ్చాయి.

రాజకీయ ఆధిపత్యాలు..
ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు క్రికెట్ తో పూర్తి స్థాయి సంబంధం లేనివి. ముఖ్యంగా బంగ్లాదేశ్ నిష్క్రమణ, స్కాట్లాండ్ ఎంట్రీ, తరువాత పాకిస్తాన్ కూడా బెదిరింపులకు దిగడం వంటి వాటిలో క్రీడలకంటే రాజకీయాలే ఆధిపత్యం వహించాయి.
క్రికెట్ నే మతంగా ఆరాధించే దేశాలలో రాజకీయ, భౌగోళిక కారణాలు ఉద్రిక్తంగా ఉండటంతో అవి ఆటలను నాశనం చేస్తున్నాయి. సాధారణంగా క్రికెట్ లో బెస్ట్ ఈవెంట్ గా భరించే వాటిలో జట్ల వ్యూహాలు, అంచనాలపై దృష్టి పెట్టాలి. ఫామ్, ఆటగాళ్ల ఎంపిక, తుది జట్లు ఇవే చర్చల్లో ఉండాలి. కానీ ఎప్పుడు లేనిది ఇప్పుడు జరుగుతోంది.
బంగ్లాదేశ్ తొలగింపు..
ఈ అంతరాయానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి నాటకీయంగా నిష్క్రమించడం వివాదానికి ప్రధాన కారణం. సంఘటనలన్నీ ఇప్పుడు అందరికి తెలిసిందే.
భద్రతా సమస్యలను పేర్కొంటూ బంగ్లాదేశ్ భారత్ కు రావడానికి నిరాకరించింది. అనేకసార్లు చర్చల తరువాత కూడా ఇవి కొలిక్కిరాలేదు. తాము ఆడబోయే వేదికలను వెంటనే మార్చాలని కూడా ఐసీసీ అభ్యర్థించింది.
అయితే ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. బంగ్లాదేశ్ రానట్లయితే ఆ స్థానంలో క్వాలిఫైయర్ లో తరువాత స్థానంలో ఉన్న స్కాట్ లాండ్ ఆడుతుందని ప్రకటించింది.
ఆధునిక క్రికెట్ చరిత్రలో ప్రపంచకప్ నుంచి ఓ టెస్ట్ హోదా దేశాన్ని తొలగించడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయాన్ని అనేకమంది విమర్శించారు. బంగ్లాదేశ్ పరిస్థితిని తప్పుగా అంచనావేసిందా? దాని ఆటగాళ్ల భద్రతకు ప్రమాదమా? ఇది కూడా చర్చకు దారితీసింది. బోర్డుల రాజకీయం ఎలా ఉన్న ఆటగాళ్లకు ఇది తీరని నష్టం.
ముఖ్యంగా యువ ఆటగాళ్లకు ప్రపంచకప్ అనేది ఓస్వప్నం. మరోసారి ఈ అవకాశం వస్తుందో రాదో చెప్పలేరు. ఇందుకోసం వారు సంవత్సరాల తరబడి సన్నద్దత, ఎంపిక, వేసుకున్న ప్రణాళికలు అన్ని కూడా ఒక్క ప్రతిష్టంభనతో ముగిసి పోయాయి.
అభిమానులకు నిరాశే..
స్కాట్లాండ్ చేరిక అసోసియేషన్ క్రికెట్ కు అర్హమైనది. ఉత్తేజకరమైనది, అయినప్పటికీ ఇది అనివార్యమైన పరిస్థితి. వారి రాక సరైన పద్దతిలో రాలేదని నిరూపిస్తుంది. ఇది బంతి రాకముందే టోర్నమెంట్ స్వరూపాన్ని నియంత్రిస్తుంది.
ఇది అనిశ్చితి ఇక్కడితో ఆగలేదు. పాకిస్తాన్ క్రికెట్ నాయకత్వం బంగ్లాదేశ్ కు సంఘీభావం ప్రకటించింది. తాను కూడా రాను అన్నట్లు వ్యవహరించింది. ఇది కూడా క్రికెట్ ప్రపంచంలో ఆందోళన రేపింది. సమఉజ్జీల మధ్య పోరాటం అనేది ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది.
క్రికెట్ మతంగా భావించే ప్రాంతాలలో క్రికెట్ అనేది లివింగ్ రూములు, హస్టల్లు, టీ స్టాళ్లు, అర్థరాత్రి చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ సందడి మసకబారింది. భౌగోళిక రాజకీయాలు, సంక్షోభాలు, యుద్దాలు అస్థిరతతో ఇప్పటికే ప్రపంచం కుంగిపోయింది. క్రీడలను ఆస్వాదించడానికి చాలా తక్కువ సమయం ఉంది.
ఇంతకుముందు 1996 లో ఆస్ట్రేలియా, వెస్టీండీస్ లు శ్రీలంకలో పర్యటించడానికి నిరాకరించాయి. దీనిఫలితంగా పోటీ విశ్వసనీయత దెబ్బతింది. ప్రసార విలువలు ప్రభావితం అయ్యాయి. 2025 లో జరిగిన హైబ్రిడ్ ఆసియా పోటీలు కూడా ఖర్చులు పెంచాయి.
ఆర్థిక నష్టాలు..
ప్రతి ఎపిసోడ్ లోనూ నష్టాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ను మినహయించడం దాని క్రికెట్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం కలిగిస్తుంది. ప్రపంచకప్ నుంచి నిష్క్రమించడంతో బోర్డుకు వచ్చే రుసుములు కోల్పోతుంది.
జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వచ్చే వార్షిక ఆదాయంలో 60 శాతం ఐసీసీ నుంచే వస్తోంది. ఇది దాదాపుగా 27 మిలియన్ డాలర్లుగా ఉంటుంది. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపుగా 250 కోట్లకు సమానం.
ఈ నిధులు దేశీయ పోటీలు, మౌలక సదుపాయాల అభివృద్ధికి మద్దతు ఇస్తాయి. టోర్నమెంట్ ముగిసిన చాలాకాలం తరువాత కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇది కేవలం బంగ్లాదేశ్ క్రికెట్ కే కాదు.
క్రికెట్ వీక్షించే బంగ్లా అభిమానుల మద్దతును కోల్పోతాయి. బ్రాడ్ కాస్టర్ల ఆదాయంలో కూడా కోత పడుతుంది. స్పాన్సర్లు కూడా తమ ఖర్చును తగ్గించుకుంటారు. ఇది క్రికెట్ పర్యావరణ మొత్తానికి పాకుతుంది.
ఈ పరిస్థితిలో కలవర పెట్టే అంశంలో ముఖ్యమైన అంశం ఏంటంటే.. దక్షిణాసియాలో క్రికెట్ చాలాకాలంగా తన మార్క్ ఈవెంట్ లను క్రీడేతర ఒత్తిడి నుంచి రక్షించుకోవడానికి కష్టపడుతోంది. ఇక్కడ క్రికెట్ ఎప్పుడూ కేవలం ఆటకాదు. ఇది దౌత్యం, అధికారంతో ముడిపడి ఉంది.
క్రికెట్ వెనక్కి వెళ్లిపోయింది..
క్రికెట్ లోకి ఇప్పుడు తరుచుగా రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఐసీసీ ముందున్న సవాళ్లు ఏంటంటే నియమాలను అమలు చేయడం మాత్రమే కాదు. పారదర్శకంగా, స్థిరంగా ఉండే చట్రం ద్వారా వాటిని వర్తింపజేయాలి.
2026 ఎడిషన్ లో 20 జట్లు పాల్గొనడంతో ఆట కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ప్రపంచకప్ కు ముందు రోజులు ఉత్సాహం కంటే గందరగోళంతో నిండిపోయింది. మొదటి బంతి వేసిన తరువాత ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.
టీ20 క్రికెట్ అంటేనే ఉత్కంఠభరితంగా ఉంటాయి. కొత్త హీరోలు, జట్లు ఉద్భవిస్తాయి. కానీ ఇక్కడ ఆటకంటే ఆటేతర విషయాలు ప్రాధాన్యం దక్కడమే ఆందోళనగా ఉంది.
( ది ఫెడరల్ అన్ని వైపుల నుంచి అంశాలను గౌరవిస్తుంది. ఫెడరల్ ఒక వేదిక మాత్రమే. వ్యాసంలోని సమాచారం, అభిప్రాయాలు కేవలం రచయితకు సంబంధించినవి. ఇవి ఫెడరల్ అభిప్రాయాలను తప్పనిసరిగా ప్రతిబింబిచవు)
Read More
Next Story