జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎందుకు ఉపరాష్ట్రపతి కావాలంటే...
x

జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎందుకు ఉపరాష్ట్రపతి కావాలంటే...

అన్నిటికన్నా మిక్కిలి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ప్రజాస్వామ్య ప్రియులు.

సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించడంతో ఆయన పేరు ఊరు ప్రాంతం ఒక్కసారి మీడియాలో పతాక శీర్షికలలో ప్రధానంగా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా,అస్సాం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు జస్టిస్ గా పదవి విరమణ అనంతరం గోవా లోకాయుక్తగా పనిచేసినా ఆయన విధులు నిర్వహించిన అన్ని పదవులకు అరుదైన వన్నెతెచ్చారు. ఆయన వెలువరించిన తీర్పులను గమనిస్తే సుదర్శన్ రెడ్డి ప్రజా దృక్పథం ఆయన దార్శనికత వ్యక్తిత్వం విలువలు నిబద్ధతలే ఏరి కోరి ఆయనళు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించారనిపిస్తుంది. న్యాయమూర్తి గా ఆయన సేవలలో స్పష్టత నిమగ్నత ప్రస్ఫుటమవుతుంది.

సుదర్శన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామంలో 1946లో సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. హైదరాబాదులో ఉన్నత చదువులు చదివి ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1971లో న్యాయ శాస్త్రం పూర్తి చేసి హైదరాబాద్ హైకోర్టులో అడ్వకేట్ గా ఎన్రోల్ చేసుకొని అనతి కాలంలోనే వకీలుగా పేరు ప్రఖ్యాతులు గడించాడు . అంచలంచెలుగా ఎదిగి 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు. ముఖ్యంగా ఆయన ఎన్నో కీలకమైన తీర్పులు ఇచ్చినా ముఖ్యంగా చతిస్గడ్ లో ఆదివాసి యువకులతో నిర్మించిన ప్రైవేటు వ్యవస్థ సాల్వాజుడుం విషయంలో సుప్రీమ్ కోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన విలక్షణ తీర్పు మిక్కిలి ఎన్నదగినది. ఆ తీర్పును చదివితే అందులో ఆయన ఉల్లేఖించిన అనేక రాజనీతిజ్ఞుల మరియు న్యాయ కోవిదుల ఉటంకింపులు చూస్తే ఆశ్చర్యము కాదు తద్వారా ఆయన ప్రజా దృక్పథం స్పష్టంగా కనబడుతుంది.

గత దశాబ్దంగా దేశంలో రెండు పరస్పర విరుద్ధ భావనల ఘర్షణలు రాజకీయ రాజకీయ రంగం వేదిక మీద రక్తి కట్టిస్తున్నారు. ఒకటి సనాతన ధర్మం హిందూజాలం అయితే మరొకటి భారత దేశ రాజ్యాంగ స్ఫూర్తి ఆధారంగా విలువల భావజాలాలు 78 ఏళ్ల భారతీయ స్వాతంత్ర్య దేశంలో ముందు ఎప్పుడూ లేనంత ప్రజలలో విస్తృత ప్రచారం సంఘర్షణలు చోటు చేసుకున్నాయి . ప్రజాస్వామ్య దేశంలో అధికార పక్షం ప్రతిపక్షాలు ఒకరికొకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం పరిపాటి. ఉన్న రాజకీయ పార్టీల అధినాయకులు ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడిన మాటలకు ఆయా పార్టీలు మేనిఫెస్టో లలో చేసిన వాగ్దానాలకు అధికారం చేపట్టాక వందన ఉండదు సామ్యము ఉండదు. ప్రజలు కోరుకున్నట్టు కాకుండా పాలకులు తాము తమను వెనుక వెన్నుదన్నుగా ఉండి నడిపిస్తున్న వారికి అనుకూలంగా పాలన కొనసాగుతుంటుంది .చట్టాలు చేపడుతుంటాయి. ప్రపంచీకరణ తీసుకొచ్చిన అత్యంత దుష్పరిణామాలలో ఒకటి క్విడ్ ప్రోకో సంస్కృతి చేరినది చేరినది. ఇది మన దేశంలోని రాష్ట్రాలలో ,కేంద్రంలో ప్రభుత్వొలు ఏర్పరిచి వారు తీసుకునే నిర్ణయాల తీరుతెన్నులలో ప్రజా వ్యతిరేక విధానాలు గోచరమవుతుంటాయి. రాజ్యాంగ పీఠికలో రాసుకున్న పాఠ్యాంశాన్ని పాలకులు అప్పుడప్పుడు వల్లే వేస్తుంటారు కానీ ఆచరణలో దానికి పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తుంటారు.

రాజ్యాంగం ద్వారా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల అనేక విభాగాలలో రాజకీయ జోక్యం పరోక్షంగా ప్రభావితం చేస్తున్నది. మన రాజకీయ వ్యవస్థ దీన్ని ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు కాక కానీ ప్రజల అవగాహన లోకి మెంటది వెంట తెలియ వస్తున్నది. దీనికి దేశంలో జరిగిన అనేక సంఘటన ఉదాహరణలు చెప్పవచ్చును. విచిత్రంగా దేశ సరిహద్దులను రక్షించే భద్రత దళాలను ఈ మధ్యకాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలపై ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.

ఇటీవల న్యాయస్థానాలు,మీడియా, కార్యనిర్వహణ విభాగాలు వీటన్నిటికీ అతీతంగా సర్వ స్వతంత్రంగా పనిచేయడం అంత సులభమైన విషయమేమి కానేరదు . అలా ఏం మేధావవులైనా ప్రజలైనా కోరుకుంటూ వారికి తీవ్ర నిరాశ మిగులుతుంది .

వందేళ్ల పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దాని నాయకులు ఇటీవల దేశ వాస్తవ ముఖచిత్రం గుర్తించి సామాజిక కులగణన అన్ని రంగాలలో ఆయా వర్గాల ప్రాతిపదికన ఫలాలు అందాలని అందించాలని అనతి కాలంలో రాహుల్ గాంధీ నేర్చుత్వంలో ఒక శక్తివంతమైన ఉద్యమంగా రూపాంతరం చెందనున్నది . ఆ ఉద్యమం ఫలనాలు ప్రతిఫలనాలు ఇటీవల దేశ రాజకీయ ముఖచిత్రంలో ప్రధాన ఎజెండాగా క్రమంగా మార్పు చెందుతున్నది. ఇది ఒక విధమైన ప్రజలకు శుభ పరిణామం కానున్నది.

దేశం ఇప్పుడు భిన్న దృక్పథాల మధ్య రాజకీయ రంగం ఒక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది.అది ఒకరు రాజ్యాంగ పరిక్షకులుగా మరొకరు రాజ్యాంగ వ్యతిరేకు వర్గాలుగా చీలిపోయాయి. దేశ రాజకీయ రంగమంతా చిందరవందరగా అగుపిస్తున్నది . ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా చేర్పులు మార్పులు కూర్పుల మీద తీవ్ర ఆరోపణలు ఇండియా కూటమి నాయకులు ఆధారాలతో పాటు ప్రజాక్షేత్రంలో ఓటర్లకు అర్థం చేయించే ప్రయత్నం నిరంతరంగా చేస్తున్నది .

ఇటువంటి నానుమాల పడిన రాజకీయ వాతావరణంలో అధికార పార్టీ ఎన్ డి ఏ తరఫున ఆర్ఎస్ఎస్ అభ్యర్థి నిలబెడితే,ఇండియా కూటమి తరపున న్యాయశాస్త్ర కోవిదులు దార్శనికుడు న్యాయ శాస్త్ర రాజ్యాంగ నిపుణుడు ప్రజా దృక్పథం కలిగిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని బరిలో నిలిపారు. అంతే కాకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక రంగంలో తనదైన పాత్రా, గురుతరమైన బాధ్యతలు నిర్వర్తించారు . అన్నిటికన్నా మిక్కిలి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ప్రజాస్వామ్య ప్రియులు.

గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు నీలం సంజీవరెడ్డి అధ్యక్షుడిగా పోటీ పడినప్పుడు తన అంతరం ఇప్పుడు వి వి గిరిని పోటీలో నిలిపి ఆత్మ ప్రబోధం ప్రకారం ఓటు వేయమని కోరారు. గతంలో వలె ఇప్పుడు ఆత్మ లేని నాయకులకు ఆత్మ ప్రబోధాలు విచక్షణలు కలిగి ఉంటాయని కాంక్షించడం అంత ఉపయోగకరమైనది కాదు. ఇప్పుడు ఒక్క మెజారిటీ మైనారిటీ పార్లమెంటు సభ్యుల బలాబలాలే పనిచేస్తాయి.ఉపరాష్ట్రపతి ఎన్నికలలో గెలుపు ఓటములు సమస్య ప్రధానం కాదు.గ ప్రజాస్వామ్యం ,రాజ్యాంగ పరిరక్షణను ఇండియా కూటమి ఎన్నికలలో సమర్థవంతమైన ప్రచార అస్త్రంగా చేయబోతున్నది.. క్రమంగా ఈ ఎన్నికలలు రాజ్యాంగ పరిరక్షకులకు రాజ్యాంగ వ్యతిరేకులకు మధ్య పోరుగా మారనున్నాయి.

Read More
Next Story