భారత రాజ్యాంగం తిరగరాయాలనేదెవరు, ఎందుకు? (1)
x

భారత రాజ్యాంగం తిరగరాయాలనేదెవరు, ఎందుకు? (1)

దేశంలో ఎపుడూ లేనంతగా ఇపుడు భారత రాజ్యాంగం చర్చనీయాంశమయింది. ఈ చర్చను న్యాయశాస్త్ర నిపుణుడు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ విశ్లేషిస్తూ రాస్తున్న వ్యాసాలివి


ప్రధానమంత్రి చెప్పినా, ప్రతిపక్షనాయకుడు చెప్పినా ‘‘హమేఁ సంవిధాన్ కో బచానా హై’, అంటే మనమంతా మన రాజ్యాంగాన్ని మనమే రక్షించుకోవాలి అన్నదే నినాదం,. ఎన్నికలకు ముందు, 30 మే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన రాజ్యాంగానికి ప్రమాదం ముంచుకొస్తున్నది’ అని ఎన్నికల సభలలో ప్రసంగించారు. అంబేడ్కర్ నిర్మించిన మన రాజ్యాంగాన్ని తీసిపారేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రధానమంత్రిపై రాహుల్ గాంధీ తో పాటు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ‘ఇండియా కూటమి’ (INDIA) నేతలు ఎన్నికల సభలో తీవ్రమైన ఆరోపణ చేశారు. మన రిజర్వేషన్ లను టోకున తీసేద్దామని మోదీ అనుకుంటున్నాడని ప్రతిపక్ష నేత గా విమర్శించారు. ఈ రాజ్యాంగాన్ని అంబేడ్కర్ నేతృత్వంలో గొప్పగా రచించారు. అందువల్ల దీనిని తీసేయాలనుకున్నారు, మార్చాలనుకున్నా పెద్ద వివాదమవుతూ ఉంటుంది.



2024 ఎన్నికల్లో భారత్‌కు మొత్తం రాజ్యాంగాన్ని మార్చివేసే ప్రమాదం ఎదురయిందని ఈ ప్రసంగాల వల్ల అర్థమవుతుంది. మన రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసేందుకే తనకు 400 లోక్ సభాస్థానాలు కావాలంటున్నాడని ప్రతిపక్షాలు వాదించాయి. తనకు 400 సీట్లు వస్తాయని, వచ్చితీరతాయని అని ఘంటాపథంగా ప్రధానమంత్రి కూడా పదేపదే ప్రకటించారు.

సంవిధాన్ హత్యా దివస్

విచిత్రమేమంటే ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే "సంవిధాన్ హత్యా దివస్" కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి భారతీయుడిలోనూ వ్యక్తి స్వేచ్ఛ మన ప్రజాస్వామ్య రక్షణ శాశ్వతమైన జ్వాల సజీవంగా ఉంచడానికి సహాయపడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఎమర్జెన్సీ విధించిన స్మారకార్థం జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్యా దివస్‌గా పాటిస్తున్నట్లు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1975 లో అత్యవసర పరిస్థితిని విధించింది, రెండు సంవత్సరాలకు పైగా చాలా పౌర హక్కులను నిలిపివేసిందని 49 సంవత్సరాల కింద జరిగింది.దాన్ని గుర్తు చేయడం కోసం, ఆనాటి కాంగ్రెస్ పార్టీని తిట్టిపోయడానికి ఉపయోగిస్తున్నారు. రాజ్యాంగానికి నిలబట్టుకోవడానికి మంచి చర్యలు తీసుకోకుండా 1975 నాటి సవరణలను వాడుకుంటూ, ఇప్పడి పౌర హక్కులను అణచివేస్తున్న విమర్శల గురించి ఏం జవాబు ఇస్తారు?

తాజా ప్రకటన ద్వారా అమిత్ షా గారు, "కాబట్టి, ఎమర్జెన్సీ కాలంలో అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడిన బాధపడ్డ వారందరికీ నివాళులు అర్పించేందుకు భారతదేశ ప్రజలను ఏ విధంగానూ మద్దతు ఇవ్వకూడదని పునశ్చరణ చేయడానికి భారత ప్రభుత్వం జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్యా దివస్' అంటూ భవిష్యత్తులో ఇటువంటి స్థూల అధికార దుర్వినియోగం," అని అధికారికంగా ప్రకటించారు.

లోక్ సభలో 400 స్థానాలు ఎందుకు?

ఎన్నికల్లో మౌనంగా ఉండిన ప్రజలు రాజ్యాంగాన్ని మారుస్తారంటూ జరుగుతున్న చర్చను విన్నారు. అధికార పార్టీ లోక్‌సభలో 400 సీట్లు కావాలని అడిగింది. అప్పుడు ప్రతి అయిదుగురిలో నలుగురు తమ పార్టీవాళ్లు గెలుపొందుతారని, మన రాజ్యాంగాన్ని పూర్తిగా మార్పు చేయడానికి అవసరమైన బలం లభిస్తుందని బిజెపి వాళ్ల దురాశ. సాంకేతికంగా వాళ్లు ప్రజాస్వామ్య వ్యవస్థ మౌలిక స్వరూపాన్ని మార్చగలుగుతారా? ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య మూల స్వరూపాన్ని మార్చగలుగుతారా? ఇంతటి ప్రయత్నం గురించి బీజేపీ చాలాసార్లు ప్రస్తావించింది, సభల్లో ప్రసంగించింది. వాళ్లకు 400 సీట్లు లభిస్తే ఏం జరుగుతుందని ప్రజాస్వామ్య ప్రేమికుల అనుమానం. ఈ నాలుగు వందల అంకెతో ఆ అనుమానం ప్రబలమైంది. ఒక దశలో అటు ప్రధాని మోదీ ఇటు రాహుల్ గాంధీ రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందనే మాట పదేపదే ప్రయోగిచడంతో మొట్టమొదటి సారి, మన ఎన్నికల్లో ‘రాజ్యాంగం’ ఒక సవాల్ అయిపోయి ఒక పెద్ద ప్రశ్నగా ప్రజల నెత్తిన నిలబడింది.

రాజ్యాంగమే చర్చనీయాంశం

నిజంగా 400 స్థానాలు సంపాదించగలిగితే ఈ దేశం పరిపాలన ఏ విధంగా ఉంటుందనే భయం చాలామందిలో పెరిగిపోయింది. ఇది దేశ ప్రజల ముందు ఒక తీవ్రమైన చర్చనీయాంశమైనట్లు స్పష్టంగా కనబడింది. ఆ ప్రమాదాన్ని శంకించడంతో మన ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికీ ఉంది. పాలకులు ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బ తీసేదే వారి అజెండా. అందుకు వారు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ప్రజలు భయపడ్డారు.

ప్రజాస్వామ్యం బలహీనంగా ఉందనిపించింది. మీడియా బలమైన కార్పొరేట్ దిగ్గజాల పిడికిళ్లలో బందీ అయింది. అప్పుడు పోలీసులు, సీబీఐ, పీఎంఎల్‌ఏ, యూపీఏపీ, ఆదాయం పన్ను శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శక్తిని ప్రభుత్వ పూర్తి శక్తిని వాడుకుంటూ రాజ్యాంగాన్ని బలహీనం చూస్తూన్నారేమో అని భయం వచ్చింది.




ఇదేకదా నియంతృత్వం? మరో వైపు చిన్నచిన్న మీడియా గ్రూపులు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేశాయి. సమాచార హక్కును జనం పట్ల అండగా నిలబడిందని అనుకున్నారు. బ్యూరోక్రసీ, ఉన్నతాధికారులు పూర్తిగా ఏమీ చేయలేని దశలో పడిపోయారు.

సమాచార కార్యకర్తలను బెదిరించినప్పుడు, సామాన్యులను హత్య చేసినప్పుడు, వారినే కోర్టు లిటగేషన్ లతో ఏడిపిస్తూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కమిషన్ పడిపోయింది. న్యాయపరమైన చర్యల్లో నిపుణులైన వారు వేధింపులకు గురి చేసినప్పుడు ఎన్నెన్నో గొంతులు మూగపోయాయి, మూగపోతాయి కూడా.

ఓటు శక్తి

జనం ముందు కనిపించే ఒకే ఆయుధం ఉంది ఓటు. ఓటు వేసే శక్తి ఉన్నప్పుడు మాత్రమే 1950 దశకంలో అంబేదడ్కర్ బృందం కలలు కని నిర్మించిన మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకో గలుగుతాం. మన రాజ్యాంగ పీఠిక మూల సూత్రాలనుంచి సుప్రీంకోర్టు వెలువరించే న్యాయం మాత్రమే ఏకైక ఆశ. ఒక్క రాజ్యాంగ పీఠికనే కాదు, మొత్తం భారత రాజ్యాంగాన్ని దాని మౌలిక స్వరూపంతో కాపాడుకోవలసిన అవసరం ఉందని ఓటర్లు భావించారు. మొత్తం శాసనాన్ని- రూల్‌బుక్‌ను కాపాడుకోవాలా లేదా అని భార త రాజ్యాంగంపై ఈ ఎన్నికల సమయంలో ప్రజల మధ్య చర్చ జరిగింది. ఇంతకు రాజ్యాంగం అది ఎప్పుడు కూడా ఎన్నికల ప్రచార అంశం కాలేదు. కానీ బీజేపీ, కాంగ్రెస్ ఇండియా గ్రూపు ఈ అంశంపైనే ఎన్నికల్లో పోరాడాయి. ‘లౌకికవాదం’ పదాన్ని ద్వేషించడం, కొన్ని మతాల ప్రయోజనాలకు వ్యతిరేకించడం, లేదా రాజకీయ, స్వార్థపూరిత కారణాలకు ఉపయోగించుకునే ప్రయత్నం ఈ మధ్య జరిగింది. అయితే, రాజ్యాంగం ఎప్పటికీ దీనిని అంగీకరించదు. ప్రజాస్వామ్యం పట్ల చిత్తశుద్ధి లేదు. కేవలం అత్యంత క్రూరమైన నియంతృత్వంపై మాత్రమే ఉంది. బీజేపీ లేదా ఇండియా గ్రూపునకు రాజ్యాంగాన్ని మార్చే అవధులు లేని అధికారం లేదు.

ఎన్నికలు వచ్చినాయి. అనుకోకుండా ఓడిపోయినవి కొన్ని, గెలిచినవి కొన్ని. ఆశలు పెట్టుకున్న 400 స్థానాలు రాలేదు. కాస్త ఊపిరి తీసుకున్నారు. బిజెపికి స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చింది. అంతేకాదు, బిజెపి నాయకత్వంలోని ఎన్ డిఎ కి ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబునాయుడి తెలుగుదేశం, బీహార్ లో నితీష్ కుమార్ నాయత్వంలో ఉన్న జనతా దళ్ (యునైటెడ్) పార్టీలతో కలసి బలీయమైన సంకీర్ణంగా ఏర్పాటైంది. ఈ రెండు పార్టీలు బిజెపితో గట్టిగానే ఉన్నట్టు ఇప్పుడు అనిపిస్తున్నది. రాబోయే రోజులు ఏం జరుగుతాయో ఎవరూ చెప్పలేరు. కాని చంద్రబాబు నితీష్ కూడా సమయానికి సరిగ్గా ఎత్తులు పై ఎత్తులు వేయడంలో దిట్టలే.

రాజ్యాంగానికి ప్రమాదం ఉందా లేదా?

రాజ్యాంగానికి ప్రమాదం లేదనీ నమ్మలేము. ఇదివరకు ఒక సారి భారతీయ సమాజం, ప్రజ భయాందోళనలు చూసింది. రాజ్యాంగ మౌలికలక్షణాలను నాశనం చేయడానికి జరిగిన తీవ్ర ప్రయత్నాన్ని మన దేశం ఒకసారి చవిచూసింది. దురదృష్టవశాత్తు ఇటీవలి సమయంలో మరోసారి ప్రయత్నం జరిగింది. మొదటిసారి 1975 మధ్య ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీ భయానకమైన అనేకానేక సవరణలతో ఒక మినీ రాజ్యాంగాన్ని తయారు చేసింది. అంబేడ్కర్ రాజ్యాంగానికి పోటీగా ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని తయారు చేసి జనం నెత్తిన యుద్ధాన్ని రుద్దిపారేసారు. ఇది దేశ ప్రజల ముందు ఒక చర్చనీయాంశం కాగా, వారు ఒక ప్రమాదాన్ని శంకించడంతో మన ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడింది. పాలకులు ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బ తీసే అజెండాతో సిద్ధంగా ఉండడంతో ప్రజలు భయపడ్డారు. ఇప్పడికీ ఆ భయం పోయిందా, పోలేదా?

2014 ఎన్నికలలో బిజెపి ఘనంగా గెలిచింది. పార్లమెంట్ మెట్ల దగ్గర తల తాకించి మొక్కి, రక్షించమని అడిగి, రాజ్యాంగం ముందు నిలబడి అని ఆశ్చర్యం అందరికీ కలిగించారు. ఎంత భక్తి, ఎంత ప్రేమ, మన రాజ్యాంగం గురించి, ఎంత బాగా పరిపాలిస్తాడో, సుపరిపాలన రాబోతుందని అందరూ అనుకున్నారు. మంచిదైంది కొత్త ప్రభుత్వం మనకు రావడం అని నమ్మారు. తరువాత చాలా ఆస్తులను నమ్ముకుంటూ ఉంటే నమ్మకం కూడా పోతూ ఉంటే అది అమ్మకమే కదా అని చాలా మంది బాధపడ్డవారు.


భావ ప్రకటనా స్వేచ్ఛ


మళ్లీ ఏం జరిగిందో తెలుసు. 2024 అంటే సరిగ్గా పదేళ్ల తరువాత అదే ప్రధాని, అతనే వ్యక్తి, చాలా పెద్దదైన రాజ్యాంగం పుస్తకం తల మీద పెట్టుకుని దండం పెట్టుకుని ఏం చెప్పినట్టు? దాని అర్థం ఏమిటి? అర్థం కాదా? పదేళ్ల తరువాత కూడా మన రాజ్యాంగాన్ని దండమా కోదండమా, అమిత దండమా అని ప్రత్యేకం చెప్పవలసిన అవసరం ఉందా?

ఎన్నికలకు ముందు ఇది మన పోరాటం రాజ్యాంగం కోసం అని రాహుల్ అన్నారు. ఆయనొక్కడే కారు, ప్రధాని కూడా ఏదో సందర్భంలో రాజ్యాంగం, రాజ్యాంగం అని అంటూ ఉంటే తరువాత ఏమవుతుందో అని భయపడిపోయారు. ప్రతిఎన్నికల సభలో అందమైన సన్నగా, మరీ లావు కాకుండా , డైట్ ప్రయత్నాలు చేసిన మన రాజ్యాంగం చూడండి చూడు అని అంటూ అంటే, అందులో ఏముందో అన్న ఆలోచన జనానికి వచ్చింది. ఆ పుస్తకాలు కొనుక్కున్నారట. పూర్తి అమ్ముడుపోతే ఇప్పుడు దొరకడం లేదట. మనం అమ్ముకుంటున్నా రాజ్యాంగాన్ని ఈ విధంగా!!

బలమైన ప్రతిపక్షం

దేశంలో ఎపుడూ లేనంతగా ఇపుడు భారత రాజ్యాంగం చర్చనీయాంశమయింది. ఈ చర్చను న్యాయశాస్త్ర నిపుణుడు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ విశ్లేషిస్తూ రాస్తున్న వ్యాసాలివిఒక్కటి మాత్రం కరెక్ట్. అదేమంటే, బలమైన ప్రతిపక్షం పుట్టింది. పదేళ్లు రాజ్యాంగానికి భయం పెట్టిన వారు, రాజ్యాంగం వల్ల భయపడే అవకాశం వస్తున్నదంటూ కొంచెం నయమే అనుకున్నారు. రాజ్యాంగం పుస్తకాన్ని అమ్ముకున్నట్టు, నవరత్నాల నుంచి అనేకానేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటే ఉంటే, కొంచెం సిగ్గుపడతారేమో అని నమ్ముకున్నారు. ఏది ఏమైనా హమేఁ సంవిధాన్ కో బచానా హై


Read More
Next Story