
కాలం మర్చిపోయిన యుద్ధవీరులు ఎవరంటే?
శ్రీలంకలో పీస్ కీపింగ్ ఫోర్స్ గా పోరాడిన భారత సైనికులు
ఎం ఆర్ నారాయణ స్వామి
ఈ సంగతి ఇప్పటిది కాదు.. 1988 నాటిది. ఉత్తర శ్రీలంకలోని వవునియా జిల్లాలోని ఒక మార్గంలో నేను నడుచుకుంటూ వెళ్తుండగా, నాకు ఎదురుగా భారత సైనికులు వస్తున్నారు. వారితో నేను ఢిల్లీ యాసతో కూడిన ‘నమస్తే’ అని పలకరించడంతో వారు ఆశ్చర్యపోయారు.
వారు అప్పుడు ఎల్టీటీఈ ఉగ్రవాదుల కోసం అక్కడ ఉన్నారు. కొంతమంది సైనికులు అక్కడ ఆగినప్పుడు వారిలో ఎక్కువ మంది హర్యానాకు చెందినవారిగా తెలుసుకున్నాను.
నేను ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ అని తెలుసుకోగానే వారిలో ఇద్దరు దేవీలాల్ ప్రధానమంత్రి అవుతారా అని తెలుసుకోవాలనుకున్నారు. అప్పుడు నేను వారిని ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించాను. దానికి వారిచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయాను.
తమిళులు పోట్లాడుకుంటున్నారు..
హర్యానా హిందీ యాసలో ఒక సైనికుడు మాట్లాడుతూ.. శ్రీలంకలో ఉన్న తమిళులను రక్షించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఇక్కడ తమిళులు ఒకరిపై ఒకరు పొట్లాడుకుంటున్నారని చెప్పారు. ఆయన వాటిని ఎల్టీటీ గా పొరపాటుగా చెప్పారు.
అయితే అక్కడకు సంబంధించిన ప్రాథమిక విషయాలను తాను నేర్చుకున్నాడని అర్థం అయింది. 1987 లో భారత్- శ్రీలంక మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. దీనిప్రకారం శ్రీలంక ఉత్తర ప్రాంతంలో 32 నెలల పాటు మన సైన్యం పీస్ కీపింగ్ ఫోర్స్ తో ఇక్కడ ఉంది. అనేకసార్లు మన సైన్యం ఇక్కడ గందరగోళానికి గురైంది.
భారత సైన్యం.. భారంగా..
తమిళ టైగర్లతో పోరాడాలని భారత సైన్యానికి ఆదేశాలు ఉన్నాయి. వారు అలాగే చేశారు. ప్రారంభంలో భారీ ప్రాణనష్టం జరిగిన తరువాత ఎల్టీటీఈ కూడా దట్టమైన అటవీ ప్రాంతాలకు మకాం మార్చింది.
తరువాత జరిగిన పోరాటంలో 12 మంది భారతీయ సైనికులు మరణించారు. మరో 3 వేల మంది వికలాంగులయ్యారు. అయితే తరువాత వచ్చిన భారత ప్రభుత్వాలు పీస్ కీపింగ్ ఫోర్స్ పై ఉదాసీనంగా వ్యవహరించాయి. తమిళ టైగర్లపై ఏమాత్రం అవగాహన లేకుండా సైన్యాన్ని శ్రీలంకకు పంపారు.
పీస్ కీపింగ్ ఫోర్స్ లో పాల్గొన్న భారత సైన్యాన్ని స్వాగతించడానికి అప్పటి సీఎం కరుణానిధి నిరాకరించారు. భారత్, శ్రీలంక పరిస్థితుల వల్ల రెండు దేశాలు పీస్ కీపింగ్ ఫోర్స్ పై పెద్దగా మాట్లాడలేదు.
గుర్తు చేసుకున్న రాజ్ నాథ్..
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్ ఐపీకేఎఫ్ ఆపరేషన్ లో పాల్గొన్నవారిని గౌరవించాలని అన్నారు. శ్రీలంకలో విచ్ఛిన్నం చేసే తమిళ వేర్పాటువాదానని అంతం చేయడానికి భారత సైన్యాన్ని శ్రీలంకలో మోహరించారనేది వాస్తవం.
ఎల్టీటీఈ ఓటమి తరువాత సంవత్సరాలు గడిచేకొద్దీ 1987- 90 నాటి రక్తపాతానికి భారత్ దాని సైన్యం కారణమనే ప్రజాదరణ పొందిన నమ్మకాన్ని తిరస్కరించే అనేక అసౌకర్య వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
భారత్ సైన్యాన్ని ఎదుర్కోవాలనే ప్రభాకరన్ నిర్ణయంతో ఆ సంస్థను విడిచిపెట్టిన ఒక సీనియర్ ఎల్టీటీఈ సభ్యుడు ఇప్పుడు టైగర్లు భారత్ శత్రువుగా మారడానికి ఏర్పాటు చేయలేదని పేర్కొన్నాడు.
1987 లో మధ్యలోనే ప్రభాకరన్ స్వయంగా ఒక భారతీయ జర్నలిస్టుతో ఒక ప్రకటన యుద్ధాన్ని ప్రేరేపించింది తానేనని ఎవరికి తెలియకుండా ఐపీకేఎఫ్ తో ఆటలు ఆడతానని అందులో చెప్పాడు.
అలాగే ఎల్టీటీఈకి విదేశీ నిఘా సంస్థలతో సంబంధాలు ఉన్న సంగతి బయటపడింది. పీస్ కీపింగ్ ఫోర్స్ చిహ్నం శ్రీలంలో ఉన్నప్పటికీ భారత్ లో లేదు. 2015 లో మోదీ శ్రీలంకలో ఉన్న ఈ చిహ్నాన్ని సందర్శించారు. పీస్ కీపింగ్ ఫోర్స్ లో అమరులైన వారికోసం వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలో నిశ్శబ్దంగా నివాళులర్పిస్తుంటారు.
భారత్ సైనికులకు ఇక్కడ కొన్ని తప్పులు చేశారు. ముఖ్యంగా తమిళ పౌరులకు, టైగర్లు మధ్య తేడాలను కనిపెట్టడం చాలా కష్టమని ఒక సైనికుడు నాతో చెప్పారు. ఉత్తర శ్రీలంకలో సైన్యం అరాచకాలను నేను స్వయంగా చూశాను. దానిని అడ్డుకోవడానికి జోక్యం చేసుకున్నాను.
శ్రీలంక ఐక్యత, సమగ్రత కోసం భారత సైనికులు ఎక్కువ మూల్యం చెల్లించుకున్నారు. తరువాత భారత దళాలు వెళ్లిపోవాలని ఆదేశించిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేను టైగర్లు చంపేశారు.
భారత సైనికుల లాగే తమిళ టైగర్లు కూడా ఇతర వ్యక్తులను ఇలాగే పాశవికంగా హత్య చేశారు. అందులో ముఖ్యంగా కనిపించే పేరు తమిళ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు అప్పపిళ్లై అమృత లింగం. ఎల్టీటీఈతో పోరాడిన ఇతర తమిళ గ్రూపులను వీరు హత్య చేశారు.
ఇక్కడ సారాంశం ఏంటంటే.. ఏ దేశంలోనూ ఎవరూ నిర్థిష్టకాలంలో భారత్ వైపు నిలిచినందుకు సిగ్గుపడకూడదు.
(ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను గౌరవిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. అవి తప్పనిసరిగా ది ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)
Next Story

