466 రోజుల ఇజ్రేల్ జినోసైడ్ లో గెలిచిందెవరు? మదపుటేనుగా? చిట్టెలుకా?
x

466 రోజుల ఇజ్రేల్ జినోసైడ్ లో గెలిచిందెవరు? మదపుటేనుగా? చిట్టెలుకా?

అధికారికంగా ఇజ్రాయెల్ సైనిక నష్టాలు వెల్లడించిన తర్వాత ఓ పొలిటికల్ కామెంట్


గాజాలో ఇజ్రాయెల్ సైనిక నష్టాలపై కొత్త వివరాలు వెల్లడయ్యాయి.ఇజ్రాయెల్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన సైనిక మరణాల సంఖ్య 400 అనేది నిజం కాదు. నిజం 5942 మంది

ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు వెయ్యు మంది సైనికులు మరణించారని విమర్శ చేసినపుడు నెతన్యాహు ప్రభుత్వం అబద్దమని ఖండించింది. గాయపడ్డ పెషెంట్లలో మరణించిన సైనికులతో కలిపి ఆఖరికి ఒప్పుకున్న ఐదున్నర వందల సంఖ్య కూడా నిజం కాదు. ఇప్పుడది 5942 గా ఒప్పుకుంది.

యుద్ధకాలంలో మృతుల పేర్లు బదులు సంఖ్యల్ని ప్రకటిస్తూ వచ్చింది. పేర్లు దాచి విమర్శకులకు నిజ నిర్ధారణకు అవకాశం లేకుండా చేసింది. మృత కుటుంబాలకు పరిహారం చెల్లించే సమయంలో ఆ వివరాల్ని బయటపెట్టక తప్పదు కదా! ఇప్పుడు జరిగింది సరిగ్గా యిదే! క్షతగాత్రుల సంఖ్య 15,000 మందికి పైగా.

యుద్దానికి ఏడాది నిండిన సందర్భంగా ఇజ్రాయెల్ "HARETZ" దినపత్రిక గాయపడ్డ సైనికుల సంఖ్య పదివేలకి చేరిందని ఆరోపించింది. అబద్దమని ప్రభుత్వం ఖండించింది. ఇప్పుడది 15,000 దాటిందని స్వయంగా ఒప్పుకుంది. యుద్ధ విరమణ తర్వాత HARETZ దినపత్రికలో ఇజ్రేలీ సైనిక విశ్లేషకులు AMOS HOREL క్రింది వ్యాఖ్యానం చేశారు. కాల్పుల విరమణకు ప్రధాన కారణం సర్కార్ చెప్పే బందీల విడుదల కాదు, సైనిక నష్టాలే. పారా మిలిటరీ సహా గాజాకు తరలించిన సైనిక బలగాల సంఖ్య మూడున్నర లక్షలు.

గాజా విస్తీర్ణం 365 చ.కి.మీటర్లు. చ.కి.మీ. కి సైనికులు 960 మంది. ఓ చ.కి.మీ.కి 250 ఎకరాలకి పంచితే ఒక్క ఎకరానికి నలుగురు దురాక్రమణ సైనికులతో గాజా భీభత్స దృశ్యాన్ని ఊహిద్దాం.

గాజా జనాభా 23 లక్షల మంది. జనసాంద్రత ఎక్కువ. సగటు కుటుంబ సభ్యులు పది మంది వరకు కూడా ఉంటుంది. రెండు నుండి రెండున్నర లక్షల కుటుంబాల గాజా! ఒక కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ తుపాకులు కాపలా వుంటాయి. ఇది పసిపిల్లల నుండి వృద్ధుల వరకు లెక్కిస్తే! గాజా టెర్రర్ స్థితిని ఊహిద్దాం.

యుద్ధం ప్రారంభించింది 7-10-2023 తేదీన.

యుద్ధ విరమణ జరిగిన తేదీ 19-1-2025.

యుద్ధ కాలం 466 రోజులు.

సగటున రోజుకు ఇజ్రాయెల్ సైనికుల మరణాల సంఖ్య 13

రోజుకు గాయపడ్డ సైనికుల సంఖ్య 32

ఇజ్రాయెల్ యుద్ధ ప్రకటన ప్రకారం గాజా హమాస్ మిలిటెంట్ల సంఖ్య 25 నుండి 30 వేల మంది.

నెతన్యాహు ప్రభుత్వ యుద్ధ లక్ష్యాలు రెండు.

1

సాయుధ హమాస్ మిలిటెంట్లను సజీవంగా బందించడం లేదా చంపి నిర్జీవం చేయడం.

2

230 మంది బంధీలను సజీవంగా విడిపించడం.

యుద్ధంలో ఇజ్రాయెల్ సాధించిన ఫలితాలు

సజీవంగా బంధించిన హమాస్ సంఖ్య జీరో

సజీవంగా చిక్కిన ఇజ్రాయెల్ బంధీల సంఖ్య జీరో

హమాస్ సాయుధుల్ని సజీవంగా బంధించినట్లు అధికారికంగా ప్రకటించిన సంఖ్య జీరో

హమాస్ సాయుధుల్ని చంపి శవాల్ని స్వాదీనం చేసుకున్నట్లు ప్రకటించిన సంఖ్య జీరో

గాజా ఎగ్జిట్ ప్యాకేజీ- ఫలితాల గూర్చి

గాజాను విడిచిపెట్టాలనే పౌరుల కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం యుద్ధం మధ్య ఒక ప్యాకేజీ ప్రకటించింది. కన్నంలోకి పొగ పంపి బయటకు వచ్చే ఎలుకకు బ్రతికడానికి అవకాశం కల్పించిన పధకమది. ఇళ్ళు, వాకిళ్లు ధ్వంసించి జనాన్ని రఫా సరిహద్దుకి చేర్చాక గాజాకు తిరిగి రాబోమనే హామీతో 'రఫా' గుండా ఈజిప్ట్, ఇతర అరబ్ దేశాలకి వెళ్లడానికి స్వేచ్ఛ కల్పించిన గొప్ప"ఉదార" పధకమది

మా నేల విముక్తి కై నూరేళ్ళ పాలస్తినా విమోచనా పోరాటంలో ప్రతి కుటుంబం ఒకరినో ఇద్దరినో ప్రాణాలను అర్పించిన చరిత్ర మా జాతికి వుంది. అట్టి మా వీరజాతి మృత్యువుకు భయపడి తమ పుట్టిన మాతృదేశంతో శాశ్వత బంధం తెంచుకోదు. ఈ దేశద్రోహకర ప్యాకేజీకి తల వంచబోదు అని ఆరోజే హమాస్ కౌంటర్ ప్రకటన చేసింది. రఫా గుండా వెళ్ళాలనుకునే పౌరులపై హమస్ భౌతిక వత్తిడి లేదు. పైగా అది ఇజ్రాయెల్ సైనిక ప్రాంతం. మానసికంగా వెళ్లాలని భావించే గాజా పౌరుల్ని ఆటంకపరిచే వారెవ్వరూ లేరు. ప్యాకేజీ ప్రకటించాక రఫా టోల్ గేట్ వద్ద వెళ్లే పౌరుల కౌంటింగ్ కోసం ఓ కౌంటర్ తెరిచింది.

రఫా టోల్ గేట్ ద్వారా బయటకు వెళ్ళిన గాజా పౌరుల సంఖ్య జీరో

శవాలతో సంతకం చేసిన ఒప్పందమది

హమాస్ ని మట్టుబెట్టే వరకూ యుద్ధ విరమణ చేసేది లేదని ఇజ్రాయెల్ సర్కార్ ప్రపంచం ఎదుట పదేపదే భీష్మ ప్రతిజ్ఞలు చేసింది. 466 రోజుల యుద్ధం తర్వాత దోహాలో అదే హమాస్ ప్రతినిధుల సంతకం చేసిన యుద్ధ విరమణ ఒప్పందం ప్రకారం సైనిక బలగాల్ని ఉపసంహరణ చేయడం గమనార్హం! విజేతలుగా రావాల్సిన తమ సేనలు శవాల్ని మోసుకొచ్చాయి. శవాలుగా మారాల్సిన హమాస్ నేతలు సంతకం చేసిన శాంతి ఒప్పంధాన్ని చచ్చినట్లు అమలు చేయాల్సి వచ్చింది.

మరో మాట

ఇజ్రాయెల్ నష్టాలు చెప్పి గాజా జన నష్టాలెందుకు చెప్పడంలేదని ఎవరైనా అడగవచ్చు. నిజానికి గాజా పౌర మరణాలు, క్షతగాత్రుల సంఖ్యలు ఇంతకంటే అనేకరెట్లు ఎక్కువే. ఇది ఆ నష్టాల్ని లెక్కించే సందర్బం కాదు. ఇది జింకల సమూహం పై దాడికి దిగి నష్టపోయిన సింహం గూర్చి, చీమల చేతుల్లో చిక్కి దెబ్బతిన్న పాము గూర్చి మాట్లాడే సందర్బం. ఇది జింకల, చీమల మరణాల గూర్చి మాట్లాడే సందర్బం కాదు. పైగా బ్రతకడం కోసమే పుట్టే జాతి ఇజ్రాయెల్ ది. పోరాడడం కోసం పుట్టేది పాలస్తినా జాతి. గాజాలో ప్రతిమరణం ఓ జననమే. అవి పాలస్తినా జాతీయ విమోచనోద్యమ విత్తులై పునర్జన్మ ఎత్తుతాయి. అక్కడ మృతులు కూడా చిరంజీవులే. ఇజ్రాయెల్ మరణాలు కుక్క చావులే. ఇది వీరమరణాల గూర్చి, వాటి స్ఫూర్తితో నిర్మాణం కానున్న నూతన స్వేచ్చా జాతీయ రాజ్యం గూర్చి మాట్లాడే సందర్బం కాదు. అది మరో సందర్బంగా మాట్లాడుకుందాం.

ఇది పరజాతి భక్షణకోసం దురాక్రమణ యుద్దానికి దిగి దెబ్బతిన్న రాజ్యం గూర్చి మాట్లాడుకునే సందర్బం. అందుకే గాజా పౌర సమాజ నష్టాల గూర్చి మాట్లాడలేదు. అరలక్ష మృతులు, లక్షకు పైగా క్షతగాత్రుల గూర్చి నిర్లక్ష్యం చేశానని ఎవరూ అపార్ధం చేసుకోకండి మిత్రులారా! మనుషుల గూర్చి మాట్లాడుకునే సందర్భాల్లో తప్పకుండా గాజా ప్రజల కష్టనష్టాల గూర్చి, ప్రాణ బలిదానాల గూర్చి మాట్లాడుకుందాం. మన సాటి మనుషుల కోసం కన్నీళ్లు కార్చుదాం.

ఎవరు విజేతలు? ఎవరు పరాజితులు?

మదపుటేనుగా?

చెట్టెలుకలా?

విషసర్పమా?

చలిచీమలా?

Gaza ceasefire, Israeli military losses,Major General Eyal Zamir

Read More
Next Story