దళిత సంస్థల తిరుగుబాటు లేమితనం ఎందుకు?
x

దళిత సంస్థల తిరుగుబాటు లేమితనం ఎందుకు?

దళిత సంస్థల్లో తిరుగుబాటు స్పిరిట్ ఏటు పోయింది?


- పాపని నాగరాజు

తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలలోఎస్సి, ఎస్టీ అత్యాచారాలు, హత్యలు వంటి అత్యాచారాలు 4,088 కేసులు నమోదయ్యాయి, పరిహారం రూ.40 కోట్లు చెల్లించబడ్డాయి, ఇంకా న్యాయం అందని బాధితులు అనేకులు. జాతీయ నేర రికార్డుల బ్యూరో డేటా ప్రకారం, 2020-2025 మధ్య తెలంగాణలో ఎస్సి, ఎస్టీ అత్యాచారాలు పెరిగాయి. 2023లోనే 1,709 కేసులు నమోదయ్యాయి. ఇండియాలో మొత్తం అత్యాచారాలు పెరిగాయి. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు మొదటి ప్రధాన్యలో ఉన్నాయి. ఈ అత్యాచారాలు దళితులపై జరుగుతున్నప్పటికీ, ప్రత్యామ్నాయ దళిత పోరాట సంస్థలు మినహా మేజారీటీ సంస్థల నుండి తిరుగుబాటు లేదు. ఎందుకు?

దళిత ఉద్యమాల చరిత్రలో డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ తర్వాత ఒక శూన్యత ఏర్పడిరది. అంబేడ్కర్‌ దళితులను రాజకీయంగా, సామాజికంగా జాగృతం చేశారు, కానీ ఆయన మరణానంతరం దళిత నాయకత్వం విప్లవాత్మక మార్గాన్ని ప్రత్యామ్నాయ విప్లవ శక్తులు మిహా, మిగితా కులంపేరుతో రూపం మార్చుకున్నవారు వదిలి, ఎన్నికల రాజకీయాల వైపు మళ్లింది. కాన్షీరామ్‌ వంటి నాయకులు బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) ద్వారా దళితులను ఏకం చేయడానికి ప్రయత్నించినా ఈ సారధ్యంలో ఆవతరించిన వారు ఒక్క కులంకే పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు ఆ పార్టీలు కూడా బలహీనపడ్డాయి. దళిత నాయకులు మేధావి వర్గం నుండి త్యాగం చేయగల నాయకత్వం రావాలి, కానీ పోస్ట్‌-అంబేడ్కర్‌ మధ్యతరగతి దళితులు నిజమైన విప్లవ నాయకత్వాన్ని సృష్టించలేకపోయారు. ఇది ఒక విమర్శ. దళిత ఉద్యమం రాడికల్‌ మార్గాలను తిరస్కరించి, లిబరల్‌-డెమోక్రటిక్‌ మోడల్‌తో సరిపెట్టుకుంది.

దీనికి ముఖ్య కారణం, మెయిన్‌స్ట్రీమ్‌ రాజకీయ పార్టీలచే కో-ఆప్టేషన్‌ రావడే. కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుండి దళిత నాయకులను తమలోకి ఆకర్షించి, దళిత అజెండాను తమదిగా చేసుకుంది. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పిఐ) ఇందులో అంబేద్కర్‌ స్థాపించిన పార్టీ మినహా దళిత పార్టీలు ఎన్నికల ఓటములు, మెయిన్‌స్ట్రీమ్‌ పార్టీలతో సంబంధాల వల్ల రాడికల్‌ దృష్టిని, దృక్పదాన్ని కోల్పోయాయి. బీజేపీ, కాంగ్రెస్‌ వంటి పార్టీలు దళితులను ఓట్‌ బ్యాంక్‌గా చూస్తున్నాయి, కానీ దళిత అభివృద్ధికి దోహదం చేసే కులనిర్మూలన అజెండాను అమలు చేయవు. ఇదే విప్లవాత్మక దృక్పథం అవుతుంది. దళిత ఉద్యమం క్యాపిటలిస్ట్‌, బ్రాహ్మణిక వ్యవస్థలో ఇరుక్కుపోయింది, ఇక్కడ నాయకులు వ్యక్తిగత లాభాల కోసం విక్రయించబడతున్నారు.

అంతర్గత విభేదాలు మరొక పెద్ద సమస్య. దళితులు హిందూ, బౌద్ధ, సిక్కు, క్రిస్టియన్‌, ముస్లిం వంటి వివిధ మతాలను అనుసరిస్తున్నారు. ఇది దళిత ఏకీకరణను అడ్డుకుంటుంది. తెలంగాణలో మాల, మాదిగ వంటి ఉప-కులాల మధ్య విభేదాలు రావడానికి కారణం అయిన సామాజిక న్యాయపంపిణిని అంగీకరించక పోవడంతో ఉద్యమం బలహీనపడుతుంది. దళితులు సాంస్కృతిక గుర్తింపు, రాజకీయ దిశ లేకుండా ఉన్నారు.

చారిత్రకంగా, దళితులు తిరుగుబాటు చేయలేదు, ఎందుకంటే కుల వ్యవస్థ హిందూ మతంతో అంతర్లీనంగా ఉంది. అస్పృశ్యత దళితులను ఈ వ్యవస్థ నుండి బయటకు తోసేసింది. ఇప్పుడు, దళితులు రాజకీయంగా జాగృతమవ్వాలి. కానీ ఉద్యమం ఎన్‌జీఓలు, ఎన్నికల రాజకీయాలలో మునిగిపోకుండా ఉండాలి. దేశంలో అనేకంగా జరిగిన దళితప్యాందర్‌ ఇతర ఉద్యమాల నుండి ప్రేరణ పొంది, కొత్త తరం దళితులు మార్పులో బాగస్తులవ్వాలి.

అక్కడక్కడా ఆర్థికంగా కొద్దిలో కొందరు మాత్రమే మెరుగుపడ్డారు. ఇది పేదలకు ముందుకు తీసుకు పోవాడానికి వీరు దోహదపడాలి. లేకపోతే తీవ్ర వ్యతరేకత వస్తుంది. ఇది అంబేద్కర్‌ ఆలోచన విధానంకు వ్యతిరేకం. కుల అణచివేతను వర్గ పీడనతో లింక్‌ చేయాలి. ఇది మోనోపలీని తిరస్కరించేదిగా ఉండాలి. లేక పోతే ఈ మోనోపలీని ప్రజల్లో వ్యక్తం అయ్యే తిరుగుబాటులను అణచివేస్తుంది. దళితులు డ్యూటీబేస్డ్‌ పోరాటాలు, భావజాల వ్యాప్తిని విస్తృతపర్చాలి. దళిత సంస్థల అంతర్గత విభేదాలు, నాయకత్వ లోపంను, విప్లవాత్మక మార్పు కోసం ఏకమై, కుల-వర్గ పోరాటాన్ని చేపట్టాలి. మన దళితులు నిశ్శబ్దంగా ఉండడం మనువాదులకు బలం. ఇప్పుడు సమయం వచ్చింది. ఐక్యతతో వ్యవస్థను మార్చడమే మిగిలి ఉంది. ప్రభుత్వం వివిధ రకాలుగా దళితుల ఆర్థిక మొత్తాన్ని ఖాజేసిన తనాన్ని మెడలు వంచి పంచుకోవచ్చు.

తేది : 30-10-2025 (28-10-2025)

Read More
Next Story