అధికార పార్టీలోకి మారడం అవసరమా ? అవకాశవాదమా?
x

అధికార పార్టీలోకి మారడం అవసరమా ? అవకాశవాదమా?

అధికారం లేక పోవటాన గౌరవాలు ప్రోటోకాల్ లేక ఆహ్వానాలు రాక అవకాశాలు లేక అలమటిస్తారు.అధికారుల వద్ద ప్రజల మధ్య పరపతి లేక ప్రజలకు అడిగింది చేయలేక నలిగిపోతారు.


అధికారంలో వున్న పార్టీలోకి చేరడానికి అనేక కారణాలు. అలా చేరడం అవసరమా ? అది అవకాశవాదం అనుకుంటారు కొందరు.


అది వాస్తవాలతో పనిలేని సిద్దాంత చర్చ. ఓడినా గెలిచినా అధికార పార్టీలో చేరడం అవసరం అని చాలామంది భావిస్తుంటారు. ఏ కలెక్టరుంటే ఆ కలెక్టర్ తో పని తీసుకున్నట్టే అధికారంలో వున్నముఖ్యమంత్రితో పని తీసుకుంటారు.


అందుకు అధికార పార్టీలో చేరుతారు. అలా చేరకపోతే పనులుకావు. అధికారులవద్ద ప్రజలమధ్య పరపతి వుండదు. ప్రజలకు అడిగింది చేసి పెట్టలేరు. తమ సహచరులకు కార్యకర్తలకు అనుచరులకు అభిమానులకు , కాంట్రాక్టులు , లైసెన్సులు , రియల్ ఎస్టేట్ అనుమతులు, తమ ప్రాంత అభివృద్దికి రోడ్లు జ్రైనేజీ, మంచినీటి నల్లాలు, పోలీసు కేసుల్లో విడిపించడం, అధికారులతో పనులు చేయించుకోవడం, తమనాశ్రయించిన ఉద్యోగులకు బదిలీలు వగైరా పనులు చేసి పెట్టడం కష్టమవుతుంది.


బయటి నుంచి పనులు చేయించుకోవాలనుకుంటే అధికార పార్టీలో వున్నవారు అడ్డుకుంటారు. తాము చెప్పిన పనులు చేయాలంటారు. తమ వారికి కాంట్రాక్టులు లైసెన్సులు పర్మిషన్లు , స్కూల్లు కాలేజీలు రెసిడెన్షియల్ స్కూల్లలో ప్రవేశాలు, హాస్పటల్సులో తమవారికి సేవలు మొదలైనవి చేయడంలో అధికార పార్టీ వారికున్న ప్రాధాన్యత మిగతా వారికుండదు. ఇతర పార్టీల వారికి చేసి పెడితే వారి పరపతి పెరిగితే వారికే ఓట్లు పెరిగి అధికార పార్టీ ఓడిపోయే దశ వస్తుంది. అందుకని అడ్డుతగులుతారు.


చిన్న కాంట్రాక్టర్లకుకాంట్రాక్టులు ఇప్పించకపోకే తమవారికి అనుకున్న చోటికి బదిలీలు చేయించకపోతే ఉద్యోగాలు ఇప్పించకపోతే వాల్లు ఎలా బతుకుతారు? పార్టీని ఎలా బతికిస్తారు? పార్టీ నీరసించి పోతుంది. తమ నాయకుడిని వదిలి వెల్లి పోతారు. ఐదేళ్ల కాలంలో అధికారం లేక పోవటాన గౌరవాలు ప్రోటోకాల్ లేక ఆహ్వానాలు లేక పాల్గొనే అవకాశాలు లేక అనామకులవుతుంటారు.


ఇన్ని సమస్యల వల్ల తమకోసం తమను అంటిపెట్టుకున్న వారి ప్రయోజనాలకోసం అధికార పార్టీలో చేరుతారు. అధికారంలో వున్న పార్టీలో చేరకపోతే, వారితో అనుబంద మిత్రపక్షంగా వుండకపోతే ఎంత నిజాయితీగా వున్నా ఆ పార్టీలను ప్రజలు కూడా క్రమంగా వదిలి వేస్తారు. ఓట్లు వేయరు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం సిపిఐ, సిపియం లు . అవి క్రమంగా నీరసించిన తీరే అందుకు నిదర్శనం. నినాదాలు సిద్దాంతాలు కడుపు నింపవు. తమకు పని చేసి పెట్టేవారివైపు ప్రజలు మరలుతారు.


ఎన్ని ఉద్యమాలు చేసినా వాటితో లాభ పడ్డవారుకూడా నిత్య జీవిత సమస్యలు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించకపోతే అధికారంలో వున్నవారినే ఆశ్రయిస్తారు. రైల్వే రిజర్వేషన్ మొదలుకొని తిరుపతి దర్శనం వంటి పలు అవసరాలు అధికారంలో వున్న వారే చేయడం సాధ్యం.

అలా పలు కారణాలు అవసరాల రీత్యా గెలిచినా ఓడినా అధికారంలో వున్న పార్టీలో చేరుతారు. తద్వారా తమనెంట పన్నవారిని కాపాడుకుంటారు. ఇది వాస్తవ పరిస్థితి. దీనిని వాస్తవిక దృష్టితో అర్థం చేసుకున్న వారికి వెంటది వెంట అంతదాక కొట్టాడిన పార్టీలోనే ఎందుకు చేరుకుంటారో తేలికగానే బోధపడుతుంది.

మరి అధికార పార్టీ అక్కడి వారి వ్యతిరేకతను కాదని ఎందుకు చేర్చుకుంటున్నారు? తమ సంఖ్య పెరిగితే విడిపోతామని బెదిరించేవాల్లు తగ్గుతారు. ప్రభుత్వం సుస్థిరంగా వుంటుంది. ప్రతిపక్షం నీరసించడం అధికారంలో వున్న వారికి ఎంతో అవసరం. రెండో సారి అధికారం లోకి రావడం సులభమవుతుంది. ఇలా ఫిరాయింపులు ప్రజలకు ప్రభుత్వానికి ఫిరాయించినవారికి వారి అనుచరులకు మేలు చేస్తున్నాయి.

అందుకే ఫిరాయింపుల చట్టం వున్నా ఆ చట్టం వరకట్న నిషేద చట్టం వలె అవినీతి వ్యతిరేక చట్టం వలె సరిగా అమలు కాలేక పోతున్నది. ఇవా ఫిరాయింపులు ఒకరకంగా పార్టీ రహిత ప్రజాస్వామ్యం సిద్దాంతాన్ని గుర్తు చేస్తున్నది.


Read More
Next Story