తాలిబన్లను పాకిస్తాన్ ఎందుకు మచ్చిక చేసుకోలేకపోయింది?
x
పాకిస్తాన్- ఆప్ఘన్ సరిహద్దు వద్ద కాపలా కాస్తున్న తాలిబన్ దళాలు

తాలిబన్లను పాకిస్తాన్ ఎందుకు మచ్చిక చేసుకోలేకపోయింది?

ఇస్లామాబాద్, కాబూల్ తో జూదం ఆడుతోందా?


Click the Play button to hear this message in audio format

వివేక్ కట్జూ

పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఫిబ్రవరి 26న రాత్రి పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడులు చేసినట్లు ప్రకటించింది. అయితే ఆ దాడుల్లో ఉగ్రవాదులే లేరని, కేవలం సాధారణ ప్రజలే లక్ష్యంగా దాడులు చేశారని అది ప్రకటించింది. అయితే తమపై దాడులకు ప్రతీకారం తప్పదని వెల్లడించింది.

ఆత్మాహుతి బాంబు దాడులకు ప్రతీకారంగా?

ఫిబ్రవరి 22న పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్‌లోని పదిహేడు ప్రదేశాలపై బాంబు దాడి చేయడంతో ఈ భారీ పోరాటం ప్రారంభమైంది. గత కొన్ని వారాలుగా తెహ్రీక్-ఎ-తాలిబాన్-ఎ-పాకిస్తాన్ (TTP; పాకిస్తాన్ ఇప్పుడు ఫిట్నా అల్ ఖవారీజ్ అని పిలుస్తుంది) చేసిన ఆత్మాహుతి బాంబు దాడులకు ప్రతిస్పందనగా ఇవి జరిగాయని పేర్కొంది. TTPకి భారత్ మద్దతు ఉందని పాకిస్తాన్ నిత్యం ఆరోపిస్తుంది. దానిని అదుపు చేయనందుకు ఆఫ్ఘన్ అధికారులను నిందిస్తుంది. పాకిస్తాన్ బాంబు దాడిలో అనేక మంది మహిళలు, పిల్లలు మరణించారు.
రెండు రోజుల క్రితం డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న పాకిస్తాన్ పోస్టులపై భారీ ఆయుధాలతో తాలిబన్ దళాలు కాల్పులు జరిపింది. పాకిస్తాన్ దళాలపై భారీ ప్రాణనష్టం కలిగించిందని పేర్కొంది. పాకిస్తాన్ ఈ వాదనలను తోసిపుచ్చింది. దాని దళాలు ఆఫ్ఘన్ దళాలపై గణనీయమైన నష్టాలను మిగిలాయని తామే ప్రతిదాడి చేసినట్లు ఎప్పటిలాగే గొప్పలు చెప్పుుంది.

ఇది పూర్తి యుద్ధానికి దారితీస్తుందా?

ఈ పోరాటం రెండు దేశాల దళాలు డ్యూరాండ్ రేఖను దాటే యుద్దంగా మారతుందా? పాకిస్తాన్ వైపు ఎలాంటి నష్టం జరుగుతుంది? ఈ అంశంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. మా సహనం నశిస్తోంది, ఇప్పుడు మీకు మాకు యుద్ధం జరుగుతోందని అన్నారు.
ఆసిఫ్ ఒక మూర్ఖుడు, అతని మాటలు పాకిస్తాన్‌లో యుద్ధం, శాంతిని చివరికి నిర్ణయించే ఆర్మీ జనరల్స్ ఆలోచనకు తీవ్రమైన సూచన కాకూడదు. నిజానికి, ఖవాజా ఆసిఫ్ మాటలు నిరాశను సూచిస్తున్నాయి. పౌర ప్రభుత్వం కూడా వాటిని తీవ్రంగా పరిగణించదు. అవి ఖచ్చితంగా పాకిస్తాన్ నిజమైన ఉద్దేశాలు, విధానాలకు సూచన కాదు. ఆఫ్ఘనిస్తాన్ పట్ల పాకిస్తాన్ వైఖరికి మరింత సూక్ష్మమైన వ్యక్తీకరణను పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అందించింది.

పాక్ విదేశాంగ శాఖ ఏం అంటోంది..

పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 26న మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఆఫ్ఘనిస్తాన్ పట్ల పాకిస్తాన్ విధానాల గురించి మాట్లాడుతూ.. “మొదట పాకిస్తాన్ సైనిక ప్రతిస్పందనపై, మేము మా ఆత్మరక్షణ హక్కును వినియోగించుకోవడంలో బలంగా స్పందిస్తాము. ఈ సందేశాన్ని అన్ని అంతర్జాతీయ దేశాలకు తెలియజేసింది. పాకిస్తాన్ ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా చర్చిస్తోంది. ఒకటి ఆ దేశంతో వాణిజ్యం, రెండోది ఆ దేశంలో ఉన్న తాలిబన్ నాయకులపై ఉన్న యూఎన్ ఆంక్షలు.
‘మీరు భద్రతా మండలిలో చేసిన మా ప్రకటనలను అనుసరించాలి. శిక్షార్హత లేకుండా, ఆఫ్ఘన్ నేల నుంచి స్వేచ్ఛతో పనిచేస్తున్న ఈ ఉగ్రవాద సంస్థలపై చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రజల మధ్య సంబంధాల పరంగా ఎటువంటి నిర్మాణాత్మక సంభాషణ గురించి తెలియదు.
ప్రజల మధ్య సంబంధాల పరంగా ఆఫ్ఘన్ ప్రజల మీద మాకు ఎటువంటి వ్యతిరేకతా లేదు. అయితే తాలిబన్లు పాక్ మీద దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం. వారితో మాకు సంప్రదాయ చారిత్రక భాషా సంబంధాలు ఉన్నాయి. ఆఫ్ఘన్ ప్రజలకు ఎటువంటి హాని జరగకూడదని మేము కోరుకుంటున్నాము’’ అని విదేశాంగ శాఖ ప్రకటించింది.
తమ దేశంపై దాడులు చేస్తున్న ఉగ్రవాద గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని అవి స్పష్టం చేస్తున్నాయి. అయితే, పాకిస్తాన్ కారణంగా ప్రధాన శక్తులు తాలిబన్లతో విడిపోయే అవకాశం లేదు. వారు TTPని అంతం చేయమని ఆఫ్ఘన్ తాలిబన్లను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు, కానీ వారు అంతకు మించి మాట్లాడరు. కానీ తాలిబన్లు మాత్రం టీటీపీని తమలో ఒక భాగంగా అస్సలు అంగీకరించరు. వారి మీద ఒత్తిడులు పెట్టే అవకాశం కూడా లేదు.

పాకిస్తాన్ మళ్లీ రెచ్చిపోతుందా..

అయితే వైమానిక శక్తి ద్వారా పాక్ మరోసారి తాలిబన్లపై దాడులకు దిగితే అది తమకు నష్టం కలిగిస్తుందని భావిస్తే టీటీపీని అప్పగించడానికి అంగీకరించవచ్చు. లేదా వారిని నియంత్రించవచ్చు. లేదా పరిస్థితి మరింత తీవ్రతరం కావచ్చు.
ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఆఫ్ఘనిస్తాన్‌లోకి భూ దళాలను పంపుతాడా? పాకిస్తాన్ సైన్యం గతంలో వ్యూహాత్మక తప్పిదాలు చేసింది. కార్గిల్ ఒక గొప్ప ఉదాహరణ. ఆఫ్ఘనిస్తాన్‌లోకి తన బలగాలను పంపితే అది అలాంటి తప్పు చేస్తుంది. పాకిస్తాన్ మద్దతు వల్లే ఆఫ్ఘన్ తాలిబన్లు అమెరికాను ఎదుర్కోగలిగారని, అది లేకుండా వారు అణిచివేయబడతారని మునీర్ అనుకోవచ్చు. అందువల్ల, ఇప్పుడు విదేశీ మద్దతు లేకుండా, వారు పాకిస్తాన్‌ను ఎదిరించలేరు. పాకిస్తాన్ మద్దతు లేకుండా ఆఫ్ఘన్ తాలిబన్లు అమెరికాను ఓడించలేకపోయేవారన్నది నిజం. అయితే, పాకిస్తాన్ కూడా అమెరికా కాదని గుర్తుంచుకోవాలి.
అంతేకాకుండా, పష్టున్లకు పంజాబీల పట్ల తీవ్ర అసహనం, అనుమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం పంజాబీ సైన్యం. అందువల్ల, పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లోకి చొరబడినా తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ డ్యూరాండ్ లైన్ వెంబడి కాల్పులు జరుపుతూనే ఆఫ్ఘన్ నగరాలపై బాంబులు వేసే అవకాశాలు తక్కువ.
ఇది తాలిబన్లపై పెద్దగా ప్రభావం చూపదు. మరోవైపు, ఇది TTPపై ఎక్కువ నియంత్రణను అనుమతించేలా చేస్తుంది. పాకిస్తాన్ మూడు దశాబ్దాలకు పైగా భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఉపయోగించింది. ఇప్పుడు TTP దానికి వ్యతిరేకంగా చేస్తున్న అసాధారణ యుద్ధం ముగింపులో ఉంది. అయితే ఈ పరిణామాలు కూడా పాకిస్తాన్ భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఉపయోగించకుండా ఆపదు.
(ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను అందించడానికి ప్రయత్నిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. ఫెడరల్ ఒక వేదిక మాత్రమే. ఇవి తప్పనిసరిగా ది ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)
Read More
Next Story