వాట్సాప్ యూనివర్శిటీ భారతీయ ముస్లింలనే ఎందుకు టార్గెట్ చేస్తోంది?
x

వాట్సాప్ యూనివర్శిటీ భారతీయ ముస్లింలనే ఎందుకు టార్గెట్ చేస్తోంది?

లక్షలాది సందేశాలు పాక్ వ్యతిరేకత పేరుతో ముస్లిం వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయేందుకు?


(మూలం.. సంకేత్ ఉపాధ్యాయ)

ఇది భావోద్వేగ విస్పోటనం కాదు, కొన్ని అధ్యయనాలు చూపించినట్లుగా వాట్సాప్ మెసేజ్ లలో ఇస్లామోఫోబిక్ సందేశాలు వీరవిహారం చేస్తున్నాయి. ఇతర రకాల కంటేంట్ కంటే ఇవే ఎక్కువ చురుకుగా ఉన్నాయి.

26 మంది అమాయక హిందూ పర్యాటకులను మతం పేరు అడిగి, బట్టలు విప్పించి మరీ ముస్లిమా కాదా అని చూసి మరీ కాల్చివేశారు. ఈ దాడి వార్త భారతీయులను ఆగ్రహానికి గురిచేసింది.
ఇది సరిహద్దు అవతల నుంచి వచ్చిన ఉగ్రవాదం. ఒక దేశాన్ని బాధించింది.. తీవ్రంగా కలిచివేసింది. ఈ దాడిపై కాశ్మీరీల హృదయం మరింతగా గాయపడింది. 2019 లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత అనంతరం ఏర్పడిన పరిస్థితులు కాశ్మీర్ ను పూర్తిగా మార్చివేశాయి.
అక్కడికి కోట్లాది మంది పర్యాటకులు ‘క్యూ’ కట్టారు. విదేశీ పెట్టుబడులను సైతం కాశ్మీర్ బాగా ఆకర్షించింది. కానీ ఒక్క ఉగ్రవాద దాడి వారి వ్యాపారాన్ని దూరం చేసింది. ఈ ఉగ్రవాద దాడి వల్ల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి దేశం దు:ఖంలో ఐక్యంగా ఉంటుందని తెలిసింది. కానీ వాట్సాప్ గ్రూపులు ఇక్కడ రెండో కోణాన్ని ఆవిష్కరించాయి. తమ ముస్లిం వ్యతిరేకతను బాహాటంగా బయటపెట్టుకున్నాయి.
వాట్సాప్ ద్వేషం..
దాడి జరిగిన ఒక రోజు తరువాత అన్ని రెసిడెన్షియల్ సొసైటీ వాట్సాప్ గ్రూపులు హడావిడిగా సందేశాలు పంపించుకోవడంలో బిజీగా మారాయి. ఇది హిందూ, ముస్లిం కోణంలో ఉన్నాయి.
పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందూ పురుషులనే లక్ష్యంగా చేసుకున్నారనేది కాదనలేని వాస్తవం. బాధితులు తాము చూసిన వాటిని వివరిస్తున్నారు. అయితే వాట్సాప్ లో వచ్చినది ఉగ్రవాదులపై కోపం కాదు, ముస్లింలపై కోపం.
ఆందోళన చెందుతున్న స్నేహితులు షేర్ చేసిన కొన్ని వాట్సాప్ పోస్టులు చాలా బాధ కలిగించాయి. కొన్ని సందేశాలు దేశంలోని ముస్లింలు, హిందువులు చనిపోవాలని కోరుకుంటున్నారని ఉన్నాయి.
‘‘ఇన్మే సే 50 పర్సెంట్ గద్దర్ హోతే హై’’ అని ఒక సందేశం వచ్చింది. ఇది 50 శాతం భారతీయ ముస్లింలు దేశ ద్రోహులు అని సూచిస్తుంది. అన్ని నివాస సంఘాలలో సంతాప సమావేశాలు జరిగాయి. అవి కొవ్వొత్తుల వెలుగులో ప్రారంభమయ్యాయి కానీ చివరికి పునరావృతం చేయని ప్రసంగాలతో ముగిశాయి.
ద్వేషానికి మద్దతు..
నోయిడాలో ని ఓ వ్యక్తి కొంతమంది పిల్లల సమక్షంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు హిందువులు జనాభాలో 80 శాతం కంటే తక్కువ. క్రమక్రమంగా మైనారిటీగా మారి దేశంపై నియంత్రణ కోల్పోతాము. ఇదే వారు కోరుకుంటున్నది’’. ఇదే సమయంలో బీజేపీ చత్తీస్ గఢ్ యూనిట్ చేసిన ట్వీట్ కూడా ఆలోచించదగ్గదే. ఓ బాధితుడి చిత్రాన్ని చూపిస్తే.. ‘‘జాతి నహీ, ధర్మ్ పూచా’’( వారు కులాన్ని కాదు, మతాన్ని అడిగారు) అని వచనంతో గిబ్లీ శైలిని చిత్రంగా మార్చారు.
దాడి జరిగిన తరువాత కొన్ని గంటల్లోనే ఈ ట్వీట్ వచ్చింది. హిందువులను కులాల ఆధారంగా విభజించకూడదని సూచిస్తుంది. అలాగే కులగణన కోసం ప్రతిపక్షాల డిమాండ్ ను నిరుత్సాహరించాలనే సూచన కూడా ఉంది.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి?
ముస్లింలే లక్ష్యంగా చేసుకుంటూ వస్తున్న మెసేజ్ లపై తప్పు అని ఓ వర్గం సూచించినప్పుడు ఒక సమూహం వారిపైకి దూసుకుపోయింది. ‘‘ఇవి మా భావాలు, మేము వాటిని ఆపలేము’’ అని వారు అన్నారు.
హిందువులు ప్రతి ఇంట్లో పెంపుడు జంతువుగా ఆవును పెంచుకోవడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని కొంతమంది ఫ్లాట్ నివాసితులు ఒక ఫన్నీ కామెంట్ పెట్టారు. కానీ లోతుగా ఆలోచించి చూస్తే దాని భావం బోధపడుతుంది. ఇది ఉగ్రవాదంపై భారత చేస్తున్న పోరాటానికి ఎలా సాయపడుతుంది.
ముస్లింలపై ఈ ద్వేషమంతా తక్షణమే మొదలైంది. కానీ అన్ని సమాజా వాట్సాప్ గ్రూపులలో ఇది ఒక ప్రవాహంలా మొదలైంది. ఈ సమస్య ఇండియన్ రెసిడెన్షియల్ సొసైటీ వాట్సాప్ గ్రూపులకే పరిమితం కాదు. నేను ఢిల్లీ మాజీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను ఇంటర్వ్యూను చేసాను.
‘‘ఇది కేవలం సొసైటీ గ్రూపులు మాత్రమే కాదు. నా ఐఏఎస్ గ్రూపులు కూడా ఇలాంటి చాట్ లతోనే ఉండి ఉన్నాయి. నేను అనేక గ్రూపుల నుంచి బయటకు రావాల్సి వచ్చింది.
అలాంటి ప్రతి చర్య తరువాత భారత్ లోని ముస్లింలు దేశం పట్ల తమ విధేయతను నిరూపించుకోవడం ఏదో విధంగా అవసరం అవుతుంది. మనం ఎంత దేశ భక్తులమో ప్రతిసారి ఎందుకు నిరూపించుకోవాలి?’’ అని జంగ్ ప్రశ్నించారు.
మంటకు ఆజ్యం పోయడం..
ఈ పరిస్థితిని శాంతపరచడానికి అధికార పార్టీ సభ్యులు సాయం చేస్తున్నట్లు కనిపించడం లేదు. దాడి జరిగిన ఒక రోజు తరువాత బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు. రాజ్యాంగం నుంచి ఆర్టికల్ 26, 29 తొలగించాలని ఆయన అన్నారు.
ఈ రెండు ఆర్టికల్స్ మైనారిటీలు తమ మతాన్ని ఆచరించే హక్కును కల్పిస్తాయి. ఆర్టికల్ 29 మైనారిటీలు తమ విశ్వాసాన్ని ఆచరించడానికి రక్షణ కల్పిస్తుంది.
నేను దూబేను అడుగుతున్నాను.. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ పై దాడి చేసినందుకు భారతీయ మైనారిటీలు తమ విశ్వాస హక్కును ఎందుకు వదులుకోవాలి? ఇది భారతీయ ముస్లింలు భారతీయులు కాదని సూచించడం కాదా? అని ప్రశ్నించారు.
ఆందోళకరమైన అధ్యయనాలు..
ఇది నిజంగా సహజమైన, సేంద్రీయ భావోద్వేగ విస్పోటనమా? ఇది ఎందుకు జరుగుతుంది. దీనికి అనేక అధ్యయనాలు ఉన్నాయి.
వాట్సాప్ విజిలెంట్స్ అనే 2019 లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్ అధ్యయనం ప్రకారం.. మెసేజింగ్ ఫ్లాట్ ఫాం లో నకిలీ వార్తల వ్యాప్తి డిజిటల్ అక్షరాస్యత కంటే ఇప్పటికే ఉన్న సామాజిక పక్షపాతాల ద్వారా ఎక్కువగా జరుగుతుందని తేలింది. తప్పుడు సమాచారం తరుచుగా అట్టడుగు వర్గాలను ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటుందని అధ్యయనం వివరించింది.
2021 మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ ఖరగ్ పూర్ నిర్వహించిన ఒక అధ్యయనం మరో అడుగుముందుకు వేసింది. ఫియర్ స్పీచ్ ఆన్ వాట్సాప్ అనే శీర్షికతో ఆ అధ్యయనం ఐదువేల భారతీయ వాట్సాప్ గ్రూపులలో 2 మిలియన్ సందేశాలను విశ్లేషించింది.
సందేశాలలో మూడింట ఒక వంతు ముస్లింపై భయాన్ని రేకేత్తిస్తున్నాయని కనుగొన్నారు. ఈ ఇస్లామోఫోబిక్ సందేశాలు విస్తృతంగా వ్యాపించడమే కాకుండా ఇతర రకాల కంటెంట్ కంటే ఎక్కువ కాలం చురుకుగా ఉన్నాయి. కొంతమంది ఎక్కువ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. వారు సరైన సమాచారం కంటే ఎక్కువగా వేగంగా ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు.
( ఈ వ్యాసంలోని సమాచారం పూర్తిగా రచయితకు సంబంధించినవి. ఫెడరల్ అన్ని వైపుల అభిప్రాయాలను గౌరవిస్తుంది. కేవలం ఒక వేదికల మాత్రమే నిలుస్తుంది )


Read More
Next Story