సుప్రీంకోర్టు ఎస్సీ కోటా వర్గీకరణ  తీర్పు గొప్పదని ఎందుకంటున్నాం?
x

సుప్రీంకోర్టు ఎస్సీ కోటా వర్గీకరణ తీర్పు గొప్పదని ఎందుకంటున్నాం?

మాడభూషి శ్రీధర్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును విశ్లేషిస్తున్నారు


మూడు రోజులో కిందట ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఎస్ సి రిజర్వేషన్ల వర్గీకరణను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు సారాంశం ఇది:


  1. తీర్పు: మొత్తం రిజర్వేషన్లను రద్దు చేయలేదు. చేయడం కూడా సాధ్యంకాదు.
  2. మన రాజ్యాంగం సాంఘిక పత్రం.
  3. కోటా కింద తక్కువ కోటా అసమానత అవుతుంది.
  4. ''ఇది ఒకరి గెలుపు కాదు, ఒకరి ఓటమి కాదు.
  5. మాల సోదరులు అర్థం చేసుకోవాలి, దీనికి అవరోధం కల్పించేందుకు ప్రయత్నించొద్దు’’ అని కృష్ణ మాదిగ అన్నారు.
  6. 2005లో ఇచ్చిన ఈవీ చెన్న‌య్య వ‌ర్సెస్ ఏపీ ప్ర‌భుత్వం కేసును కోర్టు కొట్టివేసింది.
  7. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 341కు వ్య‌తిరేకంగా వ‌ర్గీక‌ర‌ణ ఉన్న‌ట్లు ఆ నాటి తీర్పులో సుప్రీం తెలిపింది. అది 5 న్యాయమూర్తుల తీర్పుపైన 7గురి బెంచ్ కి పంపారు.
  8. 21 ఏళ్ల తరువాత సుప్రీంకోర్టు ఏడుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం పాత తీర్పును తోసిపుచ్చింది.
  9. 2006లో పంజాబ్ రూపొందించిన ఎస్సీ, బీసీ రిజ‌ర్వేష‌న్ చ‌ట్టాన్ని కూడా కోర్టు స‌మ‌ర్థించింది అంటే కోటా వర్గీకరణ ఒప్పుకోలేదు.
  10. ఉప కులాలను 'హోమోజీనస్ క్లాస్' (ఒకే సమూహంగా భావించలేమని) కాదు.
  11. ప్రభుత్వం తక్కువ వెనుకబడిన వారికి ప్రభుత్వం అఫర్మేటివ్ ఆక్షన్ చేయాలి. అంటే Affirmative Action అమలు చేయడం న్యాయం. ఇద్దరిలో బలహీనుడికి బలవంతులు లాభాలు లాగేయడం చెల్లదు.
  12. ఆర్టికిల్స్ 14, 15 కింద ఇది సరైన తీర్పు.
  13. రాజ్యాంగం ఆర్టికిల్ 341 కింద అతి బలహీనులకు ప్రాధమ్యం ఇవ్వడం అధికారం రాష్ట్రపతికి ఇస్తున్నది.
  14. సమానత హక్కు కింద సహేతుకమైన వర్గీకరణ ఉండాల్సిందే.
  15. Quantifiable and demonstratable అని చేయగలిగితే ఎస్సీల వర్గీకరణ సబబే.

రిజర్వేషన్ అవసరమా?

అసలే రిజర్వేషన్ అవసరమా? అందులో ఎస్సీలంటె ఎవరు. కులాల పేరు కాకుండా, బ్రాహ్మణ (పూజారి), క్షత్రియ (పాలకులు), వైశ్య (వర్తకులు), శూద్రుడు (సేవకుడు) అని కులవ్యవస్థ వివరించేవారు అంటారు. పుట్టినపుడు పోయేడప్పుడు కులాలు ఏవిధంగా వస్తాయో, పోతాయో ఎవరికీ తెలియదు. జన్మతో పాటు మనిషికి పేరు కూడా ఉండదు. అవననీ మనకు అందరికీ పేర్లు నామకరణం చేస్తూ ఉంటే ఆ మాటలు వాడుకుంటున్నారు. గతజన్మలో ఏముందో రాబోయే జన్మలో ఏమవుతుందో తెలిసే అవకాశం లేదు.

పాతకాలంలో నాలుగే కులాలు ఉన్నాయని, అందువల్లనే కులాల పేర కొట్టుకుని చస్తున్నామని తెలుస్తూనే ఉంది. అందులో అయిదో కులం వారిని, ఉదాహరణకు మాలలు మాదిగలు అని అంటున్నారు. ఆ మాట నామకరణం ఎక్కడినుంచి వచ్చింది? వారిని అణగారిన అనే కులం లేదు. వెనుకబడిన వారు అనే పేరు కూడా లేదు. నానాకులాల పేర్లుతో అంటున్నా అవి తిట్టువలెనే అనిపిస్తూ ఉంటాయి. హరిజనులు అనీ, గిరిజనులు, ఆదివాసులు, అనీ, అందులో ఒకరైన మాల మాదిగ వంటి పేర్లతో పిలుచుకోవడానికి ఎక్కడనుంచి వచ్చింది? ఆ పేర్లు ఈ పేర్లు పెట్టడం సరికాదు.

కనుక రాజ్యాంగంలో రచించుకున్నపుడు అక్కడ అటువంటి పేర్ల బదులు షెడ్యూల్డు (అంటే ఒక రకాల వెనుకబడిన వారిని జాబితా అని రాసుకుంటూ ఇంగ్లీషు భాషలో జాబితా షెడ్యూల్డ్ అంటే షెడ్యూల్ లో ఉన్న వారు కనుక షెడ్యూల్డ్ క్యాస్ట్ లు అనీ ఎస్ సి అనీ సృష్టించడం అయింది. షెడ్యూల్డ్ లొ తెగల వాళ్లు కూడా వెనుకబడిన వారు కనుక వారిని షెడ్యూల్డ్ ట్రైబ్ లు అని ఎస్ టి అంటున్నాం. నిజానికి బ్రాహ్మణపు పనులు చేసేవారు ఇంకేదో పనిచేసిన, గుమాస్తాలు, కూలీలు చేసుకునే వారు వగైరా బ్రహ్మాణ పనులు చేసే వారు. వైశ్యుల మంది ఉండడం, క్షత్రియులు ఉండడం సాధ్యమే. ఎస్సీ ఎస్టీ వారిని కలిపి వెనుకబడిన వారు అంటున్నాం. కాని షెడ్యూల్డ్ కులాలు తెగల వారికన్న కొంచెం ఎదిగైన వారిని బిసి అంటున్నాం. బ్యాక్స్ వర్డ్ అని వెనుకబడిన అంటారు. వాళ్లందరినీ వెనుకబడిన వారు అన్నప్పడికీ, ఎస్సీ ఎస్టీ వంటి వెనుకబడినవారైన అదర్ బ్యాక్ వర్డ్ అని ;hkఓబిసి అనే పేరు నిలబడి పోయింది. ఎస్సీ ఎస్టీలు కాని వెనుకబడిన వారిని ఓబిసి అంటున్నాం. భారత రాజ్యాంగంలో ఇటువంటి పదాలను వాడుకుంటున్నాం.

కోటా అనే రిజర్వేషన్లు

ఎస్సీ ఎస్టీ వారికి ఉద్యోగాల, విద్యాస్థానాల్లో, రాజకీయ పదవుల్లో కొందరికి ప్రత్యేక స్థానాలను కేటాయించడాన్ని కోటాలు అంటున్నాం. అది ఇంగ్లీషు పదాల్లోనే వాడుకుంటున్నాం కనుక అది రిజర్వేషన్ అంటున్నాం. ఇప్పడికీ మనకు అవి అర్థం కావడం లేదు. ఒకవేళ భారతీయ అని పేరు బెట్టి ఏం చేస్తారు? భారతీయ కోటా అని రిజర్వేషన్ అని మాత్రమే అనాలని, లేకపోతో జైల్లో తోస్తారా? మరీ తుగ్లక్ రాజులెవరైనా భారతీయ అనలేదని జైల్లోకి తోయవచ్చినా సాధ్యమే. ఇప్పుడు మన పాత మూడు క్రిమినల్ చట్టాలను భారతీయ పేర్లద్వారా మన భారతీయత పరిఢల్లుతున్నాయి కదా. కాని అప్పుడు అది భారతీయ జనతా పార్టీ అన్నపుడు పార్టీ అనే ఇంగ్లీషు పేరు ఎందుకు వాడుతున్నారు. భాసపా అనకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీషు మాటలతో బిజెపి అని ఎందుకు అంటున్నారు? అప్పుడు తుగ్లక్ అనే ప్రభువు గుర్తుకురావడంలో తప్పేముంది? అంటే పేరులో కూడా పేదరికం మనదే. దారిద్రతం కూడా మనదే. కనుక మనం ఎస్సీ ఎస్టీ అనీ, ఓబిసి అని అనుకుంటే ఏ తప్పులేదు. ఆ ఎస్సీల వారి మధ్య ఇంకా వెనుకబడిన వారిని ఏ పేరుతో చెబుదాం? మాల కన్న మాదిగలకు మధ్య తేడా ఎవరు నిర్ణయిస్తారు?

ఈ విషయం గురించే సుప్రీంకోర్టు (తెలుగు భాష ప్రకారం భారతీయ సమున్నత న్యాయస్థానం అంటారేమో) నిన్న తీర్పు గురించి అందరూ అనుకుంటున్నారు.

వెనుకబడిన కన్న వెనుకబడిన వారు

ఎస్సీ ఎస్టీ వారు చాలా వెనుకబడిన వారని అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాత చెప్పీ చెప్పీ నుంచి 75 సంవత్సరాలనుంచి అంటూనే ఉన్నాం. అక్కడికి మన రాజ్యాంగం ఆర్టికల్ 14లో , 14లో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అందరూ సమానమే అయినప్పుడు అగ్రవర్ణాలకు, ఎస్సీ ఎస్టీలను వెనుకబడిన తనాన్ని ఏవిధంగా నిర్ణయిస్తారనేదే కీలకమైన ప్రశ్న. గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్, అగ్రవర్ణాల వారు అణగారిన వర్గాలను మొత్తం రాజ్యాంగ రచయితలు చర్చించారు. రాజ్యాంగంలో నిర్ణాయక సభ దాదాపు ప్రతిసారీ ఎస్సీలను ఏమనాలి, ఎస్టీలను ఏ విధంగా లెక్కించాలి అన్నదే ఇప్పడికీ, నిన్న సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిలు కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు.

ఎందుకంటే, అది కదలక మెదపలేక వారికోసం కాదు ఈ రాజ్యాంగం. గతి తార్కిక ఆలోచనకు, ప్రగతి శీలతకు ఉన్న జీవన సమాజానికి అని రాజ్యాంగం అర్థం చేసుకోవాలి. రాజకీయాలకు చాలా అవసరాలు ఉంటాయి. ఎన్నికల్లో గెలవడానికి ఏమైనా చేస్తారు. కాని సమానత కోసం, సమత కోసం, ఆర్టికిల్ 14లో రాసుకున్నా అందరమూ సమానమే అనుకునే సిద్ధాంతానికి, నియమాలకు అమలుచేయడానికి ప్రయత్నం చేయడం వారి బాధ్యత. అది రాజ్యాంగ బాద్యత. ఆ సిద్ధాంతాలపైన వచ్చిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, దాని ఆలోచనల గురించి సతమతమవుతూనే ఉన్నాం. అవుననేవారు, వెంట వెంటనే కాదనే వారూ ఉంటారు.

బలహీనులకు రక్షించడానికి.. అదే ఆర్టికిల్ 15.

సమానత అంటే సరిపోదు. అసమానంగా ఉన్నవారికి పెద్ద బలం ఉన్నవారిని బలహీనులకు రక్షించడానికి ఆ ఇద్దరిరకాల మధ్య సమానత కావాలంటే అదే అసమానత. ఇది అర్థం కాని మహానుభావులకు రిజర్వేషన్లు అర్థం కాదు. ఇటువంటి వాళ్లకు దేవుడి గుడిముందు కొబ్బరికాయ కొట్టి, సమానత ఎక్కడిందెక్కడ మనదేశంలో, ఆ ప్రపంచంచూడండి ఎక్కడ ఉంది రిజర్వేషన్ అని తిట్టుకునే వారు పరమ భక్తులు కావచ్చు కాని దేశభక్తులు మాత్రం కాదు. రిజర్వేషన్లు వద్దని, సమానత వద్దని, వర్గీకరణ తప్పనే వారు, వారిలో మాలలకు మాదగివారికి మధ్య అసమానత ఉందని అర్థం చేసుకుంటే వారికి దండం. అటువంటి వారే సమానం అనుకునే వాడికి కోదండంతో కొట్టడం కావలసిందే. సుప్రీంకోర్టు అదే చెప్పింది. అందులో 6 గురు జడ్డిగారులు గట్టిగా చెప్పారు. ఒక జడ్జిగారు ఎందుకు అసమ్మతి తీర్పు ఇచ్చారెందుకో తరువాత మాట్లాడుకుందాం.

ముందు సమానత గురించి తేలితే, వాటి వెనుక సిద్ధాంతాలు దాని వెనుక రాధ్దాంతాలు, ప్రభుత్వాలు చట్టాలు చేయడం, దాన్ని న్యాయస్థానాలు కింద కొట్టిపారేయడం, మరికొందరు అయిదు జడ్జీలు మంచిదనడం, ఏడుగురిలో ఆరుగున్న మెజార్టీ వారు అవుననడం గొప్ప విషయం. దీన్ని వివరాల్లోకి వస్తేఅసలు సంగతులు తెలుస్తాయి. అందరూ సమానమే అనేది పచ్చి అబద్ధం. అమ్మానాన్న దగ్గర పెరిగిన పెద్దన్న తమ్ముళ్త నెత్తిన గొరడ చేసే వారుంటే అదే అసమానత. మామూలుగా సమాజనంలో జనాలందరు సమానం కాదు అని ఈ పాటికి అర్థం కావాలి. ఆయా మామూలు జనం మధ్య ఎస్సీ ఎస్టీ లతో అసమానత ఉంది. వారి మధ్య ఎస్టీలకు మధ్య ఎక్కువ తక్కువలు ఉన్నాయి. ఎస్సీ పేదవారి మధ్యే తక్కువ అనీ ఎక్కువఅనే సమానతలు ఉన్నాయి. కొందరు మొత్తం లాభాలో కొట్టేస్తు ఉంటే, పక్కన ఎస్సీవాడినైనా రిజర్వేషన్ లాభం అందక పోతే అతనేం చేయాలి. పోరాడాలా కాదా? అదే క్రిష్ణ మాదిగ దండోరా అని పోరాడుతున్నాడు. అందుకోసం రోడ్డు మీద పడ్డారు. అసెంబ్లీలో, సెక్రెటేరియిట్, అంబేడ్కర్ విగ్రహాల ముందు ధర్నా చేసారు. సమ్మెలు చేసారు. తుపాకులకు బలైపోయారు. దశాబ్దాల పోరాటంలో క్రిష్ణ మాదిగ 60 షష్టిపూర్తికూడా అవుతున్నది కాని ఇంకా పూర్తిగా ఎస్ ఎస్టీ వారి వర్గీకరణ రాలేదు. వచ్చేఅవకాశం ఉంది. ఆయా శాసనసభల్లో చట్టాలుచేస్తే తప్ప వర్గీకరణ ఓ కొలిక్కి వస్తుందని ఆశ.

ఒకరికి మరొకటి పోటీ కాదు

వారిలో ఎస్సీల మధ్య, అంటే అందులో మనకు తెలిసిన మాటప్రకారం, మాదిగల వారికి మాల వారికి మధ్య వర్గీకరణ అని వివరించుకోవాలి. ఒక్కమాటతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అంటూ అర్థం కావాలి, కాని కాదు. ఆ వివరణ అర్థమైన తరువాత సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ పంకజ్‌ మిథల్‌, జస్టిస్‌ సతీశ్‌చంద్ర మిశ్రా, జస్టిస్‌ బేలా ఎం త్రివేదితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 565 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించింది. అందులో ఏం చెప్పారన్నదే ముఖ్యం.

ఏం చెప్పారు?

ఎస్సీలు అణగారిన వర్గం వారు అంటే వర్గీకరణ జరిపి షెడ్యూల్డ్‌ కులాల్లో సామాజికంగా, ఆర్థికంగా మరింత వెనుకబడి ఉన్న కులాలకు ప్రత్యేక కోటా ఇచ్చేందుకు రాష్ర్టాలకు రాజ్యాంగపరమైన అధికారం ఉందని సుప్రీంకోర్టు తేల్చింది. ఇది గొప్ప నిర్ణయం.

ఇదివరకు హైకోర్టులు వర్గీకరణ రాజ్యాంగవ్యతిరేకం అన్నారు. మరి కొన్ని హైకోర్టు ఆ మాట ఒప్పుకోలేదు. కనుక సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. అక్కడ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2004న ఎస్సీ ఎస్టీకోటాలో ఉపవర్గకరణ ఉండదు అన్న తీర్పును ఈకేసు తోసి పుచ్చింది. అంతకుముందు పంజాబ్ ప్రభుత్వం 2006 శాసనం కింద ఎస్సీ వర్గాలలో రెండు కులాల సగం సీట్లలో తొలి ప్రాధాన్యం ఇచ్చారన్నారు. దాన్ని పంజాబ్ హరియాణా హైకోర్టు కొట్టివేసింది. అప్పుడు సుప్రీంకోర్టుముందుకు వెళ్లింది.

అప్పుడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజార్టీతో తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని అధికరణ 341 ప్రకారం ఎస్సీలు సజాతీయులు కాబట్టి వర్గీకరణ చేయడానికి వీలు లేదంటూ ‘ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం’ కేసులో 2004లో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాజ్యాంగ ధర్మాసనం ఈ సందర్భంగా కొట్టివేసింది.

కీలకమైన సూత్రం: 'హోమోజీనస్ క్లాస్'


Read More
Next Story