
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
మోదీ తరువాత దేవేంద్ర ఫడ్నవీసేనా?
మహారాష్ట్ర నుంచి క్రమంగా ఢిల్లీ వైపు అడుగులు పడుతున్నాయా?
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు సాధించిన భారీ విజయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పై అందరి దృష్టిని ఆకర్షించింది.
జనవరి 15న జరిగిన ఎన్నికలకు సంబంధించిన 29 కార్పొరేషన్లలో 25 కార్పొరేషన్లలో పార్టీని ఒంటిచేత్తో విజయం వైపు నడిపించారు. ఎన్నికల విజయాల స్థిరమైన రికార్డుతో ఫడ్నవీస్ ఒక తెలివైన వ్యూహాకర్తగా తన ఇమేజ్ ను బలోపేతం చేసుకున్నాడు..
2024 అసెంబ్లీ ఎన్నికల విజయం తరువాత ఆయన నాయకత్వంలో ఈ ఎన్నికల విజయాలు కూడా సాధించారు. ఈ పార్టీ దాని కూటమి భాగస్వాములు, ప్రధానంగా ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, 288 సభ్యుల సభలో 236 స్థానాలతో రికార్డు స్థాయిలో విజయం సాధించింది. వీటిలో 131 స్థానాలను బీజేపీ సొంతంగా గెలుచుకోగా, 57 స్థానాలను శివసేన తన ఖాతాలో వేసుకుంది.
ఆ తరువాత జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ ఎన్నికలలో కూడా పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రతిపక్షాల కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చింది.
ఈ విజయాల పరంపరంలో తాజా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఇక్కడ బీజేపీ మొత్తం 2,869 సీట్లలో 1425 గెలుచుకుంది. విశేషమేమిటంటే ఇక్కడ స్టార్ క్యాంపెనయిర్లుగా ఎవరూ లేరు. ముఖ్యంగా బీజేపీ చాలాకాలంగా ఆధారపడుతున్న మోదీ, అమిత్ షా లు ఇక్కడకు రాలేదు.
ఫడ్నవీస్ ఎదుగుదల..
మహాత్మా జ్యోతిబా పూలే, షాహు మహారాజ్, బాబా అంబేడ్కర్ రూపొందించిన ప్రగతిశీల సామాజిక సైద్దాంతిక పునాది రాజకీయాలలో హిందూత్వవాదానికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్రంలో ఇలాంటి ఫలితాలు ఆయన స్థాయిని పెంచాయి.
ఇప్పుడు ఫడ్నవీస్ స్థానం మోదీ, అమిత్ షా తరువాతది చెప్పవచ్చు. ఆయన పనితీరు, రాజకీయ నైపుణ్యాలు, నాయకత్వం దృఢత్వం సమ్మేళనంలో పేరు పొందారు.
స్థానిక నాగపూర్ ఎమ్మెల్యే నుంచి బీజేపీ మహారాష్ట్ర వ్యూహంలో కేంద్ర వ్యక్తిగా ఫడ్నవీస్ ఎదగడం 11 సంవత్సరాల స్వల్పకాలంలోనే జరిగింది. 2014 లో ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
అదే ఆయన జీవితంలో కీలక మలుపు. ఆయన గతంలో కనీసం మంత్రిగా కూడా పనిచేయలేదు. అప్పట్లో ఈ చర్య అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ కాలంలో ఫడ్నవీస్ రాజకీయంలో గుర్తించిన మరో అంశం ఏంటంటే హిందూత్వాన్ని మరింత దృఢమైన వైఖరితో ప్రచారం చేయడం.
మరాఠా రాజకీయాలు చాలాకాలంగా ఆధిపత్యం చెలాయించిన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బ్రాహ్మణుడిని ఎన్నుకోవడం అసాధారణం. 1995 లో శివసేన నాయకుడు మనోహర్ జోషి మాత్రమే ఇక్కడ మినహాయింపు.
అయితే ఆయన ఐదు సంవత్సరాలు బాధ్యతలు స్వీకరించిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఎంతో నమ్మకంతో పరిపాలనను స్థిరత్వంగా నిర్వహించారు. మహారాష్ట్రలో గడచిన కొన్ని దశాబ్ధాలలో పూర్తి కాలం మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పదవీకాలం సమర్థవంతంగా పూర్తి చేసింది ఆయనే.
ఈ కాలంలో కూడా ఆయన ప్రశాంతంగా, నాగరిక సమాజపు నాయకుడిగా కనిపించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా నేతృత్వంలో ఉన్న బీజేపీ ప్రస్తుత శైలికి ఆయన వైఖరి విరుద్దంగా ఉంది.
తన ఐదు సంవత్సరాల కాలంలో ఫడ్నవీస్ బహిరంగంగా దూకుడు హిందుత్వ రాజకీయాలను ఆచరించాల్సిన అవసరం లేదు. ఇది దేశంలోని ఇతర ప్రాంతాలలో మహారాష్ట్రలోనూ ప్రమాణంగా మారుతోంది.
ఇంజనీరింగ్..
2019 లో అసెంబ్లీ ఎన్నికల తరువాత శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే సీఎం పదవిని తీసుకోవడంతో బీజేపీతో పొత్తు తెగిపోయింది. ఈ ఆరు సంవత్సరాలు మాత్రమే ఆయన కఠినమైన పరీక్ష ఎదుర్కొన్నారు.
అయితే కొన్ని అసాధారణమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఆయన రాష్ట్రంలోనే కాకుండా, భారత రాజకీయాల్లో కూడా మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఠాక్రే వైఖరిని సవాల్ చేయడానికి 2019 నవంబర్ 23న తెల్లవారుజామున ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తనకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మద్దతు ఇచ్చారని చెప్పారు.
అయితే తరువాత ఆయన కూడా మొహం చాటేయడంతో కేవలం మూడు రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. తరువాత రెండు సంవత్సరాల్లోనే మహారాష్ట్ర అసాధారణమైన రాజకీయ పున: వ్యవస్థీకరణను చూసింది.
ఉద్దవ్ ఠాక్రే తన సైద్దాంతిక బద్ద విరోధులు అయిన ఎన్సీపీ, కాంగ్రెస్ లతో చేతులు కలిపింది. ఆయనే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చుకున్నారు. ఆ కాలంలో బీజేపీ శక్తి విహీనంగా కనిపించింది.
ఇదే సమయంలో ఫడ్నవీస్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నాడు. తన చేతికి మట్టి అంటకుండానే శివసేన, ఎన్సీపీలను బలహీనపరిచే ఎత్తులు వేశాడు. దీనితో షిండే శివసేనలోని 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. వీరు కలిసి తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఓపికకను ప్రతిఫలం..
ఈ ఎపిసోడ్ లో కొన్ని విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో తిరిగి అధికారం పొందాలనే లక్ష్యంగా వారి వైఖరిలో కనిపించింది. ఫడ్నవీస్ ఇది వరకు తాను అమలు చేసిన మృదువైన, మెత్తని మనస్సు ఉన్న నాయకుడు అనే ఇమేజ్ ను పక్కన పెట్టి దృఢమైన రాజకీయ నిర్ణయాలకు తెరతీశాడు.
తరువాత రెండున్నర సంవత్సరాలు ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా షిండే కింద పనిచేశారు. నిజానికి వేరే వ్యక్తులు అయితే తనకు డిమోషన్ లభించిందని బాధపడేవారు, అనవసర వివాదాలకు తెరతీసేవారు.
కానీ ఫడ్నవీస్ అవేమీ చేయకుండా తన సమయం కోసం వేచి చూవారు. 2024 అసెంబ్లీ ఎన్నికల తరువాత మరోసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు షిండే తన డిప్యూటీ అయ్యారు.
ఎదురుదెబ్బ నుంచి ఆధిపత్యం వైపుగా..
ఈ మధ్యకాలంలో తమకు పోటీగా ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ విభజించారు. అజిత్ పవార్ పక్కకు లాగి వారితో బీజేపీ పొత్తుపెట్టుకునేలా ఎత్తులు వేశారు. ఆరు దశాబ్ధాలకు పైగా తన రాజకీయ జీవితంలో శరద్ పవార్ ఇంత తీవ్రమైన ఎదురుదెబ్బ ఎప్పుడూ తగలలేదు.
ఇదే సమయంలో గ్రామపంచాయతీలు, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ లు ఇలా క్షేత్ర స్థాయిలోనూ ప్రతిపక్షాల కోటలను ఆయన కూలుస్తునే ఉన్నాడు. వందలాది మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరారు. దీనితో ఎన్సీపీ బలంగా 52 కి పడిపోయింది.
2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీకి మాత్రం గట్టి ఎదురుదెబ్బె తగిలింది. బీజేపీకి 48 సీట్లలో కేవలం 17 సీట్లు మాత్రమే దక్కాయి. 2019 ఎన్నికల్లో పార్టీకి 27 స్థానాలు వచ్చాయి. బీజేపీ, ఫడ్నవీస్ రాజకీయాలను భారీ మూల్యం చెల్లించుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావించారు.
కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనూహ్యంగా విజయం వైపుకు దూసుకెళ్లింది. 288 స్థానాలున్నా అసెంబ్లీలో 236 సీట్లు గెలుచుకుంది. ఇదే విజయ పరంపరను ఇప్పుడు మున్సిపల్ కౌన్సిల్, గ్రామపంచాయతీల్లోనూ కంటిన్యూ చేశారు.
హిందూత్వ రాజకీయాల మలుపు..
ఫడ్నవీస్ రాజకీయ సాధనాల్లో ముఖ్యమైనది ఆయన హిందూత్వాన్ని బలంగా స్వీకరించడం. హిందూ సమాజం నుంచి ర్యాలీలు నిర్వహించడానికి అనుమతించడం, బలమైన హిందూ గుర్తింపును వ్యక్తీకరించడం, రాష్ట్రంలో బీజేపీ సైద్దాంతిక ఆకర్షణకు ఆయన కేంద్రంగా మారారు.
ఒకప్పుడు ఆయన సున్నితమైన పని చేయడానికి ఇష్టపడి ఉండవచ్చు. కానీ మోదీ- షా యుగంలో ఉండటం వల్ల ఆయన కూడా కఠినమైన వైఖరికి మారాల్సి వచ్చింది. అందువల్ల లోక్ సభ ఎన్నికల్లో తగిలిన బలమైన దెబ్బ నుంచి ఆయన బయటపడి 20 నెలల్లోనే బలీయమైన శక్తిగా కమలదళాన్ని నిలిపారు.
ఈ కాలంలోనే ఆయన అనేక రాజకీయ తుఫాన్లను ఎదుర్కొన్నాడు. అందులో ముఖ్యమైన మరాఠా రిజర్వేషన్ల అంశంపై ఉద్యమం చేస్తున్న మనోజ్ జరంగే పాటిల్ నుంచి ఎదురైంది.
ఆయన తరుచుగా దీక్షలు చేసి ఫడ్నవీస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కానీ ఫడ్నవీస్ ఈ అడ్డంకులు సులువగా దాటగలిగారు. తన కూటమి భాగస్వాములను అదుపులో ఉంచగలిగారు.
పార్టీ బలాన్ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేశారు. ఇవన్నీ ఒకప్పుడూ ప్రత్యేక విదర్భ రాష్ట్ర లక్ష్యంతో ముడిపడి ఉన్న నాగ్ పూర్ కు చెందిన స్థానిక నాయకుడిని రాష్ట్ర వ్యాప్త ఆకర్షణ కలిగిన ప్రజా నాయకుడిగా మార్చాయి. బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు అతడిని ‘దేవా బాపు’ అని ప్రేమగా పిలవడంలో ఆశ్చర్యం లేదు.
ముఖ్యమంత్రి పదవిపై ఆశపెట్టుకున్న షిండే కొన్ని సమయాల్లో ఫడ్నవీస్ కు కష్టాలు తెచ్చిపెట్టాడు. కానీ ఇప్పటి వరకు షిండేను అదుపులో పెట్టగలిగారు. తాజాగా బృహన్ ముంబై కార్పొరేషన లోనూ షిండే గ్రూప్ మేయర్ పదవి కోసం డిమాండ్ చేయడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీనిని ఫడ్నవీస్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలి.
ఢిల్లీకి వెళ్లేదారి..
కొన్ని సంవత్సరాల తరువాత ఫడ్నవీస్ దారి ఎటువైపు వెళ్తుంది. ముఖ్యంగా 2029 సార్వత్రిక ఎన్నికల తరువాత పార్టీ అధికారాన్ని నిలుపుకున్నా, నిలుపుకోకపోయినా మోదీ తరువాత బీజేపీకి ప్రత్యామ్నాయా నాయకుడిగా నిలుస్తారా? అనతికాలంలోనే అది సాధ్యమా?
సంప్రదాయకంగా మత రాజకీయాలను ప్రతిఘటించి రాష్ట్రం మహారాష్ట్ర. అయితే హిందుత్వానికి అనుకూలంగా ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, అస్సాం మాదిరికాకుండా ఫడ్నవీస్ 2029 లో బీజేపీలో గుర్తింపు పొందిన నాయకుడిగా మారవచ్చు.
ఈ కాలంలోనే ఆయన దృఢమైన హిందూత్వ నాయకుడిగా మాత్రమే కాకుండా అనేక మంది ఇతర పోటీదారులకంటే ఎక్కువ అవకాశాలున్న నాయకుడిగా చూడవచ్చు. ఆయన బాగా చదువుకున్నవారు, అనేక అంశాలపై నిష్ణాతులు, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.
అంతర్జాతీయ వ్యవహరాలను నేర్పుతో హ్యండిల్ చేసే సత్తా ఉన్నవారు. మంచి రాజకీయ చతురత కూడా ఉంది. మోదీ-షా లాగే 24 గంటలు పనిచేసే తత్వం కలవాడు. అన్నింటికంటే ముఖ్యమైనది ఆయన వయస్సు. 2029 నాటికి ఆయన వయస్సు కేవలం 55 సంవత్సరాలే ఉంటుంది.
బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఆశీర్వాదం ఆయనకు బలంగా ఉంది. 2024 ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ చురుకుగా పాల్గొనకపోవడం వల్లే ఓటమి పాలైంది. దీన్నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి క్షేత్రస్థాయిలో ఈ సంస్థతో ఫడ్నవీస్ పనిచేశారు.
ఆర్ఎస్ఎస్ బీజేపీ తదుపరి నాయకుడిగా గడ్కరీతో పాటు, ఫడ్నవీస్ పేరును సైతం సూచించిందని బీజేపీలో ఊహగానాలు వచ్చాయి. ప్రస్తుత బీజేపీ నాయకత్వంలో ఎవరికి ఇలా సాధ్యం కాలేదు.
2029 వరకూ తాను మహారాష్ట్రను విడిచిపెట్టబోనని ఫడ్నవీస్ స్వయంగా చెబుతున్నారు. 2029 తరువాత ఆయన ఢిల్లీ వెళ్లడానికి సిద్ధం అయినట్లు ఇందులో స్పష్టమైన సంకేతం దాగి ఉంది.
మోదీ అనంతరం..
మోదీ తరువాత బీజేపీకి ఏం జరుగుతుందో చాలామంది ఆలోచిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ దశాబ్ధకాలంగా నిశ్శబ్దంగా ప్లాన్ బీ లేదా కొందరు అనుకుంటున్నట్లుగా ప్లాన్ డీ(దేవేంద్ర ఫడ్నవీస్) కోసం పనిచేయవచ్చు.
201 4 లో తనకు ఇష్టమైన వ్యక్తిని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడంతో ఆర్ఎస్ఎస్ విఫలం అయింది. ఈసారి ఆ అవకాశాన్ని వదులుకోకపోవచ్చు. ఆ సందర్భంలో అమిత్ షా స్థానం ఎంటనేది తెలియదు. ఫడ్నవీస్ ఆ గౌరవప్రదమైన స్థానం లభిస్తే ఆయన అంగీకరిస్తారా? అది సంఘ్- బీజేపీ మధ్య ఉద్రిక్తతకు బీజాలు వేసే అవకాశం ఉంది.
ఫడ్నవీస్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం వల్ల భారత రాజకీయాల్లో హిందూత్వ ప్రభావం భవిష్యత్ ను గణనీయంగా మార్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే.. ఆర్ఎస్ఎస్ ఆ జూదానికి దిగుతుందా?
కానీ మోదీ తరువాత ఫడ్నవీస్ ప్రధానమంత్రి అయితే భారత్ లౌకిక రాజకీయాలను తీసుకువస్తారా? ఫడ్నవీస్ రాజకీయ నిర్వహణలోనే కాకుండా పాలనలో కూడా సమర్థుడిగా పరిగణించబడుతున్నందున సమాధానం చాలామంది ఊహించిన దానికంటే ఎక్కువ కలవరపెట్టేదిగా ఉండవచ్చు.
బీజేపీలోని ఇతరుల కంటే ఆయన అర్థిక వ్యవస్థను బాగా అర్థం చేసుకుంటారు. మోదీ పాలనలో సాధించిన ఫలితాలను అధిగమించే ఫలితాలను అందించగలరు. బలమైన హిందూత్వ ధోరణికి మెరుగైన పాలన తోడైతే అటువంటి నాయకత్వాన్ని తొలగించడం ప్రత్యర్థులకు చాలా కష్టమవుతోంది. కాబట్టి, ప్రధానమంత్రిగా ఫడ్నవీస్ లౌకికవాదం, ప్రజాస్వామ్య నిబంధనల పునరుద్దరణకు మోదీ కంటే పెద్ద సవాల్ విసిరే అవకాశం ఉంది.
(ది ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను ప్రచురిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. అవి తప్పనిసరిగా ‘ది ఫెడరల్’ అభిప్రాయాలను ప్రతిబింబించవు)
Next Story

