ఒడిశాలో బీజేడీని పాండియన్‌ గెలిపిస్తాడా?
x

ఒడిశాలో బీజేడీని పాండియన్‌ గెలిపిస్తాడా?

ఒడిషాలో బిజు జనతా దళ్‌ పార్టీని గద్దె దింపేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే కాని వారి ప్రయత్నాలు ఫలిస్తాయా?


ఆయన ఓ తమిళియన్‌. ఐఏఎస్‌ అధికారి. ఇటీవలే స్వచ్చంధ విరమణ చేశారు. అంతకుముందు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు ప్రైవేటు కార్యదర్శిగా పనిచేసి ‘మోస్టు ఎఫీసియంట్‌గా వర్సన్‌’గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒడిశా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఆయనే కార్తీకేయన్‌ వి. పాండియన్‌..

ఒడిశాలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. నెక్ట్స్‌ సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తర్వాత ఆ పీఠాన్ని ఓ ఐఏఎస్‌ అధికారి అధిరోహిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

మోస్టు ఎఫీసియంట్‌గా వర్సన్‌గా..

కార్తికేయన్‌ పాండియన్‌ పట్నాయక్‌ పాలనలో అత్యంత కీలకంగా వ్యవహరించి, ‘మోస్టు ఎఫీసియంట్‌గా వర్సన్‌’గా పేరు తెచ్చుకున్నారు.ఇటీవల తన ఐఏఎస్‌ ఉద్యోగానికి స్వచ్చంద పదవి విరమణ చేశారు. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వస్తాయన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అనుకున్నట్లుగానే కార్తికేయన్‌ పాండియన్‌ తమ పార్టీలో చేరుతున్నట్లు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు.

ఎవరీ పాండియన్‌..

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రైవేట్‌ సెక్రటరీ పాండియన్‌. 2000 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఇతను ఓ తమిళియన్‌. 2002-2004 ఒడిషాలోని కలహండిలో సబ్‌ కలెక్టర్‌గా, 2005-2007 మయూర్‌భంజ్‌లో కలెక్టర్‌గా, 2007 - 2011 గంజాంలో కలెక్టర్‌గా, 2011లో ఒడిశా సీఎం ప్రైవేట్‌ సెక్రటరీగా పనిచేశారు. కొంతకాలానికి ఒడిషా 5టి అధికారిగా విధులు నిర్వహించారు. ఒడిషాలోని ఒడియా అమ్మాయిని వివాహమాడారు. భార్య పేరు సుజాత. ఐఎఎస్‌ అధికారి అయిన ఈమె ఒడిశా మిషన్‌ శక్తి కార్యదర్శిగా ఉన్నారు.

పాండియన్‌కు అవార్డులు..

పాండియన్‌ బాధ్యతాయుతంగా పనిచేయడం వల్ల ఆయన్ను ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయన పలు అవార్డులను అందుకున్నారు. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ ద్వారా హెలెన్‌ కెల్లన్‌, వికలాంగుల సంక్షేమం కోసం నేషన్‌ అవార్డు, ఇంటర్నేషనల్‌ హాకీ ఫెడరేషన్‌ ద్వారా ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్‌ అవార్డును పాండియన్‌ అందుకున్నారు.


Read More
Next Story