ఆ వర్గాలకు బీజేపీ అనుకూలమా?
x

ఆ వర్గాలకు బీజేపీ అనుకూలమా?

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ లో చాలా మంది ఆర్థికవేత్తలు ఉన్నారు. అశోక్‌ గులాటీ, అషిమా గోయల్‌, అమిత్‌ మిత్రా లాంటి ఆర్థికవేత్తలు


రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ (RSS)లో చాలా మంది ఆర్థికవేత్తలు ఉన్నారు. అశోక్‌ గులాటీ, అషిమా గోయల్‌, అమిత్‌ మిత్రా లాంటి ఆర్థికవేత్తలు వ్యవసాయ సబ్సిడీలకు పూర్తిగా వ్యతిరేకం. గుత్తాధిపత్య పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తారు.

ఈ క్యాపిటలిస్టులు స్వభావరీత్యా బంధుమిత్రులు. బడ్జెట్‌ సొమ్మును ప్రైవేట్‌ కాంట్రాక్టర్ల చేతుల్లోకి నెట్టే విధానాలను రూపొందిస్తారు. బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని సిఫార్సు చేస్తారు. ప్రైవేటీకరణకు ఒత్తాసు పలుకుతూ..గుత్తాధిపత్య పెట్టుబడిదారులకు తక్కువ ధరకు రాష్ట్ర పరిశ్రమలు దక్కేలా వ్యవహరిస్తారు.

క్యాపిటలిస్టులు(Capitalits) దళితులు / ఆదివాసీలు / ఓబీసీలకు రిజర్వేషన్‌లకు వ్యతిరేకం. దీన్నే నేను బ్రాహ్మణ-బనియా డెవలప్‌మెంట్‌ మోడల్‌ (బీబీడీఎం) అని పిలుస్తాను.

దక్షిణ భారతంలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణ కంటే ఉత్తర భారతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చాలా బలంగా ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న నార్త్‌ ఇండియాలో కంటే సౌత్‌ ఇండియాలో వ్యవసాయ, చేతివృత్తుల రంగాలకు రాయితీలు చాలా ఎక్కువ.

దక్షిణాది కంటే ఉత్తరాదిలో అగ్రకులాల అభివృద్ధి చాలా ఎక్కువ. ఉత్తర భారతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఉనికి పేదరికానికి, ప్రజా సంక్షేమం పట్ల అజ్ఞానానికి మూలం. దక్షిణాది రాష్ట్రాలలో వ్యవసాయ, చేతివృత్తి వర్గాలు తమ అభివృద్ధి గురించి స్పష్టమైన అవగాహనతో ఉన్నారు.

వ్యవసాయ, గ్రామ సంక్షేమ పథకాలు తమిళనాడులో ప్రారంభమయ్యాయి. 2023 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీ రైతు సంక్షేమ ఎజెండాతో వచ్చింది. దక్షిణాది అభివృద్ధి నమూనాను శూద్ర అభివృద్ధి నమూనా (ఎస్‌డీఎం)గా అని పిలుస్తారు.

కుల, సాంస్కృతిక, సామాజిక క్రమాన్ని పునర్నిర్మించడంలో ఎస్‌డీఎం దోహదపడుతుంది. బీబీడీఎం కులతత్వ, పేదలకు వ్యతిరేకం. దేశం ఆధునిక ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు సాగాలంటే ఎస్‌డీఎం చాలా అనుకూలం.

ఆర్‌ఎస్‌ఎస్‌, దాని ఆర్థికవేత్తలు అమెరికా గుత్తాధిపత్య ` చైనీస్‌ అధికార నమూనాను అనుసరిస్తున్నారు.శూద్రులు/దళితులు/ఆదివాసీలు వారి నమూనాతో పోరాడకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుంది.

కేంద్రీకృత సంపద..

దేశ ఆర్థిక వ్యవస్థపై తమ హిందుత్వ దృక్పథాన్ని చాలా కాలంగా రాస్తూ, మాట్లాడుతున్నారు. వ్యాపార వర్గాలతో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉన్న అంతర్గత సంబంధాలు.. గుత్తాధిపత్య పెట్టుబడి వ్యవస్థలో బ్రాహ్మణులు, బనియాలను ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌/బీజేపీ శక్తులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రెండు వర్గాలలో భారీగా సంపద కేంద్రీకృతమైంది.

వ్యవసాయ, చేతివృత్తుల వారి పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్‌(Congress) హయాంలో అధికారంలో ఉన్న లౌకిక బ్రాహ్మణ-బనియా పాలక శక్తుల కంటే బ్రాహ్మణ-బనియా వ్యాపారుల ఇళ్లలో సంపద కేంద్రీకరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ యత్నిస్తోంది. కాంగ్రెస్‌ హయాంలో అయినా, ఇప్పుడయినా కేంద్ర ప్రభుత్వంపై ద్విజ సంఘాల నియంత్రణ పూర్తిగా ఉంది.

ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవసాయ, చేతివృత్తుల వారిని శూద్ర ఆర్థిక రంగాలుగా భావిస్తోంది. శూద్రులు ద్విజ సంక్షేమం కోసం సంపదను ఉత్పత్తి చేయవలసి వస్తుంది.

ఉచితాలను ఎగరేస్తున్నారు..

రైతులకు, రైతుకూలీలకు, గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు ఉచిత (ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మాటల్లోనే) వాగ్దానాల పేరుతో బీజేపీ రైట్‌వింగ్‌ ఆర్థికవేత్తలు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఎన్నికల మేనిఫెస్టోల్లో ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఆమోదించిన రైతు రుణమాఫీ పథకాలు ఆర్‌ఎస్‌ఎస్‌/బీజేపీ ఆర్థికవేత్తలకు చికాకు కలిగించాయి.

ఆర్‌ఎస్‌ఎస్‌/బీజేపీ నియమించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌, శూద్ర ఆర్థికవేత్త ఉర్జిత్‌ పటేల్‌ను కొద్దిరోజుల వ్యవధిలోనే ఆ పదవి నుంచి బయటకు పంపించారు.

ప్రజానీకానికి ఇచ్చే ఉచితాలు భవిష్యత్‌ భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాదంగా మారుతాయని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆర్థికవేత్తలు అంటున్నారు. చాలా వరకు గుత్తాధిపత్య పారిశ్రామిక కుటుంబాలు ముంబైలో అల్పాహారం, లండన్‌లో రాత్రి భోజనం చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. దేశ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసే దేశభక్తుల్లా వారిని చూయిస్తున్నారు.

హిందూత్వ ఆర్థికవేత్తల సూత్రీకరణ సాధారణంగా ఇలా ఉంటుంది: ‘‘వ్యవసాయానికి ఉచితాలు లేవు. బడ్జెట్‌ ఎకానమీ తప్పనిసరిగా టెస్లా కార్లలో హైవేలపై కదలాలి. ఇది కొత్త జాతీయవాదం.

భారీ మొత్తంలో విదేశీ బ్యాంకులకు నగదు బదిలీ చేసి, తాము నష్టాల్లో ఉన్నామని బడా వ్యాపారులు చూపించినప్పుడు వారి లక్షల కోట్ల బ్యాంకు రుణాలను కేంద్రం మాఫీ చేస్తుంది.

బడా వ్యాపారవేత్తలు భారత్‌ను వదిలి ఇంగ్లండ్‌లోనో, అమెరికాలోనో, కెనడాలోనో, ఆస్ట్రేలియాలోనో స్థిరపడుతున్నారు. ఇక్కడి గ్రామాల నుంచి ఏ రైతు, కార్మికుడు లేదా చేతివృత్తిదారుడు విదేశాలకు పారిపోడు. నుదుటిపై పెద్ద తిలకం దిద్దుకుని విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకునే బడా వ్యాపార శక్తులు భారత్‌కు మెరుగైన సేవలందిస్తున్నాయని వారు భావిస్తున్నారు.

మోదీ మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌లో స్నేహపూర్వక స్వరంతో.. వారి వివాహాలను భారతదేశంలో జరుపుకోవాలని సలహా ఇచ్చారు. కానీ ఈడీ లేదా ఆదాయపు పన్ను అధికారులు దాచిన సంపద కోసం వారి ఇళ్లకు, కార్యాలయాలకు వెళ్లరు.

కులతత్వ భావజాలం

దేశంలో (రెవిడి సంస్కృతి) ఉచితాలు పంపిణీ చేసి ఓట్లు సేకరించే సంస్కృతిని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొంతకాలం క్రితం మోదీ చెప్పారు. ఉచిత వాగ్దానాలు చేసి ఓట్లు దండుకునే ఆ సంస్కృతి దేశ అభివృద్ధికి చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.

‘‘రెవిడి సంస్కృతి ఉన్నవారు కొత్త ఎక్స్‌ప్రెస్‌ వేలు, కొత్త విమానాశ్రయాలు/రక్షణ కారిడార్‌లను ఎప్పటికీ నిర్మించరు. మనమంతా కలిసి ఈ ఆలోచనను ఓడిరచాలి. దేశ రాజకీయాల నుంచి రెవెడి సంస్కృతిని తొలగించాలి. ’’అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాని చేసిన మరో ముఖ్యమైన రాజకీయ ఆర్థిక ప్రకటన ఏమిటంటే.. ‘‘మేము పారిశ్రామికవేత్తల పక్కన నిలబడటానికి భయపడే వ్యక్తులు కాదు’’అని.

పైన పేర్కొన్న రెండు.. ఆర్‌ఎస్‌ఎస్‌/బీజేపీ నాయకత్వ గుత్తాధిపత్య అనుకూల ఆర్థిక, రాజకీయ వైఖరిని సూచిస్తున్నాయి. నయా ఉదారవాద ఆర్థిక ఆలోచనలో కులతత్వ ఆర్థిక భావజాలం ఉంది.

(ఫెడరల్‌ స్పెక్ట్రమ్‌ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను అందించడానికి ప్రయత్నిస్తుంది. కథనాలలోని సమాచారం, ఆలోచనలు లేదా అభిప్రాయాలు రచయితకు చెందినవి.)

Read More
Next Story