కర్ణాటకలో ఆలయాల్లో ప్రవేశానికి డ్రెస్‌కోడ్ కోసం వత్తిడి
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సృష్టించిన సందడిలో కర్ణాటకలోని ఆలయాల్లో డ్రస్‌కోడ్ అమల్లోకి తేవాలని సంఘ పరివార్ ప్రయత్నిస్తూ ఉంది
కర్ణాటకలో ఆలయాలను సందర్శించే భక్తులకు డ్రెస్‌కోడ్ అమలు చేయాలని బీజేపీ మిత్రపక్షాలు, హిందూ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. పురుషులు, మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో రావాలని పట్టుబడుతున్నాయి. హిందువుల పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడేందుకు డ్రెస్ కోడ్ తప్పనిసరి అంటున్నాయి ఈ సంఘాలు. బెంగళూరులోని కొన్ని దేవాలయాల్లో డ్రస్‌కోడ్‌ను సూచించే బోర్డులు కూడా ఈ సంఘాలే వేలాడదీస్తున్నాయి.
కర్నాటకలోని కోస్తా జిల్లాల్లో డ్రస్ కోడ్ తప్పనిసరి చేయడానికి, ఆలయంలోకి ప్రవేశించే ముందు ‘‘సరైన దుస్తులు’’ ధరించాలని సూచిస్తూ బజరంగ్ దళ్ పోస్టర్లు వెలిశాయి.
కర్ణాటకలో తమ రాజకీయ ఎజెండాను ప్రచారం చేయడానికి బీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఈ సంఘాలు ఒక సాకుగా తీసుకుంటున్నాయి..
వాటితో నో ఎంట్రీ..
షార్ట్‌లు, చిరిగిన జీన్స్, టీ-షర్టులు, మినీలతో దేవాలయాలలోకి ప్రవేశించడదాన్ని నిషేధించాలని ఈ సంఘాలు ఆంక్షలు విధిస్తున్నాయి, స్త్రీలు చీర లేదా సల్వార్ కమీజ్ ధరిస్తేనే ఆలయంలోకి అనుమతించాలని ఈ సంఘాలు చెబుతున్నాయి.
అమలు చేయలంటున్నది ఎవరు?
ఈ డ్రెస్ కోడ్ ను అమలుచేయాలంటున్నది ప్రభుత్వం గాని, ఆలయ పాలక మండళ్లు కాదు. కర్ణాటక దేవస్థాన మహాసంఘ (కర్ణాటక దేవాలయాల సంఘం), హిందూ జనజాగృతి సమితి (హెచ్‌జేఎస్) ఆలయ నిర్వాహకులను డ్రెస్ కోడ్‌ను అమలు చేయాలని కోరుతున్నాయి. ఇవన్నీ సంఘ్ పరివార్ సంస్థలు.
హుబ్బల్లిలో జరిగిన హెచ్‌జెఎస్, కర్ణాటక టెంపుల్-మట్, రిలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ ఫెడరేషన్ సమావేశంలో డ్రెస్ కోడ్‌కు సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయాల్లో డ్రెస్‌కోడ్‌ను అమలు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డికి వారు విజ్ఞప్తి చేశారు.
ప్రజలు దేవాలయాలలో మంచి సాంప్రదాయ దుస్తులను ధరించాలని హెచ్‌జేఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్ గౌడ ‘ది ఫెడరల్’తో అన్నారు.
ప్రైవేట్ ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో నడిచే 500పైగా దేవాలయాల్లో డ్రెస్‌కోడ్‌ను అమలు చేయనున్నట్లు హెచ్‌జేఎస్ వర్గాలు తెలిపాయి. ఇందులో బెంగళూరులోని 50కి పైగా ప్రధాన ఆలయాలు ఉన్నాయి.
హేతువాదుల మాటేంటి?
డ్రస్‌కోడ్‌ను హేతువాదులతో పాటు భావప్రకటనా స్వేచ్ఛను సమర్థించే వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి దుస్తులు ధరించాలో ఎంచుకునే హక్కు అందరికీ ఉందని, దేవాలయం అనేది ఆధ్యాత్మిక, స్వచ్ఛమైన భావాలకు అనుసంధానంగా ఉండే పవిత్ర స్థలం అని గుర్తు వారు చేస్తున్నారు.
అక్కడ ప్రవేశం లేదు..
కటీల్‌లోని దుర్గాపరమేశ్వరి ఆలయం, పొలాలిలోని ఆజరాజేశ్వరి ఆలయంలో రెండేళ్ల క్రితం భక్తులకు సంప్రదాయ దుస్తులను తప్పనిసరి చేశారు.
2017లో దేవాలయాల్లోకి ప్రవేశించే ముందు కర్ణాటక రాజ్య ధార్మిక పరిషత్ (కర్ణాటక రాష్ట్ర మత సమాఖ్య) పురుషులు జీన్స్, షార్ట్‌లు, టీ-షర్టులు ధరించరాదని, మహిళలు చీర లేదా సల్వార్ కమీజ్ ధరించాలని కోరింది.
కర్ణాటకలోని గత బీజేపీ ప్రభుత్వం హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి కల్పించడానికి చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చింది.
కర్ణాటకలోని 1,80,000 పైగా ఉన్న దేవాలయాలలో సంవత్సరానికి రూ. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న 34,563 మాత్రమే దేవదాయశాఖ కిందకు వస్తాయి.