ఆర్టికల్‌ 370 సుప్రీం తీర్పు బీజేపీకి లాభిస్తుందా?
x
ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన తర్వాత లాల్‌ చౌక్‌ వద్ద ప్రధాని మోదీ కటౌట్‌ వద్ద భద్రతా సిబ్బంది

ఆర్టికల్‌ 370 సుప్రీం తీర్పు బీజేపీకి లాభిస్తుందా?

ఆర్టికల్‌ 370 రద్దుకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీకి, బీజేపీకి


ఆర్టికల్‌ 370 (Article 370) రద్దుకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీకి, బీజేపీకి ప్రోత్సాహనిచ్చింది. ప్రతిపక్షాలకు రాబోయే ఎన్నికల సవాళ్లను మరింత కష్టతరం చేసింది.

మూడు రాష్ట్రాల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాధించింది. అయోధ్యలో రామమందిరాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించిన వెంటనే రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడారు. ఊహించినట్లుగానే, షా కాంగ్రెస్‌ పార్టీని, కాశ్మీర్‌కు సంబంధించి నెహ్రూ తీసుకున్న నిర్ణయాలను కూడా విమర్శించారు.

జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన మద్దతు ఇవ్వడం అంటే 70 ఏళ్ల తర్వాత అది పూర్తిగా భారతదేశంలో భాగం కావడాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది.

షా డిసెంబర్‌ 11న రాజ్యసభలో ప్రసంగించారు. నెహ్రూ, కాంగ్రెస్‌(Congress) గత తప్పిదాల వల్ల రాష్ట్రంలోని కొంత భాగాన్ని పాకిస్తాన్‌కు (పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రాంతాలను సూచిస్తూ) ఇచ్చారని కూడా విమర్శించారు.

అయోధ్యలో దేవాలయం కోసం ప్రచారం ప్రారంభించకముందే ఈ హామీ ఇచ్చారు. ఇప్పుడు కోర్టు ఆమోదంతో బీజేపీ ఈ విజయాన్ని తమ ఖాతాల్లో వేసుకుంది.

సరళంగా చెప్పాలంటే..ఈ నిర్ణయం వివాదాస్పదమైనప్పటికీ, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. మరోవైపు ఆర్టికల్‌ 370 తొలగింపునకు కూడా సుప్రీం కోర్టు మద్దతు ఇచ్చింది.

ఆర్టికల్‌ 370 రద్దును సమర్ధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు విరుద్ధమైనదిగా అనిపించవచ్చు. తీవ్ర వ్యతిరేకత, న్యాయపర చిక్కులు ఎదురైనా.. బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చిందన్నది ప్రధానాంశం. దాన్ని సాకారం చేశారు మోదీ.

బీజేపీ ఇప్పుడు తన మూడో కల యూనిఫాం సివిల్‌ కోడ్‌ నెరవేర్చుకోవడంపై దృష్టి పెట్టవచ్చు. కాషాయ పార్టీ పాలనలో ఉన్న ఉత్తరాఖండ్‌లో కోడ్‌ అమలు దాదాపు పూర్తయింది. జాతీయ స్థాయిలో కూడా ఇదే చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్న బీజేపీ.. ఆ దిశగా వ్యూహరచన చేస్తోంది.

ఇండియా కూటమి ఇప్పుడు ఏప్రిల్‌-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా సవాళ్లతో కూడిన పోరును ఎదుర్కొంటోంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాజస్థాన్‌లో ఇటీవల కమలం పార్టీ సునామీ సృష్టించిన విషయం తెలిసిందే.

ఇండియా కూటమిలో భాగమైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీలు ఆర్టికల్‌ 370పై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించవలసి ఉంటుంది. ఆర్టికల్‌ 370 చర్చ నుంచి దూరం కావడానికి గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు దానికి ఏ మాత్రం అనుకూలంగా ఉండే అవకాశం లేదు. సోమవారం తీర్పు తర్వాత, పార్టీ నాయకులు పి చిదంబరం అభిషేక్‌ మను సింఘ్వి ఇప్పుడు ఆర్టికల్‌ 370, పార్టీకి ‘‘మూసివేయబడిన అధ్యాయం’’గా పేర్కొన్నారు. అయితే, వారు సుప్రీం కోర్టు అభిప్రాయంతో గౌరవంగా విభేదించారు. ఈ వైఖరికి ఎన్‌సీ, పీడీపీ లేదా కాశ్మీర్‌ ప్రజల నుంచి మద్దతు లభించే అవకాశం లేదు. ఈ గ్రూపులు గత జనవరిలో శ్రీనగర్‌లో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు హాజరై తమ మద్దతు తెలిపాయి.

ఆర్టికల్‌ 370 తీర్పుపై భారతదేశం ఎలా స్పందిస్తుందనే ఆసక్తికరంగా మారింది. ఉద్ధవ్‌ థాకరే శివసేన వర్గానికి ఒక కీలక సభ్యుడు సుప్రీం నిర్ణయాన్ని సమర్థించారు.

కూటమిలోని వర్గాలు ‘ది ఫెడరల్‌’తో మాట్లాడుతూ.. ఈ విషయంపై కూటమి తమ వైఖరి తెలపవలసి వస్తే.. అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా, జమ్ము, కాశ్మీర్‌ రాష్ట్ర హోదాను ‘‘త్వరలో’’ పునరుద్ధరించాలని పిలుపునిచ్చేందుకు మాత్రమే తన స్టాండ్‌ పరిమితం కావాల్సి ఉంటుందని విశ్వసిస్తున్నారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఒకరు ఫెడరల్‌తో ఇలా అన్నారు. "కూటమి ఉమ్మడి తీర్మానాన్ని పరిశీలించవచ్చు. జమ్ము, కాశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు ఎటువంటి జాప్యం లేకుండా జరగాలి. సుప్రీంకోర్టు ఎన్నికలకు సెప్టెంబర్‌ 30, 2024 గడువు విధించింది. ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా పునరుద్ధరణ జరగాలని కూడా తీర్మానం పేర్కొంది’’. అని తెలిపారు.

బీజేపీ ఎన్నికల విజయాలు, ఆర్టికల్‌ 370పై కోర్టు తీర్పు, రాబోయే రామమందిర ప్రారంభోత్సవం, ఉచిత రేషన్‌ పథకం పొడిగింపు, ప్రధాని మోదీకి ఉన్న క్రేజ్‌ ప్రతిపక్ష నాయకులు పరోక్షంగా అంగీకరించారు.

Read More
Next Story