
ఇరాన్ జాతీయ జెండా విజయ చిహ్నాన్ని చూపుతున్న మహిళలు
వెనెజువెలలా ఇరాన్ లో కుదురుతుందా?
వ్యక్తిని హతమారిస్తే అమెరికా లక్ష్యం నెరవేరినట్టేనా?
ఇరాన్ లో జరుగుతున్న ప్రస్తుత సంక్షోభంలో తాను కలుగజేసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు. ట్రంప్ చేస్తున్న చర్యలను ప్రపంచం అంగీకరించడం నిజంగా ఆశ్చర్యకరం. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవి అన్యాయమైనప్పటికీ సాధారణ చర్యలలాగా వీటిని ప్రపంచం చూస్తోంది.
ఆందోళన చేస్తున్న నిరసనకారుల మరణంతో తన జోక్యానికి తక్షణ కారణంగా ట్రంప్ వాదిస్తున్నారు. సినీ ఫక్కీలో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను ట్రంప్ కిడ్నాప్ చేయించారు.
ఆ దేశ అధ్యక్షుడిని మాదకద్రవ్యాల కింగ్ పిన్ గా ఆరోపణలు గుప్పించారు. తరువాత మదురో గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మదురో ను మాదకద్రవ్యాల కింగ్ పిన్ గా అప్పటి వరకూ అభివర్ణించిన ట్రంప్ తరువాత హఠాత్తుగా తన వ్యూహాన్ని మార్చారు.
తన దృష్టి మొత్తం వెనెజువెలా ఆయిల్ ఉత్పత్తి, దాని ట్రేడ్ పై ఉందని వాటి విషయాలు మాట్లాడటం ప్రారంభించారు. ఆయనకు సార్వభౌమాధికారం అంటే అసహ్యం అని తన చేతలతో నిరూపించుకున్నాడు.
క్రూరమైన అణచివేత..
ఇరాన్ లో జరుగుతున్న ప్రజా నిరసనల్లో ఇప్పటి వరకూ దాదాపు 2 వేల మంది మరణించారు. మరో 11 వేల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరానీయన్లు మరణిస్తుంటుంటే పాపం ట్రంప్ చూడలేకపోతున్నారు.
అయితే ప్రస్తుతం దక్షిణ సూడాన్, మయన్మార్, యెమెన్ లో లక్షలాది మంది ప్రజలు అక్కడ జరిగే అంతర్యుద్దాల కారణంగా చనిపోతున్నారు. 2023 అక్టోబర్ 7 న ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాద సంస్థ దాడి చేసి వేలాది మంది యూదులను హతమార్చింది.
తరువాత ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడింది. ఇదే సమయంలో జరిగిన అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ.. త్వరగా పనిపూర్తి చేయండని నెతన్యాహూను కోరాడు. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చారు.
కానీ అప్పటికే 70000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ట్రంప్ తదుపరి లక్ష్యం ఇరాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికా కలుగజేసుకోవడం అత్యంత సహజమైన పని అన్నట్లుగా మీడియా వార్తలు రాస్తోంది.
ఈ పరిణామాలను 2003 లో ఇరాక్ పై అమెరికా దండయాత్రను తలపిస్తోంది. తన దాడులను సమర్థించుకోవడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్.. ముందే ఓ పథకం సిద్ధం చేశాడు.
సద్దాం హుస్సేన్ సామూహిక విధ్వంసక ఆయుధాలను తయారు చేస్తున్నాడని బుష్ పదే పదే ఆరోపించారు. నిషేధించబడిన రసాయన ఆయుధాలు, జీవ ఆయుధాలను తయారు చేస్తున్నాడని ఇవి ప్రపంచానికి పెను ప్రమాదంగా మారతాయని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు.
ఈ దండయాత్రకు మరింత రక్తి కట్టించడానికి అన్నట్లుగా 9/11 దాడుల సూత్రధారి అయిన ఒసామా బిన్ లాడెన్ తో ముడిపెట్టింది యూఎస్. అమెరికా దాడి చేయడానికి అమెరికా అనుమతి కోరుతూ..బుష్ ఐరాసకు వెళ్లాడు. ఈ దాడులను రష్యా, ఫ్రాన్స్ తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే వీటో జరిగే లోపు అమెరికా ఇరాక్ పై దాడులకు దిగి నాశనం చేసింది.
అమెరికా అసలు లక్ష్యం ఏంటంటే ఇరాక్ లో తమ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న సద్దాం హుస్సేన్ ను కబలించాలని కోరుకుంది. దానికి ప్రజా ఆమోదం కోసం ప్రయత్నించింది. అయితే అవన్నీ ఉత్తదే అని తరువాత కాలంలో తేలింది.
కానీ ప్రస్తుత పాలకుడు ట్రంప్ తను ఇరాన్ లో జోక్యం చేసుకుంటా అని ప్రత్యక్షంగా ప్రకటించాడు. సైనికపరంగా వైమానిక దాడులు చేస్తామని వెల్లడించారు. ఖమేని, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్, దాని సైనిక మౌలిక సదుపాయాలపై దాడులు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
ఈ దాడులు గత ఏడాది జూన్ లో అమెరికా ఫోర్డోలోని ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా చేసిన క్షిపణి దాడుల తరహాలో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ దాడుల తరువాత ఇరాన్ అణు కార్యక్రమం నిలిపివేసింది.
మొసాద్ మద్దతు..
అమెరికాకు ఉన్న సూపర్ పవర్ తో ప్రపంచంపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నాడు. అతని ప్రియ స్నేహితుడు నెతన్యాహూ ఇప్పటికే ఇరాన్ కు చెందిన త్రిబుల్ హెచ్ లపై విరుచుపడి వాటిని దాదాపు నిర్వీర్యం చేసి, ఇరాన్ ను ఒంటరి చేశాడు.
ఇప్పుడు అమెరికా చేసేదే తను దాడి చేసే సమయాన్ని ఎంచుకోవడమే. ఇజ్రాయెల్ విదేశీ గూఢచార సంస్థ మొస్సాద్ మొదటిసారిగా ఇరానీయన్లతో కలిసి నడుస్తామని ప్రకటించింది.
ఇజ్రాయెల్ మీడియా ఎక్స్ లో ఈ విషయాన్ని మొస్సాద్ పోస్ట్ చేసినట్లు నివేదించింది. ఇరానియన్ల నిరసనలల్లో తాము కూడా పాల్గొంటామని పేర్కొంది. ‘‘వీధుల్లోకి రండి, సమయం వచ్చింది, మేము మీతో ఉన్నాము. మాటలతో మాత్రమే కాదు, మేము మీతో ఉన్నాము’’ అని ఎక్స్ లో పేర్కొంది.
ఇరాన్ గత రెండు నెలలో దాదాపు 10 మంది అనుమానిత మొస్సాద్ ఏజెంట్లను ఉరితీసింది. ఇక్కడ ఇంకా మరో వందమంది ఏజెంట్లు ఉన్నారని మొస్సాద్ అధికారులను ఉటంకిస్తూ వార్తలు ప్రచురితం అయ్యాయి.
ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి లాంచర్లు నాశనం చేసే పనిని మొస్సాద్ వారికి అప్పగించింది. ఇజ్రాయెల్ దాని అణు సౌకర్యాలపై దాడులు చేయడం ప్రారంభించగానే వారు తమకు అప్పగించిన పనిని పూర్తి చేశారు.
ప్రస్తుతం మొస్సాద్ ఇరాన్ లో చురుకుగా ఉన్నట్లు దాని పోస్ట్ తో తెలియజేసింది. ఇరాన్ తో హింసను క్రూరంగా అణచివేస్తున్నారనే నెపంతో ట్రంప్ తాజాగా ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.
అమెరికా మిత్రదేశాలపై ఈయూ ఇప్పుడు ట్రంప్ వ్యతిరేకించలేకపోతోంది. 2016 లో ఇరాన్ తో అమెరికా చేసుకున్న అణు ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలిగారు. అయితే ఈయూ మాత్రం తాము ఆ పనిచేయబోమని ప్రకటించింది.
ఇప్పుడు అమెరికా ఆంక్షలు విధించడంతో ఈయూ దాసోహం అనకతప్పలేదు. రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలై ఉంది. ట్రంప్ కు చైనాతో ఒప్పందాలు ఉన్నాయి. అమెరికా చర్యలను నిరసిస్తూ ప్రకటనలు చేయడం తప్ప అది ఏం చేయలేదు. ఇప్పుడు ఇక ఇరాన్ ఒంటరిగా మిగిలిపోయింది.
ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా..
ఇరాన్ చాలా సందర్భాల్లో సంక్షోభాలను ఎదుర్కొంది. అమెరికా నేతృత్వంలోని మిత్రదేశాలు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించాయి. చాలా సందర్భాల్లో ఇస్లామిక్ దేశాలో అసమ్మతిని ఎగదోయడానికి ప్రయత్నించాయి.
1980 లో ఇరాన్ పై ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ దాడి చేశాడు. ఇది దాదాపు ఎనిమిది సంవత్సరాలు కొనసాగింది. దీనికి అమెరికా అండదండలు అప్పట్లో సద్దాంకు అందించింది.
ఇరాన్ దీని తట్టుకుని ఇస్లామిక్ పాలనను సుస్థిరం చేసుకుంది. తరువాత కాలంలో లౌకిక ఉదారవాదులు, మితవాదులు పాలనలో సంస్కరణల కోసం అనేక ఆందోళనలు చేశారు. అయితే అవేవి విజయం వైపు నడవలేదు.
ఇందులో జరిగిన కొన్ని ఉద్యమాలు నిజమైనవి. వాటిలో ప్రజాస్వామ్య వ్యక్తీకరణలు, హిజాబ్ వివాదాలు, బురఖా ధరించమని మహిళల ఉద్యమాలు వీటిలో ఉన్నాయి.
కానీ అమెరికా మిత్రదేశాలు వాటిలో కల్పించుకుని వాటిని ఇంకా ఎగదోసి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించాయి. అయితే అన్నీ విఫలం అయ్యాయి. ఇరాన్ వాటిని విదేశీ జోక్యంగా పేర్కొంటూ ప్రజలను తమ వైపు తిప్పుకోగలిగింది.
అమెరికా వ్యతిరేక భావనలు..
ఈ సారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. బాహ్య కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టిన ఇరాన్, ఇప్పుడు అంతర్గతంగా వచ్చిన సంక్షోభాన్ని దాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
గత కొన్నిసంవత్సరాలుగా దాని మీద విధించిన తీవ్రమైన ఆంక్షలు దేశాన్ని తీవ్రంగా బలహీనపరిచాయి. ఈ ప్రాంతంలో దాని శక్తులకు ఎదురుదెబ్బలు తగిలాయి. తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఇప్పుడు దాని పాలనకు వ్యతిరేకంగా మారాయి.
ఇప్పుడు ట్రంప్ దాని పాలకులను మార్చడానికి ప్రయత్నిస్తోంది. వెనెజువెలా అమెరికా పక్కన ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున సైనిక ఆపరేషన్ లేకుండానే మదురోను తీసుకెళ్లగలిగింది.
కానీ ఇరాన్ లో అలాకాదు. అందులో అమెరికాకు, ఇరాన్ మధ్య ఉన్న భారీ దూరం. 2003 ఇరాక్ పై అమెరికా దాడి తరువాత జరిగిన అల్లకల్లోలం, తరువాత జరగబోయే పరిణామాలపై ఓ క్లూను అందిస్తుంది.
ఇరాన్ లో ఐదు దశాబ్దాల క్రితం జరిగిన తిరుగుబాటు అక్కడ ఇస్లామిక్ రిపబ్లిక్ ను స్థాపించింది. అయతుల్లా ఖమేనీ సాంప్రదాయ నియంతలా వ్యవహరించడం లేదు. ఆయన నాయకత్వంలోని ఇస్లామిక్ కౌన్సిల్ ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాలలో జోక్యం చేసుకోదు. విధాన నిర్ణయాలను తీసుకుంటుంది. ప్రపంచ షియా ముస్లింలకు ఆయన అత్యున్నత అధికారిగా గుర్తింపు పొందుతారు.
ఇరాన్ లో రాజకీయాలు పై నుంచి కింది స్థాయి వరకూ నిర్మించబడి ఉన్నాయి. దానికి విస్తారమైన నెట్ వర్క్ ఉంది. వీరికి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్లు రక్షణగా ఉంటారు. వారు ప్రొఫెషనల్ సైనికులే కాదు.
సిద్దాంతరపరంగా రక్షణగా ఉన్నవారు. అమెరికా తమ లక్ష్యంగా ఎంచుకున్న భవనాలను, మౌలిక సదుపాయాలపై దాడి చేసి కొంత నష్టం కలిగించవచ్చు, అగ్ర నాయకులను తొలగించవచ్చు కానీ ఇరాన్ సంస్థాగత చట్రాలను భర్తీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
2020 లో ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ఐఆర్ జీసీ రెవల్యూషనరీ అధిపతి అయిన ఖాసీం సులేమనీ హత్య చేయించాడు. ఆయన ఖుద్ ఫోర్స్ లో అనేక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే ఆయన మరణంతో ఆ విభాగం మూతపడలేదు. తరువాత డిప్యూటీ అయిన ఇస్మాయిల్ ఖుద్ ఫోర్స్ అధిపతి నియామకం పొంది ఆ సంస్థను నడిపిస్తున్నాడు.
అమెరికా అధ్యక్షుడి కెనడీ హత్య తరువాత ఉపాధ్యక్షుడు లిండన్ జాన్సన్ పదవీ పగ్గాలు చేపట్టారు. వ్యవస్థలు ఉన్నాయి అవి చేస్తూనే ఉన్నాయి. కెనడీ హత్యతో అమెరికా కూలిపోలేదు. ఇరాన్ లోనూ ఇలాంటి నిర్మాణమే ఉంది.
అలా లేదనుకోవడం మూర్ఖత్వం, అజ్ఞానం మాత్రమే. ఇరాక్ లో సద్దాం మరణం తరువాత అమెరికాను స్వాగతిస్తారని దాని ఊహ తరువాత తల్లకిందులైంది. వాస్తవ రూపం ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది.
ఇరాకీ సైన్యంలోని ఒక విభాగం, అధికార యంత్రాంగం, రాజకీయ శక్తులు అమెరికాకు వ్యతిరేకంగా తిరిగాయి. దాని పర్యవసాలు ఇప్పటికి అక్కడ ప్రభావం చూపిస్తున్నాయి. ఉదాహారణకు ఇస్లామిక్ స్టేట్ ప్రభావం పెరగడం, ఇరాక్ దండయాత్ర ఒక వ్యూహాత్మక లోపంగా భావించవచ్చు.
ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైనిక జోక్యం చేసుకుంటే దాని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. విప్లవం జరిగి యాభై సంవత్సరాలు గడచిని తరువాత కూడా ఇరానియన్లు అమెరికా వ్యతిరేకులుగానే ఉన్నారు.
చరిత్ర చూస్తే తిరుగుబాటు తరువాత వచ్చే పాలన బయటి నుంచి చూసే దానికంటే భిన్నంగా ఉంటుంది. ట్రంప్ వీటిని అర్థం చేసుకుంటాడా.. అర్థం చేసుకుంటేనే మంచిది.
Next Story

