
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో 12 అబ్బుర పరిచే విషయాలు
అన్ని పార్టీలకు శుభవార్తలు, దుర్వార్తలు, హెచ్చరికలు చేసిన ఎన్నికలివి
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల కౌంటిగ్ నిన్నముగిసింది. ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇందులో అన్ని పార్టీలకు నిరాశ కల్పించే కోణాలున్నా్యి. భవిష్యత్తు మీద ఆశలు రేకెత్తించే మలుపులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కనిపించిన కొన్ని ఆసక్తికరమయిన విషయాలు ఇవి:
- మునిసిపల్ ఎన్నికల్లో వైఫ్యల్యాన్ని భారత రాష్ట్రసమితి చాకచక్యంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ఎన్నికలను స్థానిక నాయకులకే వదిలేశామని, సాధారణంగా రూలింగ్ పార్టీకే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని పార్టీ వర్కింగ్ ప్రెశిడెంట్ కెటిఆర్ చెప్పడం విశేషం. రూలింగ్ పార్టీకి 85 శాతం మించి ఫలితాలు రాకపోతే ఎలా అని పార్టీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు
- ఇక బిజెపిది చిత్రమయిన పరిస్థితి. తెలంగాణలో బిజెపి వేడి చల్లబడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ పార్టీ ఎపుడో 2020 లో జరిగిన మునిసిపల్ ఎన్నికల కంటే ఈ సారి బాగా పనిచేసిందని, ఎక్కువ కౌన్సిలర్లను గెలుచుకుందని సమర్థించుకుంటూ ఉంది. మరి ఈ మధ్య లో జరిగిన ఎన్నికల్లో అటే అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికల్లో సృష్టించిన వేడిఏమయింది?కార్యకర్తలకు సంతృప్తి కలిగించేందుకు జిహెచ్ ఎంసి ఎన్నికల్లో బిజెపి జండా ఎగరేస్తామని బండి సంజయ్ చెబుతున్నారు.
- కాంగ్రెస్ అత్యధిక మెజారిటీ వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ పట్టు పార్టీ మీద, ప్రభుత్వం మీద బలపడుతున్నట్లు కనిపిస్తుంది. ఎపుడూ ఎక్కడ జరగని విధంగా మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే, ఈ పార్టీ కి ప్రజలు మెల్లిగా దూరం అవుతున్నసూచనలు చాలా చోట్ల కనిపించాయి. ఇది కాంగ్రెస్ కు హెచ్చరిక.
- మున్సిపల్ పరోక్ష ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే ఓటు వేయడానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా అర్హులు కారని చెప్పింది
- కొత్తగూడెం కార్పొరేషన్‌లో సిపిఐకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశపెట్టారు. కాంగ్రెస్ ను ఏదో ఒక చోటనైనా దెబ్బతీయాలన్నది ఆయన కోరిక. దానికి సిపిఐని ఎంచుకున్నారు. సిపిఐ కాంగ్రెస్ ఒకవిధగా మిత్రపక్షం. కెటిఆర్ ఆశకు లొంగిపోతుందా?
- ఎన్నికల ఫలితాల మీద తెలంగాణ జాగృతి కవిత కామెంట్: కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలు తొలిమెట్టు
- అసెంబ్లీలో ఒక సీటు గెల్చుకున్నట్లే సిపిఐ ఒక మునిసిపాలిటీని గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సీపీఐ ఆవిర్భవించింది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉంటే సీపీఐ-24 కైవసం చేసుకుంది. కాంగ్రెస్-20, బీఆర్ఎస్-7, సీపీఎం-1, బీజేపీ-1, ఇండిపెండెంట్-5 స్థానాలను గెలుచుకున్నారు.
- కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతూ ఉంది. అక్కడి 66లో 30 గెల్చుకుని బిజెపి మేయర్ పదవి కొటేందుకు ఉబలాటపడుతూ ఉంది. అయితే, కరీంనగర్ కార్పొరేషన్ కూడా తమ ఖాతాలోకే వస్తుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ దీమా తో ఉన్నారు. ఈ విషయంపై సీపీఐ నేతలతో మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు.
- కరీంనగర్ లో ‘మేయర్’ పదవి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కయి బీజేపీని ఓడించేందుకు మూడు పార్టీలు ఒక్కటయ్యాని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ కు ‘మేయర్’ పదవిని ఆఫర్ చేశాయన్నది ఆయన ఆరోపణ.
- తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 25 చోట్ల హంగ్ ఫలితాలు వచ్చాయి.వీటిలో చొరబడి మ్యాజిక్ చేసి చైర్మన్ పదవులు కొట్టొచ్చ అనే దానిమీద అన్ని పార్టీలు చర్చలు మొదలుపెట్టాయి. బిఆర్ ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు భేటీ అయ్యారు. ఎక్స్‌అఫీషియో ఓట్ల వినియోగం, స్వతంత్ర అభ్యర్థులను ఆకట్టుకునేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.
- బిఆర్ ఎస్ ను ఓడించేందుకు అన్ని రాజకీయపార్టీలు ఏకమయ్యాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యాఖ్యానించారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎన్నికల్లో గెల్చిన 16 మంది కార్పొరేటర్ లను ఆయన సన్మానించారు.బీఆర్ఎస్ ను ఓడించడానికి అన్ని పార్టీలు ఏకం అయ్యాయని తెలిపారు. ఓటర్లను, బీఆర్ఎస్ అభ్యర్థులను అధికార పార్టీ నాయకులు , పోలీసులు భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికలలో గెలిచారని ఆయన అన్నారు.
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్ కైవసంచేసుకోగా అలియాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఈ విజయాన్ని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఖాతాలో వేస్తున్నది బిఆర్ఎస్. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించేలా ప్రణాళిక రూపొందించి సక్సెస్ అయ్యారు. అన్నీతానై 9 రోజుల పాటు మూడు మున్సిపాలిటీలలో పర్యటించి ప్రజల మద్దతును కూడగట్టారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంలో మల్లారెడ్డి సక్సెస్ అయ్యారని బిఆర్ ఎస్ నేతలుచెబుతున్నారు.
Next Story

