
7 కార్పొరేషన్ల మేయర్ పీఠాలు: హంగ్ నుంచి హవా వరకు
ఫిబ్రవరి 11 ఎన్నికల తర్వాత 7 కార్పొరేషన్లలో మేయర్ ఎంపిక రాజకీయ కదలికలు. హంగ్ పరిస్థితులు, ఒప్పందాలు, పార్టీ ఆధిక్యాలు ఎలా ఉన్నాయంటే?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తర్వాత అసలు చర్చ మేయర్ పీఠాల చుట్టూనే తిరిగింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 13న కౌంటింగ్ పూర్తయింది. వార్డు ఫలితాలు వెలువడగానే ఏడు కార్పొరేషన్లలో మేయర్ ఎంపికపై రాజకీయ కదలికలు వేగం పుంజుకున్నాయి. ఆధిక్యత ఉన్న చోట్ల నిర్ణయాలు సులభంగా సాగగా, హంగ్ పరిస్థితులు ఉన్న చోట్ల ఒప్పందాలు కీలకమయ్యాయి.
నిజామాబాద్
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం 60 డివిజన్లు ఉండగా వాటిలో కాంగ్రెస్‌కు 17, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 14, బీజేపీ 28 డివిజన్లలో గెలిచారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి పదవిని దక్కించుకున్నాయి. కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 స్థానాలతో పాటు రెండు ఎక్స్‌అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 33కు చేరింది. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా కలవడంతో కాంగ్రెస్ బలం 34కి చేరింది. దీంతో ఈ కార్పొరేషన్ మేయర్ పీఠం కాంగ్రెస్‌కు దక్కింది. ఈ మేయర్ పదవి మహిళలకు రిజర్వ్ కాగా ఉమారాణి, లలిత పోటీపడ్డారు. వారిలో ఉషారాణి విజయం సాధించారు. డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్ ఎన్నికయ్యారు.
మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం డివిజ్‌లలో కాంగ్రెస్ 29, బీఆర్ఎస్ 14, బీజేపీ 6, ఇతరులు 7 డివిజన్లలో గెలిచారు. కాంగ్రెస్.. ఇతరులను కలుపుకుని కార్పొరేటర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. మేయర్‌గా కాంగ్రెస్‌కు చెందిన గుమల్ మమత ఎన్నికయ్యారు. ప్రాంతీయ సేవా అంశాలపై ప్రచారం ఫలితాల్లో ప్రతిఫలించినట్టు సమాచారం. ఆధిక్యతతో మేయర్ ఎంపిక సాఫీగా సాగింది.
రామగుండం
రామగుండం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ బలం స్పష్టంగా కనిపించింది. మొత్తం 60 డివిజన్లు ఉండగా వాటిలో కాంగ్రెస్ 38, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, స్వతంత్రులు 8 డివిజన్లలో గెలిచారు. కాంగ్రెస్ ఒక్క పార్టీనే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేయడంతో ఫలితాల తర్వాత మేయర్ ఎంపిక పెద్దగా సందిగ్ధత లేకుండా జరిగింది. ఆధిక్యత ఆధారంగా పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. మహంకాళి స్వామి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ వశమైంది.
నల్గొండ
నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్‌గా బుర్రి చైతన్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి ప్రకటించారు. డిప్యూటీ మేయర్‌గా అష్రాఫ్ అలీ ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నిక ప్రశాంతంగా సాగింది. నల్లగొండ కార్పొరేషన్‌లో మొత్తం 48 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ 2 డివిజన్లలో విజయం సాధించింది. ఆలిండియా ఫార్వర్డ్ పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో కాంగ్రెస్ బలం 30కి చేరింది. ఎక్స్ అఫీషియో మెంబర్ మంత్రి ోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన ఓటును వినియోగించుకున్నారు.
మంచిర్యాల
మంచిర్యాల కార్పొరేషన్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. పార్టీ ఆధిపత్యం మేయర్ ఎంపికకు దారి తీసింది. మొత్తం 60 డివిజన్లలో కాంగ్రెస్ 44 డివిజన్లను తన సొంతం చేసుకుని పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. బీఆర్ఎస్ 9, బీజేపీ 5, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు. దీంతో మంచిర్యాల మేయర్‌గా కాంగ్రెస్ పార్టీ నేత ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్‌గా సళ్ల రమ్య మహేష్ ఎన్నికయ్యారు. ఫలితాలు వచ్చిన వెంటనే దిశ స్పష్టమైంది.
కరీంనగర్
కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడ BRS తటస్థంగా ఉండటం కీలక పరిణామంగా మారింది. మొత్తం 66 డివిజన్లు ఉండగా వాటిలో బీజేపీ 30 డివిజన్లను సొంతం చేసుకుంది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 8, ఇతరులు 13 స్థానాల్లో గెలిచారు. అయితే మ్యాజిక్ సంఖ్యపై సందిగ్ధత నెలకొంది. సంఖ్యాపరంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోబూచులాట సాగింది. రెండు వర్గాలు తమ తమ వ్యూహాలతో కదిలాయి. హైదరాబాద్ శివారులో వేర్వేరు శిబిరాలు నిర్వహించబడ్డాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఏఐఎఫ్‌బీ సభ్యులు, స్వతంత్రులు కలిసి కార్పొరేషన్‌ను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు చేశారు.
ఈ ఎన్నికలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు ఇచ్చారు. బీఆర్ఎస్ తటస్థంగా వ్యవహరించింది. చివరకు 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో బీజేపీ పీఠం దక్కించుకుంది. మేయర్ పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, ఫలితంతో స్పష్టత వచ్చింది. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా వై సునీల్ రావు ఎన్నికయ్యారు.
కొత్తగూడెం
కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్–CPI మధ్య పవర్ షేరింగ్ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం మొదటి 2.5 సంవత్సరాలకు సీపీఐకి మేయర్ పదవి లభించింది. డిప్యూటీ మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ పొందింది. ఇది ఒప్పంద రాజకీయాల స్పష్ట ఉదాహరణగా నిలిచింది. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి 23 డివిజన్లలో విజయం సాధించింది. ఇందులో కాంగ్రెస్‌కు 22, సీపీఎంకు ఒక డివిజన్ దక్కింది. సీపీఐ 22 స్థానాలు గెలుచుకుంది. బీఆర్‌ఎస్ 8, బీజేపీ ఒకటి, స్వతంత్రులు 6 డివిజన్లలో విజయం సాధించారు. మరోవైపు రామగుండం కార్పొరేషన్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
ఎవరికి ఎన్ని స్థానాలంటే
మొత్తం ఏడు కార్పొరేషన్‌లలో కాంగ్రెస్ ఐదు కార్పొరేషన్లలో విజయం సాధించింది. బీజేపీ, సీబీఐ చెరో కార్పొరేషన్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ ఫలితాలు కాంగ్రెస్ ప్రభావాన్ని చూపుతున్నాయి. అయితే ప్రతి కార్పొరేషన్ కథ ఒకేలా లేదు. కొన్ని చోట్ల ఆధిక్యతే నిర్ణయించింది. కొన్ని చోట్ల హంగ్ పరిస్థితులు రాజకీయ చర్చలకు దారి తీశాయి. ఎన్నికల సమయంలో హంగ్ ఉన్న ప్రాంతాల్లో మద్దతులపై వ్యూహాత్మక చర్చలు జరిగినట్టు వర్గాలు తెలిపాయి.
రాజకీయ ఉద్రిక్తతలు కనిపించినా, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని అధికారులు పేర్కొన్నారు. ఏడు కార్పొరేషన్లలో మేయర్ పీఠాల కథ ఇప్పటికి ఒక దశకు చేరుకుంది. మిగిలిన అధికారిక ప్రకటనలు, తదుపరి పరిణామాలు స్థానిక రాజకీయ దిశను మరింత స్పష్టంచేయనున్నాయి.

