
కవితపై అనుమానాలు పెరిగిపోతున్నాయా ?
ఆ పేరు ఎవరి సొంతం కాదుకాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పారు.
కల్వకుంట్ల కవిత శుక్రవారం మీడియాతో మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఎవరైనా వాడుకోవచ్చని చెప్పారు. టీఆర్ఎస్ పేరు ఫ్రీగా ఉందన్నారు. కాబట్టి ఆ పేరు ఎవరి సొంతం కాదుకాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పారు. తమపార్టీ ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తుంది అని అన్నారు. తమపార్టీకి బీహార్ సిద్ధాంతకర్త అంటు ఎవరూ లేరని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్తలో ఉందని విమర్శించారు. ఎందుకంటే తండ్రి కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు రావటంలేదు. సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. అందుకనే బీఆర్ఎస్ నిద్రావస్తలో ఉందని కవిత చెప్పింది.
టీఆర్ఎస్ గురించి కవిత చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనిస్తే ఆమె మనసు మార్చుకున్నదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈమధ్యనే తాను ఏర్పాటుచేయబోయే కొత్తపార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అని ప్రకటించిన విషయం తెలిసిందే. జాగృతి అనే స్వచ్చంధ సంస్ధను గడచిన 20 ఏళ్ళుగా నిర్వహిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. అందుకనే తన పార్టీ పేరులో తెలంగాణ+జాగృతి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న కవిత చివరకు తెలంగాణ ప్రజా జాగృతి అని పేరుపెట్టారు. పార్టీ పేరు, అజెండా, జెండా అన్నింటినీ ఈనెల 25వ తేదీన కవిత ప్రకటించబోతున్నారు.
అలాంటిది ఈరోజు మీడియాతో మాట్లాడుతు టీఆర్ఎస్ పేరును ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పటంలో అర్ధమేమిటి ? టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ పేరును కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. పార్టీ పేరు టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మార్చటంతోనే పార్టీపేరులోని తెలంగాణ అనే ఆత్మ మాయమైపోయింది. అందుకనే బీఆర్ఎస్ ఓడిపోయిందనే ప్రచారం కూడా బాగా జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాంటిది ఇపుడు సడెన్ గా కవిత మాట్లాడుతు టీఆర్ఎస్ పేరును తనపార్టీ పేరుగా ఉపయోగించుకునే ఆలోచనలో ఉన్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లేకపోత టీఆర్ఎస్ పేరు ఫ్రీగా ఉందికాబట్టి ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అని ఎందుకు చెబుతారు ? ఏమో 25వ తేదీలోపు ఎన్ని మార్పులైనా జరగవచ్చు కదా. చూద్దాం ఏమి జరుగుతుందో.

