టెలిఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కేసులది కూడా కాళేశ్వరం కథేనా ?
x
Kaleshwaram project, Telephone Tapping and Formula car race case

టెలిఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కేసులది కూడా కాళేశ్వరం కథేనా ?

ఏడాదిన్నర విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ రిపోర్టునే హైకోర్టు తప్పుపట్టిందంటే ఇక టెలిఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కేసు విచారణ విధానం మాత్రం కోర్టులో నిలుస్తుందా ?


ఇపుడందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. దాదాపు ఏడాదిన్నుర పాటు వందలమందిని విచారించి కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టును హైకోర్టు తప్పుపట్టింది. కేసీఆర్, హరీష్ తదితరులకు హైకోర్టు ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వకపోయినా విచారణ తీరును తప్పుపట్టింది. న్యాయమూర్తిగా దశాబ్దాల అనుభవం ఉన్న పీసీ ఘోష్ కు రిపోర్టు ఎలా తయారుచేయాలో తెలీదా ? హైకోర్టు విచారణలో తన రిపోర్టు వీగిపోకుండా, హైకోర్టు తప్పుపట్టకుండా ఎంత పకడ్బందీగా తయారుచేయాలి ? రిపోర్టు సబ్మిట్ చేయటంలో ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేకుండా చూసుకోవాలో ఒకళ్ళు చెప్పాల్సిన అవసరంలేదు కదా అనే చర్చ పెరిగిపోతోంది. జస్టిస్ ఘోష్ విచారణ తీరును హైకోర్టు తప్పుపట్టింది అంటే ఏమిటర్ధం ? ఇపుడిది తేలాలంటే ఎంతకాలం పడుతుందో ఎవరికీ తెలీదు.

దాదాపు ఏడాదిన్నర విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ రిపోర్టునే హైకోర్టు తప్పుపట్టిందంటే ఇక టెలిఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కేసు విచారణ విధానం మాత్రం కోర్టులో నిలుస్తుందా ? టెలిఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కేసుల్లో అవినీతి జరిగిందని, అధికారదుర్వినియోగం జరిగిందని ఇప్పటికే ఈడీ, ఏసీబీ విచారణలో తేలింది. అయితే రెండు కేసుల్లోను కీలకమైన వ్యక్తులు నోరిప్పటంలేదు. వీళ్ళు నోరిప్పేంతవరకు ఈరెండు కేసులు ఒక కొలిక్కిరాదు. ఒకవేళ కీలకవ్యక్తులు నోరిప్పినా ఈకేసులో కోర్టులో నిలుస్తాయా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. కాళేశ్వరం అవినీతి, అవకతవకలను విచారించింది జస్టిస్ పీసీ ఘోష్. టెలిఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కేసులను విచారిస్తున్నది కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్ధలు.

జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టునే కేసీఆర్, హరీష్ తప్పుపట్టారు. కాళేశ్వరంలో అసలు అవినీతే జరగలేదని, నాలుగు పిల్లర్లు కుంగితే ఏమవుతుంది నాలుగు తట్టల ఇసుక, నాలుగు తట్టల సిమెంట్ వేస్తే సరిపోతుంది కదాని వాదిస్తున్నారు. కమిషన్ రిపోర్టును అడ్డంపెట్టుకుని తమను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తోందని, కక్షసాధిస్తోందని హరీష్, కేటీఆర్ ప్రభుత్వంపై ఎదురుదాడులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కమిషన్ విచారణ తీరును తప్పుపడుతు హైకోర్టు రిపోర్టును కొట్టేసింది. రిపోర్టు ఆధారంగా కేసీఆర్, హరీష్ తదితరులపై ఎలాంటి యాక్షన్ తీసుకునేందుకు లేదని స్పష్టంగా తేల్చేసింది.

జస్టిస్ నిర్వహించిన విచారణ తీరునే హైకోర్టు తప్పుపట్టినపుడు ఇక అధికారుల విచారణ తీరును కోర్టు అంగీకరిస్తుందా ? అన్నదే ఇపుడు సందేహం. ఎలాంటి లోపాలు లేకుండా దర్యాప్తుసంస్ధలు తమ రిపోర్టును ప్రభుత్వానికి ఇవ్వగలవా ? టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదని, ఫార్ములా కేసులో ఎలాంటి అవినీతి, అధికార దుర్వినియోగం జరగలేదని మొదటినుండి కేటీఆర్, హరీష్ వాదిస్తున్నారు. ఎప్పుడో కొలిక్కి రావాల్సిన ఈరెండు కేసుల విచారణ నత్త నడకను తలపిస్తున్నాయి. ఈ రెండు కేసుల విచారణ ఎప్పుడు ముగుస్తుందో ? అధికారులు రిపోర్టును ఎప్పుడు తయారుచేసి ప్రభుత్వానికి అందిస్తారు లేదా కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తారో తెలీటంలేదు. వచ్చే ఎన్నికల్లోగా దర్యాప్తు సంస్ధలు విచారణను లాజికల్ ఎండ్‌కు తీసుకొస్తారా ? అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. అధికారులు ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు కోర్టులో నిలబడతాయా ? అన్నది కూడా సందేహమే.

ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకునే కేటీఆర్, హరీష్ పదేపదే కేసులు తమను ఏమీ చేయలేవని అంటున్నారా ? దర్యాప్తులు పక్కాగా జరిగి, కోర్టు విచారణలో అవినిలిచినప్పటి సంగతి కదా అనే ధీమానే కేటీఆర్, హరీష్ లో బాగా కనబడుతోంది. అందుకనే ప్రభుత్వం తమపై పెట్టిన కేసులు లొట్టపీసు కేసులని, విచారణలో తామే దర్యాప్తు అధికారులను ఉల్టాగా ప్రశ్నలు అడిగామని థీమాగా కేటీఆర్, హరీష్ చెప్పగలుగుతున్నారు. విచారణ చేసిన తర్వాత రెండుకేసులు కోర్టుమెట్లెక్కితే ఏమవుతుందో అనే ఆసక్తి పెరిగిపోతోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Read More
Next Story