అసెంబ్లీ సమావేశాల్లో రాజుకున్న దళిత కార్డ్ రాజకీయాలు
x

అసెంబ్లీ సమావేశాల్లో రాజుకున్న 'దళిత కార్డ్' రాజకీయాలు


తెలంగాణా అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఇప్పుడు ‘దళితకార్డ్’ చుట్టూ తిరుగుతోంది. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బూతులు తిట్టిన అంశం మంగళవారం రెండోరోజు అసెంబ్లీతో పాటు తెలంగాణలో ప్రకంపనలు సృష్టించాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వ్యతిరేకంగా సభలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు, ఎంఎల్ఏలు మాట్లాడారు. అలాగే తెలంగాణలో చాలాచోట్ల కేసీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర నిరసన ప్రదర్శనలు చేశారు. కాంగ్రెస్ కు పోటీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రేవంత్ వైఖరికి నిరసనగా అసెంబ్లీ బయట ఎంఎల్ఏలు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. హైదరాబాద్ లో చాలాచోట్ల కారుపార్టీ నేతలు, శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు.


కేసిఆర్ ప్రభుత్వం దళితులకు చేసిన అన్యాయాలను కాంగ్రెస్ శ్రేణులు పదేపదే ఆరోపిస్తే దీనికి పోటీగా రేవంత్ ప్రభుత్వం దళితులతో పాటు మహిళలు, యువతకు చేస్తున్న అన్యాయాలపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలతో రెచ్చిపోయారు. ఈ గొడవలు ఇలాగుండగానే స్పీకర్ ను బూతులు తిట్టిన తాతామధును శాసనమండలి నుండి బహిష్కరించారు.

దళిత రాజకీయ వివాదంలో అసెంబ్లీలో ప్రజా సమస్యలు, హామీలపై చర్చ పూర్తిగా పక్కదారి పట్టాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, 22 ఏ సమస్యలు, రైతు రుణాలు, యువతకు ఉద్యోగాలు, ఆరుగ్యారెంటీల అమలు తీరుపై ఒక్కఅంశం మీదకూడా చర్చ జరగలేదు. అసెంబ్లీ సమావేశాలు మొదలు కాకముందు అటు బీఆర్ఎస్, ఇటు బిజెపి పోటాపోటిగా 22ఏ ,విద్యార్థులు సమస్యల వంటి వాటి మీద ధర్నాలు చేసాయి. కానీ అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం వీటిని పక్కన పెట్టి ఈ ‘దళిత రాజకీయాలు’ చేస్తున్నారు.



Read More
Next Story