
లిక్కర్ స్కామ్ నుండి కవితకు బిగ్ రిలీఫ్
లిక్కర్ స్కామ్ లో కవితది సౌత్ గ్రూప్ తరపున కీలక పాత్రగా సీబీఐ, ఈడీలు కేసులు పెట్టి ముందు విచారించి తర్వాత అరెస్టుచేసిన విషయం తెలిసిందే
కొంతకాలం క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యుటి సీఎం మనీష్ సిసోడియాను శుక్రవారం ఢిల్లీ రౌస్ ఎవిన్యు కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
వీరితో పాటు మరో 20 మంది మీదకూడా నమోదైన కేసులను కోర్టు కొట్టేసింది. ఈ20 మందిలో కల్వకుంట్ల కవిత కూడా ఉంది. ఈరోజు కోర్టు తీర్పుతో కవితకు బిగ్ రిలీఫ్ అనేచెప్పాలి. లిక్కర్ స్కామ్ లో కవితది సౌత్ గ్రూప్ తరపున కీలక పాత్రగా సీబీఐ, ఈడీలు కేసులు పెట్టి ముందు విచారించి తర్వాత అరెస్టుచేసిన విషయం తెలిసిందే.
అరెస్టయిన కవిత ఆరునెలలపాటు ఢిల్లీలోని తీహార్ జైలులో గడిపారు. తర్వాత బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నారు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవిత రాజకీయంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరకు బీఆర్ఎస్ నుండి గెంటివేతకు కారణాల్లో లిక్కర్ స్కామ్ కూడా ఒకటి అనటంలో సందేహంలేదు. ఇలాంటి స్కామ్ లో కేజ్రీవాల్, సిసోడియా, కవితతో పాటు మరికొందరు పాత్రపై ఎలాంటి సాక్ష్యాలు లేవని రౌస్ ఎవిన్యు కోర్టు తీర్పు చెప్పటం అంటే రాజకీయాల్లో ఉన్న వారందరికీ బిగ్ రిలీఫ్ అనేచెప్పాలి.
మద్యంపాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్, సిసోడియా, కవితతో పాటు మరికొందరు వ్యాపారస్తుల దగ్గర ముడుపులు తీసుకుని పాలసీని వ్యాపారులకు అనువుగా తయారుచేసినట్లుగా పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల ఆధారంగానే పైన చెప్పిన వారందరిపైనా సీబీఐ, ఈడీలు కేసులు నమోదుచేసి విచారణల తర్వాత అరెస్టులు కూడా చేసింది. సరైన ఆధారాలు లేకుండానే కేసులో పైన చెప్పిన వారి పేర్లను చేర్చి, అరెస్టుచేయటంపై కోర్టు సీబీఐ పైన తీవ్రస్ధాయిలో మండిపడింది. ఏదేమైనా ఇన్నాళ్ళు లిక్కర్ రాణి అనే నిందను మోస్తున్న కవితకు ఈరోజు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.

