కవిత మీద పెద్ద భారం దిగిపోయిందా ?
x
Kalvakuntla Kavitha

కవిత మీద పెద్ద భారం దిగిపోయిందా ?

బెయిల్ రద్దయితే మళ్ళీ ఎప్పుడు తీహార్ జైలుకు వెళ్ళాల్సొస్తుందనే భయంతోనే కవిత ఇంతకాలం రోజులు వెళ్ళదీస్తున్నారు అనటంలో సందేహంలేదు


ఇంతకాలం పెద్ద గుదిబండలాగ తయారైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుండి కల్వకుంట్ల కవితకు విముక్తి దొరికింది. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై ఎలాంటి ఆధారాలు లేవని ఢిల్లీలోని రౌస్ ఎవిన్యు కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు కచ్చితంగా కవితకు బిగ్ రిలీఫ్ అనేచెప్పాలి. స్కామ్ లో కేజ్రీవాల్, సిసోడియాతో పాటు మరో 20మందిపైన సీబీఐ నమోదుచేసిన కేసుల నుండి కోర్టు తీర్పు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. కేసులో అరెస్టయిన తర్వాత సుమారు 6 మాసాలు కవిత ఢిల్లీలోని తీహార్ జైలులో గడిపారు. ప్రస్తుతం ఆమె బెయిల్ పైన బయట తిరుగుతున్నారు.

బెయిల్ రద్దయితే మళ్ళీ ఎప్పుడు తీహార్ జైలుకు వెళ్ళాల్సొస్తుందనే భయంతోనే కవిత ఇంతకాలం రోజులు వెళ్ళదీస్తున్నారు అనటంలో సందేహంలేదు. అలాంటిది సీబీఐ నమోదుచేసిన కేసుల్లో కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు తీర్పివ్వటం అంటే బిగ్ రిలీఫ్ అనేచెప్పాలి. ఇపుడు ఏమవుతుందంటే తన రాజకీయ అడుగులను కవిత చాలా బలంగా రెట్టించిన ఉత్సాహంతో వేస్తారు అనటంలో సందేహంలేదు. ఇంతకాలం లిక్కర్ రాణి అనే నిందను కవిత మోస్తున్నారు. కవితను లిక్కర్ రాణి అని ఆమె ప్రత్యర్ధులు అనేకసార్లు అభివర్ణించిన విషయం అందరికీ తెలిసిందే.


రాజకీయంగా వేగంగా కవిత అడుగులు వేయలేకపోవటానికి లిక్కర్ కేసు కీలకపాత్ర పోషించిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రత్యర్ధులపై ఆర్ధికపరమైన ఆరోపణలు చేసినపుడు వాళ్ళు కవితను ఇబ్బంది పెట్టడానికి ముఖ్యంగా లిక్కర్ రాణి అని లిక్కర్ స్కామ్ ను ఉదాహరణగా చూపేవారు. కేంద్రమంత్రి బండి సంజయ్ తదితరులు తనను పదేపదే లిక్కర్ రాణి అని ఎద్దేవాచేస్తున్నా గట్టిగా కౌంటర్లు ఇవ్వలేని స్ధితిలో ఉండిపోయారు. లిక్కర్ స్కామ్ పై గట్టిగా ఏమి మాట్లాడితే ఏమి సమస్య ముంచుకుని వస్తుందో అనే ఆందోళనే కవితను రాజకీయంగా వేగంగా ముందుకెళ్ళకుండా బ్రేకులు వేసింది.

బీఆర్ఎస్ నుండి కవిత బయటకు రావటానికి కీలకమైన అంశాల్లో లిక్కర్ స్కామ్ కూడా ఒకటి. లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కున్న దగ్గర నుండి బీజేపీ పార్టీ అధినేత కేసీఆర్ ను బాగా ఇరుకునపెట్టేసింది. ఎంతలా ఇబ్బందిపెట్టిందంటే నరేంద్రమోదీ, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా కేసీఆర్ వణికిపోయేంతగా. 2023 ఎన్నికలకు ముందు మోదీ, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి కేసీఆర్ ఎన్నికలకు ముందు లిక్కర్ స్కామ్ లో కూతురు కవితను సీబీఐ అరెస్టుచేసి తీహార్ జైలులో పెట్టడంతో కేసీఆర్ నోటికి తాళంపడిపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా మోదీ, ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ నోరిప్పలేదు.


వివిధ కారణాలతో బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చేసిన కవిత ఇకనుండి తెలంగాణ రాజకీయాల్లో రెట్టించిన ఉత్సాహంతో దూసుకుని వెళతారు అనటంలో సందేహంలేదు. తొందరలోనే పరిషత్ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఖమ్మం, వరగంల్ మున్సిపల్క కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లోపు తన సొంతపార్టీని కవిత ప్రకటించి ప్రత్యర్ధులకు సవాలు విసరటం ఖాయమనే అనుకోవాలి. తనపైన ఇంతకాలంగా ఉన్న అతిపెద్ద ఆర్ధికఆరోపణలు తప్పని కోర్టు తేల్చేయటంతో కవిత పెద్ద రిలీఫ్ గా ఫీలవుతున్నారు. ఇపుడు కవిత మీద ఆరోపణలు చేయటానికి ప్రత్యర్ధులకు ఎలాంటి అస్త్రాలు లేవని అందరు గుర్తుంచుకోవాలి.

కొత్తపార్టీ ఖాయమేనా ?

లిక్కర్ స్కామ్ లో నిర్దోషి అని తేలటంతో కవితను దగ్గరకు తీసుకోవటానికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఒక అవకాశం దొరికిందా ? అనే ప్రచారం మొదలైంది. స్వయంగా కూతురే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని జైలుకు వెళటంతో ప్రత్యర్ధులపై విరుచుకుపడటానికి కేసీఆర్ కు పెద్ద ఇబ్బందిగా తయారైంది. కేసీఆర్ మీద ఆరోపణలతో రెచ్చిపోవటానికి లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రను ప్రత్యర్ధులు ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. తాజా కోర్టు తీర్పుతో వ్యక్తిగతంగా తాను ఆరోపణల నుండి బయటపడటమే కాకుండా తండ్రి, పార్టీ చీఫ్ కేసీఆర్ ను కూడా కవిత బయటపడేసినట్లే అనుకోవాలి. కాబట్టి ఏదో కారణాన్ని చూపించి కవితను కేసీఆర్ మళ్ళీ దగ్గరకు తీసుకునే అవకాశాలను కొట్టిపారేసేందుకులేదు.

ప్రస్తుతం కవిత-సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సంబంధాలు ఉప్పునిప్పులాగ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్యా ఈ పరిస్ధితికి ప్రధాన కారణం లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కోవటమే. దీనిపైన సోదరుడి ఆధిపత్యాన్ని కవిత సవాలుచేయటం, సీనియర్ నేత, బావ తన్నీరు హరీష్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు, దగ్గరి బంధువు జోగినపల్లి సంతోష్ కు అపరిమితమైన ప్రాధాన్యత ఇవ్వటం లాంటి అనేక కారణాలతో ఇద్దరి మధ్యా గ్యాప్ పెరిగిపోయింది. ఫలితంగా కవిత పార్టీలో నుండి బయటకు వచ్చేయాల్సొచ్చింది.

ఇపుడు తనమీద నమోదైన కేసులనుండి కవిత విముక్తి లభించింది కాబట్టి సోదరుడితో మనస్పదర్ధలను సర్దుబాటు చేసుకోగలిగితే మళ్ళీ కేసీఆర్ కూతురును దగ్గరకు తీసుకునే అవకాశాలున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story