ఆప్ అధినేతను ‘ధురందర్’ విలన్ తో పోల్చిన బీజేపీ
x

ఆప్ అధినేతను ‘ధురందర్’ విలన్ తో పోల్చిన బీజేపీ

ఢిల్లీ రెహమాన్ డెకాయిట్ అంటూ ఎక్స్ లో ట్వీట్ చేసిన మంత్రి పర్వేష్ సాహిబ్


Click the Play button to hear this message in audio format

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న స్పై థ్రిల్లర్ అయిన ‘ధురందర్’ సినిమాలోని విలన్ పాత్రను ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ తో పోల్చిన బీజేపీ, వ్యంగ్యంగా విమర్శలు సంధించింది. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్మించుకున్న విలాసవంతమైన భవనం అయిన శీష్ మహాల్ ను చూపిస్తూ ‘ధురందర్-3’ అంటూ ఢిల్లీ మంత్రి పర్వేశ్ సాహిబ్ ఈ ట్వీట్ చేశారు. అందులో కేజ్రీవాల్‌ను 'ఢిల్లీ రెహమాన్ డెకాయిట్'గా అభివర్ణించారు. 'ధురందర్'లో రెహమాన్ డకాయిత్ ఒక స్మగ్లర్, గ్యాంగ్‌స్టర్.

బంగ్లాలో నడుచుకుంటూ..

శీశ్ మహాల్ లో ఆయన నడుచుకుంటూ దాదాపు 15 నిమిషాల గల వీడియోను విడుదల చేశారు. ఇది 2015 నుంచి 2024 వరకు అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం. ఈ బంగ్లా పునరుద్దరణలో అనేక అవకతవకలు జరిగినట్లు బీజేపీ అప్పట్లో ఆరోపించింది. ఇందులో కేజ్రీవాల్ అమర్చుకున్న విలాసవంతమైన జాకుజీ షాండ్లీలియర్, బాత్రూం పరికరాలు, వాటికి అయిన ఖర్చును మంత్రి వివరించారు.
"ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, కర్టెన్లకు రూ.90 లక్షలు, గాజుతో కప్పబడిన పైకప్పు, అన్ని సౌకర్యాలున్న రెండు వంటగదులు, బెల్జియన్ పాత్రలు, అమెరికా నుంచి తెప్పించిన ఫిట్‌నెస్ పరికరాలు, పై అంతస్తుకు ఆహారాన్ని తీసుకెళ్లడానికి ఒక లిఫ్ట్, ఆరుగురు సభ్యులున్న కుటుంబం కోసం 14 సీట్ల డైనింగ్ టేబుల్ ఉన్నాయి," అని సింగ్ వీడియోలో చెప్పారు. ఈ బంగ్లా నిర్మాణానికి రూ.80 కోట్లు ఖర్చయిందని, ప్రాంగణాన్ని విస్తరించే ప్రణాళికలు కూడా ఉన్నాయని, అయితే 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలవ్వడంతో ఇది జరగలేదని చెప్పారు.

కాగ్ నివేదిక..

సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక, బంగ్లా పునరుద్ధరణలో పలు అవకతవకలను వెల్లడించింది. సుమారు రూ.8 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ పునరుద్ధరణ పనులు రూ.33.66 కోట్లతో పూర్తయ్యాయి.
బుధవారం సభలో CAG నివేదికపై జరిగిన చర్చ సందర్భంగా "షీష్ మహల్"లో ఉంచిన వస్తువుల సుదీర్ఘ జాబితాను చదువుతూ సింగ్ మొదటిసారిగా కేజ్రీవాల్‌ను రెహమాన్ దకాయిట్ తో పోల్చారు.
"ఇటీవల 'ధురందర్' అనే సినిమా విడుదలై అన్ని రికార్డులను తిరగరాస్తోంది. ఇందులో ప్రముఖ స్మగర్ల పాత్ర పేరు రెహమాన్ డెకాయిట్. ఇప్పుడు బీజేపీ అర్వింద్ కేజ్రీవాల్ ను ఇదే విధంగా పోల్చే ప్రయత్నం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రజాధనాన్ని దోచుకున్న 'రహమాన్ బందిపోటు' లాంటివాడు, కానీ మన 'ధురందర్' లాంటి ప్రజలు గత సంవత్సరం అలాంటి 'బందిపోటు'ను ఓడించారు," అని సింగ్ అన్నారు.

ఆప్ స్పందన..

కేజ్రీవాల్ 'అధికారిక నివాసం' పునరుద్ధరణ జరుగుతున్నప్పుడు, ప్రధానమంత్రి నివాసం కూడా నిర్మిస్తున్నారని ఆప్ ఎదురుదాడి చేసింది. "ముఖ్యమంత్రి నివాసానికి సంబంధించిన ప్రతి వివరమూ ప్రజలకు అందుబాటులో ఉండగా, ప్రధానమంత్రి నివాసానికి సంబంధించిన ప్రతి వివరమూ రహస్యంగా ఉంచారు" అని ఢిల్లీ ఆప్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 'శీష్ మహల్' అంశం బీజేపీ ప్రధాన ఎన్నికల ప్రచారాంశాలలో ఒకటిగా వాడుకుంది. ఇవి ఫిబ్రవరి 2025 అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ ఓటమికి ఒక కారణంగా నిలిచాయి.
Read More
Next Story