కవితది పిట్టల దొరసాని క్యారెక్టర్: బీజేపీ ఎంపీ
x

కవితది పిట్టల దొరసాని క్యారెక్టర్: బీజేపీ ఎంపీ

సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు నిజామాబాద్‌లో వాళ్లను ఓడించి బీజేపీకి ఓటేశారు.


కవిత కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఆమెపై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ది పిట్టల దొర క్యారెక్టర్ అయితే, కవితది పిట్టల దొరసారి క్యారెక్టర్ అంటూ విమర్శలు గుప్పించారు. సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు నిజామాబాద్‌లో వాళ్లను ఓడించి బీజేపీకి ఓటేశారని అన్నారు. బీజేపీ.. కవితకు రాజకీయ సమాధి కట్టిందని అన్నారు. బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగానే కేసీఆర్ ఇప్పుడు మరమనిషి అయిపోయారంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కూడా అర్వింద్ చురకలంటించారు. కేసీఆర్ రోబో అయ్యారా? అంటూ ప్రశ్నించారు.

ఈ సందర్భంగానే ఇటీవల పార్లమెంట్‌లో తెలంగాణ విభజనపై బీజేపీ కర్ణాటక ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. తేజస్వీ మాటలను బీఆర్ఎస్ కళ్లద్దాలతో చూడొద్దని అన్నారు. ‘‘ఇండియా-పాకిస్థాన్ విభజన ప్రక్రియలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా తెలంగాణ, ఆంధ్ర విభజన సమయంలో కూడా ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. కాంగ్రెస్ ప్రకటించి వెనక్కి తీసుకుంది కాబట్టే.. అలా జరిగింది. అంతమంది చనిపోయారని తేజస్వీ అన్నారు’’ అని అర్వింద్ వివరించారు.

Read More
Next Story